Monday, August 31, 2009

పిల్లులకు ఎందుకు మీసాలు ?, Why cats have Mustaks




పిల్లులకు పొడవుగా , బిరుసుగా , మందం గా ఉండే మీసాలు .. దాని నోటిపై మూలాలకు ముక్కు అంచులకు మధ్య ఉబ్బెత్తుగా ఉండే ప్రదేశం లో భూమికి సమాంతరం గా ఉంటాయి . ఈ మీసాల వెంట్రుకలు దాని శరీరము పై ఉండే వెంట్రుకలకు భిన్నం గా ఉంటాయి . ఈ మీసాల మూలాలు నరాలు రక్త నాళాలు ఎక్కువగా ఉండే ప్రదేశం లో లోతుగా ఉండటం తో స్పర్శ జ్ఞానం కలిగి దాని మార్గ నిర్దేశానికి (navigation) ఉపయోగ పడటమే కాకుండా , దాని మానసిక పరిస్థితిని కుడా తెలియజేస్త్యాయి .

పిల్లి మీసాలు ఎంత సున్నితము గా ఉంటాయంటే .. అవి తన చుట్టూ వీస్తున్న గాలి దిశలలో కొద్దిపాటి తేడాలను కుడా పసిగట్ట గలవు . గదిలో సామాగ్రి ఉన్నా ప్రదేశాలను బట్టి అక్కడ వీచే గాలి ప్రవాహం ఆధాపడి ఉంటుంది . పిల్లి ఒక గదిలో తిరుగు తున్నప్పుడు ముఖ్యం గా రాత్రివేళల్లో ఒక కుర్చీ లేక మంచం అడ్డం వస్తే ఆ వస్తువు చుట్టూ గాలి వీచే పరిస్థితిని తన మీసాల ద్వారా తెలుసుకొని ఆ వస్తువును ఢీ కొట్టకుండా మార్గాన్ని నిర్దేశించుకుంటుంది . అదే విధంగా ఒక ఇరుకైన సొరంగం లాంటి మార్గం లో పోవలనుకున్నప్పుడు ఆ మార్గం లో తను వెల్ల గలదా? ఒక వేళ వెళ్ళిన అందులో నుంచి సురక్షితం గా బయటకు రాగలడా? అనే విసయాన్ని మీసాలను ఆ మార్గం అంచులకు తాకించి అంచనా వేసుకుంటుంది . ఆ విధమ గా పిల్లి మీసాలు దానికి ప్రక్రుతి ప్రసాదించిన కొలబద్ద లాంటిది .పిల్లి కోపమా గానో లేక ఆత్మ రక్షణలో పడినప్పుడు మీసాలను వెనుక్కు లాక్కుంటుంది . అదే ఏదైనా ఆహారము దొరికే ముందు సంతోషం గా ఉన్నప్పుడు మీసాలను సడలించి ముదుకు ఉంచుతుంది . ఇలా పిల్లి మీసాలు దాని మానసిక పరిస్థితి ని కుడా తెలియజేస్తాయి .

Friday, August 28, 2009

అవి జారి పడవెందుకు ?, Why don't they fall down?





ఈగలు , చిన్న పురుగులు నున్నని గోడల పైన , గాజు పలకల పైన జారిపదిపోకుండా ఎలా నడవగలుగుతాయి ?
కారణము : వాటి పాదాల కింద ఉండే అసంఖ్యాకమైన , బిరుసెక్కిన అతిచిన్న , సన్నని వెంట్రుకలే . పైకి నున్నగా కనిపించే ఇంటి గోడలు , పైకప్పుల కిందిభాగాలు , గాజు తలుపులు నిజానికి మన కంటికి కనిపించని అతి సూక్ష్మ మైన ఎగుడు దిగుడులు , బీటల మయమై ఉంటాయి . ఇవి ఈగలు , చిన్న పురుగుల పాదాలకింద ఉండే అతి సూక్ష్మమైన వెంత్రుకులకు కావలసిన పట్టు నిస్తాయి. .. అంతే కాకుండా ఆ జీవుల పదాల చివరి భాగాలలో ఉండే గొల్లలాంటి నిర్మాణము ఆయా ఉపరితలాలపై అస్తవ్యస్తం గా ఉండే అతిస్వల్పమైన ప్రదేశాలను గట్టిగా పట్టుకోవడం తో అవి జారకుండా ముందుకు పోగలుగుతాయి . కొన్ని పురుగులు నడుస్తున్నప్పుడు వాటి పదాల్లో కలిగే వత్తిడి వల్ల ఓ రకమైన జిగురులాంటి ద్రవం విడుదల అవుతుంది . వెంట్రుకల గుండా స్రవించే ఆ ద్రవం వల్ల కుడా అవి పడిపోకుండా నడవగలుగు తాయి .

