Saturday, July 31, 2010

FireWorks Origin history , బాణాసంచా పుట్టుక కథ ఏమిటి?
దీపావళి రోజున , పెళ్ళి రోజున , ముఖ్యమైన ఉత్సవాల సందర్భము లోను , అమ్మవారు పండగల సీజన్‌ లోను, ఊరేగింపులలోను బాణాసంచా కాల్చుతూ ఉంటారు . దీపావలీ రోజున పిల్లలైతే ఎంతో ఆనందిస్తారు . బాణాసంచా కాల్చి ఆనందించడమే కాని దాని పుట్టుగ గురించి ఎవరూ అలోచించరు . మరి ఆ కథ ఏమిటో తెలుసుకుందాం ...


పూర్వము 2000 (రెండు వేల)ఏళ్ళ క్రితం చైనా లో ఓ వంటవాడు తమాసా గా ఒకరోజు వంటగదిలోని మూడు పొడులను కలిపి ఏదో చేద్దామని బానలి (పెనము) పై వేడి చేసున్నాడు . ఇంతలో పొయ్యిలోనుంచి ఒక నిప్పురవ్వ పడి ఆ మిశ్రమము పెద్దగా మెరుపులు చిమ్ముతూ మండిపోయింది . ఆ పొడులు సాదారణము గా వంటగదిలో ఉండే .. బొగ్గుపొడి , గంధకము , ఒక రకమైన ఉప్పు . ఇక దాంతో ప్రయోగాలు మొదలు పెట్టేడు . ఆ పొడులను కలిపి వెదురు బుంగ లో కూరి మంటలో పడేస్తే అది ' డాం ' అని పేలింది . అలా పుట్టింది బాణాసంచా.
బాణాసంచా కనిపెట్టింది చైనా వాళ్ళయినా వాటిని అద్బుతమైన కళగా మార్చింది ఇటాలియన్‌ లు . రంగురంగులతో మిరుమిట్లు గొలిపే సామగ్రిని తయారు చేసింది వాళ్ళే . బాణాసంచా కాలుస్తున్నప్పుడు ఏర్పడే రంగులకు కారణము రసాయనాలే ... బేరియం నైట్రేట్ వల్ల ' ఆకుపచ్చ కాంతి ' , కాపర్ సాల్ట్ వల్ల ' నీలము ' , స్టాటియం నైట్రేట్ వల్ల ' ఎరుపు ' , కార్బన్‌ వల్ల ' కాసాయము ' , మెగ్నీషియం-అల్యూమినియం వల్ల ' తెలుపు ' , సోడియం సాల్ట్ వల్ల పసుపు కాంతి విడుదల అవుతాయి .

బాణాసంచా రికార్డులు :
 • జపాన్‌ లో 1988 లో తయారు చేసిన అతిపెద్ద చిచ్చుబుడ్డి గిన్నెస్ రికార్డుల్లోకి ఎక్కింది . 54.7 అంగులాల వ్యాసము , 750 కిలోల బరువు ఉండే దీన్ని వెలిగించినపుడు రవ్వలు 3,937 అడుగుల వ్యాసము వరకూ విరజిమ్మినాయి .
 • మలేషియా లో 1988 లో 33,38,777 టపాలను ఉపయోగించి చేసిన 18,777 అడుగుల పొడవైన దండ ను పేల్చితే 9 గంటలు 27 నిముషాల పాటు ఆగకుండా పేలింది .
 • పోర్చుగల్ లో 2006 లో ఏకంగా 66,326 ఫైర్ వర్క్స్ ను కాల్చి ప్రపంచరికార్డు సృస్టించారు . ఇవి ఒకదాని తర్వాత ఒకటి గా ఆకాశములోకి దూసుకుపోఇ వెలుగుపూలు విరజిమ్మాయి .
 • బ్రిటన్‌ లో కేవలం 30 సెకనుల్లో 56405 ఫైర్ వర్క్స్ కాల్చడం ఒక రికార్డు .
 • బ్రితన్‌ లో బీచ్ నుంచి ఒకేసారి 40.000 తారాజువ్వల ను వెలిగించి వదిలారు .
 • అమెరికాలో 1992 లో ఇడాహో జలపాతము దగ్గర అతిపెద్ద భూచక్రాన్ని కాల్చారు . 47.4 అడుగుల వ్యాసము ఉన్న ఇది 3 నిముషాల 47 సెకనులు పాటు గిర్రుమంటూ తిరిగింది .

 • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

జలాంతర్గాములు ఓడల్నెలా కూలుస్తాయి? , Submerines destroy Ships - how?
ప్రశ్న : జలాంతర్గాముల సాయము తో సముద్రము పై ప్రయాణించే పడవలను ఎలా కూల్చగలరు ?

జవాబు : జలాంతర్గామి (submerine)నీటి అడుగున ప్రయాణించగలదు . అవసరమైతే నీటిపైకి మామూలు ఓడల్లాగా కూడా రాగలదు . జలాంతర్గాముల్లో క్షిపణులను , ఫిరంగుల్లాంటి తుపాల్కులను పేల్చగలిగే ఏర్పాట్లు ఉంటాయి .నీటి అడుగు నుంచి కూడా నీటి ఉపరితలము పై ఉండే లక్ష్యాల పైకి క్షిపణులను ప్రయోగించే వ్యవస్థ వీటిలో ఉంటుంది . జలాంతర్గాములు నీటి కింద ఉన్నప్పుడు వాటిని నడిపే కెప్టెన్‌లు పెరిస్కొపుల వంటి పరికరాల సాయము తో నీటి పై ఉండే శత్రుఓడల్ని , స్థావరాల్ని గుర్తించే అవకాసము ఉంటుంది . నీటిలోనే దూసుకుపోగల మిస్సైళ్ళను టార్బిడాలని (torbidos) అంటారు . రాడార్ వ్యవస్థ ద్వారా చుట్టు ప్రక్కల గాలిలో ఈగల్ని , గ్రద్దలను కూడా చూడగల ఎలక్ట్రానిక్ (electronic) సామర్ధ్యము ఆధునిక జలంతర్గాముల్లో ఉన్నది .

మూలము : ఈనాడు దినపత్రిక .
 • =================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Thursday, July 29, 2010

ఎం.ఆర్.ఐ.స్కానర్‌ ఎలా పని చేస్తుంది? , MRI scanner working datails
ప్రశ్న:
MRI స్కానర్‌ ఎలా పని చేస్తుంది?
- ఎమ్‌. అరుణ్‌కుమార్‌, ఇంటర్‌, ఇచ్ఛాపురం
జవాబు:
MRI 'మాగ్నెటిక్‌ రెజోనెన్స్‌ ఇమేజింగ్‌' అనే ఆంగ్ల పదాలకు సంక్షిప్త పదం. తెలుగులో 'అయస్కాంత అనునాద ప్రతిబింబ కల్పన' అని చెప్పుకోవచ్చు.

భౌతిక శాస్త్ర సూత్రమైన అయస్కాంత అనునాదాన్ని అనుసరించి మనం కంటితో చూడలేని శరీర భాగాల ప్రతిబింబాలను కంప్యూటర్‌ తెరపై చిత్రించే పరికరాన్నే ఎమ్మారై స్కానర్‌ అంటారు.

సొరంగంలాగా ఉండే MRI స్కానర్‌ భాగంలోకి ప్రేవేశపెట్టిన వ్యక్తి శరీరం ఆ పరికరంలో ఉండే అతి శక్తివంతమైన అయస్కాంత క్షేత్రానికి గురవుతుంది. ఫలితంగా శరీరంలోని అణువులలో ఉండే కణాలు ఒక వరస క్రమంలోకి వస్తాయి. ఆ తర్వాత అక్కడే ఉత్పన్నమయ్యే రేడియో తరంగ స్పందనలు ఆ కణాలను అవి ఉండే క్రమం నుంచి చెదరగొడతాయి. మళ్లీ ఆ కణాలు వాటి తొలి స్థానాలకు వచ్చే క్రమంలో రేడియో సంకేతాల్ని ఉత్పన్నం చేస్తాయి. ఆ సంకేతాలను స్కానర్‌కు అనుసంధానించిన కంప్యూటర్‌ విశ్లేషిస్తుంది. ఆపై కంప్యూటర్‌ తెరపై దేహంలోని ధాతువు (కణజాలాల) యొక్క ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఆ ప్రతిబింబం నుంచి ఆ ధాతువు (దేహభాగం) యొక్క నిర్మాణాత్మక, జీవరసాయన సమాచారాన్ని, లోపాల్ని తెలుసుకుంటారు.

- ఈ.వి. సుబ్బారావు, హైద్రాబాద్‌

 • ==========================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

ఈత రాని చేపలుంటాయా? , Fish can not swim ?
చేప అంటే నీటిలో ఈది తీరాలిగా? కానీ ఈతరాని చేపలున్నాయంటే నమ్ముతారా! అవును 'హాండ్‌ ఫిష్‌లు' ఆ రకమే. ఇవి ఈదలేవు. మరేం చేస్తాయి? సముద్రం అట్టడుగు మట్టంపై చేతులతో నడుస్తాయి. చేపకు మొప్పలుంటాయి కానీ చేతులేంటి? అదే వీటి ప్రత్యేకత. వీటికి మొప్పల స్థానంలో బలమైన కండరాలు పొడుచుకు వచ్చి ఉంటాయి. అచ్చం చిన్న చిన్న చేతుల్లాగా. వాటితో నడుస్తాయి. ఆస్ట్రేలియా సముద్రాల్లో మాత్రమే కనిపించే ఈ నడిచే చేప ఈదలేకపోడానికి కూడా కారణం ఇదే. ఇవి ఇలా నడచుకుంటూ నీటి అడుగున ఉండే క్రస్టసీన్‌లు, చిన్నచిన్న జీవులు కనిపిస్తే గుటుక్కుమనిపిస్తుంటాయి. అందుకే దీనికి 'హాండ్‌ ఫిష్‌' అని పేరొచ్చింది. ఈ మధ్యే వీటిల్లో 9 కొత్త జాతుల్ని కనుగొన్నారు. మొత్తం 14 జాతులున్నాయి.

ఈ చేప ఎంతుంటుందో తెలుసా? నాలుగు అంగుళాలు అంటే 10 సెంటీమీటర్లు. చూడ్డానికి రంగురంగుల్లో భలే అందంగా కనిపించే ఈ చేపల్లో పింక్‌ హాండ్‌ ఫిష్‌ అనే దానిపై ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేసి హడావుడి చేశారు. ఎందుకో తెలుసా? అక్కడి సముద్రాల్లో జీవ వైవిధ్యం బాగా దెబ్బతింటోందిట. అలా ముప్పు పొంచిన ఉన్న జీవుల్లో మొదటి స్థానంలో ఉంది ఈ చేపే మరి.

ఎప్పుడో 11ఏళ్ల క్రితం 1999లో కనిపించిన ఈ జాతికి చెందిన పింక్‌ హాండ్‌ ఫిష్‌ మళ్లీ ఇప్పుటి వరకూ జాడలేకుండా పోయిందంటే ఇవెంత ప్రమాదస్థితిలో ఉన్నాయో అర్థమవుతుంది. దాదాపు 5 కోట్ల ఏళ్ల క్రితం ఈ చేపలు ప్రపంచవ్యాప్తంగా అన్ని సముద్రాల్లో ఉండేవట. వాతావరణ కాలుష్యం, వేట, సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల ఇవి క్రమంగా అంతరించిపోయాయి.

బ్యాట్‌షిఫ్‌ కూడా..
ఇలా నడిచే చేపల జాబితాలో బ్యాట్‌ఫిష్‌లు కూడా ఉన్నాయి. వీటిల్లో రెండు కొత్త జాతుల్ని మెక్సికోలోని సముద్ర
తీరంలో కనుగొన్నారు. మన అరచేతుల్లో ఇమిడేంత పరిమాణంలో ఉండే ఇవి అట్టడుగున సముద్ర తలంపై చకచకా నడిచేస్తాయి. వీటికి దృఢమైన భుజాల్లాంటి మొప్పలు ఉన్నాయి. అదాటున చూస్తే గబ్బిలం నడుస్తున్నట్టుగా ఉంటుంది. అందుకే వాటికి బ్యాట్‌ఫిష్‌ అని పేరొచ్చింది. గల్ఫ్‌ తీరంలో డీజిల్‌, పెట్రోల్‌ అవశేషాలు సముద్రంలో కలుస్తాయి కదా, వాటి వల్ల ఈ చేపలు చాలా ప్రమాదంలో పడ్డాయి. వీటి ఆహారమైన ప్లాంక్‌టన్‌లు విషపూరితమైపోతున్నాయి. అలాగే వాటి గుడ్లు కూడా పిల్లలవ్వకుండానే చనిపోతున్నాయి.

 • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.

భూమి, ఆకాశం కలిసిపోతాయా? , Earth and Sky meets at distance ?

ప్రశ్న: ఎత్తయిన ప్రదేశంలో నిలబడి చుట్టూ చూస్తే చాలా దూరంలో భూమి, ఆకాశం కలిసిపోయినట్లు కనిపిస్తాయి. ఎటు చూసినా అలాగే ఉంటుంది. అవి నిజంగా కలుస్తాయా?

