Wednesday, March 10, 2010

ఆ బిలాల రహస్యమేంటి? , Stars Life changes-Krishna bilam





ప్రశ్న: కృష్ణబిలాలంటే ఏమిటి? అవి ఎందుకు ఏర్పడతాయి?

జవాబు: నక్షత్రాల జీవితకాలంలో వివిధ దశలుంటాయి. వాటిలో కృష్ణబిలం (బ్లాక్‌హోల్‌) చివరిది. ఈ దశకు ముందు నక్షత్రం రెడ్‌ జెయింట్‌, వైట్‌డ్వార్ఫ్‌, సూపర్‌నోవా, న్యూట్రిన్‌ స్టార్‌ లాంటి మరికొన్ని దశలను దాటుతుంది.

ద్రవ్యరాశి ఎక్కువగా ఉన్న నక్షత్రాలు చివరి దశకు చేరుకున్నప్పుడు, వాటిలోని గురుత్వాకర్షణ బలాలు ఎక్కువైపోతాయి. దాంతో అవి తమ కేంద్రం వైపు కుంచించుకుపోతాయి. వాటి ద్రవ్య సాంద్రత (density) అనంతంగా పెరుగుతుంది. దీన్నే కృష్ణబిలం అంటారు. కృష్ణబిలంలో దేశ,కాలాలు (space, time) వాటంతట అవి మలుపుతిరిగి దాంట్లోకి కలిసిపోతాయి. కృష్ణబిలం మీద పడే ద్రవ్యం, కాంతి కూడా వెనక్కి తిరిగి రాలేవు. కాబట్టి వీటిని మనం చూడలేము.

సూర్యుని ద్రవ్యరాశి 2,000,000,000,000,000,000,000 (2 తర్వాత 21 సున్నాలు) టన్నులు! వ్యాసం 1,000,000 కిలోమీటర్లు. ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త చంద్రశేఖర్‌ సుబ్రహ్మణ్యం సూర్యుని ద్రవ్యరాశి కన్నా 1.4 రెట్లు ఎక్కువగా ఉండే నక్షత్రాలే కృష్ణబిలాలుగా మారతాయని సిద్ధాంతీకరించాడు. సూర్యుని కన్నా అంత పెద్దగా ఉండే ఓ నక్షత్రం కృష్ణబిలంగా మారితే దాని వ్యాసం కేవలం 2.9 కిలోమీటర్ల వరకూ కుంచించుకుపోతుంది. నక్షత్రాలే కాదు, ఏ వస్తువులోని ద్రవ్యరాశి అయినా కేంద్రంలోకి కుంచించుకుపోయి, సాంద్రత అనంతంగా పెరిగితే, అది కృష్ణబిలంగా మారుతుంది. మన భూమి బఠాణీ గింజ పరిమాణానికి కుంచించుకుపోతే, అది కూడా బ్లాక్‌హోల్‌ అయిపోతుంది!

  • ===================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

3 comments:

  1. p v l narasimharaoFriday, 14 May, 2010

    nice answer

    ReplyDelete
  2. sir i am very happy? but it is very interasting...my number 9052489993.i studing btech.vinod.

    ReplyDelete

your comment is important to improve this blog...