Friday, August 21, 2009

ఆడియో విడియో పాటలు ఎలా నిల్వా ఉంటాయి?,Storage of audio video?

* శబ్దాన్ని వినిపించే ఆడియో క్యాసెట్ , దృశ్యాన్ని చూపించే విడియో క్యాసెట్ లలో ఒక సూత్రము ఇమిడి ఉన్న్నది . విద్యుత్ సంకేతాలు , అయస్కాంత క్షేత్రాలకు సంబంధించిన అద్భుతం ఇది .ఆడియో , విడియో క్యాసెట్ లలో సన్నని పొడవైన ప్లాస్టిక్ టేపులు ఉండి ..దానిపై ఉన్న ముదురు గోధుమ రంగు పుతపైనే శబ్దము నిక్షిప్తమై ఉంటుంది . ఇది ఎలా జరుగుతుంది ? ఈ పూత ఐరన్ ఆక్శైడ్ అయస్కాంత పూత ,
* ఆడియో , విడియో ప్లేయర్ సిస్టం లో రికార్డింగ్ హెడ్ ఉంటుంది ... ఇది ఒక గుండ్రని ఇనుప ముక్క మాత్రమే .. దాని చుట్టూ కొంచెం ఖాళీ వాడాలి ఒక సన్నని తీగ చుట్టి ఉంటుంది .గుండ్రం గా చుట్టిన ఏదైనా తీగలో సిద్యుత్ ప్రవాహం (electric current) ఏర్పడినపుడు దాని చుట్టూ అయస్కాంత క్షెత్రమ్ (MagnatiField)ఏర్పడుతుంది . క్యాసెట్ లో నిక్షిప్తం చేయల్చిన శబ్దాన్ని మైక్రోఫోన్ సయం తోను , దృశ్యాన్ని ఫోటోసెల్ సయం తోను విద్యుత్ సంకేతాలు గా మారుస్తారు . ఆ సంకేతాలను అంప్లిఫయర్ (Amplifier) ద్వారా వృద్ధి చేసి రికార్డింగ్ హెడ్ లో ప్రవహింప చేస్తారు . అప్పుడు రికార్డింగ్ హెడ్ చుట్టూ అయస్కాంత క్షెత్రమ్ ఏర్పడుతుంది . ఈవిద్యు సంకేఆల తీవ్రత (intensity) మారుతూ ఉండడం వల్ల అయస్కాంత క్షెత్రమ్ లో కుడా మార్పూ వస్తుంటుంది . ఇప్పుడు రికార్డింగ్ హెడ్ లో ఉండే చిన్న ఖాళీ ప్రదేశం ద్వార క్యాసెట్ లో ఉండే టేపును నిర్ణీత వేగంతో నడిపిస్తే , అప్పటికే ఏర్పడిన అయస్కాంత క్షెత్రమ్ వల్ల టేపు పై ఉన్న ఐరన్ ఆక్శైడ్ కణాలూ కుడా ఆయస్కాన్తీకరణము కు గురవుతాయి . ఫలితముగా టేపు పై ఉన్న కణాలూ తమ స్థానాలు సర్దుకుంటాయి ... అంటే శబ్దం , దృశ్యాలకు అనుగుణం గా టేపు పై కణాలూ ఒక క్రమపద్దతిలో ముద్ర అరెర్పరుస్తాయి. ఇదంతా రికార్డింగ్ వ్యవహారము ... మరి తెపులని తిరిగి ప్లే చేసిన ప్పుడు ఏం జరుగుతుంది ? ఆడియో లేదా విడియో ప్లేయర్ ను ఆన్ చేసినపుడు టేపు ఒక నిర్ణీత వేగం తో ప్లయింగ్ హెడ్ మీదుగా తిరుగుతుంది . అది తెపుపై నిక్శిప్తమైఉన్న అయస్కాంత క్షెత్రన్ని గుర్తిస్తుంది .. ఆ అయస్కాంత క్షెత్రమ్ ప్లింగ్ హెడ్ చుట్టూ ఉండే తీగచుట్టలో విద్యుత్ ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది ... ఆ విద్యుత్ ప్రవచాన్ని ఆమ్ప్లి ఫయర్ వృద్ది చేసి స్పీకర్కు అందించడం ద్వారా శబ్దాన్ని , టీవీకి అందించడం ద్వారా దృశ్యాన్ని మనం చూడగలుగుతున్నాము .