జవాబు: భూమ్యాకాశాలు ఎక్కడా కలవవు. ఎందుకంటే భూమి అనే వస్తువు వాస్తవమే అయినా, ఆకాశమనేది వస్తువూ కాదు, వాస్తవమూ కాదు. మన కంటికి తోచే ఖాళీ ప్రదేశమే ఆకాశం. కేవలం భూమి మీదున్న వాతావరణం వల్లనే ఆకాశం నీలం రంగులో కనిపిస్తుందే కాని, ఆ పరిధి దాటి పైకి వెళితే కనిపించేదంతా కటిక చీకటి లాంటి అంతరిక్షమే. నక్షత్రాలు కనిపిస్తాయి కానీ మిణుకుమనవు. సూర్యుడు ప్రచండమైన కాంతితో గుండ్రంగా గీత గీసినట్టు కనిపిస్తాడు. రేఖల్లాగా మెరుపులు కనిపించవు. భూమి గుండ్రంగా ఉండడం వల్ల, మన కంటికి పారలాక్స్‌ అనే దోషం ఉండడం వల్ల భూమ్యాకాశాలు కలిసిపోయినట్లు అనిపిస్తుంది. దగ్గరగా చూస్తే వెడల్పుగా ఉండే రైలు పట్టాలు దూరానికి కలిసిపోయినట్టు అనిపించినట్టే ఇది కూడా. గోళాకారంలో ఉండే భూమి ఒంపు వల్ల ఈ భ్రమ (illusion)కలుగుతుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక


 • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

రక్తకణాలు ఎలా ఏర్పడతాయి? , Blood cells formation - How?
ప్రశ్న: మన దేహంలో రక్తకణాలు ఎలా ఏర్పడతాయి?

జవాబు: శరీరంలోని రక్తంలో ఉండే ఎర్రరక్తకణాలు, రక్త పట్టీలు (ప్లేట్లెట్స్‌), సుమారు 70 శాతం తెల్ల రక్త కణాలు ఎముకల్లో ఉండే మూలగ (Bone Marrow) నుంచి తయారవుతాయి. మిగతా తెల్లరక్త కణాలు రససంబంధిత ధాతువుల (lymphatic tissues) నుంచి తయారవుతాయి.

ఎర్ర కణాలు, తెల్లకణాలు, దేహంలో మొదటి నుంచి ఉండే వంశానుగత కణాలు (Stem Cells) ద్వారా క్రమేపీ జరిగే అతిక్లిష్టమైన పరివర్తనం వల్ల ఎముకల్లోని మూలగలో ఉత్పన్నమవుతాయి. మూలగలో ఉండే రక్తకణం కేంద్రకం కలిగి ఉంటుంది. అయితే ఆ రక్తకణం మూలగ నుంచి వెలువడేటపుపడు తన కేంద్రకాన్ని పోగొట్టుకుంటుంది. అపుడా రక్తకణం అసంపూర్ణ కణం. అలా వెలువడిన కణం ఊపిరి తిత్తులలోని ప్రాణవాయువును గ్రహించి, దాన్ని కణ జాలాల్లోని (Tissue) కార్బన్‌ డై ఆక్సైడ్‌తో మార్పిడి చేసుకుంటుంది. రక్తకణాలు ముఖ్యంగా మూడు విధులను నిర్వర్తిస్తాయి. అందులో మొదటిది ఎర్రరక్త కణాలు ఆక్సిజన్‌ను రవాణా చెయ్యడమైతే, రెండవది తెల్ల రక్తకణాలు వ్యాధి నిరోధక కణాలుగా వ్యవహరించడం, మూడవది గాయాల నుంచి రక్తం అదేపనిగా కారిపోకుండా గడ్డ కట్టే ప్రక్రియలో తోడ్పడడం.
source : Eenadu news paper- ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

 • ==============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Wednesday, July 21, 2010

నుదిటిపై వేలు తిప్పితే నొప్పేల? , Finger on the forehead gives pain why?


ప్రశ్న:
నుదిటిపైన, కనుబొమ్మల మధ్య చూపుడు వేలును నుదుటికి తాకకుండా గుండ్రంగా తిప్పితే అక్కడ నొప్పి పుట్టినట్టనిపిస్తుంది. ఎందుకు?
-మగ్గిడి ప్రసాద్‌, మంథని
జవాబు:
శరీరంలో తల (skull) భాగం చాలా విశిష్టమైంది. ఇందులోనే శరీరం మొత్తాన్ని నియంత్రించే మెదడుతోపాటు పంచేంద్రియాలన్నీ ఉన్నాయి. నుదుటి మీద చూపుడు వేలు దగ్గరగా ఉంచి అటూయిటూ తిప్పినపుడు, ఆ వ్యక్తి అప్రయత్నంగా తన తలకు, కళ్లకు ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అన్నట్టు రెండు కళ్లను ఆ వేలి వైపు తిప్పడానికి ప్రయత్నిస్తాడు. అయితే మన కళ్లు రెండూ దృష్టినాడి (optical nerve) ద్వారా అనుసంధానం కావడం వల్ల అవి ఎపుడూ ఒకేవైపు కలిసి తిరుగుతూ ఉంటాయి. ఇది నొప్పి (strain)లేని ప్రక్రియ. కానీ కళ్లకు దగ్గరగా చూపుడు వేలు తిప్పేటప్పుడు రెండు కళ్లూ కనుబొమ్మల మధ్యకు (అంటే కుడికన్ను ఎడమవైపునకు, ఎడమకన్ను కుడివైపునకు కొద్దిగా) తిరగాలి. ఇది అసహజ ప్రక్రియ. అందువల్ల కనుబొమ్మలు ఇబ్బంది (strain) పడతాయి.

-ప్రొ||ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక


 • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

బొబ్బలెక్కుతాయెందుకు? , Blebs form in Burns why?

ప్రశ్న:
మరిగే నీళ్లు శరీరంపై పడితే బొబ్బలెందుకు వస్తాయి?
-జక్కా మన్మథ, జొన్నలపాడు
జవాబు:
ఒక వస్తువు వేడిగా ఉందంటే, దాని ఉష్ణోగ్రత మన శరీర ఉష్ణోగ్రత కన్నా ఎక్కువగా ఉందన్న మాట. ఉష్ణం ఎప్పుడూ ఎక్కువ ఉష్ణోగ్రత నుంచి తక్కువ ఉష్ణోగ్రత వైపు పయనిస్తుంది. వేడిగా ఉన్న వస్తువును తాకినప్పుడు ఉష్ణం తక్కువ ఉష్ణోగ్రత ఉన్న మనదేహంలోకి ప్రవేశిస్తుంది. మన దేహం అనేక జీవకణాలతో నిర్మితమైంది. ఈ కణాలు అనేక అణువుల సముదాయం. సామాన్య దేహ ఉష్ణోగ్రత వద్ద ఈ అణువులు కదులుతూ ఉంటాయి. వేడి వస్తువు మన దేహంలోని ఏ భాగానికైనా తగిలితే, ఉష్ణశక్తి వలన ఆ వస్తువులో అతి వేగంగా చలిస్తున్న అణువులు మన దేహ భాగంలోని అణువులను కూడా అతి వేగంగా చలించేటట్లు చేస్తాయి. అందువల్ల మనదేహంలో ఆ భాగంలోని అణువులు దూరంగా వెళతాయి. కొన్ని సమయాల్లో అణువులు చర్మాన్ని వీడి పోతాయి. అప్పుడు కలిగే స్పర్శజ్ఞానమే కాలడం, బొబ్బలెక్కడం. ఆ విధంగా మరుగుతున్న నీళ్లు శరీరంపై పడితే బొబ్బలొస్తాయి.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైద్రాబాద్‌


 • ==============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

తోడుకు ముందు పాలు ఎందుకు వేడిచేయాలి? , Milk heated before curdling Why?

ప్రశ్న:
పాలను తోడు పెట్టడానికి వేడి చేయాల్సిన అవసరం ఏమిటి? వేడి చేయకుండా తోడు పెడితే తోడుకోవేం?

జవాబు:
పాలను పెరుగుగా మార్చడానికి కొంత మజ్జిగనో, పెరుగు బిళ్లనో వేయడాన్నే తోడుపెట్టడం, తీరు పెట్టడం అంటారని తెలిసిందే. శాస్త్రీయంగా దీనిని సీడింగ్‌ (seeding) అంటారు. పాలను పెరుగుగా మార్చేది ఈస్ట్‌ (yeast) అనే సూక్ష్మజీవులే. మజ్జిగ లేదా పెరుగులో ఇవి ఉంటాయి. పాలలో ఇవి ఉండవు. కాబట్టి ఈస్ట్‌ బ్యాక్టీరియా ఉండే మజ్జిగను అవి ఏమాత్రం లేని పాలలో వేయడం వల్ల అవి తమ సంతానాన్ని అధికంగా నెలకొల్పుకోవడం వల్లనే ఆ పాలన్నీ మర్నాటికి పెరుగుగా మారుతాయి. ఇక వేడి చేయడం ఎందుకో చూద్దాం. మామూలు పాలలో ఈస్ట్‌కు కావలసిన లాక్టోజ్‌, గెలక్టోజ్‌ వంటి ఆహార దినుసులు, కొన్ని ప్రోటీన్లు, నీరు ఉంటాయి. అయితే పాలలోని తైలబిందువులు (fat globules) ఈస్ట్‌ అభివృద్ధికి సహకరించవు. అందువల్ల కొవ్వులు లేని పాలు ఈస్ట్‌ ఎదుగుదలకు అనుకూలం. పాలను కాచడం వల్ల అందులో ఉన్న కొవ్వు పదార్థమంతా ఒక చోటకి చేరుకుని తొరకలా ఏర్పడుతుంది. ఆ పాలు బాగా వేడిగా ఉన్నప్పుడు కూడా తోడు వేయకూడదు. అప్పుడు బ్యాక్టీరియా చనిపోయి పాలు సరిగా తోడుకోవు. కాచిన పాలు గోరువెచ్చగా చల్లారిన సమయంలో తోడు పెడితే పెరుగు బాగా అవుతుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

 • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Tuesday, July 20, 2010

గ్రహాలు గుండ్రంగానే ఉండనేల? , Planets are round in shape Why?

ప్రశ్న:
సూర్యుడు, గ్రహాలు, భూమి, నక్షత్రాలు అన్నీ గుండ్రంగానే ఉంటాయెందుకని?
-సిహెచ్‌. హేమ, 9వ తరగతి, పాల్వంచ
జవాబు:
నక్షత్రాలు, గ్రహాలు ఏర్పడిన తొలి దశలో అవన్నీ కొంతవరకు ద్రవరూపంలోనే, అత్యంత ఉష్ణోగ్రతలతో ఉండేవి. ఆపై క్రమేణా చల్లబడి కొన్ని గ్రహాలు ఘనరూపం దాల్చగా, నక్షత్రాలు ఇంకా చాలావరకూ ద్రవ, వాయు రూపంలోనే ఉన్నాయి. గ్రహాలు, నక్షత్రాలలో ఉండే గురుత్వాకర్షణ శక్తి వాటి కేంద్రాల నుంచి ఉత్పన్నమవడంతో వాటిలోని వివిధ కణాలు వాటి కేంద్రాల వైపు ఆకర్షితమవుతాయి. ఉష్ణోగ్రతలు తగ్గి చల్లబడిన తర్వాత కూడా అంతర్భాగాలలో విచ్ఛిన్నమవుతున్న రేడియో ధార్మిక మూలకాల వల్ల గ్రహాల లోనూ, కేంద్రక సంయోగం (న్యూక్లియర్‌ ఫ్యూజన్‌) వల్ల నక్షత్రాల లోను ఉష్ణం పుడుతూనే ఉంది. అందువల్ల గ్రహాల అంతర్భాగంలోని పదార్థాలు, నక్షత్రాల లోని పదార్థాలు ఇప్పటికీ ద్రవరూపంలోనే ఉన్నాయి. ఈ పదార్థాలు కూడా గురుత్వాకర్షణ వల్ల వాటి కేంద్రాల వైపే ఆకర్షితమవుతూ ఉంటాయి. ఈ ఆకర్షణ అన్ని భాగాలపైనా ఒకే విధంగా ఉండడం వల్ల నక్షత్రాలు, గ్రహాలు గోళాకార రూపం దాల్చాయి. గణిత భావనల ప్రకారం ఆదర్శవంతమైన సౌష్ఠవరూపం గోళాకారమే.


Courtesy:Eenadu telugu daily-ప్రొ||ఈ.వి.సుబ్బారావు


 • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

మాంసం తినే మొక్కలుంటాయా?, Flesh eating Plants Present ?

ప్రశ్న:
మొక్కల్లో మాంసాహారాన్ని తీసుకునేవి ఉంటాయని విన్నాను. నిజమేనా?
-డి.వి. రమణరావు, భీమవరం
జవాబు:
కొన్ని మొక్కల్లో కీటకాలను ఆకర్షించి, బంధించే వ్యవస్థ ఉన్నవి ఉన్నాయి. బంధించిన కీటకాలను ఎంజైములు, బ్యాక్టీరియా సాయంతో జీర్ణించుకునే వీలు వాటిలో ఉంటుంది. ఇలాంటి మొక్కలను మాంసాహారపు మొక్కలు (carnivorous plants) అంటారు.

ఆఫ్రికా అడవుల్లో ఎక్కువగా ఉండే ఇలాంటి మొక్కల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. ఉదాహరణకు వీనస్‌ ఫ్త్లెట్రాప్‌ అనే మొక్క ఆకులు తెరిచిన దోసిలిలాగా అమరి ఉంటాయి. వాటి అంచుల్లో సన్నని వేళ్లలాంటి కాడలు ఉంటాయి. ఆకుల లోపలి గ్రంథులు సువాసనలను వెదజల్లే స్రావాలను విడుదల చేస్తాయి. అందువల్ల ఆకర్షితమైన కీటకాలు ఆకుల మధ్యకు చేరుకోగానే, అంతవరకూ దోసిలిలా ఉండే భాగాలు చటుక్కున మూసుకుపోతాయి. అంచుల్లో ఉండే కాడలు కూడా మనం వేళ్లను బిగించినట్టుగా బిగిసిపోతాయి. దాంతో లోపలి కీటకం ఎటూ తప్పించుకోలేదు. ఆకుల లోపలి భాగంలో స్రవించే ఎంజైములు, ఆమ్లాల వల్ల కీటకం శరీరం విచ్ఛిన్నమై ద్రవరూపంలోకి మారుతుంది. మొక్క దాన్ని శోషించుకుంటుంది. ఇలా దొన్నెల్లాగా, మూతల్లాగా రకరకాల ఆకారాల్లో ఉండే ఈ మాంసాహార మొక్కల్లో కొన్ని చిన్న చిన్న జంతువులను సైతం పట్టి అరాయించుకునే శక్తి కలవి ఉంటాయి.

