Wednesday, November 10, 2010

Why do we get Sweat ? , చెమట ఎందుకు పోస్తుంది ?


  • [sweat+on+face.gif][sweat+in+armpit.gif]

మానవ శరీరము ఒక యంత్రం వంటిది . యంత్రం పనిచేస్తుంటే వేడి ఎలా పుడుతుందో ... శరీరము లో జరిగె జీవన క్రియలకు కూడా వేడి అలానే పుడుతుంది . ఆ వేడి ని తగ్గించి శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించి 98.6 డిగ్రీల ఫారిన్‌ హీట్ దగ్గర స్థిరముగా ఉండేందుకు శరీరము చేపట్టే ప్రక్రియే చెమటపోయడం .

మనిషి శరీరములో సుమారు 2 నుండి 4 మిలియన్ల స్వేదగ్రంధులు ఉంటాయి .ఇవి చర్మము కింద డెర్మిస్ (Dermis)-క్రింది చర్మ పొర లో ఉంటాయి .ఈ గ్రంధులు రెండు రకాలు ...1.ఎక్రిన్(eccrine)‌,2.ఎపొక్రైన్‌(apocrine) --- సింపాథటిక్ నెర్వస్ సిస్టం అదుపులో పనిచేస్తాయి .

ఎండాకాలంలో ప్రతి ఒక్కరికి చెమట వస్తుంది. కొంతమందికి మరింత ఎక్కువగా వస్తుంది. మరికొంత మందికి చాలా తక్కువగా చెమట పడుతుంది. శారీరక శ్రమ చేసేవారికి ఎక్కువగా చెమట పడుతుంది. చెమట లేదా స్వేదం (Sweat) క్షీరదాలలోని చర్మం నుండి ఉత్పత్తి చేయబడిన ఒకరకమైన స్రావం. ఇవి చర్మంలోని స్వేద గ్రంధుల నుండి తయారౌతుంది. దీనిలో ముఖ్యంగా నీరు, వివిధ లవణాలతో (ముఖ్యంగా క్లోరైడ్స్) కలిసి ఉంటాయి. ఈ చెమటతోబాటు శరీరంనుంచి అమోనియా, ప్రొటీన్లు, కొవ్వు, ఆమ్ల లవణాలుకూడా శరీరంలోంచి బయటకు వచ్చేస్తాయి. కాబట్టి చెమట ఉప్పగావుంటుంది.చెమట రావడంవలన చర్మం చెమ్మగావుంటుంది. ఎండకు, ఎక్కువ వేడికి చర్మం ఎండిపోకుండా ఉండేందుకు చెమట వస్తుంది . . నిజానికి చెమటకి వాసన ఉండదు. శరీరంపై ఉండే బ్యాక్టీరియా దానితో చేరినపుడు విపరీతమైన వాసన పుడుతుంది.

చెమట పట్టడం మానవులలో ఒక విధంగా ఉష్ణోగ్రతను నియంత్రించే విధానం. అయితే పురుషుల స్వేదంలో కామ ప్రకోపాన్ని అధికం చేసే లక్షణాలున్నట్లుగా కనుగొన్నారు. చర్మం మీది చెమట ఆవిరిగా మారినప్పుడు శరీరం చల్లబడుతుంది. ఉష్ణ ప్రదేశాలలో శరీర వ్యాయామం చేసేటప్పుడు ఎక్కువ చెమట పడుతుంది. చెమట మానసిక ఒత్తిడి వలన ఎక్కువౌతుంది. చల్లని వాతావరణంలో తక్కువగా ఉంటుంది. స్వేద గ్రంధులు తక్కువగా ఉండే కుక్క వంటి కొన్ని జంతువులలో ఇలాంటి ఉష్ణోగ్రత నియంత్రణ నాలుక మరియు నోటి గ్రంధుల ద్వారా జరుగుతుంది.

మానవ శరీరము ఒక యంత్రము లాంటిది . యంత్రము పనిచేస్తుంటే వేడి ఎలా పుడుతుందో ... శరీరం లో జరిగే జీవన క్రియలకు కూడా వేడి అలానే పుడుతుంది. ఆ వేడిని తగ్గించి శరీర ఉష్ణోగ్రతను క్రమబదీకరించి  98.6 ఫారన్‌హీట్ దగ్గర స్థిరం గా ఉండేందుకు శరీరము చేపట్టే ప్రక్రియే చెమట పోయడం .శరీరం మీద ఉన్న స్వేదగ్రంధులనుండి వేడిని చెమటతో బయటకు స్వేదం రూపములో పంపుతుంది. ఆ స్వేదము గాలిలోకి ఆవితవుతూ శరీరాన్ని చల్లబరుస్తుంది.

-- డా.వందన శేషగిరిరావు --- శ్రీకాకుళం
  • =====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...