Saturday, June 26, 2010

వేళ్లు విరిస్తే శబ్దమేల? , Bending finger joints gives sound Why?





  •  
  •  
  •  

ప్రశ్న: మనం వేళ్లు విరిచినపుడు శబ్దం ఎందుకు వస్తుంది?

జవాబు: చేతి వేళ్లలో ఎన్నో కీళ్ల (joints)తో కూడిన ఎముకలుంటాయి. జీవనిర్మాణ శాస్త్రం (anatomy) ప్రకారం వీటిని జారుడు కీళ్లు(gliding joints) అంటాము.నిజానికి ఐదువేళ్ల ఎముకలు ఈ కీళ్ల సాయంతో విడివిడి గొలుసుల లాగా ఉంటాయి. వేళ్లు కదిలేటప్పుడు కీళ్ల దగ్గరే ఎముకలు అటూ ఇటూ కదులుతాయి. కదిలే యంత్ర భాగాల వద్ద ఘర్షణను నివారించడానికి ఎలాగైతే కందెనలు (lubricants) వాడతామో, అలాగే మన వేళ్ల ఎముకులు కదిలే కీళ్ల దగ్గర ఒక రకమైన చిక్కని ద్రవం (మ్యూకస్‌) ఉంటుంది. కదలికల కారణంగా జీవన ప్రక్రియల్లో భాగంగా ఇందులో అప్పుడప్పుడు అతి చిన్న పరిమాణంలో గాలి బుడగలు ఏర్పడతాయి. మనం వేళ్లను మిటకరించినప్పుడు ఈ గాలి బుడగలు పగిలి ఆ ద్రవంలో చెదిరిపోతాయి. అప్పుడే శబ్దం ఏర్పడుతుంది.
  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...