Courtesy:Eenadu telugu daily-ప్రొ||ఈ.వి.సుబ్బారావు


 • ========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Monday, July 19, 2010

వానపడేప్పుడు కరెంటు ఆపేస్తారేం? , Electric power off whhile raining Why?
ప్రశ్న: బాగా వర్షం వచ్చేప్పుడు విద్యుత్‌ సరఫరాను నిలిపివేయడాన్ని గమనించాను. ఎందుకు?
-కె. హయగ్రీవాచారి, కాజీపేట
జవాబు: సాధారణ వర్షం కురిసేప్పుడు విద్యుత్‌ సరఫరాను ఆపరు. కేవలం మెరుపులు, వేగంగా వీచే గాలులతో కూడిన భారీ వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే ఇలా చేస్తారు. బాగా మెరుపులు వచ్చేప్పుడు అవి విద్యుత్‌ తీగలను తాకితే వేల ఓల్టుల విద్యుత్‌ శక్మం (electrical potential) తీగల ద్వారా ఇళ్లు, సబ్‌స్టేషన్లలోకి ప్రసరించే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల విద్యుత్‌ సాధనాలు, పరికరాలు పాడయిపోతాయి. విద్యుత్‌ను ముందుగానే ఆపితే నష్టం కొంత నివారణ అవుతుంది. పెనుగాలులు వీచేప్పుడు చెట్లు, స్తంభాలు కూలిపోయి వైర్లు కలిసి విద్యుత్‌ హ్రస్వ వలయం (electrical short circuit) ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక


 • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

కమలం చరిత్ర ఏంటి? , Lotus History

* కమలం వయసు కచ్చితంగా తెలియదు. ఈజిప్టులో 1922లో బయటపడిన టుటాంక్‌మాన్‌ సమాధిలో మమ్మీ చుట్టూ ఊదా రంగు కమలాలు అమర్చి ఉండడాన్ని కనుగొన్నారు. ఆ సమాధి కొన్ని వేల ఏళ్లనాటిది.
* బౌద్ధమతంలో స్వచ్ఛమైన ఆత్మ, వాక్కు, మనస్సులకు ప్రతీకగా కమలాన్ని పేర్కొంటారు.
* ఇవి తెలుపు, ఎరుపు, నీలం, ఊదా, గులాబి రంగుల్లో ఉంటాయి.
* పరిసరాలను బట్టి కమలం తన ఉష్ణోగ్రతను నియంత్రించుకోగలదు. కీటకాల ఆకర్షణ కోసమే ఇదంతా.
* ప్రతి కమలం 2000 విత్తనాల్ని ఇస్తుంది. ఆ విత్తనాలు పొడి ప్రదేశంలో వందేళ్లయినా చెక్కు చెదరకుండా ఉంటాయి. శాస్త్రవేత్తలకి వెయ్యేళ్ల వయసున్న విత్తనాలు కూడా దొరికాయి.
* చాలా దేశాల్లో ఈ పువ్వుల రెక్కలు, కాండం, వేళ్లతో రకరకాల వంటలు చేస్తారు. దీని వేళ్లలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండడంతో పాటు, విటమిన్‌ సి అధికంగా లభిస్తుంది.
* చైనాలో కమలాలను ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.
* కమలం మనదేశానికే కాదు బంగ్లాదేశ్‌కు కూడా జాతీయపుష్పమే.

 • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

డైవర్ల మత్తు తెలిసేదెలా? , How to measure alcohol persent in Drivers?

ప్రశ్న: రహదారులపై వాహనాల డ్రైవర్లు మత్తు పానీయాలు తీసుకున్నారని కనిపెట్టే బ్రీత్‌ ఎనలైజర్‌ ఎలా పనిచేస్తుంది?
-జానపాటి శ్రీనివాస్‌, నందిపహాడ్‌, నల్గొండజిల్లా
జవాబు: వాహనాలను నడిపేవారు తాగి ఉన్నారో లేదో తెలుసుకోడానికి పోలీసులు ఉపయోగించే 'బ్రీత్‌ ఎనలైజర్‌' పేరుకు తగినట్టుగానే శ్వాసను విశ్లేషించడం ద్వారా పనిచేస్తుంది.ఒక వ్యక్తి మత్తుపానీయం సేవిస్తే అది అతని రక్తంలో కొంత శాతం కలుస్తుంది. ఆ రక్తం ఊపిరితిత్తులకు సరఫరా అయినపుడు అందులోని మత్తు పానీయం కొంత ఆవిరయి ఊపిరిలో కలుస్తుంది. రక్తంలో ఎంత ఎక్కువ మత్తుపానీయం కలిస్తే అంత ఎక్కువగా శ్వాసలో దాని ప్రభావం ఉంటుంది. అందువల్లే తాగిన వ్యక్తి దగ్గర వాసన వస్తుంది.

బ్రీత్‌ ఎనలైజర్‌లోని ఒక గొట్టం వ్యక్తి శ్వాసను పీల్చుకుంటుంది. పరికరంలో ఉండే ప్లాటినం ఏనోడ్‌ (విద్యుత్‌ ధ్రువం), వ్యక్తి శ్వాసలోని మత్తు పానీయాన్ని ఆక్సీకరించి ఎసిటిక్‌ యాసిడ్‌గా మారుస్తుంది. ఈ యాసిడ్‌లోని అణువులు కొన్ని ఎలక్ట్రాన్లను కోల్పోవడంతో విద్యుత్‌ ప్రవాహం ఏర్పడుతుంది. ఈ విద్యుత్‌ ప్రవాహం తీవ్రత ఎక్కువగా ఉంటే పరికరంలో ఎర్ర బల్బు, తక్కువగా ఉంటే ఆకుపచ్చ బల్బు వెలుగుతాయి. దాన్ని బట్టి ఆ వ్యక్తి ఎంత మేర మద్యం పుచ్చుకున్నాడో తెలుస్తుంది. ఈ మధ్య ఈ పరికరంలో ఎన్నో మార్పులు వచ్చాయి. కొన్ని పరికరాలు మత్తు పానీయం స్థాయిని అంకెల్లో చూసిస్తే, మరో కొన్ని రంగులు మార్పు ద్వారా చూపిస్తాయి.

courtesy -Eenadu telugu daily - ప్రొ||ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

 • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

నడుస్తుంటే చేతులూపాలా?, Hands Swing while walking Why?
ప్రశ్న:
మనం నడుస్తున్నపుడు చేతులు ఎందుకు వూపుతాము?
-లగుడు కృష్ణ సౌందర్య, 8వ తరగతి, చోద్యం, గోటగొండ
జవాబు:
నడుస్తున్నప్పుడు చేతులూపడమనేది అసంకల్పితంగా జరిగేదే అయినా, దీని వెనుక బ్యాలన్స్‌కి సంబంధించిన సూత్రం ఉంది. ఇది, శరీరం మధ్య భాగాన్ని కదలకుండా ఉంచడానికి, దేహశక్తిని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. నడిచేప్పుడు మనపై కొన్ని బలాలు పనిచేస్తుంటాయి. మన శరీరం పైనుంచి కిందికి ఒక నిలువైన అక్షం (axis)ఉన్నట్టు వూహించుకుంటే, కుడికాలును ముందుకు వేసినప్పుడు అక్షంపై ఒక బలం గుండ్రంగా తిరుగుతూ పని చేస్తుంది. దీనిని అపవర్తన భ్రామకం (రొటేషనల్‌ మొమెంట్‌) అంటారు. దీని వల్ల నడుం గుండ్రంగా తిరగడానికి ప్రయత్నిస్తుంది. అలా తిరిగితే నియంత్రణ కోల్పోయి పడిపోతాం. ఈ బల ప్రభావాన్ని ఆపాలంటే దీనికి వ్యతిరేక దిశలో మరో బల భ్రామకం పనిచేయాలి. ఇది ఎడమ చేతిని ముందుకు వూపడం వల్ల ఏర్పడుతుంది. అంటే, కుడికాలును ముందుకు వేస్తే ఏర్పడిన బలాన్ని, ఎడమచేతిని ముందుకు ఊపితే ఏర్పడిన బలం 'బ్యాలెన్స్‌' చేస్తుంది.

కుడికాలును ముందుకు వేసినపుడు కుడిచేతిని, ఎడమకాలును ముందుకు వేసినపుడు ఎడమచేతిని అదే దిశలో వూపి నడవడం సాధ్యంకాదు. అలా చేస్తే మన నడుము, శరీరం పక్కకు ఒరిగిపోయే బలానికి గురవడం వల్ల ఇబ్బందిగా ఉంటుంది. ఇలా పరుగెత్తడానికి ప్రయత్నిస్తే అసలు సాధ్యం కాదు.

- ప్రొ||ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

 • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

హెలీకాప్టర్‌ ఎగిరేదెలా? , Helicopter Flying how?

ప్రశ్న:
హెలికాప్టర్‌ ఎగరడానికి కావలసిన 'ఫోర్స్‌' ఏమిటి?
- బి. అభిజిత్‌, తణుకు
జవాబు:
విమానం చేయలేని పనులను కూడా హెలికాప్టర్‌ చేయగలదు. రన్‌వే పై పరుగెత్తకుండానే ఉన్న చోట నుంచి నిట్టనిలువుగా పైకి లేవగలదు. కావాలంటే వెనక్కు ఎగరగలదు. ఎగురుతూ కావలసిన చోట ఆగిపోయి ఉండగలదు. గాలిలో పూర్తిగా గుండ్రంగా తిరుగగలదు. ఇన్ని ప్రత్యేకతలతో హెలికాప్టర్‌ ఎగరడానికి దానిలోని ప్రధాన భాగాలైన మెయిన్‌ రోటర్‌, డ్రైవ్‌ షాప్ట్‌, కాక్‌పిట్‌, టెయిల్‌ రోటర్‌, లాండింగ్‌ స్కిడ్స్‌ దోహదం చేస్తాయి.

మన ఇంట్లోని సీలింగ్‌ ఫ్యాన్‌ను తీసుకొచ్చి తిరగేసి బిగించినట్టుగా హెలికాఫ్టర్‌ మీద పెద్ద పెద్ద రెక్కలున్న పంకా ఉంటుంది. ఈ మొత్తం అమరికను 'మెయిన్‌ రోటర్‌' అంటారు. ఈ రెక్కలు గిరగిరా తిరగడం వల్లనే హెలికాప్టర్‌ పైకి లేస్తుంది. అంత బరువైన హెలికాఫ్టర్‌ను పైకి లేపేటంత 'లిఫ్ట్‌' (బలం) ఏర్పడేలా రెక్కలను వేగంగా తిప్పడానికి ప్రత్యేకమైన ఇంజను ఉంటుంది. పంకా రెక్కలు హెలికాఫ్టర్‌ చుట్టూ ఉండే గాలిని కిందకు నెడతాయి. ఇది చర్య అనుకుంటే, దీనికి ప్రతిచర్యగా హెలికాప్టర్‌ పైకి లేస్తుంది.

పంకా తిరగడంతో పైకి లేచిన హెలికాప్టర్‌ దానికి వ్యతిరేక దిశలో గిరగిరా తిరగాలి కదా. మరి దాన్ని ఆపాలంటే, మెయిన్‌ రోటర్‌ తిరిగే దిశకు వ్యతిరేకంగా పనిచేసే సమానమైన బలం కావాలి. ఈ బలాన్ని హెలికాప్టర్‌ తోకకు ఉండే రెక్కలు (టెయిల్‌ రోటర్‌) కలిగిస్తాయి. ఈ రెక్కలు తిరగడం వల్లనే హెలికాప్టర్‌ పైకి లేచిన తర్వాత స్థిరంగా ఉండ గలుగుతుంది. హెలికాప్టర్‌ తలమీద, తోక దగ్గర ఉండే రెక్కల్ని ఒకే ఇంజను ద్వారా తిప్పే ఏర్పాటు ఉంటుంది.

ఇక 'కాక్‌ పిట్‌'లో పైలట్‌ దగ్గర రెండు రకాల కంట్రోల్సు ఉంటాయి. ఒకటి 'సైకిక్‌ కంట్రోల్‌' అయితే, మరొకటి 'కలెక్టివ్‌ కంట్రోల్‌'. సైకిక్‌ కంట్రోల్‌ ద్వారా పైలెట్‌ హెలికాప్టర్‌ను ముందుకు, వెనక్కు, కుడి ఎడమలకు తిప్పకలుగుతాడు. కలెక్టివ్‌ కంట్రోల్‌ ద్వారా పైకి, కిందికి తిప్పకలుగుతాడు. పైలట్‌ కాళ్ల దగ్గర టెయిల్‌ రోటర్‌ వేగాన్ని నియంత్రించే పెడల్స్‌ ఉంటాయి. ఇన్ని సదుపాయాలున్న హెలికాప్టర్‌ని 75 సంవత్సరాల క్రితం ఐగర్‌ సికోరస్కీ అనే ఇంజనీరు రూపొందించాడు.

