Wednesday, September 15, 2010

ఎడారి ప్రాణుల జీవనమెలా? , How the creatures live in Desert?




ప్రశ్న: ఎడారుల్లో ఉండే ప్రాణులేంటి? అవి అక్కడ ఎలా జీవించగలుగుతాయి?

-ఎమ్‌. కౌశల్య, 9వ తరగతి, రాజమండ్రి

జవాబు: నీరు అత్యల్పంగా దొరికే ఇసుక నేలలతో కూడిన ఎడారుల్లో జీవనం కష్టమని అనిపించినా, ఆ పరిసరాలకు అనుగుణంగా బతికే మొక్కలు, జీవులు ఉంటాయి. ఎడారుల్లో ఎక్కువగా నత్తలుంటాయి. వీటితో పాటు బల్లులు, పాములు, ఎలుకలు, తొండలు, గుడ్లగూబలు, కీటకాలు ఉంటాయి. ఇలాంటి ఎడారి జీవుల్లో చెమట, మూత్రం ఎక్కువగావెలువడని శరీర నిర్మాణం వల్ల వాటికి నీటి అవసరం చాలా తక్కువగా ఉంటుంది. ఎడారి మొక్కలైన ముళ్లపొదలు, కాక్టస్‌లాంటి మొక్కలకు ఆకులు తక్కువగా ఉండడం వల్ల వాటిలోని నీరు త్వరగా ఆవిరి కాదు. అరుదుగా వర్షాలు పడినా ఇవి ఆ నీటిని కాండాల్లో నిల్వ చేసుకోగలుగుతాయి. ఇక ఎడారి ఓడగా పేరొందిన ఒంటె అక్కడి ముళ్లపొదల్ని మేయగలదు. దీని మూపురంలో కొవ్వు పదార్థం పేరుకుని ఉండి శక్తినిస్తూ ఉంటుంది. ఒంటె ఒకేసారి 25 గ్యాలన్ల వరకూ నీరు తాగి దాన్ని శరీరంలో నిల్వ చేసుకోగలదు. ఎడారి జీవుల్లో ఎక్కువ బొరియల్లో జీవించేవి కావడం వల్ల అత్యధికమైన వేడి వాటిని బాధించదు.

- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌


  • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...