Friday, December 03, 2010

రుతువుల్లోనే పండ్లేల? , why do fruits apper only in Seasons?


ప్రశ్న: చాలా రకాల చెట్లు రుతువుల్ని బట్టే కాయలు కాస్తాయెందుకు?

-మద్దిలి పద్మావతి, కోట బొమ్మాళి (శ్రీకాకుళం)

జవాబు: భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోందని చదువుకుని ఉంటారు. సూర్యుడి చుట్టూ తిరిగే కక్ష్యామార్గానికి భూమి అక్షం లంబంగా కాకుండా, కొంచెం ఒరిగినట్టు ఉండడం వల్లనే భూమిపై రుతువులు ఏర్పడుతున్నాయని కూడా తెలిసిందే. ఇందువల్లనే ఏడాది మొత్తాన్ని పరిశీలిస్తే భూమిపై ఏ ప్రాంతంలోనూ సూర్యరశ్మి తీవ్రత ఒకే విధంగా ఉండదు. పైగా భూమి దీర్ఘవృత్తాకార (elliptical) మార్గంలో సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే ఏడాదిలో కొంతకాలం సూర్యుడికి దగ్గరగా, మరి కొంత కాలం దూరంగా భూమి ఉంటుంది. ఈ రెండు కారణాల సమష్టి ఫలితమే భూమిపై కొన్ని ప్రాంతాల్లో రుతువులకు పునాది. చాలా చెట్లు వేసవి కాలానికి ముందే చిగురు తొడిగి మొగ్గలు వేసి పుష్పాలుగా వికసించి, పరాగసంపర్కం ద్వారా కాయలు, పండ్లుగా రూపాంతరం చెందుతాయి. ఈ దశలన్నింటికీ వాతావరణ ఉష్ణోగ్రత, గాలిలో తేమ, సూర్యరశ్మి అనుకూలత మొదలైన కారణాలు అనువుగా ఉంటాయి. మండు వేసవిలో నీటి కొరత ఏర్పడి కిరణజన్య సంయోగ క్రియ సజావుగా సాగదు. అందుకే కొన్ని చెట్లు తమకి అనుకూలమైన సమయాల్లోనే ఫలాలను ఇస్తుంటాయి.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌,వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక


  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...