Wednesday, January 27, 2010

దిక్సూచి దిక్కుల మర్మమేమిటి?,Magnet secret of north and south poles?





ప్రశ్న: అయస్కాంతం ఉత్తర ధ్రువం, భూమి ఉత్తర ధ్రువం పరస్పరం ఎందుకు వికర్షించుకోవు? దిక్సూచిలో ఉత్తర ధ్రువం, భూమి ఉత్తర ధ్రువం వైపు ఎలా ఉంటుంది?

జవాబు: భూమి విషయం కాసేపు పక్కన పెడితే, ఏవైనా రెండు అయస్కాంతాలను దగ్గరకు తీసుకొస్తే వాటి సజాతి ధ్రువాలు వికర్షించుకొంటాయనేది తెలిసిందే. అలా విజాతి ధ్రువాలు ఆకర్షించుకొంటాయి. అంటే రెండు అయస్కాంతాలను చెరో చేత్తోనూ పట్టుకుని, వాటి సజాతి ధ్రువాలను దగ్గరగా చేర్చడానికి ప్రయత్నిస్తే అవి దూరంగా వెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్టు చేతుల మీద కలిగే ప్రభావం ద్వారా తెలుస్తుంది. అదే వాటి విజాతి ధ్రువాలను దగ్గర చేస్తే అవి లటుక్కున అంటుకునేట్లు ఆకర్షించుకొంటాయి.

ఒక నాణానికి బొమ్మ, బొరుసులను గుర్తించినట్టుగా ఒక అయస్కాంతానికి ఏది ఉత్తర ధ్రువమో, ఏది దక్షిణ ధ్రువమో గుర్తించడం ఎలా? ఇక్కడే భూమి మనకు సాయపడుతుంది. భూమి కూడా పెద్ద అయస్కాంతమని మనకు తెలుసు. ఒక దండాయస్కాంతాన్ని స్వేచ్ఛగా వేలాడదీస్తే అది ఉత్తర దక్షిణ దిశలను సూచిస్తుందని పాఠాల్లో చదువుకున్నారు. అందువల్లనే అయస్కాంతంలో భూమి ఉత్తరం దిశను సూచించే కొసను ఉత్తర ధ్రువమని, దక్షిణ దిశను సూచించే కొసను దక్షిణ ధ్రువమని మనం గుర్తుపెట్టుకున్నాం. నిజానికి భూమి ఉత్తర ధ్రువం, ఉత్తరదిశను సూచించే అయస్కాంత ధ్రువం, రెండూ విజాతి ధ్రువాలు. అలాగే దక్షిణం వైపున్న భూ అయస్కాంత ధ్రువము, ఆ వైపు మళ్లిన అయస్కాంత ధ్రువం కూడా విజాతి ధ్రువాలే.

=============================================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...