Thursday, August 13, 2009

గ్రహణాలు ఎలా ఏర్పడతాయి?, How Eclips forming?




సూర్యుడు ,చంద్రుడు , భూమి ఒకే సరళరేఖ పైకి వచ్చినపుడే గ్రహణాలు ఏర్పడుతాయి . చంద్ర గ్రహణము పౌర్ణమి నాడు , సూర్య గ్రహణము అమావాస్య నాడు ఏర్పడతాయి . కాంతి పడిన ప్రతి వస్తువుకి నీడ ఏర్పడుతుంది . . అంతరిక్షములో సూర్యుని కాంతి భూమి ,చంద్రుల పై పడినపుడు వాటి నీడలు కుడా అలాగే ఏర్పడతాయి కాని ఆ నీడపడే చోటుకి ఏ వస్తువు (గోడలు లాంటివి ) ఉండవు కావున ఆవి కనిపించవు . . . ఈ నీడలు వల్లే గ్రహణాలు ఏర్పడుతాయి .

చంద్ర గ్రహణము :
భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటే , ఆ భూమి చంద్రుడి తో సహా సూర్యుని చుట్టూ తిరుగుతోంది . ఇలా తిరిగే భూమి పై సూర్యకాంతి నిరంతరము పడుతూనే ఉంటుంది . ఆ కంటి పడే ప్రాంతాల్లో పగలని , పడని ప్రాంతాల్లో రాత్రని అనుకుంటాం ,.. సూర్య కంటి పడినపుడు భూమికి వెనక దాని నీడ ఏర్పడుతుంది . . . కాని అక్కడంతా అంతరిక్షము కాబట్టి ఏమీ కనబడదు , ఆ నీడ పడే ప్రాంతం లోకి చంద్రుడు వచ్చాడనుకోండి .. ఆ చద్రుడే ఓ గోడలా అడ్డు ఉండడము తో భూమి నీడ దానిపై పడుతుంది . ఆ నీడ పాడుచున్నప్రనటం మేర చంద్రుడు కనిపించదు ... కాబట్టి దాన్నే చంద్రగ్రహణము అనుకుంటాము .

సూర్య గ్రహణము :
భూమి పైకి సూర్య కంటి పడుతున్నపుడు ఆ కంటికి అడ్డుగా చంద్రుడు వచ్చదుకోండి ... అప్పుడు చద్రుడి నీడ ఏర్పడి అది భూమి మీద పడుతుంది . భూమి పై ఆ నీడ పరుచుకున్న ప్రాంతం లో ఉన్నవారు తలెత్తి పైకి చుస్తే సూర్యుడు కొంత భాగము కనిపించడు , అదే సూర్య గ్రహణము అంటాము . చంద్రుదు కనిపించని రోజు అమావాస్య అవుతుంది .

భూమి నుంచి చంద్రు ఉన్న దూరానికి సరిగ్గా 400 రెట్లు దూరాన సూర్యుడు ఉన్నాడు .. .అంతేకాకుండా చంద్రుడు వ్యాసానికి సరిగా 400 రెట్లు పెద్దదిగా సూర్యుడి వ్యాసము ఉన్నది . అందుకే భూమి నుంచి చంద్రుడు , సూర్యుడు ఒకే పరిమాణము లో కనిపిస్తాయి .
  •  

  • ==================================
visit my wrbsite : dr.seshagirirao.com

చలికాలము లో చర్మము పగుల్లెందుకు?,Skin Cracks in winter Why?




శరీరము పై ఉండే చర్మము మనల్ని ఉష్ణము , చలి , దుమ్ముల నుంచి కాపాడుతుంది . .. కాని చలి కాలము లో చర్మము పొడి బారడం తో దానిపై పగుళ్ళు వస్తాయి ... మరీ పలుచని చర్మము పోరలుందే పెదాలు , బుగ్గలు పై పగుళ్ళు ఎక్కువగా ఉంటాయి .