- ఈ.వి. సుబ్బారావు, హైద్రాబాద్‌-(ఈనాడు దినపత్రిక సౌజన్యము తో)


 • ========================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Sunday, July 18, 2010

Does poultry eggs give chicks on hatching?, ఫారం కోడిగుడ్లను పొదిగితే పిల్లలవుతాయా?
ప్రశ్న: కంపెనీ కోడి గుడ్లను ఫారం కోళ్లు పొదగవు. ఆ గుడ్లను నాటు కోడిచేత పొదిగించినా పిల్లలు రావు. మరి వాటిని పొదిగేదెలా?
ప్రశ్న: నాటుకోడి పెట్టిన గుడ్లను పొదిగితే పిల్లలవుతాయి. మరి ఫారం కోడిగుడ్లను పొదిగితే కూడా పిల్లలవుతాయా?

జవాబు: నాటు కోడి ప్రకృతి సహజంగా పరిణామ క్రమంలో ఆవిర్భవించిన ఓ జీవి. ఇది ఒక సకశేరుక (vertebrate) పక్షివర్గపు (aves) జంతువు. ప్రకృతి సిద్ధంగా ప్రతి జీవి తన సంతానాన్ని తన జాతిని తరాల తరబడి ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. అందుకే జీవుల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థ (reproductive system) ఉంది. మామూలు నాటు కోడి ప్రకృతి సిద్ధమైనదే కానీ, ఫారం (poultry) కోడి అలాంటిది కాదు. జన్యు సాంకేతిక ప్రక్రియ (genetic engineering)ను, ప్రకృతి సిద్ధమైన పద్ధతులకు సంధానించగా ఏర్పడినది. అవి గర్భం నుంచే పుడతాయి కానీ వాటి గుడ్లను పొదిగితే పిల్లలు రావు. కారణం వీటి గుడ్లలో ఫలదీకరణం చెందిన అండం ఉండదు. ఆడ, మగ కోళ్లు జతగూడడం వల్ల కాకుండా ప్రత్యేక పద్ధతిలో సేకరించిన శుక్రద్రవాన్ని ఫారం కోడి పెట్టలకు ఇంజెక్ట్‌ చేస్తారు. అందువల్లనే వీటిలో జీవం ఉండదు. కేవలం తెల్ల సొన, పచ్చసొనలతో కూడిన ప్రొటీనే ఉంటుంది. అందుకే వీటిని కేవలం శాకాహారమనే అంటారు. మరి ఇలా ఎందుకు చేస్తారు? మామూలు కోడి గుడ్డును నిలవ ఉంచితే తినడానికి పనికిరాదు. అదే ఫారం కోడిగుడ్డయితే పరిమిత ఉష్ణోగ్రత వద్ద ఎంత కాలం నిలవ ఉంచినా ఏమీ కాదు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌,-వరంగల్‌; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞానవేదిక

జవాబు: కంపెనీ (ఫారం) కోళ్లు పెట్టే గుడ్లలో జీవం ఉండదు. అయితే ఫారం కోడిపిల్లల్ని పత్యేక పద్ధతిలో మొదటి తరం గుడ్ల నుంచి సాధిస్తారు. అలా వచ్చిన తెల్లని కోడిపిల్లల్ని ఫారం హౌస్‌లలో తిండి పెట్టి బాగా పోషిస్తారు. వీటిని మాంసం కోసం, గుడ్ల కోసం వాడతారు. కోడిపుంజు ప్రమేయం లేకుండా సాంకేతికంగా ఉత్పత్తి చేసే ఈ గుడ్లలో ఫలదీకరణం జరగదు. పైగా ఆ గుడ్ల జన్యునిర్మాణాన్ని మార్చి సంతానాన్ని ఇవ్వని విధంగా నిర్దేశిస్తారు. కనుక వాటిని నాటుకోడి పొదిగినా, ఇంక్యుబేటర్‌లో పొదిగినా పిల్లలు రావు. అందుకనే ఫారం కోడిగుడ్లు శాకాహారంతో సమానమని చెబుతారు.-ప్రొ||ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక


================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Friday, July 16, 2010

డబ్బువిలువ లో ఆ తేడాలెందుకు?, Why are the differences in currency values?

ప్రశ్న:
మన రూపాయికి, అమెరికా డాలరుకు సుమారు 50 రెట్ల తేడా ఉంటుంది. ఎందుకని?

జవాబు:
మనం వాడే డబ్బునే తీసుకుంటే ఒక రూపాయికి, ఐదు రూపాయలకి తేడా ఎందుకు ఉంది? ఐదు రూపాయలకి 10 చాక్లెట్లు వస్తాయనుకుంటే, అవే చాక్లెట్లు రూపాయకి రెండే వస్తాయి. పది చాక్లెట్లకి, రెండు చాక్లెట్లకి ఉన్న నిష్పత్తి 5 కదా. అదే రూపాయికి, ఐదురూపాయలకి ఉన్న నిష్పత్తి కూడా. అంటే మనం ఇచ్చే నాణెం విలువను వస్తువులను పొందే నిష్పత్తే నిర్ణయిస్తోంది.
అలాగే వివిధ దేశాల కరెన్సీ విలువలను వాటికి లభించే వస్తువుల నిష్పత్తే నిర్ణయిస్తుంది. అంతర్జాతీయంగా వినిమయం అయ్యే వస్తువుల విలువను బట్టే వివిధ దేశాల కరెన్సీ విలువ నిర్ణయమవుతుంది. ఉదాహరణకు మనం వాడే 50 రూపాయలకు అంతర్జాతీయ మార్కెట్లో ఒక వస్తువు లభిస్తుందనుకుందాం. అదే వస్తువును అమెరికా వ్యక్తి కొనాలంటే ఒక డాలరు ఇస్తే సరిపోతుందనుకుంటే, అప్పుడు డాలరు విలువ 50 రూపాయలవుతుందన్నమాట. వస్తువుల ధరల్లో తేడాపాడాలను బట్టి డాలరుకు, రూపాయికి మధ్య మారకపు విలువలో తేడాలు ఏర్పడుతాయి.

 • =======================================
visit My website > Dr.Seshagirirao - MBBS

ఉల్లిపాయలు కోస్తుంటే కన్నీళ్లు వస్తాయి. ఎందుకు?, Onion cutting tears - Why?
ప్రశ్న:
ఉల్లిపాయలు కోస్తుంటే కన్నీళ్లు వస్తాయి. ఎందుకు?

జవాబు:
ఉల్లిపాయల్లో ఎమినోయాసిడ్‌ను ఉత్పన్నం చేసే భాస్వరం ఉంటుంది. కోసినప్పుడు భాస్వర మూలకం విచ్ఛిన్నం కావడంతో ప్రొపాంథియాల్సో ఆక్సైడ్‌ (Propanthialso oxide) అనే ద్రవం ఏర్పడుతుంది. ఈ ద్రవానికి అతి త్వరగా ఆవిరిగా మారే ధర్మం ఉంటుంది. అలా మారిన వాయువు కళ్లలోకి జొరబడుతుంది. కళ్లలోకి వెళ్లిన వాయువు అక్కడి తేమతో కలిసి సల్ఫ్యూరికామ్లము, హైడ్రోజన్‌ సల్ఫైడ్‌గా ద్రవరూపం చెందుతుంది. దాంతో కళ్లు భగ్గుమని మండి కన్నీరు కారుతుంది. ముక్కు నుంచి కూడా నీరు కారుతుంది. చిత్రమేమంటే కన్నీరు తెప్పించే ఈ భాస్వరపు సమ్మేళనమే ఉల్లిపాయలను ఉడికించేప్పుడు వచ్చే కమ్మని వాసనకు కారణం. ఉల్లిపాయలను కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే, తరిగేముందు వాటిని నీటితో కడిగి తడిగా ఉంచాలి. అప్పుడు భాస్వరపు సమ్మేళనం ఆ తడిలో కరిగిపోతుంది.

--ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
----------------------------------------------------------------------------
ఉల్లిపాయలు కోస్తే కన్నీరేల?---ప్రొ.. ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక.

జవాబు: శాస్త్రీయంగా ఉల్లి పేరు ఎలియం సిపా (allium cepa). మామూలు కంటితో కూడా చూడ్డానికి వీలైన పెద్ద జీవకణాలు ఉల్లిపాయ పొరల్లో ఉంటాయి. కోసినప్పుడు కన్నీళ్లు తెప్పించే పదార్థాలను, కంటిలోకి వాయురూపంలో చేరితే కన్నీళ్లు కలిగించే రసాయనాలనీ 'నేత్ర బాష్పద రకాలు'(lachrymatory agents) అంటారు. ఉల్లిపాయ కణాల్లో గంధక పరమాణువులుండే అమైనో ఆమ్లాలు కొన్ని ఉంటాయి. అందులో అల్లీన్‌ (allin)ఒకటి. అలాగే అల్లినేస్‌ (allinese) అనే ఎంజైమ్‌ కూడా ఉంటుంది. ఉల్లిపాయను కోసేటప్పుడు అందులోని కణాలు తెగిపోవడం వల్ల ఇవి బయటపడి గాలిలోని ఆక్సిజన్‌ సమక్షంలో చర్య జరిగి సల్ఫీనిక్‌ ఆమ్లాలు ఏర్పడుతాయి. వెంటనే ఇవి ఉల్లిలోని మరో ఎంజైమ్‌ వల్ల 'ఎస్‌-ఆక్సైడ్‌' అనే వాయురూప పదార్థంగా మారుతుంది. ఇది గాలిలో వ్యాపించి కంటిని చేరితే, కంటిలో ఉన్న నాడీ తంత్రులు స్పందించి 'మంట' పుట్టిన భావన కలుగుతుంది. వెంటనే ఆ మంటను నివృత్తి చేయడానికి మెదడు కన్నీటి గ్రంథుల్ని (lachrynatory glands) ప్రేరేపించి కన్నీరు కలిగిస్తుంది.


 • ===============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

తొమ్మిది తలల హైడ్రా కధ ఏమిటి ?, Story of Hydra of Greek
తొమ్మిది తలల పామంట! వూపిరి కూడా విషమంట!!

తొమ్మిది తలలు.. రక్తమంతా విషమయం.. దడ పుట్టించే రూపం..ఈ భయంకర జీవేంటో తెలుసా? గ్రీకు పురాణాల్లోని ఓ పాము!

హిందూ పురాణాల్లో వెయ్యి తలల ఆదిశేషుడు ఉంటే, గ్రీకు పురాణాల్లో తొమ్మిది తలల హైడ్రా ఉంది. అయితే ఆదిశేషుడులా అది దేవత కాదు,పరమ కర్కోటకమైన రాకాసి. దీని ఒంట్లోని రక్తం, వదిలే వూపిరి అంతా విషమే. రామాయణంలో రావణాసురుడి తలని నరికితే కొత్తది వచ్చినట్టే, దీని తల నరికితే రెండు పుట్టుకొస్తాయి.

ఇంతకీ హైడ్రా తల్లిదండ్రులు ఎవరో తెలుసా? తల్లి ఎకిడ్నాది పాము శరీరం, మనిషి తల అయితే, తండ్రి టైఫూన్‌ చూపులతోనే మంటలు చిమ్మే వందతలల భారీ కాయుడు. వీరిద్దరికీ పుట్టిన హైడ్రా భయంకరంగా కాక ఇంకెలా ఉంటుంది? ఇది గ్రీసు దగ్గరి లెర్నా సరస్సులో కాపురం పెడుతుంది. భాగవతంలో కాళీయుడనే నాలుగు తలల పాము ద్వారక దగ్గర సరస్సులో మకాం పెట్టిన కథ గుర్తుందా? దాని వల్ల అక్కడి జలమంతా విషమయమైతే, గ్రీసు దగ్గర హైడ్రా పైకొచ్చి చుట్టుపక్కల పశువుల్ని, మనుషుల్ని చంపి ఆరగిస్తూ ఉంటుంది. మరి దీని పీడ విరగడ చేసిన వాడే లేడా? ఉన్నాడు. అతడే హెర్క్యులస్‌. దేవతలు అప్పగించిన 12 గొప్ప కార్యాలు సాధించి ప్రపంచవ్యాప్తంగా మహావీరుడిగా పేరు పొందిన ఇతగాడు హైడ్రాను వెతుక్కుంటూ బయల్దేరతాడు. బిలంలోకి బాణాలు వేసి రెచ్చగొట్టేసరికి హైడ్రా బుసలు కొడుతూ బయటకి వస్తుంది. దాని వూపిరి పీల్చకూడదు కాబట్టి హెర్య్కులస్‌ ముక్కుకి గుడ్డ కట్టుకుని తలపడతాడు. ఆ యుద్ధం భలే సాగుతుంది. మరి ఒక తల నరుకుతుంటే రెండు పుట్టుకొస్తుంటే ఎలా? దానికీ గ్రీకువీరుడు ఉపాయం ఆలోచించాడు. ఓ తల నరగ్గానే దాని మొదలును కాగడాతో కాల్చే ఏర్పాటు చేశాడు. ఆఖరికి ఒకే ఒక్క తల మిగిలితే దాని దవడలు పట్టుకుని నిలువునా చీల్చి చంపేస్తాడు. ఆపై భూమిలో కప్పెట్టి పెద్ద బండరాయి పడేసి చేతులు దులపుకుని చక్కా వస్తాడు.

హైడ్రా మీద దేశదేశాల్లో బోలెడు కథల పుస్తకాలున్నాయి. అమెరికాలోని అలెన్‌టౌన్‌లోని ఓ పార్కులోని రోలర్‌కోస్టర్‌ని తొమ్మిది తలలతో రూపొందించి దీని పేరే పెట్టారు. ఎందుకో తెలుసా? హెర్క్యూలస్‌ హైడ్రాతో పోరాడింది అక్కడేట మరి. ఇక దీని పేరుమీద వీడియోగేమ్స్‌ కూడా ఉన్నాయి. మీరే హెర్క్యులస్‌గా మారి దీనితో పోరాడవచ్చు. దీనిపై టీవీ సీరియళ్లు, సినిమాలు కూడా బోలెడు.

