Wednesday, December 28, 2011

గుడిలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తాం? , Why do Hindus do Pradakshina in Temples?

  • image : courtesy with - http://teluguone.com/

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : గుడిలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తాం?

జ :
గుడికి వెళ్ళిన ప్రతివారూ ప్రదక్షిణలు చేస్తారు. ప్రదక్షిణలు రెండు రకాలుగా చేస్తాం. ఒకటి ఆత్మ ప్రదక్షిణ అయితే, మరొకటి గర్భగుడి లేదా విగ్రహం చుట్టూ ప్రదక్షిణ. ప్రదక్షిణలు అయితే చేస్తాం కానీ, ఎందుకు చేస్తామో మనలో చాలామందికి సరిగా తెలీదు. ఇది ఒక జవాబు దొరకని ప్రశ్నగా ఉంటోంది.

గుడిలో వుండే దేవుడికి మనస్సులో ఏదన్నా కోరిక కోరుకుని నమస్కారం పెడతాం. ఆయనకి నైవేద్యం కింద కొబ్బరికాయ కానీ పువ్వులు కానీ సమర్పిస్తాం. దేవుడితో నేరుగా సంబంధం లేని ఈ ప్రదక్షిణలు చేయవలసిన అవసరం ఏముంది అని కొందరికి సందేహం కలగవచ్చు. దీనికి జవాబు కొందరు పండితులు ఇలా చెబుతారు.

మనకి కనిపించే 'సృష్టికి ఆతిథ్యమిస్తున్న భూమి తనచుట్టూ తాను ప్రదక్షిణలు చేస్తూ వుంటుంది. భూమి ఇలా ప్రదక్షిణలు చేయటంవల్ల దానికి శక్తి వచ్చిందా, లేక శక్తిని నిలబెట్టుకోవటం కోసం ప్రదక్షిణలు చేస్తోందా అనేది పక్కన పెడితే, మొత్తం మీద ప్రదక్షిణలు చేయకుండా వున్న మరుక్షణం ఏదన్నా జరగవచ్చు. సృష్టి మొత్తం వినాశనం కావచ్చు. అలాగే సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణం చేస్తోంది. ఫలితంగా జీవరాశి మనుగడకు సూర్యుని నుంచి శక్తి (సూర్యరశ్మి) ని పొందుతోంది.

ఈ విధంగా భూమి ఆత్మ ప్రదక్షిణలు చేయటమే కాక, సూర్యుని చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తోంది. అలాగే భక్తులు ఆత్మ ప్రదక్షిణ చేయటం, విగ్రహం చుట్టూ తిరగటం పైన చెప్పిన విషయాలకు సూచికగా వుంటాయి. ఇలా భ్రమణం 'చేయటం ద్వారా మన జ్ఞానానికి అతీతమైన శక్తిని దేవుని నుంచి పొందుతారు. ఇది మనస్సుకు, శరీరానికి కూడా మేలు చేస్తుంది. దీనిని గుర్తించబట్టే వేల సంవత్సరాల నుంచీ కూడా కేవలం హిందువులు మాత్రమే ఇలా ప్రదక్షిణ (భ్రమణం) చేసే ఆచారాన్ని పాటిస్తూ వచ్చారు.

  • ప్రదక్షిణలు ఎన్నిసార్లు చేయాలి ?

దేవాలయంలో ప్రదక్షిణలు చేస్తాం సరే, అసలు ప్రదక్షిణలు ఎన్నిసార్లు చేయాలి అనే సందేహం తలెత్తుతుంది. ఈ విషయంపై ఖచ్చితమైన నిర్ణయం ఎవ్వరూ చేయలేదు. కొందరు మూడుసార్లు చేయాలని చెబితే, కొందరు అయిదు లేదా పదకొండుసార్లు ప్రదక్షిణ చేయాలని సూచిస్తారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఎన్ని ప్రదక్షిణలైనా కానీ అవి బేసి సంఖ్యలో వుండాలి. 3. 5. 11 ఇలా అన్నమాట! ఇలా ఎందుకు నిర్ణయించారనేది ప్రస్తుతానికి జవాబు దొరకని ప్రశ్న.

ఏ దేవుడి గుడికి వెళితే, ఆ దేవుడికి సంబంధించిన స్తోత్రం పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి. స్తోత్రం మొత్తం తెలియాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఎవరకి వారు తమకు తెలిసినంతవరకు మననం చేసుకుంటూ ప్రదక్షిణ చేస్తే సరిపోతుంది. మనస్సు కేంద్రీకరించి ప్రదక్షిణ చేయటం చాలా ముఖ్యం! ఇతర ఆలోచనలతో ప్రదక్షిణలు చేసినా ఒకటే. రోడ్డు మీద నడిచినా ఒకటే! అలౌకిక విషయాలను పక్కన పెడితే ప్రదక్షిణ శరీరానికి, మనస్సుకు కూడా ఉపయోగకరంగానే వుంటుంది.

  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

బడా చార్ ధామ్ యాత్ర అంటే ఏమిటి ? , What is Bada Char dham yatra ?.

  • image : Courtesy with http://wikipedia.org/

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ఫ్ర : బడా చార్ ధామ్ యాత్ర అంటే ఏమిటి ? .

జ : విస్తృతంగా "హిందువులు" భారతదేశం లో చాలా భక్తి పూజిస్తారు అని చెప్పేవి నాలుగు piligrimage ప్రదేశాల పేర్లు ఉంటాయి. అవి: బద్రినాద్, ద్వారకా, జగన్నాథ్ పూరీ, మరియు రామేశ్వరము ..

ఆది శంకరాచార్య నిర్వచించారు చార్ ధామ్ రెండు వైష్ణవుల, ఒక శివ , మరియు ఒక మిశ్రమ పవిత్ర ప్రదేశాలు అని . కొన్ని సంవత్సరాల, క్రితం "చార్ ధామ్" ఆది శంకరాచార్య అవతారం నుండి ఇక్కడ గర్హ్వాల్ హిమాలయాలు లో అన్ని-విలువ కలిగిన చార్ ధామ్ తీర్థ యాత్ర గా తాను పేరు ఇచ్చారు. 20 వ శతాబ్దం తర్వాత, పెద్ద చార్ ధామ్ నుండి ఛోటా చార్ ధామ్ లేదా 'లిటిల్' చార్ ధామ్ అని పిలవబడేది గా మారిపోయినది . పదం చార్ ధామ్ ప్రస్తుతం, "చిన్న చార్ ధామ్ యాత్ర " సాధారణంగా పిలవడం ప్రారంభించారు . ఇదే ఇపుడు అన్ని-విలువ కలిగిన హిమాలయ చార్ ధామ్ ను సూచిస్తుంది. చార్ ధామ్ తరచుగా ఒక జీవితకాలం లో సందర్శించిన ఉండాలి అని హిందువులు అత్యంత గౌరవించే ప్రదేశము గా భావిస్తారు.

చరిత్ర:
గొప్ప 8 వ శతాబ్దం సంస్కర్త మరియు తత్వవేత్త శంకరాచార్య (ఆది శంకర) ప్రముఖంగా భారతదేశం లో హిందూ మతం ధర్మ పునరుద్ధరణకు తోడ్పడింది . అతను దేశం అంతా పర్యటించారు మరియు సమూహం విష్ణు Avatars (అవతారాలు) అంకితం ఇవి. చార్ ధామ్ గా నాలుగు పవిత్ర స్థలాలు-- బద్రినాద్, Rameshwaram, పూరి మరియు ద్వారకా. భౌగోళికంగా చార్ ధామ్ బద్రీనాథ్ మరియు రామేశ్వరం, తూర్పు, పశ్చిమ, మరియు ద్వారకా (పాత) పూరీ ఉత్తర, దక్షిణ ల్ను సూచిస్తున్న ఒక సంపూర్ణ చదరపు ప్రాంతాలు గా మార్చబడినవి .

1 బద్రీనాథ్.
బద్రీనాథ్ ఉత్తరాఖండ్ ఉత్తర భారత రాష్ట్రం లో ఉంది. ఇది Alaknanda నది ఒడ్డున, గర్హ్వాల్ కొండలు లో ఉంది. పట్టణం నార్ మరియు నారాయణ పర్వత శ్రేణుల మధ్య మరియు Nilkantha కొన (6,560 మీటర్లు) షాడో లో ఉంటుంది.