చరం లోరెండు పొరలుంటాయి.. పై పోరా లో ఉండే కణాలలో జీవముండదు , అది దేహానికి ధృడముగా ఉండే ఒక కవచం లా పనిచేస్తుంది , ఈ పోరా కింద ఉండే పొరలో ప్రత్యేకమైన తైల గ్రంధులు ఉంటాయి . ఈ గ్రందు లు ఒకరకమైన నునే పదార్ధాన్ని స్రవిస్తూ ఉంటాయి . ఈ పదార్ధము అక్కడే ఉండే సన్నని వెంతుకల మూలల నుంచి , వెంట్రుకల ద్వారా చర్మము పై భాగానికి వచ్చి శరీరం పై పరుచుకుని ఉంటుంది . చర్మం లోపల పొరలో ఈ తైల గ్రంధులతో పాటు స్వేద గ్రందులు కుడా ఉంటాయి ... వీటిలో ఉత్పన్నమైన స్వేదము (చెమట) చర్మం లో ఉండే అతి సూక్ష్మమైన రంద్రాల ద్వారా చర్మము పై భాగానికి చేరుకుంటుంది .

ఈ విదంగా చర్మము ఉపరితలము పై చెమట , నూనెల మిశ్రమము తో కూడిన మనం లాంటి పదార్ధము సన్నని ఫిలిం లాగా కప్పబడి ఉంటుంది . . . ఈ ఫిల్ము మన చర్మాన్ని నున్నగా , మెత్తగా , సున్నితం గా ఉంచుతుంది . అలాగే చర్మములోని నీరు అతిగా చుట్టూ ఉండే వాతావరణము లోకి పోయి చర్మము ఏందీ పోకుండా అడ్డుకుంటుంది . చలికాలములో గాలి చల్లగాను , పొడిగాను ఉంటుంది అందువల్ల చమట అంతగా పట్టదు ... గాలి పొడిగా ఉండడము తో శరీరముపై ఉండే కొద్దిపాటి చెమట , నునే లాంటిపదార్ధము అతి త్వరగా ఆవిరైపోయి శరీరము పై ఉండే ఫిలిం లాంటి పోరా ఎండిపోయి పలుచన పడిపోయిన కారణము గా 'భాష్ఫీభవన క్రియ (evaporation)" చర్మము లో ఉన్నా నీటిని కోల్పోయి ఎండిపోయి పగుళ్ళు వస్తాయి. శీతాకాలము లో వేజలిన్ గాని నునే గా చర్మానికి రాసుకుంటే ఈ భాద ఉండదు .

Monday, August 10, 2009

కంచు పాత్రలో నీరు శ్రేష్టము ఎందుకు?, Water in Bronz vessel is safe Why?





త్రాగే నీటిని కంచు పాత్రలో ఉంచి తాగటం మేలని భారతీయ సంప్రదాయం .. ఎంతో మంచిది . ఎందరో మైక్రో బయోలజిస్త్లు ఎన్నో ప్రయోగాలు చేసి అన్నిటా కంచు పాత్రలు మంచివని తేల్చి చెప్పారు . స్టీల్ ,ప్లాస్టిక్ బాటిల్స్ లో నిల్వచేసిన నేతిలో బాక్తెరియా గణనీయం గా పెరగనారంభించాయి ... రెండు రోజుల నిలవ తర్వాత ఆ నీరు తాగేందు కు వీలులేనిదిగా ... తెలియక తాగితే విరేచనాలు , జీర్ణకోశ వ్యాదులు తెచ్చేదిగా తయారవుతుంది ... బాక్టీరియా విపరీతం గా పెరిగి నీరు తాగేందుకు పనికిరాకుండా చేస్తాయి . అదే నీరు కంచు పాత్రలో 48 గంటలు నిలవా ఉంచి పరీక్ష చేయగా సూక్ష్మ జీవులు దాదాపు కనిపించకుండా పోయాయి .

క్నచు పాత్రలో రాగి నీటిలో కొద్దిమోతడులో కరిగి బాక్తెరియ కణజాల కవచాలను బద్దలు కొడుతుంది .. కారణము గా బాక్టీరియా చనిపోయి వాటి సంఖ్యా తగ్గిపోతుంది .../డా . శేషగిరిరావు -MBBS

Wednesday, August 05, 2009

పల్లుంటేనే పలుకగాలమా?,Teeth nessasary for speek?