 • =========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.http://dr.seshagirirao.tripod.com/

పాము కి చెవులుంటాయా?, Do Snakes have Ears?


----


ప్రశ్న:
పాముకి చెవులుండవంటారు. అయితే అవి వినగలవని విన్నాను. పాము పాలు తాగదంటారు కానీ దాని నోరు తెరిచి దారం ద్వారా పట్టడం గమనించాను. పాము కాటు వేస్తే ముంగిసకు విషం ఎక్కదా? వాటి పోరాటంలో పాము గెలవదా?

జవాబు:
పాముకి చెవులుండవంటే దానర్థం వినడానికి ఉపయోగపడే బాహ్య అవయవాలు దానికుండవని. కేవలం లోపలి చెవి భాగాల రూపాలుంటాయి కానీ అవి పని చేయవు. కేవలం పొట్ట చర్మం ద్వారానే పాములు శబ్దాలను గ్రహిస్తాయి. ఇక పగపట్టేంత తెలివి తేటలు, జ్ఞాపకశక్తి వాటికి లేవు. పాము నోటి నిర్మాణం ద్రవాలను పీల్చుకునేందుకు వీలుగా ఉండదు. అందుకే దారం ద్వారా పాలు పడతారు. ఇది దాని నైజానికి విరుద్ధం కాబట్టి పాలు పోస్తే వాటికి ప్రమాదం కల్గించినట్టే. విషపూరితమైన పాము కాటేస్తే ముంగిసకే కాదు, ఏ జంతువుకైనా విషం ఎక్కాల్సిందే. పిల్లీఎలుకల్లాగా పాము, ముంగిసలు ప్రకృతి సిద్ధమైన శత్రువులు కావు. అనుకోకుండా తారసపడితే గొడవపడవచ్చు. ఆ గొడవలో ఎవరికి పెద్ద గాయమైందనే విషయాన్ని బట్టి ఓసారి పాము, మరోసారి ముంగిస చనిపోవచ్చు. ఎక్కువ సార్లు ఇవి సర్దుకుని పారిపోతుంటాయి.

మనలో మూడు రకాల చెవులు కనబడతాయి -మనకు కనిపించే చెవినే బాహ్మచెవి అంటారు--కర్ణభేరి వెనకాల మధ్య చెవి వుంటుంది. ఇందులో మాలియస్‌, ఇన్‌కస్‌, స్టేపిస్‌ అనే మూడు చిన్న ఎముకల గొలుసు ఉంటుంది.స్టేపిస్‌ వెనకాల మొత్తని మృదులాస్థితో నిర్మించబడిన లోపలి చెవి కనిపిస్తుంది. దీనినే 'త్వచా గహనము' అంటారు.దీనినుండి బయలుదేరిన శ్రవణనాడి మొదడును చేరుకుంటుంది. శబ్ద తరంగాలను చేరవేస్తుంది.ఆ శబ్దాన్నే మనం వినగలుగుతాము.

పాములకు వెలుపలి చెవులులేవు . వెలుపలి చెవులు అదృశ్యమైన చోట 'కర్ణభేరీ రంధ్రం' అనే ఒక రంధ్రం ఉంటుంది. అది మధ్య చెవిలోకి దారితీస్తుంది. మధ్య చెవిలో 'కాలుమెల్లా ఆరిస్‌' అనబడే 'కర్ణస్తంభిక' అనే ఒక ఎముక ఉంటుంది. ఈ కర్ణస్తంభిక ఒకవైపు లోపలి చెవికి కలుపబడితే...మరో వైపు చర్మానికి కలిసి ఉంటుంది. పాము చర్మం నేలను తాకి ఉండడం వల్ల నేలలో ప్రయాణించే ధ్వని తరంగాలు మాత్రమే కర్ణస్తంభిక గ్రహించి లోపలి చెవికి చేరగలుగుతుంది. అందువల్ల నేలలోని తరంగాలు మాత్రమే అది గ్రహించగలుగుతుంది.గాలిలో తరంగాలు అది గ్రహించలేదు. గాలిలోని శబ్ద తరంగాలు అది ఏమాత్రం గ్రహించలేదు.నాగస్వరానికి ఊగుతున్న నాగుల్లా...అంటూ పడగవిప్పి నాగస్వరం ముందు ఆడే పాముల్ని చూపిస్తున్నారు అంతా అబద్ధమే. పాములవాడు నాగస్వరం ఊదేముందు నేలమీద చేతితో చరుస్తాడు. నేలద్వారా శబ్దతరంగాలు అందుకున్న నాగుపాము పడగవిప్పుతుంది.దాని కళ్ళముందు ఓ వస్తువు ఊగుతూ కనిపిస్తోంది. అది ఆగిన వెంటనే దానిని కాటు వేయాలని పాము చూస్తుంది. అందుకే అది ఎటు ఊగితే నాగుపాము పడగ అటు ఊగుతుంది. అంతేకానీ... నాగ స్వరానికి తల ఊపి ఆడడం మాత్రం కాదు.నాగస్వరం కాకుండా ఏది దానిముందు ఊపినా పడగ తప్పకుండా ఊపుతుంది. ఓ గుడ్డ చేతితో ఆడించి చూపినా పాము పడగ ఊపుతూనే వుంటుంది. నాగస్వరమే ఉండనక్కరలేదు. నాగస్వరానికి నాగుపాము తలాడించడం అంతా వట్టిదే. నేలపై తరంగాలను మాత్రమే గుర్తించగలదన్నది నిజము .

అందుకే...అతి సున్నితమైన శబ్దాన్ని వినగలిగిన సామర్థ్యమున్న వాళ్ళని ఇప్పటికీ ''పాముచెవులు'' వున్న వాళ్ళని అంటారు. కనుకనే ''పాముచెవులు'' అనే మాట ప్రసిద్ధి చెందింది.


 • =================================
visit My website > Dr.Seshagirirao - MBBS

వజ్రాయుధం కధ ఏమిటి ? , Vajraayudham Story-what is it?త్వష్ట అనే ప్రజాపతి ఒక మహాకాయుణ్ణి సృష్టించి, వాడికి వృత్రాసురుడని పేరుపెట్టాడు. వాడు దినదినానికీ నూరు బాణాల ఎత్తు పెరగసాగాడు.

'ఇంద్రుడు అకారణంగా నీ అన్నను చంపాడు. నువ్వు ఇంద్రుణ్ణి హతమార్చి, నా పగ చల్లార్చు. లోకంలోని ఏ లోహంతో చేసినదైనా, తడిదైనా, పొడిదైనా ఏ ఆయుధమూ నిన్నేమీ చేయలేదు' అని త్వష్ట వృత్రుణ్ణి ఆజ్ఞాపించాడు.

వృత్రాసురుడు రాక్షసులందరినీ కూడగట్టుకుని, దేవతలపై దాడులు మొదలుపెట్టాడు. దేవతలు వాడు పెట్టే బాధలు పడలేక, వెళ్లి బ్రహ్మతో మొరపెట్టుకున్నారు.

బ్రహ్మ, 'వాణ్ణి జయించడానికి ఒక ఉపాయం ఉన్నది. దధీచి మహర్షి శివార్చన చేసి, తన ఎముకలు వజ్రాలంత గట్టిగా ఉండే విధంగా వరం పొంది ఉన్నాడు. మీరందరూ వెళ్లి దానశీలి అయిన దధీచిని యాచించి అతని ఎముకలు తీసుకొని వాటిని ఆయుధాలుగా ఉపయోగించి వృత్రాసురుణ్ణి సంహరించండి' అన్నాడు.

ఇంద్రుడు దేవతలతో దధీచి ఆశ్రమానికి వెళ్లి, అతని అస్థికలను ఇవ్వవలసిందని అర్ధించాడు. దధీచి అందుకు సమ్మతించి, ఇంద్రుడికి తన ఎముకలను ఇస్తున్నానని చెప్పి, ప్రాణాలు వదిలాడు. అప్పుడు దేవ శిల్పి విశ్వకర్మ దధీచి వెన్నెముకతో వజ్రాయుధాన్ని నిర్మించి, ఇంద్రుడికిచ్చాడు. ఇంద్రుడు దేవసేనలతో వృత్రాసురుడిపైకి యుద్ధానికి వెళ్లి, అహోరాత్రాలు పోరాడాడు. ఆ వజ్రాయుధం కూడా వృత్రాసురుణ్ణి ఏమీ చేయలేకపోయింది.

అప్పుడు ఇంద్రుడు జగదంబను ప్రార్ధించాడు. ఆమె ప్రత్యక్షమై వజ్రాయుధం సహాయంతో సముద్రపు నురుగును వాడిపైన ప్రయోగించమని చెప్పింది. ఇంద్రుడు సముద్రతీరానికి వెళ్లి, సముద్రపు నురుగును వజ్రాయుధానికి పట్టించి ప్రయోగించాడు. లోహంతో చేయనిదీ, తడిదీ, పొడిదీ కాని ఆ ఆయుధంతో వృత్రాసురుడు చచ్చాడు.
 • ========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Thursday, July 15, 2010

ఐస్ క్రీం ఎప్పుడు పుట్టిందో ఎలా పుట్టిందో?, Ice cream origion-How?ఈ ఐస్ క్రీం ఎప్పుడు పుట్టిందో ఎలా పుట్టిందో తెలుసా? ఐస్ క్రీం తినడమే మనకు తెలుసు. కాని దానిని ఎవరు కనిపెట్టారు అనే ప్రశ్న వేసుకున్నా అది మనకు తెలియదు కాబట్టి దానిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్వం చైనా వంటవాళ్ళు రకరకాల పండ్ల నుంచి గుజ్జును, రసాన్ని తీసి చల్లగా ఉండటం కోసమని దానిలో మంచు ముక్కలు కలిపి నిల్వచేసేవారట. అది ఐస్‌క్రీం తొలి రూపం అన్నమాట. నాలుగువేల ఏళ్ళ క్రితం ఒక చైనా చక్రవర్తి ఇంట్లో పని చేసే వంటవాడు చక్రవర్తిని మెప్పించడానికి పండ్ల గుజ్జులో మంచు ముక్కలు కలిపి వడ్డించాడు. అది చక్రవర్తికి బాగా నచ్చింది. రోజూ ఈ వంటకమే వడ్డించమన్నాడు. అలా ఐస్‌క్రీం క్రమంగా ఆదరణ పొందింది. నీరో చక్రవర్తి పండ్లను తేనెతో కలిపి మంచు ముక్కలతో పాటు తినేవాడట. అదీ ఒక ఐస్‌క్రీం లాంటిదే. 1550లో జూలియస్‌విల్లే ఫ్రాంక్ అనే వైద్యుడు రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉప్పు కలిపిన ఐసు ముక్కలు ఉపయోగిస్తే ఐస్‌క్రీం మెత్తగా త్వరగా తయారవుతుందని కనిపెట్టాడు. 1620లో ఫ్రాన్స్‌కు చెందిన గెరాల్డ్ టిసైన్ అనే వ్యక్తి ఇప్పుడు మనం తింటున్న ఐస్‌క్రీంకు తుది రూపం ఇచ్చాడు.

అయితే మొదటి ఐస్‌క్రీం ఫ్యాక్టరీ తయారు కావడానికి చాలాకాలం పట్టింది. 1852లో జాకబ్ ఫస్సెల్ అనే పాలవ్యాపారి, పాలు అమ్మగా మిగిలిన మీగడను సద్వినియోగం చేసుకోవడానికి తొలి ఐస్‌క్రీం ఫ్యాక్టరీని నిర్మించాడు. అతడి ఐస్‌క్రీంలకు బాగా గిరాకీ ఏర్పడింది. ఇక ' కోన్ ఐస్‌క్రీం ' కూడా అనుకోకుండా రూపుదాల్చిందే. 1904 లో అమెరికాలో ఒక పెద్ద ఎగ్జిబిషన్ జరిగింది. అక్కడ ఐస్‌క్రీం అమ్ముతుండగా కప్పులు అయిపోయాయి. జనం ఎగబడుతుండే సరికి ఐస్‌క్రీం అమ్ముతున్న పెద్దమనిషి ఆ పక్కనే ఉన్న రొట్టెలను తెచ్చి వాటిని చుట్టచుట్టి వాటి మధ్యలో ఐస్‌క్రీం పోసి అమ్మాడు. అలా ' కోన్ ' వ్యాప్తిలోకి వచ్చింది.

ఈ విధంగా మనం ఐస్ క్రీంను తినగలుగుతున్నాం.

పుల్ల ఐసు

చల్లగా, తియ్యగా, పుల్లగా రకరకాల రుచులలో ఉండే పుల్ల ఐసు అంటే ఎవరికి ఇష్టం ఉండదు? స్కూలుకు వెళ్ళేప్పుడో స్కూలు నుంచి వచ్చేప్పుడో బండి వాడు అమ్ముతున్న ఐస్ ను కొనుక్కోకుండా ఎవరు ఉంటారు? పాలైసు, ద్రాక్షా ఐసు, ఆరెంజ్ ఐసు, సేమ్యా ఐసు, డబుల్ ఐసు... అబ్బా ఎంత బాగుంటాయో. మరి ఈ పుల్ల ఐసు ఎలా వచ్చింది అనంటే అనుకోకుండా వచ్చిందని చెప్పాలి. అమెరికాలో శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన 'ఫ్రాంక్ ఎవర్‌సన్' తన 11 ఏళ్ళ వయసులో 1905లో అనుకోకుండా దీనిని కనిపెట్టాడు. ఫ్రూట్ జ్యూస్‌ను డీప్‌ఫ్రిజ్‌లో పెట్టి మర్చిపోయిన ఎవర్సన్ మరుసటిరోజు ఉదయం దానిని తీసి చూస్తే గడ్డ కట్టి కనిపించింది. టేస్ట్ చూస్తే చాలా బాగుందనిపించింది. అప్పటి నుంచి అతడు ఫ్రూట్ జ్యూస్ లో పుల్ల గుచ్చి, డీప్ ఫఫ్రిజ్‌లో పెట్టి పుల్ల ఐసు తయారుచేయడం మొదలెట్టాడు. దానికి 'పాప్సికల్' అనే పేరు పెట్టాడు. అలా అలా అది అ దేశం నుంచి అన్ని దేశాలకు చేరింది.