Badri ప్రాంతంలో బెర్రీ విస్తారంగా పెరుగుతాయి చెబుతారు , మరియు నాథ్ అంటే లార్డ్ అర్థం. అందుకే బదరీనాధ్ అని పేరు వచ్చినది . పురాణం శంకర Badrinarayan Alaknanda నది తీరము లో Saligram రాయి చేసిన లార్డ్ ని ఒక బ్లాక్ స్టోన్ చిత్రం కనుగొన్నారు . అతను నిజానికి దానిని Tapt కుంద్ వేడి స్ప్రింగ్స్ సమీపంలో ఒక గుహ లో పొందుపరిచారు. పదహారవ శతాబ్దంలో, గర్హ్వాల్ రాజు ప్రస్తుతం ఈ దేవాలయానికి ఆ మూర్తి ని మార్చారని చరిత్ర ఉంది . .

2 ద్వారకా.

భారతదేశం వెస్ట్ గుజరాత్ రాష్ట్రంలో ద్వారకా ఉంది. ఈ నగరం సంస్కృత భాషలో పదం dvar అర్ధం- తలుపు లేదా గేట్ నుండి దాని పేరు తీసుకోబడింది. ఇది Gomti నది కచ్ గల్ఫ్ ఆఫ్ లోకి కలిసే దగ్గర ఉంది. ఈ నగరం భారతదేశం లో పశ్చిమం భాగంగా ఉంటుంది.

ద్వారకా యొక్క పురాణ నగరం లార్డ్ కృష్ణ నివాసస్థలం . ఇది సముద్ర లో ఆరు సార్లు మునగడ ద్వారా నష్టం మరియు నాశనం కాగా, ఆధునిక ద్వారక 7 వ నగరం గా కట్టబడిందని చరిత్ర ఉన్నది .

3 జగన్నాథ్ పూరీ.

భారతదేశం ఒరిస్సా రాష్ట్రంలో పూరి ఉంది. పూరి దేశం యొక్క తూర్పు భాగం లో పురాతన నగరాలలో ఒకటి. ఇది బంగాళాఖాతం తీరంలో ఉంది. ప్రధాన దేవత లార్డ్ జగన్నాదుడిగా శ్రీ కృష్ణ, దేవత సుభద్ర, లార్డ్ కృష్ణ సోదరి మరియు లార్డ్ Balabhadra పాటు పూజలు ఇక్కడ అందుకుంటున్నారు . ఇక్కడ ప్రధాన ఆలయం 1000 సంవత్సరాల పాత మరియు రాజా ChodaGanga దేవ మరియు రాజా Tritiya Ananga భీమ దేవ ద్వారా నిర్మిచారు . పూరి Govardhana మఠ, ఆది శంకరాచార్య స్థాపించారు నాలుగు ముఖ్య సంస్థలు లేదా Mathas ఒకటి .

4 Rameshwaram.

దక్షిణ ఉన్న రామేశ్వరం తమిళనాడు రాష్ట్రం లో ఉంది. ఇది భారత ద్వీపకల్పం చాలా కొన వద్ద మన్నార్ గల్ఫ్ లో ఉంది. పురాణములు ప్రకారం, ఈ లార్డ్ రామ, లంకకు వంతెన రామ్ Setu నిర్మించిన చోటు. లార్డ్ శివ అంకితం Ramanatha స్వామి ఆలయం Rameshwaram ఒక ప్రధాన ప్రాంతం . ఆలయం శ్రీ రామ ద్వారా పవిత్ర భావిస్తున్నారు ఉంది. Rameshwaram హిందువులకు ముఖ్యమైనది. ఇక్కడ దేవతగా పేరు శ్రీ Ramanatha స్వామి ఒక Linga రూపంలో ఉంది, ఇది పన్నెండు Jyotirlingas ఒకటి.
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

What is Chota Char Dham yatra,చిన్న చార్‌ధామ్ యాత్ర అంటే ఏమిటి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : చార్‌ధామ్ యాత్ర అంటే ఏమిటి ?
జ : యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బదరీనాథ్‌ను కలుపుతూ చేపట్టే యాత్రను చార్‌ధామ్ యాత్ర అంటారు. ప్రతిఒక్క భారతీయుడు కాశీక్షేత్రాన్ని దర్శించాలనుకుంటాడు. అక్కడి గంగలో స్నానం చేసి, కాశీ విశ్వేశరుడిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని భావిస్తారు. అలానే ఉత్తరాది వారంతా ఈ నాలుగు క్షేత్రాల యాత్ర, చార్‌ధామ్ యాత్ర చేస్తారు.

ఢిల్లీ నుంచి సుమారు 500 కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి పదివేల అడుగుల ఎత్తులో ఉంది యమునోత్రి. ఇది యమునానది పుట్టిన స్థలం. ఈ క్షేత్రంలో యమునాదేవి ఆలయం ప్రకృతి అందాల మధ్య ఠీవీగా కనిపిస్తుంది.హనుమాన్ చెట్టి నుంచి 14కిలోమీటర్లు కాలినడకన లేదా గుర్రాల మీద వెళ్లి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. అక్కడికి కిలోమీటరు దూరం నిఠారుగా పైకి ఎక్కితే యమున పుట్టిన చోటు దర్శనం ఇస్తుంది.

ఇక గంగోత్రి గంగమ్మ పుట్టిల్లు. ఇక్కడి నుంచి 19 కిలోమీటర్లు కాలినడకన వెళితే గోముఖ్ వద్ద గంగమ్మ జన్మస్థానాన్ని చూడవచ్చ. అది కాస్తకష్టంతో కూడుకున్న పనే అయినా సాహసయాత్రికులకు ఆ ప్రయాణం మధురమైన అనుభూతినిస్తుంది. గంగోత్రిలో గంగామాత ఆలయం ఉంది. ఇక్కడ భాగీరథి నది ప్రవహిస్తుంది. అది మరింత కిందకు వెళ్లాక, దేవ ప్రయాగ వద్ద అలకనందతో కలిసి గంగగా మారుతుంది.

జోషీమఠ్‌కు చేరువలోని కేదార్‌నాథ్ యాత్ర మరచిపోలేని అనుభవాన్ని ఇస్తుంది.ఇక్కడ హిమాలయాల మధ్య ఉన్న కేదారనాథుని ఆలయం రమణీయంగా ఉంటుంది. శంకరాచార్యులు ఇక్కడే కైవల్యం పొందారు. సుమారు పది కిలోమీటర్ల దూరం కాలినడకన లేదా పోనీల మీద ప్రయాణం చేయాల్సి ఉంటుంది. పాట్నా నుంచి హెలికాప్టర్ సౌకర్యం కూడా ఉంది.

బదరీనాథ్ ప్రయాణం మరింత అందంగా ఉంటుంది. సరస్వతి, గంగా నదుల చెంత ఉన్న బదరీనాథుని ఆలయం వరకు వాహనం వెళుతుంది. అక్కడ వ్యాసుడు నివశించిన గుహను చూడవచ్చు. చార్‌ధామ్ యాత్ర కేవలం ఆధ్యాత్మిక జీవులకే కాదు... సాహసయాత్రికులకు సైతం గొప్ప అనుభూతినిస్తుంది.
  • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

What is Gangotri?, గంగోత్రి అంటే ఏమిటి ?

  • image : courtesy with http://wikipedia.org/

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
Q : గంగోత్రి అంటే ఏమిటి ?

A : గంగోత్రి ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీ జిల్లాలోని ఒకనగర పంచాయితీ. ఇది భాగీరధీ నదీతీరంలో ఉన్న హిందువుల పుణ్యక్షేత్రం. ఇది హిమాలయాల పర్వత శ్రేణులలో 4,042 మీటర్ల ఎత్తులో ఉంది.