పళ్ళు లేకుండా మనము మాట్లడలేమా?.. మానవునికి మాత్రమె భాష , సాహిత్యము ఉన్నాయి .పరిణామ క్రమములో మానవుని నోటిలోని సప్తపద (రెండు నాసికా రంధ్రాలు , రెండు కర్ణ రంధ్రాలు , నోఫు , ఉపిరితిట్టులను కలిపే శ్వాస నాలిక , ఆహారవాహిక ... మొత్తము ఏడు నాళాలు ) సక్రమము గా అమర్చి ఉంటుంది . ఆ భాగాలు ఉన్నా కండరాలు కంపనం చెందినపుడు .. ఉపిరితిత్తుల ద్వారా గానిని ఉదినపుడు శబ్దం విడుదల అవుతుంది . .. ఆ శబ్దాన్ని నాలుక , పెదాలు , దవడలు సాయము తో యాంత్రిక చలనము చెస్తూ అన్గిట భాగాన్ని , దంతాల అంచుల్ని , బుగ్గల్ని , నాసికా రంధ్రల్ని తదనుగుణంగా సంధనించుకోన్నపుడు అవసరమైన స్వరాలూ , అక్షరాలు , వాగ్విదానము , పదకుదిక సంభవిస్తాయి. కాబట్టి పళ్ళు (దంతాలు ) కూడా మాట్లాడే ప్రక్రియలో అంతర్భాగాలే .దంతాలు లేని పిల్లలు , వృద్ధుల మాటల్లో కొంత స్పష్టత లోపిస్తుంది ... దంతాలు లేనంతమాత్రాన అసలు మాట్లాడలేరని కాదు .

ఎంపి 3 అంటే ఏమిటి?, What is mp3?



సుమారు ఇరవియా సంత్సరాల కిర్తము వరకు సంగీతాన్నీ టేపు రికార్డుల్లో అయస్కాంత లక్షణాల ఆధారంగానో , గ్రామఫోన్ రికార్డుల్లో గరుకుదనం ఆధారం గానో నిల్వచేసేవారు. ఇలాంటి సాధనాలను " అనలాగ్" సాధనలంటారు . ఇపుడు కంప్యూటర్లు , ఎలక్ట్రానిక్ పరికరాలు లో మిక్రోప్రోసేసర్ పద్దతులు వచ్చాక అనలాగ్ సమాచారము డిజిటల్ ఉర్పములోకి మారింది . ఇందులో 0 లేదా 1 అంకెల శ్రేణి రూపం లో భద్రపరిచే విధానాన్ని బైనరి సమాచారము అంటారు . సంగీత ధ్యనులను ఎలక్ట్రానిక్ హెచ్చు తగ్గులు గా తర్వాత బైనరీగా మారుస్తున్నారు .

motion picture Expert Group అనే సాంకేతిక సంస్థ .. అంతర్జాతీయ ప్రమాణాల సంస్థకు , ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్ కి అనుబందముగా ఉంది . ఇది దృశ్య ,శబ్ద నియకాలను నిర్దేశిస్తుంది. ఈ సంస్థ సంక్షిప్త నామమైన " MPEG" లోని మొదటి రెండు అక్షరాలు ... ముడో తరగతికి చెందిన పద్ధతికీ సూచనగా 3 కలిపి MP3 గా వాడుకలోకి వచ్చాయి . మొత్తానికి ఇది సంగీత ధ్యనులను కుదించి నమోదు చేసే ఒక ప్రక్రియ అన్నా మాట.

Sunday, August 02, 2009

పాము కుబుసం వడులును ఎందుకు?, Why do snakes shed skin?




  •  
పాములు పై చర్మాన్ని ఆరు నెలలకు లేదా సంవత్సరానికి ఒకసారి వదిలేస్తాయి . పాముల చర్మము నీటిని బయటకు పోనివ్వని పొలుసులను కలిగి ఉంటుంది . పొలుసుల తో కూడిన చర్మము పెరుగదు ... లోపలవున్న శరీరము పెరుగుతుంది . . . కాబట్టి పై చర్మము బిగుతుగా తయారవుతుంది . ఆ బిగుతైన చర్మము వదిలించుకోవడమే ... కుబుసం వదలడం అవుతుంది . కొత్తచరమము తయారయ్యకే పాతచర్మము కుబుసం రూపాన వదలివేయును .

