Wednesday, May 05, 2010

రామన్‌ ఎఫెక్ట్‌ అంటే? , What is Raman Effect?




ప్రశ్న:
రామన్‌ ఎఫెక్ట్‌ అంటే ఏమిటి? నిత్య జీవితంలో దాని ఉపయోగాలేమిటి?

జవాబు:
సముద్రపు నీటిపై సూర్యకాంతి పడినప్పుడు ఆ కాంతి లోని నీలం రంగు ఎక్కువగా పరిక్షేపం (scattering) చెంది (చెదిరి) మన కంటికి చేరడం వల్లనే సముద్రం నీలంగా కనిపిస్తుందని ప్రఖ్యాత భారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్‌ సి.వి. రామన్‌ సిద్ధాంతీకరించారు. ఇలా ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా పరిక్షేపం చెందుతాయో తెలిపే పరిశోధన ఫలితాన్నే 'రామన్‌ ఎఫెక్ట్‌' అంటారు.

కాంతి కిరణాలు ఒక ద్రవ పదార్థంపై పడినప్పుడు ఆ కాంతి పరిక్షేపం చెందుతుంది. అంటే కాంతి కిరణాల్లోని ఫోటాన్‌ కణాలు, ద్రవ పదార్థాల పరమాణువులపై పడి పరిక్షేపం చెందుతాయి. చాలా ఫోటాన్లు పడేటప్పటి పౌనఃపున్యంలోనే చెదిరిపోతే, కొన్ని ఫోటాన్లు మాత్రం అంతకు తక్కువ పౌనఃపున్యంతో పరిక్షేపం చెందుతాయి. అంటే పడిన కాంతిలో కొంత భాగం మాత్రం వేరే పౌనఃపున్యంతో చెదురుతుందన్నమాట. ఇదే రామన్‌ ఎఫెక్ట్‌. దీన్ని కనుగొన్నందుకు ఆయన 1930లో నోబెల్‌ బహుమతిని అందుకున్నారు. రామన్‌ ఎఫెక్ట్‌ ద్వారా రసాయనిక పదార్థాలలో అణు, పరమాణు నిర్మాణాల పరిశీలనకు, పరిశ్రమల్లో కృత్రిమ రసాయనిక సమ్మేళనాల పరిశీలనకు, మనం ధరించే వస్త్రాల రంగులు, వైద్య రంగంలో అవసరమయ్యే మందుల విశ్లేషణకు ఉపయోగపడుతుంది.
  • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

1 comment:

your comment is important to improve this blog...