Friday, August 28, 2009

అవి జారి పడవెందుకు ?, Why don't they fall down?





ఈగలు , చిన్న పురుగులు నున్నని గోడల పైన , గాజు పలకల పైన జారిపదిపోకుండా ఎలా నడవగలుగుతాయి ?
కారణము : వాటి పాదాల కింద ఉండే అసంఖ్యాకమైన , బిరుసెక్కిన అతిచిన్న , సన్నని వెంట్రుకలే . పైకి నున్నగా కనిపించే ఇంటి గోడలు , పైకప్పుల కిందిభాగాలు , గాజు తలుపులు నిజానికి మన కంటికి కనిపించని అతి సూక్ష్మ మైన ఎగుడు దిగుడులు , బీటల మయమై ఉంటాయి . ఇవి ఈగలు , చిన్న పురుగుల పాదాలకింద ఉండే అతి సూక్ష్మమైన వెంత్రుకులకు కావలసిన పట్టు నిస్తాయి. .. అంతే కాకుండా ఆ జీవుల పదాల చివరి భాగాలలో ఉండే గొల్లలాంటి నిర్మాణము ఆయా ఉపరితలాలపై అస్తవ్యస్తం గా ఉండే అతిస్వల్పమైన ప్రదేశాలను గట్టిగా పట్టుకోవడం తో అవి జారకుండా ముందుకు పోగలుగుతాయి . కొన్ని పురుగులు నడుస్తున్నప్పుడు వాటి పదాల్లో కలిగే వత్తిడి వల్ల ఓ రకమైన జిగురులాంటి ద్రవం విడుదల అవుతుంది . వెంట్రుకల గుండా స్రవించే ఆ ద్రవం వల్ల కుడా అవి పడిపోకుండా నడవగలుగు తాయి .

No comments:

Post a Comment

your comment is important to improve this blog...