పాములే కాదు , తొండ ,మొసలి , ఉడుము వంటి అనేక సరీసృపాల (reptiles) వర్గానికి చెందినా జంతువులు , బొద్దింక , తేలు వంటి కీటక(orthropoda) జాతి జంతువులు , యెన్ద్రకాయలు , కుబుసము(moulting)విడుస్తాయి . పొలుసుల చేతను , తట్టి పలకల్లాంటి భాగాలచేతను నిర్మితమైన చర్మము గల జంతువులు తమ ఎదుగుదల కు అనుగుణముగా పాత చర్మాన్ని విసర్గించుకుంటాయి .. అదే సమయము లో కొత్త పొలుసులు , అదనపు పొలుసులు , అదనపు పలకలు , కొత్త పలకల తో కూడిన నూతన చర్మాన్ని సృష్టించు కొంటాయి .

అభివృద్ది చెందినా స్కీరదాలు (mammals) కు చర్మము పొలుసుల తో కాకుండా మెత్తటి కణజాలము (tissue)తో నిర్మితమై ఉంటుంది ,. పైగా చాలా పొరలుగా ఉంటుంది . ఎపితీలియం , ఎక్షొదెర్మ్ , ఏందో డెరం అనే పొరల్లో ఎపితీలియం పైభాగాన ఉంటుంది . దీని కింద ఉన్నా దేర్మిస్ పొరలు పలుచటి కండర కణజాలము తో చక్కటి రబ్బరు పొరలాగా శరీరాన్ని కప్పి ఉంచుతుంది . పై భాగాన ఉన్న ఎపితేలియం కణాలూ కుడా పాతవి నశించి కొత్తవి పుడుతుంటాయి . అయితే ఇవి కలసికట్టుగా నశించి పోవడము వలన మనిషి తదితర అగ్రస్థాయి జంతువులు కుబుసము విదిసినట్టు అనిపించదు .

  • ========================
visit my website : Dr.Seshagirirao.com

నీరు తగ్గి హెచ్చుతుందేమి?,boiling water lessen and increase volume why?



ఒక లోహపు పాత్ర నిండా నీటిని నింపి వేడి చేస్తే ముందుగా పాత్ర లోని నీటి మట్టము కొంచము తగ్గి ఆ తరవాత పెరుగు తుంది . ఎందుకు ?...
పదార్దాల గుండా ఉష్ణము ప్రవహించే విధానాన్ని " ఉష్ణ లక్షణము (thermal conductivity)" అంటారు . పదార్ధాలను వేదిచేసినపుడు వాటి ఘనపరిమాణము సాధారణము గా వ్యాకోచిన్చదాన్ని 'ఉష్ణ యాంత్రిక (thermal expansivity)' అంటారు . నీటి విసయము లో ఈ రెండు సమన్వయము గా పని చేస్తాయి. లోహాలకు నీటికన్నా అధిక వాహకత్వ లక్షణము ఉంటుంది . అందువల్ల మొదట లోహపాత్రకు ఎక్కువ ఉష్ణము వెళ్లి అది త్వరగా వేడెక్కుతుంది ... కాబట్టి నీటి కన్నా ముందే పాత్ర వ్యాకోచిస్తుంది . .. అంటే పాత్ర ఘనపరిమాణము పెరుగు తుంది . అంతే తీవ్రత తో నీటి ఘన పరిమాణము వ్యకోచిన్చకపోవడం వల్ల మొదట్లో నీటి మట్టము తగ్గుతుంది . క్రమేపి ఉష్ణము నీటికి తాకి పాత్ర , పాత్ర లోని నీరు .. ఉష్ణోగ్రత పరంగా సమతుల్యాన్ని (thermal equilibrium) చేరు కుంటాయి . అయితే ఘన పదార్ధాల కన్నా ద్రవ పదార్ధాలకు ఉష్ణ వ్యాకోచ గుణము ఎక్కువ , ఒకే రకమైన ఉష్ణోగ్రతా వృద్దిని (temperature rise) ఇస్తే అంతే ఘన పదార్ధమైన పాత్ర కన్నా ... ద్రవ పదార్ధమైన నీరు బాగా వ్యాకోచిస్తుంది ... కాబట్టి వేడి చేస్తున్న సమయము లో క్రమముగా నీటి ఘనపరిమాణము పాత్ర ఘనపరిమాణము కన్నా బాగా పెరుగు తుంది .
నీరు ఎక్కువ సేపు మరిగిస్తే ఆవిరై నీరు పరిమాణము తగ్గును . పై న చెప్పిన సిద్ధాంతము వేడిచేయు మొదటిలోనే జరుగుతాయి .