Monday, October 25, 2010

ఆ పేలుడుకి ఉందా సాక్ష్యం? , Is there Evidence for that Bigband?



ప్రశ్న: విశ్వం బిగ్‌బ్యాంగ్‌ వల్లనే ఏర్పడిందనడానికి సాక్ష్యం ఉందా?

-కె. సురేఖ, హైదరాబాద్‌

జవాబు: బిగ్‌బ్యాంగ్‌ సిద్ధాంతం ప్రకారం విశ్వం ఒకప్పుడు అత్యధిక సాంద్రత, ఉష్ణోగ్రతలు కలిగిన ఒక చిన్న బిందువు. అది 1200 కోట్ల సంవత్సరాల క్రితం పెద్ద శబ్దంతో పేలిపోయి కాంతి వేగంకన్నా ఎక్కువ వేగంతో విస్తరించింది. దాన్నే మహావిస్ఫోటం (బిగ్‌బ్యాంగ్‌) అంటారు. ఆ బిందువు అలా పేలిపోవడానికి కారణాలేంటో ఇప్పటికీ తెలియవు. అయితే ఈ సిద్ధాంతాన్ని రుజువు చేసే కొన్ని దృష్టాంతరాలు నమోదయ్యాయి. బిగ్‌బ్యాంగ్‌ ఉత్పన్నం చేసిన వికిరణ శక్తి (Radiation) ఇప్పటికీ విశ్వంలో కాస్మిక్‌ సూక్ష్మ తరంగ నేపథ్య వికిరణాల (casmic micro wave background radiation) రూపంలో ఉంది. ఈ కిరణాలను తొలిసారి ఆర్నోపెంజియాస్‌, రాబర్ట్‌ విల్సన్‌ అనే శాస్త్రవేత్తలు 1964లో కనుగొన్నారు. వీరు అప్పటి ధ్వని తరంగాలను వినడమే కాకుండా, ఈ వికిరణాల ఉష్ణోగ్రత మూడు కెల్విన్‌లుగా నిర్ధరించారు. దీంతో మహావిస్ఫోటం సిద్ధాంతానికి బలమైన మద్దతు లభించింది. కాస్మిక్‌ సూక్ష్మతరంగ నేపథ్య వికిరణాలు భూమి వైపు అన్ని దిశల నుంచీ వస్తున్నాయి. ఈ ధ్వనిని బిగ్‌బ్యాంగ్‌ ప్రతిధ్వనిగా భావించవచ్చు.

ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌


======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...