గంగోత్రి గంగా నది పుట్టిన ప్రదేశం. గంగాదేవి ప్రతిష్ఠితమైన ప్రదేశం. హిమాలయాలలోని చార్‌ధామ్‌లలో ఒకటి. ఇక్కడ గంగానది భాగీరధి పేరుతో పిలవబడుతుంది. గంగా నదిని భూమికి తీసుకు రావడానికి భాగీరధుడు కారణం కనుక ఆ పేరు వచ్చింది. దేవ ప్రయాగనుండి గంగానదిలో అలకనందా నది ప్రవేశించే ప్రదేశం నుండి గంగా నదిగా పిలవబడుతుంది. గంగానది పుట్టిన ప్రదేశం గౌముఖ్. ఇది గంగోత్రినుండి 40 కిమీటర్ల ఎగువలో పర్వతాలలో ఉంటుంది.

2001 జనాభా లెక్కలననుసరించి ఇక్కడి జనాభా 606. పురుషులు 96%, స్త్రీలు 4%. గంగోత్రి 80% అక్షరాశ్యులను కలిగి ఉంది పురుషుల అక్షరాశ్యత 91%, స్త్రీల అక్షరాశ్యత 48%.
  • ==============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Saturday, December 24, 2011

శ్వాసక్రియలో నత్రజని మాటెత్తరేం?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: గాలిలో ఆక్సిజన్‌ సుమారు 20 శాతం, నత్రజని సుమారు 80 శాతం ఉంటాయని పాఠాల్లో చదివాను. మరి మనం ఆక్సిజన్‌ పీల్చుకుని, కార్బన్‌డయాక్సైడు వదుల్తామని ఎందుకంటారు?

జవాబు: గాలిలో ఐదింట నాలుగు భాగాలు నత్రజని (Nitrogen) ఉంటుంది. మన శ్వాసక్రియ (respiration)లోని ఉచ్ఛ్వాస ప్రక్రియ (inhalation)లో గాలిలోని ఆక్సిజన్‌తో పాటు, నత్రజని కూడా వూపిరితిత్తుల్లోకి వెళ్తుంది. కానీ ఆక్సిజన్‌కు మాత్రమే రక్తంలోకి చొరబడే లక్షణం ఉంది. జడతత్వం ఉండే నత్రజని వెళ్లిన దారినే తిరిగి నిశ్వాసం (exhalation) ద్వారా బయటకి వచ్చేస్తుంది. అయినా మనం ఆక్సిజన్‌ తీసుకుని నత్రజని వదులుతామని అనకూడదు. వదలడం అంటే అర్థం శరీరంలో ఉత్పత్తి అయిన పదార్థాన్ని విసర్జించడంగా భావించాలి. మనం తీసుకునే ఆక్సిజన్‌ మన శరీరంలోని పోషక పదార్థాలను ఆక్సీకరణం చేసి శక్తితో పాటు నీటి ఆవిరి, కార్బన్‌డయాక్సైడుగా మారుస్తుంది. ఈ కార్బన్‌డయాక్సైడు శరీరంలో ఉంటే ఆమ్లత్వం(acidity) పెరిగి అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడుతాయి. కాబట్టి దాన్ని వదిలేస్తాము. లోపలికి వెళ్లి అదే దారిలో వచ్చేసే నత్రజనిని మనం వదలము. అదే బయటకి వచ్చేస్తుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య--నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

How do virus enter cell ph and computer?,సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు లలో వైరస్‌ ఎలా ప్రవేశిస్తుంది?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు నిర్జీవ పదార్థాలు కదా? వాటిలోకి మామూలు వైరస్‌ ఎలా ప్రవేశిస్తుంది?
ప్రశ్న: కంప్యూటర్‌లో వైరస్‌ వచ్చిందంటారు. అంటే ఏమిటి?

జవాబు: కంప్యూటర్‌ వైరస్‌ అంటే జీవుల్లో రోగాలు కలిగించే వైరస్‌ కాదు. కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు ఒక విధమైన యాంత్రిక సంకేతాలతో (machine language) నిర్దేశితమయ్యే విద్యుత్‌ ప్రేరణల ద్వారా పని చేస్తాయి. దీన్నే ప్రోగామ్‌ అంటారు. కంప్యూటర్‌ పరిభాషలో పట్టుకోడానికి, చూడడానికి వీలయ్యే భాగాలను హార్డ్‌వేర్‌ అంటారని, అలా వీలుకాని ప్రోగాములను సాఫ్ట్‌వేర్‌ అంటారని తెలిసే ఉంటుంది. సాఫ్ట్‌వేర్‌ అనే ఈ ప్రోగామే సెల్‌ఫోన్లకు, కంప్యూటర్లకు జీవం లాంటిది. కొంతమంది జులాయిలు ఇంటర్నెట్‌ ద్వారా మోసపూరిత ప్రవృత్తితో అవాంఛనీయమైన సాఫ్ట్‌వేర్‌లను సృష్టిస్తారు. ఇవి ఒక పరికరంలోంచి మరో పరికరంలోకి వ్యాప్తి చెందుతూ విస్తరిస్తాయి. ఇది చేరిన పరికరాలు ఆశించిన విధంగా కాకుండా అసంబద్ధంగా, అనర్థంగా పని చేస్తాయి. రోగాలను వ్యాప్తి చేసే వైరస్‌లు ఎలాగైతే ఒకరి నుంచి మరొకరికి సోకుతాయో అలాగే ఈ కంప్యూటర్‌ వైరస్‌లు కూడా వ్యాపిస్తాయి కాబట్టి ఆ పేరుతో వ్యవహరిస్తారు.

కంప్యూటర్లలోకి వైరస్‌ ఎలా వస్తుంది? మొదట అసలు వైరస్‌ ఎలా పుట్టింది?

జవాబు: మన శరీరంలోకి, బాక్టీరియాల కణాల్లోకి వెళ్లే వైరస్‌ వేరు, కంప్యూటర్‌ వైరస్‌ వేరు. మామూలుగా జలుబు, ఎయిడ్స్‌, హెపటైటిస్‌, మశూచి వంటి జబ్బుల్ని కలిగించే వైరస్‌లకు భౌతిక రూపం ఉంటుంది. వాటిని మనం సూక్ష్మదర్శినుల్లో చూడవచ్చు. కానీ కంప్యూటర్‌ వైరస్‌లకు భౌతిక అస్తిత్వం లేదు. అవి కేవలం చిన్న చిన్న కంప్యూటర్‌ ప్రోగ్రాములు. మనకు ఉపయోగపడే కంప్యూటర్‌ ప్రోగ్రాముల్లో దూరి తమను తాము పునరుత్పత్తి చేసుకునేలా లాజిక్‌ ఉండే తేలికపాటి కంప్యూటర్‌ ప్రోగ్రాములే వైరస్‌లు. మరి వీటికి వైరస్‌ అని పేరు ఎందుకు పెట్టారు? మనకు సంబంధించిన మన స్వంత జీవకణాల్లోకి జబ్బును కలిగించే వైరస్‌ దూరి తన లాంటి వైరస్‌లనే పదే పదే తయారు చేసేలా మన స్వంత జీవ కణాన్ని నియంత్రించేదే సాధారణ వైరస్‌. ఆ క్రమంలో మనం వ్యాధి గ్రస్తులు కావడం, మంచాన పడి పని చేయలేకపోతాం కదా! అలాగే మనకు కావాల్సిన కంప్యూటర్‌ ప్రోగ్రాముల్లోకి వివిధ పద్ధతులు (ఇంటర్నెట్‌ ద్వారా, ఫ్లాపీలు, ఫ్లాష్‌డ్రైవ్‌లు ఒక కంప్యూటర్‌ నుంచి తీసి మరో కంప్యూటర్‌కు కలిపి వాడటం) ద్వారా సంక్రమిస్తాయి. అసలు ప్రోగ్రాము పని తీరును అడ్డుకుంటాయి. కాబట్టి వీటిని వైరస్‌ అన్నారు. ఇంటర్నెట్‌, ఇ-మెయిల్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఒక కంప్యూటర్‌ నుంచి మరో కంప్యూటర్‌కు మొబైల్‌ ఫోన్లకు వైరస్‌లు విస్తరిస్తున్నాయి. 1970లో ఈ కంప్యూటర్‌ వైరస్‌లు తయారయ్యాయి. అప్పట్నించి ఇప్పటి వరకు కంప్యూటర్‌ వైరస్‌ల దాడి అధికమవుతోంది. సుమారు లక్షకోట్ల రూపాయల మేర ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి కంప్యూటర్‌ వైరస్‌ల వల్ల నష్టం కలుగుతోంది. వ్యాపార లాభాలకు, రహస్యాల్ని తెలుసుకునేందుకు, పోకిరీగాళ్లు, స్వార్థ పరులు కంప్యూటర్‌ వైరస్‌లను రూపొందిస్తారు. రకరకాల ఆకర్షణ పూరితమైన ప్రకటనల ద్వారా మన కంప్యూటర్లలో ప్రవేశపెడతారు. సమర్థవంతమైన యాంటి వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ వాడటం ద్వారా వైరస్‌లను నియంత్రించగలం.

- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌,-శాస్త్రప్రచారవిభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, December 23, 2011

పున్నామ నరకము అంటే ఏమిటి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  • భారతీయ సంస్కృకి, సంప్రదాయాలకు, నాగ రికత పురోగతికి మూలం కుటుంబ వ్యవస్థ. ఈ వ్యవస్థలో తల్లిదండ్రుల పాత్ర ఎనలేనిది. పిల్లల సర్వాం గీణ వికాసానికి తోడ్పడేది తల్లిదండ్రులే. నవ మాసాలు మోసి తల్లి బిడ్డకు జన్మనిస్తే, ఆ బిడ్డల ఎదుగుదలకు మార్గదర్శనం చేసేది తండ్రియే. అందుకే ఉపనిషత్తులు మాతృదేవోభవ, పితృదేవో భవ, ఆచార్య దేవోభవ అన్నా యి. కుటుంబంలో తండ్రి తమ పిల్లల ఉజ్వలభవిష్యత్తు కొరకై ఎంతో శ్రమిస్తాడు. 'జన్మనిచ్చే తల్లికన్నా... జీవి తాన్నిచ్చే తండ్రి మిన్న'' అన్న అబ్రహాంలింకన్‌ మాటల్లో ఎంతో నిజం వుంది. 'తాను శ్రమిస్తూ తన పిల్లలకు వెలుగునిచ్చే కొవ్వొత్తి నాన్న'. బిడ్డలకు బాసటగా నిలిచే అపురూప వ్యక్తి నాన్న.'

కొడుకు అంటే మగ సంతానం కొడుకు ''పున్నామ నరకము'' నుండి రక్షించువాడు అని ఒక నాటి హిందువుల నమ్మకము ... నరకము , స్వర్గము ఎక్కడో లేవు అన్ని మనచుట్టూ నే ఉన్నాయి. పాపము చేసేవాడు నరకానికి ,, పుణ్యము చేసేవాడు స్వర్గానికి చేరుతారని నమ్మకము . తోటి జీవులకు ఇస్టములేనిది , కస్టము కలిగించేది , నస్టపరిచేది ఏ పని అయినా పాపమే . కష్టలేని , నష్ట పెట్టని , ఇష్టమైన కార్యమేదైనా పుణ్యమే .

అసలు పుత్రులు వున్నా వాళ్ళు తల్లిదండ్రులకు ఎంతవరకు సేవ చేస్తున్నారనేదే ప్రశ్న . చేస్తున్నవారు , చేసేవారూ వున్నారు .. లేకపోలెదు . లేకపోవడము బాధకాదు మనసులేకపోవడమే బాధ . ధనవంతుడి పిల్లలు పైకి చెప్పరుకాని తండ్రి ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తారు . పేదవాడి పిల్లలు తండ్రి ఇంకాకొంతకాలము బతకాలని ఆశిస్తారు - అప్పటికైనా ఎంతోకొంత సంపాదించి ఇవ్వకపోతాడా అని .

ఒక జీవి చనిపోయిన తరువాత ఏమవుతుందని ఇంతవరకూ తెలీదు . తెలినవారు చెప్పిన రీతులు రుజువు చేయబడలేదు . ఆత్మ గాలిలోనూ, శరీరము భూమిలోను కలిసిపోతాయి. . . ఉన్న జీవులనుండి కొత్త జీవులు ఉద్భవిస్తూనే ఉంటాయి. నరకము-స్వర్గము , పాపము-పుణ్యము , మంచి-చెడు , వాయ-వరస, దేవుడు-దెయ్యము ... అనేవి వేదవ్యాసుని ఆత్యాధ్మిక న్యాయ-నీతులు (Mythological Law & Orders).ఒక మనిషి మంచి మార్గములో నడవడానికి నిర్ణయించిన నియమ-నిభందనలు . నరకలోకము పాపులను శిక్షించే లోకము-యమలోకము . పుణ్య్లలోకము పుణ్యాత్ములకు చోటు కల్పించే లోకము-స్వర్గలోకము .

పితృకార్యములు చేయుటకు అర్హత పొందినవారు అంతా విధిగా పక్షాలను ఆచరించి, వారి వారి వంశవృక్షములకారకులైన పితృదేవతలను స్మరించుకుని శ్రాద్ధ కర్మలు చేస్తే వారి శుభాశీస్సులతో సర్వశుభములు పొందుతారని పండితులు పేర్కొంటున్నారు. కళ్లముందు కనిపించకపోవచ్చు. భౌతికంగా దూరమై ఉండవచ్చు. అంతమాత్రాన, దివంగతులతో మన బంధం తీరిపోదు. వారి కలల్నీ ఆశయాల్నీ నిజం చేయాల్సిన బాధ్యత మనదే. వారి జ్ఞాపకాలకు ట్రస్టీలమూ మనమే. పితృ కర్మ చే్యడము వలన చనిపోయిన తండ్రికి స్వరలోక ప్రాప్తి కలుగుతుందని దానికి అర్హుడు పుత్రుడేనని హిందూ పురాణాలలో చెప్పబడినది . అదే కొడుకు ''పున్నామ నరకము'' నుండి రక్షించువాడు అని ఒక నాటి హిందువుల నమ్మకము.
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

కాకి కాలు తలకి తగిలితే చావుకబురు వస్తుందంటారు . ఎందుకు ?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  • ప్ర : కాకి కాలు తలకి తగిలితే చావుకబురు వస్తుందంటారు . ఎందుకు ?
జ : అది ఒక మూడనమ్మకము . అందులో నిజము లేదు . ఎప్పుడైనా కాకికాలు మీ తలకి తగిలిందా? . ఎగిరే కాకి చూడడానికి చిన్నదైనా వేగముతో తలమీద వాలినప్పుడు చాలాబరువుగా ఉండి , కాలి గోళ్లు తలకి గుచ్చుకుంటాయి. ముక్కుతో పొడిచి జంతువుల జీలుగను , చనిపొయిన జంతువుల మాంసాన్ని , ఎంగిలి , కుళ్ళిపోయిన పదార్ధాలను కాలిగోళ్ళల్తో పీక్కుతింటాయి. వాటి గోళ్ళలో సూక్ష్మక్రిములు , అనారోగ్య పదార్ధాలు ఉంటాయి.

తలమీద వాలునప్పుడు ఆ ఊపులో మాడుకి గోళ్ళు తాకి అక్కడి చర్మము చిట్లి గాయము ఏర్పడి విషక్రిములు రక్తము లో కలిసే అవకాశము ఉంది . పూర్వకాలములో సరియైన వైద్యససుపాయాలు , సూక్ష్మక్రిముల అవగాహన లేకపోడముతో ...కాకి తలమీద వాలితే అనారోగ్యము. ఈ ఆనారోగ్యము నుండి కాపాడుకోవడానికి తలస్నానము చెయ్య మంటారు . . . దానినే చావుకబురు అని , అశుభవని కొందరు హడవుడి చేస్తూంటారు. అంతే . . . తలస్నానము మంచిదే కదా.
  • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Thursday, December 15, 2011

చేపలు తలకిందులవుతాయేం?, Why do fish float belly up after death?

  • image : courtesy with Eenadu Hai bujji.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: చనిపోయిన చేపలు నీటిలో వెల్లకిలా తేలుతాయెందుకు?