అలాగే ఎగ్జిబిషన్‌లోనో, షాపింగ్ మాల్స్‌లోనో కనిపించే పింక్ కలర్ బొంబాయి మిఠాయి (కాటన్ కాండీ) ని 1897 లో 'విలియం మొరిసన్, జాన్ సి వార్టన్' అనే అమెరికా వ్యక్తులు తయారు చేశారు. కలర్ చక్కెరను మిషన్ తిరగలిలో వేసి దూదిపొరల్లాంటి బొంబాయి మిఠాయిని వాళ్ళు తయారు చేశారు. 1904లో ఒక ట్రేడ్ ఫెయిర్‌లో దీనిని మొదటిసారిగా అమ్మారు. అప్పటి నుంచి ప్రతి ఎగ్జిబిషన్‌లో అది కనిపిస్తూనే ఉంది.

 • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

టీ షర్ట్ ఎలా పుట్టిందో ?, T-Shirt Origin Story?


రంగు రంగుల టీషర్ట్స్ వేసుకొని షోగ్గా తిరగాలని మనందరికీ చాలా సరదా. మామూలు చొక్కాల కన్నా టీ-షర్ట్స్ చాలా ఫ్యాషన్‌గా ఉంటాయి. సౌకర్యంగా ఉంటాయి. మరి ఇవి ఎలా తయారయ్యాయి?
టీ షర్ట్ గురించి తెలుసుకోవాలంటే మొదటి ప్రపంచ యుద్ధకాలానికి వెళ్ళాలి. అప్పట్లో యూరోపియన్లు టీ-షర్ట్స్ వంటి లోదుస్తులను ధరించి యుద్ధం చేస్తుంటే అమెరికన్లు మాత్రం దళసరి యూనిఫాంలు ధరించి యుద్ధం చేసేవారు. కాని యూరోపియన్లు హాయిగా ఉంటే అమెరికన్లు చెమటలు కక్కుతూ ఉండేవారు. దాంతో కొన్నాళ్ళకు అమెరికన్లు కూడా టీ-షర్ట్స్ వైపే మొగ్గు చూపారు. దాంతో ఒక్కసారిగా టీ-షర్ట్స్‌కు డిమాండ్ పెరిగిపోయింది. చూడ్డానికి ఇంగ్లీషు 'టీ' ఆకారంలో ఉంటుంది. కనుక వీటికి టీ-షర్ట్స్ అనే పేరు వచ్చింది. 1960 నుంచి వీటి మీద డిజైన్లు, బొమ్మలు ముద్రించడం లేదంటే స్లోగన్స్ రాయడం మొదలయ్యాయి. ఇప్పుడు మనం చూస్తుంటాం. కొన్ని ఉద్యమాలప్పుడు అందరూ టీ-షర్ట్స్ మీద నినాదాలు రాసుకొని తిరుగుతుంటారు. అలా ఇవి ప్రచారానికి కూడా ఉపయోగపడే సాధనాలయ్యాయి. మాజీ అమెరికా ప్రధాని క్లింటన్‌కు టీ-షర్ట్స్ అంటే చాలా ఇష్టం. అయితే ఆయన ధరించే అత్యుత్తమ నాణ్యత కలిగిన టీ-షర్ట్స్ ఎక్కడ తయారవుతాయో తెలుసా? మన హైదరాబాద్‌లో.

ఇప్పుడు తెలిసిందా రోజూ మనం వేసుకునే టీ-షర్ట్స్ ఎలా వెలుగులోకి వచ్చాయో. మాజీ అమెరికా ప్రధాని క్లింటన్‌కు నచ్చే టీ-షర్ట్స్ మన హైదరాబాద్ నుంచి తయారవుతున్నాయంటే మన కెంతో గర్వకారణం కదా. ఎవరైనా అడిగితే మనం ఠక్కున చెప్పవచ్చు.
 • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

స్వెటర్ల కథ ఏమిటి ?, Story of Swetters ?

చలికాలం రాగానే మూలనపడి వున్న స్వెటర్లను వెతుక్కొని మరీ వేసుకుంటాం. అవి ఎందుకు మనం వాడుతున్నాము, ఎలా తయారయ్యాయి అనేది మనం తెలుసుకుందాము.

ఆదిమానవుడు ఆధునికుడై కనిపెట్టినా అల్లిక సూదుల ద్వారా ఉన్ని వస్త్రాలను అల్లడం అతడు చాలా కాలం పాటు నేర్చుకోలేదు. మొదట ఈ పనిని మొదలెట్టింది అరబ్బులు. వాళ్ళే రాగితో అల్లిక సూదులను తయారు చేసి వాటితో సాక్సులు అల్లడం మొదలెట్టారు. ఆ తర్వాత 14వ శతాబ్దంలో ఈజిప్టు నుంచి యూరప్‌కు ఉలెన్ సాక్సులు చేరాయి. అక్కడి నుంచి యూరప్ అంతా ఉన్ని వస్త్రాల అల్లిక మొదలయ్యింది. బ్రిటీషువాళ్ళు ఉన్ని దుస్తులను ఎగుమతి చేసి డబ్బు సంపాదించడం కూడా మొదలెట్టారు. హాలెండ్, స్పెయిన్, జరనీ వంటి దేశాలలో అల్లిక బడులను తెరచి, పేదవాళ్ళకు పని కల్పించారు. స్కాట్‌ల్యాండ్‌లో ఈ పని కుటీర పరిశ్రమగా వర్ధిల్లింది. శీతాకాలంలో సైనికులు తొడగడానికి అనువుగా స్వెటర్లు, గ్లౌజులు తయారు చేయమని బ్రిటీషు రాణి ప్రజలను ప్రోత్సహించింది. పందొమ్మిదో శతాబ్దం తొలి నాళ్ళలో కూడా స్వెటర్లు, ఇతర ఉన్ని దుస్తులు సాధారణంగా సైనికుల దుస్తులుగా, శీతాకాలంలో ఉపయోగించే దుస్తులుగా వాడుకలో ఉండేవి. అయితే 1937 లో లానా టర్నర్ అనే హాలీవుడ్ తార 'దె డోంట్ ఫర్గెట్' అనే సినిమాలో టైట్ స్వెటర్ ధరించి కనిపించింది. అప్పటి నుంచి స్వెటర్లకు మంచి గ్లామర్ గాలి సోకింది. స్వెటర్ ఒక ఫ్యాషన్‌గా మారింది. స్వెటర్లు లేని చలికాలాన్ని ఊహించడం కష్టం. రంగురంగుల స్వెటర్లు మనల్ని కూడా రంగురంగుల పూలుగా మార్చేస్తాయి.

 • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

వర్షం అక్కడక్కడా కురుస్తుంది ఎందుకని? , Rain falls here and there-Why?వర్షించాలంటే మేఘాలు అవసరం. వర్షించే మేఘాలు ఏర్పడాలంటే గాలిలో పెద్దఎత్తున తేమ అవసరం. సముద్రంలో విస్తారంగా ఉన్న ఉపరితల నీరు ఆవిరై పైకి పోతుంది. ఇలా ఆవిరి పైకిపోతున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ప్రతి 100 మీటర్లకు సుమారుగా ఒక సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. అందువల్ల, ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతుండటంతో పైకి వెళ్లిన నీటిఆవిరి ఆకాశంలోని ధూళి కణాల చుట్టూ చేరి, ఘనీభవిస్తుంది. ఇవి సమూహాంగా ఉంటాయి. ఈ ఘనీభవించిన నీరు, ధూళి, గాలి అన్నీ కలిపి సమూహంగా భూమి మీద మనకు మేఘంగా కనిపిస్తుంది.

గాలి వేడిగా ఉన్నప్పుడు ఆవిరిని ఎక్కువగా ఉంచు కొనగలుగుతుంది. ఇదే చల్లబడ్డప్పుడు తక్కువ తేమను మాత్రమే ఇముడ్చుకొంటుంది. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు గాలిలో అధికంగా ఉన్న తేమ వర్ష బిందువుల రూపంలో బయటపడతాయి. ఇదే విధంగా గాలితోపాటు పయనిస్తున్న మేఘాలకు ఏదైనా ఎత్తయిన ప్రదేశాలు లేక పర్వతాలు అడ్డుగా వస్తే లేదా ఏ ఇతర కారణాల వల్ల మేఘాలు పైకి పోతే చల్లని వాతావరణాన్ని ఎదు ర్కొంటాయి. ఈ సమయంలో అధికంగా ఉన్న నీటితేమ సూక్ష్మ బిందువుల రూపంలో వేరువేరుగా ఉండక, ఒకదానికొకటి కలసి పెద్ద నీటి బిందువులగా మారిపోతాయి. ఈ నీటి బిందువుల భూమ్యాకర్షణకు లోనై వర్షంగా కురుస్తాయి. ఒకోసారి ఇలా పడేటప్పుడు వాతావరణ గాలి వేడిగా ఉంటే పెద్ద నీటి బిందువులు తిరిగి సూక్ష్మ బిందువులుగా మారిపోతాయి. ఇలా మారని పెద్ద నీటి బిందువులు మాత్రం వర్షం రూపంలో భూమి మీద పడతాయి.

అన్ని మేఘాలూ వర్షించవు..

అన్ని మేఘాలూ వర్షించవని గుర్తుంచుకోవాలి. మన కంటికి కనిపించే ఎత్తయిన తెల్లని మేఘాలు వర్షించవు. బూడిదరంగు మేఘాలే వర్షిస్తాయి. మేఘాలు గాలివాటున పయనిస్తాయి. దట్టమైన అరణ్య ప్రాంతాల్లో, ఎత్తయిన కొండలపైన, గాలిలో తేమ అధికంగా ఉండే ప్రాంతాల్లో, శీతల ప్రాంతాల్లో నల్లని, బూడిదరంగు మేఘాలు ఏర్పడి, వర్షిస్తాయి. ఒకసారి కురిసిన మేఘాలు వర్షించే తేమను కోల్పోతాయి.

ఋతుపవన కాలంలో సముద్రపు నీరు విస్తృత మేఘాల రూపంలో చల్లగా ఉన్న భూమిపైకి వచ్చి, వర్షిస్తాయి. ఈ వర్షాలు విస్తారంగా ఉంటాయి. సముద్రంలో వాయుగుండం ఏర్పడినప్పుడు తుపాను రూపంలో కూడా ఇలానే మేఘాలు భూమి మీద వర్షిస్తాయి. పయనించే మార్గంలోనే మేఘం వర్షిస్తుంది. ఇతర ప్రాంతాల్లో వర్షించదు.

ఇక ప్రశ్నకు సమాధానం... ఋతు పవనాలు, తుపాను కాలంలోనే కాక మిగతా సమయంలో కూడా మేఘాలు ఏర్పడతాయి. ఇతర సమయాల్లో ఏర్పడిన మేఘాలు స్థానిక నీటి వనరుల నుండి, ఇతరత్రా నీటి ఆవిరిని గ్రహించి, పటిష్ట మవుతాయి. గాలివాటుగా మేఘాలు పయనిస్తాయి. ఎక్కడైతే చల్లటి వాతావరణాన్ని ఎదుర్కొంటాయో అక్కడే మేఘాల్లో అధికంగా నిల్వ ఉన్న తేమ వర్షం రూపంలో భూమి మీద కురుస్తుంది. సామాన్యంగా గ్రామ నివాస ప్రాంతాల్లో చెట్లు అధికంగా ఉంటాయి. బహిరంగ చేలల్లో చెట్లు తక్కువగా ఉంటాయి. అందువల్ల గ్రామాల్లో అధికంగా ఉన్న చెట్లు తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని చల్లగా ఉంచుతాయి. కాబట్టి పరిమితంగా ఉన్న మేఘాలు చల్లగా ఉన్న ప్రాంతాల్లో నిలబడి వర్షిస్తాయి. ఇదే సమయంలో చేలల్లో మేఘాలు తక్కువగా వర్షిస్తాయి. ఇవి స్థానిక వర్షాలు. అంటే కేవలం చల్లగా ఉన్న ప్రాంతాల్లో వర్షిస్తూ, మిగతా ప్రాంతాల్లో వర్షించవు. ఒకోసారి స్థానిక వర్షం ప్రారంభమైన తర్వాత పెద్ద జల్లులు ఒకేసారి కురుస్తాయి. విస్తారంగా పడవు.
 • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ప్లగ్ లు తీసెయ్యాలా? , Plugs remove to stop using power?

---ప్రశ్న: విద్యుత్‌ పరికరాల స్విచ్‌లు కట్టేసినా ప్లగ్‌ తీయకపోతే విద్యుత్‌ను వినియోగించుకుంటాయని చదివాను. నిజమేనా?

