Tuesday, January 26, 2010

వూదితే కొవ్వొత్తి ఆరుతుందేల?, Candle litout with blowout air





ప్రశ్న: గాలిలోని ఆక్సిజన్‌ వల్ల మంట మండుతుంది. కానీ వెలుగుతున్న కొవ్వొత్తిని వూదితే ప్రకాశంగా వెలగాలి గానీ ఆరిపోతుంది. కారణం తెలపండి?

జవాబు: వెలుగుతున్న కొవ్వొత్తిని వూదితే చాలాసార్లు ఆరిపోతుంది. అయితే ఒకోసారి ప్రకాశవంతంగా వెలగచ్చు కూడా. ఈ రెండింటికీ కారణాలు తెలుసుకుందాం.

కొవ్వొత్తి వెలిగేపుడు కేవలం ఆక్సిజన్‌ సరఫరా ఒక్కటే ఆ వెలుగును నిర్ధరించదు. మంట వేడితో మైనం కరిగి వత్తి గుండా తలతన్యత (surface tension), కేశనాళికీయత(capillarity),విసరణం (diffusion)అనే ధర్మాల ప్రభావంతో మంట వద్దకు చేరుతుంది. తద్వారా మంటకి ఎప్పటికప్పుడు ఇంధన సరఫరా జరుగుతుంటుంది. మంట మండాలంటే వత్తి దగ్గర తగిన ఉష్ణోగ్రత ఉండాలి. మైనపు ద్రవంలోని అణువులు ఆవిరి చెందడంవల్ల త్వరితంగా మండేందుకు కావాల్సిన ఉత్తేజశక్తి (activation energy) లభ్యమవుతుంది. ఇవన్నీ కుదిరాక ఆక్సిజన్‌ సరఫరా బాగా ఉంటే మంట బాగా మండుతుంది. కొవ్వొత్తిని గట్టిగా వూదితే మన నోటి గాలి వత్తి ప్రాంతంలో ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. పైగా మనం వదిలేది కార్బన్‌డైయాక్సైడ్‌. అది కూడా ఆక్సిజన్‌ను తొలగించి వేస్తుంది. అందువల్ల ఆరిపోతుంది. ఇక మెల్లగా వూదితే అక్కడ పేరుకుపోయిన కార్బన్‌డయాక్సైడును మనం దూరానికి పంపినవారమవుతాము. అపుడు ఆక్సిజన్‌ బాగా అంది వెలుగు బాగా వస్తుంది.
=============================================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...