జవాబు: ఏ ప్రాణి చనిపోయిన తర్వాతైనా దాని శరీరం నిండా వాయువులు ఉత్పన్నమవుతాయి. చేపల్లో కూడా ఇలాగే జరుగుతుంది. తేలికైన ఈ వాయువుల కారణంగానే చనిపోయిన చేపలు నీటిపైన తేలుతాయి. వాయువులు ముఖ్యంగా చేపల కిందివైపు ఉండే ఉదరభాగంలో ఉత్పన్నమవుతాయి. ఫలితంగా ఉదరభాగం ఉత్ల్పవన (buoynacy) ప్రభావానికి గురవుతుంది. చేపల గరిమనాభి (centre of gravity) ఉదర భాగంలో కేంద్రీకరించి ఉండడంతో ఆ భాగం నీటి ఉపరితలానికి చేరుకుంటుంది. అందువల్లనే చనిపోయిన చేప తలకిందులై వెల్లకిలా తేలుతుంది. తర్వాత కొంత కాలానికి చనిపోయిన చేప విఘటనం (decay) చెంది దాని లోని వాయువులన్నీ విడుదలవడంతో అది నీటిలో మునిగిపోతుంది.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్

  • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

కెలోరీలు అంటే ఏమిటి?,What is a Calary?

  • image : courtesy with Eenadu news peper

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: కెలోరీలు అంటే ఏమిటి? మనిషికి వీటి అవసరం ఏమిటి? ఇవి ఎక్కువ ఉండాలా? తక్కువ ఉండాలా?

జవాబు: కెలోరీ అనేది శక్తిని కొలిచేందుకు వాడే ఒక ప్రమాణం. సాధారణంగా ఉష్ణశక్తిని కొలవడానికి వాడతారు. మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, బతికి ఉండాలన్నా, ఏ పని చేయాలన్నా శక్తి అవసరం. అది మనకు ఆహారం ద్వారా లభిస్తుంది. ఒక మనిషికి ఎంత ఆహారం కావాలి,. తద్వారా ఎన్ని కెలోరీల శక్తి అవసరం అనే విషయాలు ఆ మనిషి వయసు, వృత్తి, ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. సాధారణంగా 30 సంవత్సరాల వయసుగల వ్యక్తికి సుమారు 3500 కెలోరీల శక్తి అవసరం. యవ్వనంలో ఉన్నవారికి అదనంగా శక్తి అవసరం. చలి ప్రాంతాల్లో ఉన్నవారికి, గర్భిణులకు, అధిక శారీరక శ్రమ చేసేవారికి కూడా అదనపు శక్తి అవసరం అవుతుంది. మనం తినే ఆహారంలో కార్బొహైడ్రేట్లు, మాంసకృత్తులు (ప్రొటీన్లు), కొవ్వులు (ఫ్యాట్స్‌) ప్రధాన శక్తిదాయకాలు. మనకు సమారు 60 శాతం శక్తి పిండి పదార్థాల (కార్బొహైడ్రేట్స్‌) నుంచి వస్తుంది. దాదాపు 20 శాతం మాంసకృత్తులు, మరో 20 శాతం కొవ్వు పదార్థాల నుంచి లభిస్తుంది. కెలోరీలు మరీ ఎక్కువయితే ఊబకాయం (ఒబేసిటీ) వస్తుంది. మరీ తక్కువైతే సొమ్మసిల్లి పడిపోతారు. సంతులన ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అందరి కర్తవ్యం.

  • -ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

కేలరీలంటే మనిషి శరీరంలోని జీవక్రియలకు ఉపయోగించే శక్తికి కొలమానం. ఒక కేలరీ అంటే ఒక గ్రాము నీటిని ఒక సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతకు పెంచగలిగే శక్తి అని అర్థం.
ఇంధనాలను కాల్చటం ద్వారా పుట్టే ఉష్ణాన్ని కూడా కెలోరీలలోనే లెక్కిస్తారు. ఒక గ్రాము ఇంధనం కాల్చినపుడు ఉత్పత్తి అయ్యే ఉష్ణాన్ని ఒక కేలొరీగా లెక్కిస్తారు. ఉదాహరణకు 12 గ్రాముల కార్బన్‌ను కాల్చినపుడు 94 కేలొరీల ఉష్ణం పుడుతుంది.

  • --డా.వందన శేషగిరిరావు -MBBS
  • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

వూసరవెల్లి తన శరీరపు రంగును మారుస్తూ ఉంటుంది. ఎందుకు?,Chameleon changes colors Why?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: వూసరవెల్లి తన శరీరపు రంగును మారుస్తూ ఉంటుంది. ఎందుకు?,Chameleon changes colors Why?

జవాబు: వూసరవెల్లి తన శరీరపు రంగును పరిసరాలకు అనుగుణంగా మారుస్తుందనుకోవడం నిజం కాదు. కానీ దాని శరీరపు రంగులు మారతాయనేది మాత్రం నిజం. పరిసరాల్లోని ఉష్ణోగ్రత, వెలుతురు తీవ్రతల్లోని హెచ్చుతగ్గులకు అనుగుణంగా దాని చర్మం స్పందిస్తూ ఉంటుంది. అవి ఒకదానితో ఒకటి సందేశాలు పంపుకోవడం, వాటి మానసికావస్థను తెలియ పరుచుకునే క్రమంలో కూడా ఈ రంగుల మార్పిడి ఉపయోగపడుతూ ఉంటుంది. వాటి చర్మంలో ఉండే జీవకణాల్లో పలు యాంత్రిక నిర్మాణాల చర్యల వల్ల రంగుల మార్పు జరుగుతుంది. చర్మంలోని క్రోమోటోఫోర్స్‌ (chromotophores) అనే ప్రత్యేకమైన జీవకణాల వల్ల వేర్వేరు రంగులు ఒకేచోట ఏర్పడడమో లేక వివిధ ప్రదేశాలకు విస్తరించడమో జరుగుతుంది. వివిధ రకాలైన క్రోమోటోఫోర్స్‌ వేర్వేరు రంగులను మెరిసే స్ఫటికాల రూపంలో కలిగి ఉంటాయి.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
  • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Thursday, December 08, 2011

అడవితీగ కుడ్జూ సంగతేమిటి?, What about Kudzu creeper plant?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

చైనాలో పుట్టింది... జపాన్‌లో పెరిగింది... అమెరికా చేరింది... హడలగొడుతోంది! ఇంతకీ ఏమిటి? ఓ అడవి తీగ! కొన్నేళ్లుగా వేలాది మంది ఒకే పని మీద ఉన్నారు. ఆ పని కోసం కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతున్నారు. శాస్త్రవేత్తలు నిరంతరం గమనిస్తున్నారు. ఆ పనేంటో తెలుసా? ఓ మొక్కను పీకెయ్యడం! ఇదంతా జరుగుతున్నది అగ్రరాజ్యమైన అమెరికాలో! అది మామూలు మొక్క కాదు! అనేక ప్రాంతాల్లో అల్లుకుపోతోంది! ఎంతో నష్టానికి కారణమవుతోంది. ఆ అడవితీగ పేరు కుడ్జూ (Kudzu).ఇది ఎంత వేగంగా పెరుగుతోందంటే, ఏడాదిలో లక్షన్నర ఎకరాల్లో అల్లుకుపోయింది. ఇలా ఇప్పటికి 70 లక్షల ఎకరాల్ని ఆక్రమించేసింది.

ఈ అడవితీగ కరెంటు స్తంభాలు, ఇళ్లు, ప్రహారీ గోడలు అన్నింటి మీదకీ పాకేస్తోంది. దాంతో విద్యుత్‌ సరఫరాకి అంతరాయం ఏర్పడుతోంది. ఇక అడవుల సంగతి చెప్పక్కర్లేదు చెట్ల మీద పందిరిలా అల్లుకుపోతుంటే ఆ ప్రాంతమంతా చీకటిమయమైపోతోంది. దీని వల్ల చాలా మొక్కలు సూర్యరశ్మి తగలక చనిపోతున్నాయి. అసలివి ఇంత త్వరగా ఎదగడానికి సహకరిస్తున్నదేంటో తెలుసుకోవడం కోసం శాస్త్రవేత్తలు 18 ఏళ్ల పాటు పరిశోధనలు చేశారు. ఆ మొక్కలో ఉన్న ఓ ఔషధమే కారణమ ని తెలిసింది. దానిని ఎలా నియంత్రించాలో తెలుసుకునేందుకు నాలుగేళ్ల నుంచి పనిచేస్తున్నారు.