జవాబు: రిమోట్‌తో పనిచేసే టీవీ, డీవీడీ ప్లేయర్‌, కంప్యూటర్‌, ఏసీ లాంటి విద్యుత్‌ ఉపకరణాల విషయంలోనే దీన్ని పరిగణించాలి. ఎందుకంటే రిమోట్‌తో వీటిని ఆపేసినా వాటిలో ఎప్పుడూ ఓ విద్యుత్‌వలయం పనిచేస్తూ ఉంటుంది. పరికరం నిద్రాణ స్థితిలోకి వచ్చినా లోపల ఏదైనా చిన్న బల్బు (స్టాండ్‌బై) వెలుగుతూ ఉండే ఏర్పాటు ఉంటుంది. అప్పుడే తిరిగి రిమోట్‌తో దాన్ని ఆన్‌ చేయగలుగుతాం. కాబట్టి ఎంతో కొంత విద్యుత్‌ ఖర్చవుతూ ఉంటుంది. రిమోట్‌తో ఆపేసినా, ఆయా పరికరాలను కరెంటుతో అనుసంధానం చేసే స్విచ్‌లను కూడా ఆఫ్‌ చేస్తే ఇలా జరగదు. ఇలా చేసినప్పుడు ప్లగ్‌లు తీయనవసరం లేదు. అయితే ఎక్కువ సమయం వాడకపోయినా, పొరుగూరు బయల్దేరినా స్విచాఫ్‌ చేయడంతో పాటు ప్లగ్‌లు కూడా తీసేయడం మంచిది.
 • =====================================================
visit My website > Dr.Seshagirirao - MBBS

Wednesday, July 14, 2010

భూమి నుండి పైపైకి వెళితే శీతలమేల?, Cool if goes high from land-why?


ప్రశ్న: భూమి నుంచి పైకి పోయే కొలదీ వేడి తగ్గిపోతూ ఉంటుందంటారు. ఎందువల్ల?

జవాబు: సూర్యకిరణాలు వాతావరణం గుండా ప్రయాణించి భూమిని చేరుతాయనేది తెలిసిందే. వాతావరణంలోని గాలి లోంచి కిరణాలు ప్రయాణించినప్పటికీ గాలి స్వల్పశోషణం (poor absorber) కాబట్టి, వాటిలోని వేడిని అంతగా గ్రహించలేదు. గాలి కంటే భూమి వేడిని ఎక్కువగా గ్రహిస్తుంది. భూమి వేడెక్కడం వల్ల దానిని అంటిపెట్టుకున్న గాలి ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలా వేడెక్కిన గాలి సాంద్రత తగ్గుతుంది. దాంతో ఆ గాలి తేలికయి భూమి నుంచి ఎత్తుకు ప్రయాణిస్తుంది. భూమి నుంచి ఎత్తుకు వెళ్లే కొలదీ వాతావరణ పీడనం తగ్గుతుంది. అందువల్ల ఆ ప్రాంతంలోకి వెళ్లిన వేడిగాలి అక్కడ వ్యాకోచిస్తుంది. ఏ వాయువైనా వ్యాకోచిస్తే దాని ఉష్ణోగ్రత తగ్గుతుంది కాబట్టి అక్కడకు వెళ్లిన గాలి చల్లబడుతుంది.

ఈ విధంగా భూమి నుంచి పైపైకి పోయే గాలి ఉష్ణోగ్రత ప్రతి కిలోమీటరుకు 9 డిగ్రీల సెంటిగ్రేడు వరకు తగ్గుతుంటుంది. అందువల్లనే వేసవి కాలంలో ఎత్తుగా ఉండే ప్రదేశాలైన ఊటీ, డార్జిలింగ్‌ లాంటి పర్వత ప్రదేశాలలో వాతావరణం చల్లగా ఉంటుంది. కానీ భూమి నుంచి 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు వెళితే అక్కడ మళ్లీ వేడిగానే ఉంటుంది. ఎందుకంటే భూమి ద్వారా వేడెక్కి పైకి వెళుతూ వ్యాకోచించి చల్లబడే గాలి అంత ఎత్తుకు చేరుకోలేదు.

 • =============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ఉష్ణోగ్రత ప్రభావము బంతి పై ఉంటుందా?,Ball efficiency is effected by wheather-why?


చలికాలము లో రబ్బరుబంతిని నేలకు కొట్టినపుడు అది వేసవికాలము లో ఎగిరిన విధము గా పైకి ఎగరదు . దీనికి కారణము బంతిలోపలి గాలి మీద ఉష్ణోగ్రత ప్రభావము ఉండటమే . గాలి చల్లబడినందున ఆ గాలి ఎక్కువ రాపిడిని ఇస్తుంది .

అదేవిధము గా చలి ప్రభావము రబ్బరు మీద ఉంటుంది. రబ్బరు అంతగా సాగదు . ఈ కారణాలవల్ల బంతి నేలకేసి కొట్టినప్పుడు అక్కడే ' ధబ్ ' మని ఆగినట్టనిపిస్తుంది కాని గాలిలోకి తిరిగి అంతగా ఎగరదు . వేసవికాలము లో ఉష్ణోగ్రత వలన వ్యాకోచము చెందిన బంతి లోపలి గాలి, రబ్బరుమీద ఉషోగ్రతవలన రబ్బరు సాగే గుణము ఎక్కువగా ఉండడము వల్ల చురుకుగా ఎగరటం జరుగుతుంది .

 • =============================================
visit My website > Dr.Seshagirirao - MBBS

Wednesday, July 07, 2010

పొటాషియం సైనైడు తో ఎందుకు చనిపోతారు?,Potasium cyanide cause death - why?
ప్రశ్న:
పొటాషియం సైనైడును నోట్లో వేసుకోగానే ఎందుకు చనిపోతారు?

జవాబు:
పొటాషియం సైనైడు నీటిలోను, రక్తంలోను బాగా కరుగుతుంది. చాలా మందిలో ఉన్న అపోహ ఏమిటంటే దీన్ని మింగగానే అది రక్తంలోని హీమోగ్లోబిన్‌లో ఉండే ఇనుము కేంద్రానికి అనుసంధానించుకుంటుందని, తద్వారా శ్వాసక్రియలో ఆక్సిజన్‌ సరఫరా కణాలకు అందకపోవడం వల్ల మరణం సంభవిస్తుందని అనుకుంటారు. నిజానికి పొటాషియం సైనైడుకు, హీమోగ్లోబిన్‌కు మధ్య రసాయనిక ప్రక్రియ ఏమీ లేదు. నోటిలో వేసుకోగానే ఇది జీర్ణవాహిక ద్వారా త్వరగా రక్తంలో కలుస్తుంది. వెంటనే పొటాషియం, సైనైడు అయాన్లుగా విడివడుతుంది. ఇది కణాల్లో ఉండే 'సైటోక్రోమ్‌-సి-ఆక్సిడేజ్‌' అనే ఎంజైముతో బంధించుకుంటుంది. ఈ ఎంజైము రక్తం ద్వారా వచ్చిన గ్లూకోజ్‌ నుంచి ఎలక్ట్రాన్లను గైకొని, వాటిని శ్వాసద్వారా వచ్చే ఆక్సిజన్‌కు బదలాయించే ప్రక్రియలో ప్రధాన సంధాన కర్త. అయితే సైనైడు అయానులో బంధించుకున్నప్పుడు ఈ ప్రక్రియ జరగదు. దాంతో కణాల్లోని ఆక్సిజన్‌, గ్లూకోజ్‌ పరస్పరం వృథా అయిపోతాయి. ఫలితంగా కణాలకు శక్తి అందదు. శక్తిలేని కణాలు చేష్టలుడిగిపోవడం వల్ల మరణం త్వరగా వస్తుంది.
 • ===========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

వాసనలు ఎలా తెలుసుకుంటాము ? , Smelling of different substances - How?
ప్రశ్న:
ముక్కుతో గాలి పీల్చుకున్నప్పుడు వివిధ రకాలైన వాసనలను ఎలా పసిగడతాము?

జవాబు:
ముక్కుతో మనం లెక్కలేనన్ని రకాలైన వాసనలను పసిగడతాము. కానీ ముక్కులో వీటిని గ్రహించే గ్రాహకాల సంఖ్య 400 మాత్రమే. వీటిలో వాసనకు సంబంధించిన అణువులను గ్రహించే ప్రొటీన్లు ఉంటాయి. ఈ గ్రాహకాల్లో రోజా పువ్వు పరిమళాన్ని పసిగట్టేవని, సంపెంగ వాసనను గ్రహించేవని వేర్వేరుగా ఉండవు. తక్కువ సంఖ్యలో ఉన్న గ్రాహకాలు అన్ని రకాలైన వాసనలను పసిగట్టడానికి కారణం ముక్కులో ఉండే నాడీ సంబంధిత కణాలు. ఒక కణం ఎన్నో వాసనలకు స్పందించినప్పటికీ అది పసిగట్టే వాసనల తీవ్రతలో తేడా ఉంటుంది. ఏ ఏ కణాలు ప్రత్యేకంగా స్పందించాయి, ఆ స్పందన తీవ్రత ఎంత అనే విషయాలపై ఆధారపడి వాసనకు సంబంధించిన అవగాహన మనకు కలుగుతుంది. ఉదాహరణకు ఒక గులాబీని వాసన చూస్తే, ముక్కులో ఒక తెగకు చెందిన కణాల సముదాయమే ప్రేరేపితమవుతుంది. ఆ కణాలు పంపిన సంకేతాలు మెదడు ముందు భాగంలో ఉబ్బెత్తుగా బొడిపెలాగా ఉండే ఘాణేంద్రియ సంబంధిత ప్రదేశానికి చేరుకుంటాయి. ఈ సంకేతాల కలయిక ద్వారా మెదడుకు ఆ వాసన గులాబీదనే విషయం తెలుస్తుంది. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందనే విషయంపై ఇప్పుడు శాస్త్రవేత్తలు బ్రెయిన్‌ స్కానింగ్‌ పద్ధతి ద్వారా పరిశోధనలు జరుపుతున్నారు.
 • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Sunday, July 04, 2010

పుట్టగానే మాటలు రావేం? , Baby can not speak for some months-Why?


ప్రశ్న:
మనుషులు పుట్టిన కొన్ని ఏళ్ల తర్వాతే మాట్లాడుతారు. పుట్టగానే మాటలు ఎందుకు రావు?

జవాబు:
శబ్దం చేయడమనేది జీవి విశిష్టతకు సంబంధించిన అంశం. పరిణామ క్రమంలో వివిధ రకాల జంతువులు రకరకాలుగా శబ్దాలను చేయగలుగుతున్నాయి. అయితే శబ్దాలకు క్రమబద్ధతను కల్పించి క్రమేపీ భాషను నెలకొల్పడం మానవ జాతికే వీలయింది. అందువల్ల భాష సామాజిక పరిణామంతో ముడిపడింది. మాట్లాడాలంటే వినాలి. అయితే పుట్టక మునుపు తల్లి మాట్లాడే భాషకానీ, ఆ శబ్దాలు ప్రసారమయ్యే వాతావరణంగానీ శిశువుకి పరిచయం కావు. పుట్టగానే శ్వాస పీల్చుకునే ప్రక్రియలో మొదటి ప్రయత్నమే కేర్‌మనే ఏడుపు శబ్దం. అంతకు మించిన శబ్దాలకు శిశువు నోటిలోని భాగాలు కూడా అభివృద్ధి చెంది ఉండవు. ఎందుకంటే మాటలు పలకడానికి నోటిలోని దంతాలు, నాలుక, గొంతు కండరాలు, పెదాలు సమన్వయంతో పనిచేయాలి. ఈ సామర్థ్యం శిశువు పెరుగుతున్న కొద్దీ అలవడుతుంది. తల్లి మాటలు వింటూ పదాలు, వాక్యాలు, అక్షరాలు, శబ్దాలు గ్రహిస్తూ ఆపై లిపిని కూడా మనిషి పరిచయం చేసుకుంటాడు. భాష సామాజిక పరమైనది కాబట్టే కొన్ని భాషలు, భాషల్లోని కొన్ని పదాలు కనుమరుగవుతున్నాయి.

 • =============================================
visit My website > Dr.Seshagirirao - MBBS

ఎ.టి.యం డబ్బిచ్చేదెలా? , A.T.M-How it gives money
ప్రశ్న:
మీటలు నొక్కితే డబ్బులిచ్చే ఏటీఎం ఎలా పనిచేస్తుంది?

