Thursday, September 03, 2009

నిప్పుల్లో నడకేలా సాధ్యము?, Walking on fire-How possible?




కొందరు భక్తులు ఏ బాధా లేకుండా నిప్పుల మీద నడవగాలుగుతున్నారు . ఇది ఎలా సాధ్య పడుతుంది ?.
నిప్పులపై నడవడానికి , భక్తికీ సంభందమూ లేదు ... ఎవరైనా నిప్పులపై సులభం గా నడవోచ్చును . ఇందులో మహిమలెం లేవు , నిప్పులమీద నడవ వచ్చును గాని వాటి పై నిలబదలేము . వివరణ ఈ విధంగా ఉంది ..

మన అరికాలి చర్మము దళసరిగా ఉంటుంది . మిగతా భాగాల కన్నా ఉష్ణ ప్రసరణ (ThermalConduction) తక్కువ . నిప్పుల మీద కాలు పెట్టినపుడు ఆ వేడి శరీరం లోకి వెళ్లి గాయం కలిగించే లోపే అడుగు తీసి అడుగులేస్తాము .. కాబట్టి కాలదు . అలాగే రెండో పదం విషయం లోను జరుగును . పైగా మన చర్మము పై భాగములో చెమ్మ ఉంటుంది . నిప్పుల వెదికి ఆ నీరు ఆవిరై పలుచని గాలి ఒక పొరలాగా ఏర్పడి వేడిని గ్రహించి గాల్లోకి పంపుతుంది .. .. కాలుకి తక్కువ వేడి వస్తుంది . అందుకే అగ్ని గుండం తొక్కే వాళ్లు కాళ్ళు తడుపుకొని వెళ్తుంటారు . ఇక్కడ నిప్పుల పై బూడిద తక్కువ ఉండేలా చూసుకోవాలి .

No comments:

Post a Comment

your comment is important to improve this blog...