నిజానికి ఈ మొక్కకి, అమెరికాకి సంబంధమే లేదు. అమెరికా నూరవ పుట్టిన రోజు ఉత్సవాల్లో దేశదేశాల భాగస్వామ్యాన్ని ఆమెరికా ఆహ్వానించింది. ఆ సందర్భంగా జపాన్‌ వాళ్లు తమ దేశంలోని అందమైన మొక్కల్ని ప్రదర్శించారు. పెద్ద ఆకులతో, అందమైన పూలతో ఉన్న కుడ్జూ లతలు అందర్నీ ఆకర్షించాయి. చాలా మంది వీటిని కొని పెంచడం మొదలు పెట్టారు. పశువులకు ఆహారంగా రైతులు పొలాల్లో నాటారు. ఇప్పుడు అమెరికా వీటిని కలుపు మొక్కల జాబితాలో పెట్టింది. ఈ మొక్క పుట్టిల్లు చైనా అని చెపుతారు.

  • source : courtesy with Eenadu hai bujji

  • ==============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

వేలిముద్రలను గుర్తించేదెలా?,How to recognize fingerprints?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: ఒక వ్యక్తి యొక్క వేలి ముద్రలను ఎలా గుర్తిస్తారు?

జవాబు: వేలి ముద్రలను గుర్తించడానికి ఒక ప్రత్యేకమైన పరికరం ఉంటుంది. డిజిటల్‌ పద్ధతిలో పనిచేసే ఇది వేలిముద్రల సమాచారాన్ని వివిధ కోణాల్లో సేకరించి కంప్యూటర్‌లో భద్రపరుస్తుంది. ఈ పరికరానికి ఉండే సెన్సార్‌ ముందు చేతి వేళ్లను ఉంచుతారు. అందులో ఉండే మైక్రోచిప్‌లో ఉష్ణశక్తికి స్పందించే ఒక పొర ఉంటుంది. ఇది దాదాపు 14,000 ప్రతిబింబాలను నమోదు చేయగలుగుతుంది. చేతి వేళ్లలోని స్వల్పమైన ఉష్ణశక్తి హెచ్చుతగ్గులను సైతం ఈ యంత్రం గుర్తించి వాటిని అనేక అంశాలుగా నమోదు చేస్తుంది. వేలిముద్రల్లో ఉండే రేఖల ఎత్తుపల్లాలన్నీ ఒక వరస క్రమంలో నమోదు అవుతాయి. ఇలా ఒక వేలిముద్ర ప్రతిబింబం ద్వారా దాదాపు 50 నుంచి 100 అంశాలకు సంబంధించిన సమాచారం లభిస్తుంది. పరికరంలో ఉండే ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ ఈ అంశాలన్నింటినీ సక్రమమైన రీతిలో అమర్చి ఒక సమగ్రమైన ప్రతిబింబాన్ని కంప్యూటర్‌ తెరపై ప్రదర్శించేలా ఏర్పాటు ఉంటుంది. సేకరించిన సమాచారాన్నంతటినీ డిజిటల్‌ కోడ్‌ రూపంలో భద్రపరుస్తారు.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

మ్యాజిక్‌ను కనిపెట్టగలమా?,Can we detect Magic acts?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: ఇంద్రజాలం చేసేవారు కన్ను మూసి తెరిచేలోగానే చేతుల్లో వస్తువుల్ని మార్చుకుని అవే మారినట్టు నమ్మిస్తారు. అతి వేగంగా పనిచేసే కెమేరాతో ఆ మ్యాజిక్‌ను కనిపెట్టగలమా?

-ఎస్‌. సూర్యనారాయణ, చెన్నై

జవాబు: ఒక సెకనులో 16వ వంతు కన్నా తక్కువ సమయంలో జరిగే సంఘటనలను మన కన్ను కనిపెట్టలేదు. మానవ నేత్రానికి ఉన్న ఈ పరిమితి ఆధారంగానే సినిమాలను మనం అవిచ్ఛిన్న చలన చిత్రం (continuous motion picture)గా చూడగలుగుతున్నాం. కాబట్టి సెకనుకు 16 సార్ల కన్నా ఎక్కువగా షట్టర్‌ తెరుచుకుంటూ, మూసుకుంటూ పని చేసే స్పీడ్‌ కెమేరాల సాయంతో ఇంద్రజాలికుని చేతి కదలికల్ని ఫొటోలు తీసి వాటిని విడివిడిగా చూస్తే అతడి హస్తలాఘవాన్ని దశలవారీగా గమనించవచ్చు. ఇప్పుడు ఇంతకంటే వేగంగా ఫొటోలు తీయగలిగే కెమేరాలు ఉన్నాయి కాబట్టి వాటితో చిత్రీకరిస్తే మ్యాజిక్‌ ఎలా జరిగిందో కనిపెట్టగలుగుతాము.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

చెట్లకు బెరడెందుకు?,Trees have bark Why?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: చెట్ల కాండంపై బెరడు వల్ల ఉపయోగం ఏమిటి?

-ఎమ్‌. శ్రీశాంత్‌, 7వ తరగతి, మిర్యాలగూడ

జవాబు: బెరడు లేకుండా చెట్లు ఎక్కువ కాలం జీవించలేవు. పరిసరాల ప్రభావం నుంచి, దెబ్బలనుంచి చెట్లకు బెరడు రక్షణనివ్వడమే కాకుండా, కాండంలోని తడి ఆరిపోకుండా, ఫంగస్‌లాంటి జీవులు దాడి చేయకుండా కాపాడుతుంది. చెట్లలో సున్నితంగా ఉండే నాళికామయమైన కాంబియం(cambium) అనే పదార్థం చెట్ల కాండంపై బెరడు కిందనే ఉంటుంది. ఇక్కడే చెట్ల పోషణకు కావలసిన సరికొత్త ధాతువులు ఉత్పన్నమవుతుంటాయి. బెరడు లేకపోతే ఈ పదార్థం వాతావరణ ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే ఆకుల నుంచి వివిధ వృక్షభాగాలకు గ్లూకోజ్‌ను అందించే నాళవ్యవస్థ చెట్ల బోదెపైనే ఉంటుంది. చెట్టుకు వేళ్ల ద్వారా అందే పోషక రసాలను పీల్చుకునే మెత్తని కొయ్యకు కూడా బెరడు రక్షణ ఇస్తుంది. కొన్ని చెట్ల కాండంపై బెరడు ఎంత మందంగా ఏర్పడుతుందంటే, అడవుల్లో చెలరేగే కార్చిచ్చు నుంచి ఉత్పన్నమయ్యే అధిక ఉష్ణోగ్రత నుంచి కూడా ఇవి చెట్లను కాపాడగలుగుతాయి.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
  • ==============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

క్యాలెండర్‌ రెపరెపలేల?,Wall calendar sound on air Why?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: గోడకు నిలకడగా ఉన్న క్యాలెండర్‌ కాగితాలు సీలింగ్‌ ఫ్యాను వేయగానే రెపరెపలాడుతూ ముందుకు కదుల్తాయెందుకు? గాలి ఒత్తిడికి మరింతగా గోడకు అతుక్కుపోవాలి కదా?

