Friday, May 01, 2009

కొన్ని మందులు రంగు సీసాలలో ఇస్తారెందుకు ?




మనం కొనే టానిక్ లు , సిరప్ లు వంటివి గోధుమరంగు సీసాల్లోనే ఇస్తారు ,కొన్ని రకాల మాత్రలను రంగు సీసాల్లోనే వుంచుతారు ... అంతేకాదు మందులు , మందు సీసాల ను చీకటిగా చల్లగా వుండే ప్రదేశాలలో ఉంచమని సూచిస్తారు ... ఏమని ?
రోగికి , రోగానికి వాడే మందులు రసాయనాల తో తయారవుతాయి , ఆ రసాయనాలు సూర్య కాంతి లోని వేడి , అతినీలలోహిత తరంగాల ప్రభావానికి మార్పూ చెంది ఔసధగుణాన్ని పూర్తిగా కోల్పోతాయి . కొన్ని medicines చల్లని ప్రదేశం (ఫ్రిజ్) లోనే ఉంచాలి. అందుచేతనే కొన్ని మందులు గోధుమ రంగు సీసాలలో , కొన్ని మందులు ఫ్రిజ్ నుండి తీసి ఇస్తారు . అలాన్తపుడే అవి తమ ఔషధ గుణాన్ని సంపూర్ణము గా కలిగి ఉంటాయి.

/// డా. శేషగిరిరావు-యం.బి.బి.యస్. ///

No comments:

Post a Comment

your comment is important to improve this blog...