జవాబు:
ఏటీఎం (ATM) అంటే Automatic Teller Machine. ఖాతాదారులు ఈ యంత్రం ద్వారా డబ్బులు తీసుకోడానికి వీలుగా బ్యాంకులు ఏటీఎం కార్డును ఇస్తాయనేది తెలిసిందే. ఆ కార్డుపై ఉండే అయస్కాంతపు బద్దీ(magnetic strip)లో ఖాతాదారుని వివరాలన్నీ నిక్షిప్తమై ఉంటాయి. కార్డును ఏటీఎం యంత్రంలోని స్లాట్‌లో జొప్పించగానే అందులోని PIN (Personal Identification Number) బ్యాంకులోని ఖాతాకు అనుసంధానమవుతుంది. ఖాతాదారునికి మాత్రమే తెలిసిన ఆ నెంబర్‌ను మీటల ద్వారా నొక్కితేనే తదుపరి లావాదేవీలు జరిపేలా రక్షణ ఏర్పాటు ఉంటుంది. సరైన ఖాతాదారు తనకు కావాల్సిన డబ్బు ఎంతో సూచించగానే ఆ సంకేతాలు బ్యాంక్‌లో ఉండే కేంద్రీయ(central) కంప్యూటర్‌కి అందుతాయి. అది ఆ ఖాతాలో బ్యాలన్స్‌ను సరిచూసి తిరిగి ఏటీఎంకు సంకేతాన్నిస్తుంది. వెంటనే ఏటీఎంలో యంత్రవిభాగాలు స్పందించి నోట్లను లెక్కిస్తాయి. కేంద్రీయ కంప్యూటర్‌తో అనుసంధానమై ఉండే పరారుణ స్పర్శీయ సాధనం (Infrared Sensing Device) ఆ డబ్బు సరైన మొత్తంలో ఉందో లేదో గమనిస్తుంది. పొరపాటు ఉంటే 'రిజెక్ట్‌ బాక్స్‌'కి పంపిస్తుంది. సరిగా ఉంటే కరెన్సీ నోట్లు ఏటీఎంలోని డెలివరీ స్లాట్‌కు రోలర్ల సాయంతో చేరుకుని నెమ్మదిగా విడుదల అవుతాయి. ఆపై అతడు జరిపిన లావాదేవీ వివరాలను తెలిపే స్లిప్‌ కూడా బయటకి వస్తుంది. ఆపై ఏటీఎం ద్వారా బ్యాంకుకు సంకేతం అందగానే అక్కడి కేంద్రీయ కంప్యూటర్‌ ఎకౌంట్‌ను అప్‌డేట్‌ చేస్తుంది. ఎప్పుడైనా డబ్బు తీసుకునే అవకాశం ఉండడంతో కొందరీ యంత్రాన్ని సరదాగా 'Any Time MoneyÑఅంటారు.
-
A.T.M. వాడకము లో జాగ్రత్తలు :
బ్యాంకులలో పొడవాటి క్యూలలో గంటల తరబడి నిలబడే దాదాపు ఎక్కడపడితే అక్కడ అమర్చిన " ఏ.టి.ఎం " వినియోగం ఈ రోజుల్లో భా పెరిగింది . ఎప్పుడు కావాలంటే అప్పుడు , ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి భలే సదుపాయము గా ఉంది .
 • ఏ.టి.ఎం. కార్డును మీరు వినియోగించే సమయము లో చుట్టుప్రక్కలవారెవ్వరూ మీ పిన్‌ నెంబరును గమనించకుండా జాగ్రత్త పడాలి .
 • కార్డు నెంబరు , పిన్‌ నెంబరు ఏ సందర్భములోనూ ఇతర వక్తులకు చెప్పద్దు .
 • కొన్ని ఏ.టి.ఎం. లలో ట్రాంసాక్షన్‌ జరిపేందుకు ఏటిఎం లోని స్లాట్ లో కార్డును ఇంసర్ట్ చేయాలి ... కొన్ని మెషిన్‌ లలో స్క్రాపింగ్ సిస్టం ఉంటుంది ... అటువంటి సమ్యాలలో దాని పంప్యూటర్ స్క్రీన్‌ పై వచ్చే సూచనలు జాగ్రత్తగా గమనించాలి . తర్చుగా ఒక ట్రాంసాక్షన్‌ పూర్తికాగానే " do you want to proceed further " అనే ప్రశ్న స్క్రీన్‌ పై కనిపిస్తుంది . మరో ట్రాంసాక్షన్‌ అవసరము లేనపుడు ' no' బటన్‌ క్లిక్ చేస్తే మీ పని పూర్తి అవుతుంది , లేదంటే మెమరీ లో మీకార్డు డేటా తరువాతవారు చూసే అవకాశము ఉంటుంది .
 • ఏటిఎం కార్డు ను డెబిట్ కార్డు వలె ఉపయోగించాలి . ఏటిఎం - కమ్‌-డెబిట్ కార్డు తో షాపింగ్ కనుక చేస్తే ఆ సమ్యములో కార్డు ఒకసారికి మించి స్కాప్ కాకుండా జాగ్రత్త వహించాలి . ఒకవేళ అలా జరిగితే దానిని గమనించి షాపింగ్ రశీదును మీ వద్ద జాగ్రత్త గా దాచుకోవాలి .
 • షాపింగ్ వేళల్లో కార్డు మీ దృష్టిపధం లోనే ఉండేలా చూసుకోవాలి ఆలా చేయడం వల్ల కార్డు ఏసందర్భములోనూ దుర్వినియోగం కాకుండా ఉంటుంది .
 • ఏటిఎం కార్డు వెనుకవైపు కార్డు వెరిఫికేషన్‌ వ్యాల్యు (సి.వి.వి.) నెంబరు ఉంటుంది .. ఆనెంబరు నూ మీరు ఒకచోట రాసి భద్రపరుచుకోవాలి . ఈ నెంబరు కూడా ఇతరులము తెలియనివ్వకూడదు . ఈ నెంబరు చాలా ముఖ్యమైనది . ఈ నెంబరు మీవద్ద ఉంటే కార్డు లేకున్నా ఏ ఇంటర్నెట్ నుంచి అయినా షాపింగ్ చేసుకునే వీలుంటుంది .
 • ఏటిఎం కార్డు పోగొట్టుకున్న సందర్భాలలో సదరు బ్యంక్ టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్‌ చేసి కార్డు వివరాలు తప్పక తెలియజేయాలి . కాల్ సెంటర్ లో మీ పేరు నమోదు చేయించుకొని " కంప్లైంట్ నెంబరు " ను తప్పక నోట్ చేసుకోండి .
ఏ.టి.ఎం. కార్డు పోయినట్లైతే :
కార్డు పోయిన వెంటనే కార్డు జారీచేసిన బ్యాంక్ కు ఆ సమాచారము అందించాలి . ఇందుకోసం కాల్ సెంటర్ లో కంప్లైంట్ నమోదుచేసుకొని ' కంప్లైంట్ నెంబరు ' నోట్ చేసుకోవాలి . మీ కంప్లైంట్ అందగానే బ్యాంక్ మీ ఏటిఎం నెంబర్ ను బ్లాక్ చేస్తుంది . తరువాత మీరు ఆ కంప్లైంట్ నెంబరును ఉదహరిస్తూ పోలీష్ స్టేషన్‌ లో పిర్యాదు చేసి , ఎఫ్.ఐ.ఆర్ ను నమోదు చేయించుకోవాలి .
మీకు తెలియకుండా ఎవరైనా మీ ఏటిఎం కార్డును వినియోగిస్తే ఆ వ్యక్తి భారతీయ శిక్షాస్మృతి ప్రకారము శిక్షార్హుడవుతాడు .
బ్యాంక్ పిర్యాదు నమోదులో జాప్యము జరిగినా లేదా నమోదు చేసుకోకపోయినా , వినియోగదారుడు '' కన్‌స్యూమర్ యాక్ట్ " కింద బ్యాంక్ పై కేసు పెట్టవచ్చును .
 • ==========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Saturday, July 03, 2010

ఎంత వానో తెలిసేదెలా? , Rain measurement-How?
ప్రశ్న: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు?

జవాబు: ఏ ప్రాంతంలోనైనా వర్షం కురిస్తే ఆ ప్రాంతంలోని సమతలంపై నీరు ఎంత ఎత్తుకు చేరుకుంటుందో ఆ మట్టం ఆధారంగా అక్కడ కురిసన వర్షపాతాన్ని కొలుస్తారు. ఉదాహరణకు విజయవాడలో 10 మిల్లీమీటర్ల వర్షం నమోదైందంటే అక్కడి సమతలంపై నిలిచిన నీటి ఎత్తు 10 మి.మీ. అన్నమాట. కానీ ఒక స్థలంలో నీరు ఎంత ఎత్తున నిలబడిందనే విషయాన్ని నేల మీద నుంచి కొలవడం సాధ్యం కాదు. అందువల్ల వర్షపాతాన్ని వర్షమాపకం (Rain Gauge) అనే పరికరంతో కొలుస్తారు.

వర్షమాపకంలో ఫైబర్‌గ్లాస్‌తో కానీ, లోహంతో కానీ చేసిన 10 సెంటీమీటర్ల వ్యాసం గల ఒక గరాటు (ఫన్నల్‌) ఉంటుంది. ఈ గరాటు ఒక లీటరు ఘనపరిమాణంగల సీసా మూతకు బిగించి ఉంటుంది. గరాటు ద్వారా సీసాలో పడిన వర్షపు నీటి ఘనపరిమాణాన్ని కొలవడానికి ఒక కొలజాడీ (measuring jar)ఉంటుంది. చెట్లు, కొండలు లేని మైదానంలో సమతలంగా ఉన్న నేలపై 30 సెంటీమీటర్ల ఎత్తులో వర్షమాపకాన్ని అమరుస్తారు. ఆ ప్రదేశంలో వర్షం పడినప్పుడు నీరు వర్షమాపకంలోని గరాటు ద్వారా సీసాలో పడి కొంత ఎత్తులో నిలబడుతుంది. అలా సేకరించిన నీటి ఘనపరిమాణాన్ని కొలజాడీలో కొలిచి ఆ ప్రదేశంలోని వర్షపాతాన్ని లెక్కగడతారు.

వాతావరణ పరిశోధన కేంద్రాలలోని వర్షమాపకం ఒక సన్నని గొట్టంలా ఉంటుంది. ఆ గొట్టంపై ముందుగానే పై పద్ధతిని ఉపయోగించి కొలతలు గుర్తించి ఉంటాయి. అందులోకి చేరిన నీటి మట్టాన్ని బట్టి వర్షపాతాన్ని నేరుగా మిల్లీమీటర్లలో కొలుస్తారు.

వర్షాన్ని అలా కొలుస్తారేం?

ప్రశ్న: ద్రవాలను లీటర్లలో కొలుస్తారు కదా, మరి వర్షపాతాన్ని ఎందుకు మిల్లీమీటర్లు, సెంటీమీటర్లలో కొలుస్తారు?

-కేబీటీ సుందరి, సికింద్రాబాద్‌


జవాబు: ఏదైనా భౌతిక రాశి (physical parameter)ని రాసేప్పుడు ఏ ప్రమాణాల్లో (units) రాస్తే సులువుగా ఉంటుందో దాన్నే పాటిస్తారు. సాధారణంగా మెట్రిక్‌ విధానం, బ్రిటిష్‌ విధానం గురించి చదువుకుని ఉంటారు. అంతర్జాతీయంగా మెట్రిక్‌ విధానం (Standard International or SI) అమల్లో ఉంది. దీని ప్రకారం దూరానికి మీటరు, కాలానికి సెకను, ద్రవ్యరాశికి కిలోగ్రాము, విద్యుత్‌ ప్రవాహానికి ఆంపియర్‌ ప్రమాణాలు. కొలతల్ని వీటిలోనే చిన్న, పెద్ద ప్రమాణాలుగా వాడతాము. దూరం విషయంలో మిల్లీమీటరు, కిలోమీటరు ఉన్నట్టన్నమాట. కానీ ఒక పరమాణువు సైజును మీటర్లలోనే రాయాలంటే దాన్ని 0.000000002 మీటర్లు అని రాయాల్సి ఉంటుంది. కానీ మీటరులో బిలియన్‌ (వంద కోట్ల భాగం) వంతును నానోమీటర్‌ అనుకున్నాక, పరమాణువు సైజును 20 నానోమీటర్లు అనడం సులువు. అలాగే సూర్యుడికి, భూమికి మధ్య ఉండే దూరాన్ని మీటర్లలో రాయాలంటే 150000000000 అని రాయాల్సి వస్తుంది. దీనికన్నా 150000000 కిలోమీటర్లు అని రాయడం తేలిక. అయితే సూర్యుడికి, భూమికి ఉన్న దూరాన్ని ఒక ఆస్ట్రనామికల్‌ యూనిట్‌ అనుకుంటే అది ఖగోళ విషయాల్లో సులువుగా ఉంటుంది. ఇక వర్షం ద్రవపదార్థమే అయినా, వర్షపాతాన్ని కొలిచే పరికరాల్లో (రెయిన్‌గేజ్‌) కొలతలు మిల్లీమీటర్లు, సెంటీమీటర్లలో ఉంటాయి కాబట్టి అలా రాస్తారు. ఒక సమతలమైన ప్రదేశంలో వర్షం కురిస్తే, ఎంత ఎత్తున నీరు నిలబడుతుందనే విషయాన్నే ఆ పరికరాలు చెబుతాయి. ఒక మిల్లీమీటరు వాన పడిందంటే అర్థం, ఆ ప్రాంతంలో ప్రతి చదరపు మీటరు వైశాల్యానికి ఒక లీటరు వంతున నీరు చేరిందని అర్థం.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

 • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

నీటికి రంగుండదేం? , Water has no color- Why?
ప్రశ్న: నీటికి రంగు ఎందుకు ఉండదు?

జవాబు: ఏదైనా వస్తువు మీద పడిన కాంతి మొత్తాన్ని ఆ వస్తువులోని అణువులు కానీ, పరమాణువులు కానీ, అయాన్లు కానీ పూర్తిగా శోషించుకుంటే (absorb) ఆ వస్తువు నల్లగా కనిపిస్తుంది. కాంతిలో ఉండే ఏడు రంగుల్లో దేన్నీ గ్రహించకుండా పరావర్తనం (reflection) చేసినా, లేదా వికిరణం (scattering) చేసినా ఆ వస్తువు తెల్లగా కనిపిస్తుంది. తెల్లని కాంతిలోని ఏదో ఒక రంగు లేదా కొన్ని రంగుల్ని మాత్రమే శోషించుకుంటే ఆ వస్తువు రంగుల్లో కనిపిస్తుంది. ఉదాహరణకు చెట్ల ఆకుల్లోని పదార్థం కాంతిలోని ఆకుపచ్చను తప్ప మిగతా రంగుల్ని శోషించుకుంటుంది. అందువల్ల అవి ఆకుపచ్చగా కనిపిస్తాయి. అయితే ఏ వస్తువులు ఏఏ రంగుల్ని వదిలేస్తాయనేది వాటి అణునిర్మాణాన్ని బట్టి ఉంటుంది. నీటి అణువులకున్న లక్షణం ప్రకారం తెలుపులోని ఏ కాంతినీ అవి శోషించుకోవు. కాబట్టి అది పారదర్శకంగా ఉంటుంది.
 • =============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.