-వైష్ణవి, అమలాపురం

జవాబు: ద్రవాలను, వాయువులను ప్రవాహకాలు (fluids)అంటారు. ఆ ప్రవాహకాల వల్ల కలిగే ఒత్తిడిని ఆ ప్రవాహపు ద్రవపీడనం అంటారు. నిలకడగా ఉన్న గాలి కన్నా కదిలే గాలి కలిగించే పీడనం ఎక్కువని భావించడం వల్లనే ఇలాంటి సందేహాలు ఏర్పడుతాయి. కానీ వేగం పెరిగే కొద్దీ గాలి పీడనం తగ్గుతుంది. దీనినే బెర్నేలీ సిద్ధాంతం అంటారు. ఈ సూత్రం ఆధారంగానే విమానాలు, హెలికాప్టర్లు, గాలిపటాలు, పక్షులు ఎగరగలుగుతున్నాయి. ఇప్పుడు క్యాలెండర్‌ విషయానికి వస్తే గదిలో ఫ్యాన్‌ వేయనప్పుడు గాలి పీడనం సాధారణంగా ఉంటుంది. ఫ్యాన్‌ వేయగానే గాలిలో కదలిక ఏర్పడి పీడనం తగ్గుతుంది. ఈ స్థితిలో క్యాలెండర్‌ కాగితాల ముందు కదిలే గాలి పీడనం కన్నా, ఆ కాగితాల వెనక ఉండే గాలి పీడనం ఎక్కువగా ఉంటుంది. గాలి కదలికల వల్ల క్యాలెండర్‌ ముందు భాగంలో అల్పపీడనం ఏర్పడి ఆ వెనక ఉన్న గాలి ముందుకు వస్తూ మధ్యలో ఉన్న కాగితాలను కూడా తోస్తుంది. అందుకే ఆ రెపరెపలు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

What is difference between planet and sub-planet?, గ్రహానికి ఉపగ్రహానికి ఉన్న తేడా ఏమిటి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : గ్రహానికి ఉపగ్రహానికి ఉన్న తేడా ఏమిటి?

జ : నిర్వచనము ప్రకారము సూర్యుని చుట్టూ తిరిగేవి గ్రహాలు , గ్రహాల చుట్టూ తిరిగేవి ఉపగ్రహాలు . గ్రహాలు సైజు లో పెద్దవి . ఉపగ్రహాలు సైజులో చిన్నవి . గ్రహాలకు ఉపగ్రహాలకు కూడా స్వయం ప్రకాశశక్తి లేదు . రెండూ రాతిగోళాలే . ఆ గొళాలు సూర్యుని కాంతిని పరావర్తనం చిందించి ప్రకాశస్తాయి. గ్రహాలలో కొన్నింటిమీద వాతావరణం ఉంటుంది . ఉపగ్రహాలకు వాతావరణం లేదు . వాతావరణం కలిగి సైజులో పెద్దది అయినది ... భూమి . దానిఉపగ్రహము చంద్రుడు .

మనము ప్రయోగించగా భూకక్ష్యలో పరిభ్రమించేవి కృత్రిమ ఉపగ్రహాలు . వీటిద్వారానే నేడు మన కమ్యూనికేషన్‌ వ్యవస్థ మొత్తం నడుస్తోంది .
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, December 07, 2011

భూమి తిరుగుడు సమస్య కాదా?,Earth rotation is not a problem for aeroplanes?

    ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...భూమి

    • Bulleted Listప్రశ్న: భూమి గుండ్రంగా తిరుగుతోంది కదా! మరి విమానాలు గాలిలో ఎగిరేప్పుడు కింద భూమి తిరిగిపోతే అవి గమ్యస్థానాలను ఎలా చేరుకోగలుగు తున్నాయి?
    -రామచంద్రారెడ్డి, సిద్దిపేట
    • జవాబు: మనం బస్సులో ఒక చోట నుంచి మరో చోటకి వెళ్లేప్పుడు ఈ సందేహం రానేరాదు. ఎందుకంటే భూమితో పాటు వివిధ ప్రదేశాలు, రోడ్డు, రోడ్డు మీది బస్సు కూడా తిరుగుతున్నాయి కాబట్టి గమ్యం చేరుకుంటామని అనిపిస్తుంది. అయితే విమానం గాలిలో ఉన్నప్పుడు దానికి భూమితో ఎలాంటి సంబంధం లేదు కాబట్టి సరైన చోట దిగడం ఎలాగనే సందేహం కలుగుతుంది. దీనికి సమాధానం చెప్పుకునే ముందు ఒక సంగతి గుర్తు చేసుకుందాం. వేగంగా వెళుతున్న రైలులో కూర్చుని ఒక బంతిని పైకి విసిరామనుకోండి. ఆ బంతి గాలిలో ఉండగా రైలు ముందుకు కదిలిపోతుంది కాబట్టి అది వెళ్లి రైలు గోడలకు గుద్దుకోవాలిగా? కానీ అలా జరగదు. బంతి తిన్నగా వచ్చి మీ చేతుల్లోనే పడుతుంది. ఎందుకంటే రైలులో ఉండే గాలికి, అందులోని ప్రతి అణువుకి కూడా రైలు వేగమే ఉంటుంది. అలాగే భూమి కూడా గుండ్రంగా చాలా వేగంగా తిరుగుతున్నా, దాని చుట్టూ ఆవరించి ఉన్న వాతావరణం మొత్తం దానిని అంటుకుని అదే వేగంతో తిరుగుతుంటుంది. కాబట్టి ఆ వాతావరణంలోనే ప్రయాణించే విమానం కూడా భూ ప్రభావానికి లోబడే ఉంటుంది. అందువల్ల విమానం తప్పిపోతుందనే ఆలోచన అక్కర్లేదు.

    -ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
    • ==============================
    visit My website > Dr.Seshagirirao - MBBS.-

    పేగులు అరుస్తాయేం?,Why do intestines in the Abdomen Cry?

    ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

    • ప్రశ్న: అప్పుడప్పుడు మన కడుపులోని పేగులు అరుస్తాయెందుకు?

    -పి. రాజరత్నం, 9వ తరగతి, కరీంనగర్‌

    • జవాబు: మనం ఆహారం తీసుకొన్న కొంత సేపటికి అది జీర్ణమై కడుపు ఖాళీ అవడంతో, దాంట్లో జీర్ణాశయ సంబంధిత ద్రవాలు, గాలి మాత్రమే ఉంటాయి. ఆహారం ఉన్నప్పుడు జీర్ణాశయపు గోడల సంకోచాలు క్రమంగా, నిశ్శబ్దంగా, నెమ్మదిగా జరుగుతుంటాయి. అదే కడుపు ఖాళీ అవగానే ఈ సంకోచాల తీవ్రత పెరుగుతుంది. ఆ కదలికల వల్ల కొన్ని శబ్దాలు ఉత్పన్నమవుతాయి. వాటినే మనం పేగులు అరుస్తున్నాయంటాం. వెంటనే నీరు తాగడం, లేదా ఆహారం తీసుకోవడం ద్వారా ఈ శబ్దాలు తగ్గిపోతాయి. పేగుల గుండా ఆహారపు గుజ్జు, గాలి పయనిస్తున్నప్పుడు కూడా ఇలాంటి శబ్దాలు ఉత్పన్నమవుతాయి.

    -ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
    • ============================
    visit My website > Dr.Seshagirirao - MBBS.-

    చంద్రుడి కోసం పోటీలేల?,Why do have competion for Moon

    • Landing on the Moon
    ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

    ప్రశ్న: చంద్రుడి మీద ప్రదేశాలను కొన్ని దేశాలు నివాస ప్రాంతాలుగా రిజిస్టరు చేసుకొన్నాయని విన్నాను. అక్కడ మనిషి ఎలా నివసించగలడు?

    జవాబు: భూమికి ఉపగ్రహమైన చంద్రుడి ఉపరితలం మీద వాతావరణం దాదాపు శూన్యం. చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి మన లెక్కలో ఒక నెల పడుతుంది. అందువల్ల చంద్రుడి మీద పగలు 14 రోజులు ఉంటే, రాత్రి 14 రోజులు ఉంటుంది. పగలు దాదాపు 120 డిగ్రీల సెంటిగ్రేడు ఉష్ణోగ్రత, రాత్రి సుమారు మైనస్‌ 170 డిగ్రీల సెంటిగ్రేడు ఉష్ణోగ్రత ఉండే అక్కడి వాతావరణ పరిస్థితులు జీవుల మనుగడకు అనువైనవి కావు. అయితే అంతరిక్ష పరిశోధనలు ఊపందుకుంటున్న నేపథ్యంలో చంద్రుడిపై కృత్రిమమైన ఆవాసాలను ఏర్పాటు చేసుకునేందుకు కొన్ని దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. భవిష్యత్తులో కృత్రిమ వాతావరణాన్ని సృష్టించడం ద్వారా మానవ నివాసాలను ఏర్పాటు చేయగలమా లేదా అనే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి.

    - ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞానవేదిక
    • =======================
    visit My website > Dr.Seshagirirao - MBBS.-

    Hell and Heaven , నరకము -స్వర్గము

    ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

    ప్ర : నరకము -స్వర్గము అంటే ఏమిటి , What is Hell and Heaven?

    జ : నరక లోకము పాపులను శిక్షించే ప్రదేశము . పుణ్యము చెసిన వారికి స్వర్గము, పాపులకు నరకము ప్రాప్తిస్తుంది అని అంటారు.

    గాలి-నీరు-భూమి-అగ్ని-ఆకాశం అనే పంచభూతాల సమ్మేళనేమ్ మనిషి. ఈ విశ్వములో ఉన్న 100 లక్షల కోట్ల జీవులలో 84 లక్షల రకాల జీవులు ఉన్నాయని అంచనా. వీటిలో మానవుడు మాటలాడ గలిగే విచక్షణా జ్ఞానము ఉన్న జీవి . తన తోటి మానవులను ఒక క్రమమైన , న్యాయబద్దమైన , ప్రేమపూరితమైన,ఒక నిర్ణీతమైన జీవనవిధానానికి అనేక ఆత్యాధ్మికమైన విధి విధానాలను సృష్టించాడు . వాటిలో కొన్ని --> పుణ్యము - పాపము , మంచి - చెడు , వాయ -వరస , దేవుడు - దెయ్యము, స్వర్గము - నరకము . . .

    పాపము : తోటి జీవులకు కష్ట పెట్టే , ఇష్టములేని , నష్టపరిచే పని ఏదైనా పాపమే . . .
    పుణ్యము : సహజీవులకు కష్టపెట్టని ,ఇష్టమైన , నష్టపరచని పని ఏదైనా పుణ్యమే . . .

    • మనిషే మనిషికి దేవుడు ,
    • మనిషే మనిషికి దెయ్యము ,
    • మనిషే మనిషికి మిత్రుడు ,
    • మనిషే మనిషికి శత్రువు ,

    పరమానందము ఎక్కడో లేదు ... నీ ఆనందాన్ని నలుగురికీ పెంచిపెడితే అదే పరమానందము . ప్రతి జీవిలోనూ దేవుడున్నాడు . ఏకాగ్రతకోసము మనిషి ఊహించుకునే ఆకారమే దేవుని రూపము . ఆల్లా , ఈశ్వర్ , ఏసు మున్నగునవి ఆ కోవలోనివే. అరటి పండు కొబ్బరికాయ నైవేద్యము పెడితే పుణ్యము రాదు . . . మంచిమనసు తో పదిమందిని ఆనందపరిచి వారి ఆకలి తీరే నైవేద్యము పంచిపెడితేనే పుణ్యము .
    • =========================
    visit My website > Dr.Seshagirirao - MBBS.-

    Tuesday, December 06, 2011

    రాత్రి ఆకాశం నలుపేల?,Sky is dark in nights Why?

    ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

    ప్రశ్న: రాత్రివేళ ఆకాశం నల్లగా, చీకటిగా ఉంటుంది. ఎందుకని?

    -కె. రవికిషోర్‌, విజయవాడ

    జవాబు: ఈ సందేహం అనేక శతాబ్దాలుగా ఖగోళ శాస్త్రవేత్తల మధ్య చర్చలను లేవనెత్తింది. పదహారవ శతాబ్దం నుంచీ ఉన్న ఈ సందేహాన్ని 19వ శతాబ్దానికి చెందిన హెన్రిచ్‌ విల్‌హెల్మ్‌ ఓల్‌బర్స్‌ అనే శాస్త్రవేత్త ప్రాచుర్యంలోకి తెచ్చాడు. ఫలితంగా దీనికి 'ఓల్‌బర్స్‌ వైరుధ్యం' (Olbers Paradox) అనే పేరు వచ్చింది. విశ్వం అనంతంగా వ్యాపించి ఉంటే దానిలో అనంత సంఖ్యలో నక్షత్రాలు ఉండాలి. అప్పుడు ఆకాశంలో ఏ దిశలో చూసినా మన దృష్టి ఒక నక్షత్రం ఉపరితలం వరకు సాగాలి. గుమిగూడినట్టు కనిపించే అనేక నక్షత్రాల నుంచి వెలువడే కాంతి కారణంగా ఆకాశం దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉండాలి. కానీ అలా కాకుండా రాత్రివేళల్లో చీకటిగా ఉంటోంది. ఎందుకు?

    ఈ ప్రశ్నకు వివరణ 20వ శతాబ్దంలో లార్డ్‌ కెల్విన్‌ అనే శాస్త్రవేత్త ఇవ్వగలిగాడు. ఆయన చెప్పేదాని ప్రకారం విశ్వం వయసు అనంతం కాదు. అత్యంత దూరాల్లో ఉన్న నక్షత్రాల నుంచి వెలువడే కాంతి ఇంకా మన కంటికి చేరకపోవడం వల్లనే రాత్రివేళల్లో ఆకాశం చీకటిగా ఉంటుందని సిద్ధాంతీకరించాడు. దీని ప్రకారం విశ్వంలో నక్షత్రాలు అనంత సంఖ్యలో ఉండడానికి వీలులేదు. నక్షత్రాలు త్వరగా ఏర్పడకపోవడమే కాకుండా, వాటి వెలుగు విశ్వమంతా వెలుగు నింపే వరకు జీవించి కూడా ఉండవు. ఆవిధంగా ఓల్‌బర్స్‌ వైరుధ్యానికి పరిష్కారం లభించినట్లయింది.

    -ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
    • ============================
    visit My website > Dr.Seshagirirao - MBBS.-

    Sunday, December 04, 2011

    అష్టైశ్వర్యాలు అంటే ఏవి?, What are the eight wealth items?

    ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

    అష్టైశ్వర్యాలు అంటే ఎనిమిది రకాల సంపదల్ని అర్ధము . పూర్వము రాజులకాలము లో ఉండేవేమో కాని ఇప్పుడు ఇవన్ని ఉన్నవారు అరుదు .
    1. దాసీజనము(పరిచారకుకు),
    2. భృత్యులు(శిష్యులు),
    3. పుత్రులు(బిడ్డలు ),
    4. మిత్రులు(స్నేహితులు),
    5. బంధువులు(చుట్టాలు),
    6. వాహనములు(కారు , మోటరు సైకిల్ , విమానము),
    7. ధనము(డబ్బు సంపద ),
    8. ధాన్యము(వస్తుసంపద)

    • =====================
    visit My website > Dr.Seshagirirao - MBBS.-

    Saturday, December 03, 2011

    What is Love?,ప్రేమ అంటే ఏమిటి?

    ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

    Q : What is Love?,ప్రేమ అంటే ఏమిటి?

    A : ప్రేమ అనేది అర్ధం చెప్పలేని అనుభూతి .. ఇది యవ్వనంలో ఉన్నవారి మధ్యే కాదు ఎవరికైనా కలుగుతుంది. సృష్టిలోని ప్రతి జీవి , మనిషి ప్రేమించగలగడం అనేది ఒక అద్భుతమైన వరం. కాని నేటి యువతరానికి ప్రేమ అంటే ఆకర్షణ, శారీరక సంబంధం అనుకుంటారు, అలనాటి పాత తరంలోని వారికి ప్రేమ అంటే ఒక బూతు మాట, అక్రమ సంబంధం అంటారు. కాని ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ, లవ్ అనేది అనిర్వచనీయమైనది. దానికి పరిమితులు, హద్దులు ఉండవు....ఇక వయసులో ఉన్నవారు ప్రేమలో పడితే వాళ్లకు అన్నీ అపురూపమే. చెలి/చెలికాడు తోడుంటే ప్రకృతి ఆంతా రమణీయమే.. ఈ విశ్వములో రెండు రకాల ప్రేమ ఉంది . ఒకటి స్వార్ధముతో కూడుకున్నది , రెండు నిస్వార్ధమైనది. ఒక్క తల్లిదండ్రులే తమ పిల్లలను (ఏమీ ఆశించకుండా) నిస్వార్ధముగా ప్రేమిస్తారు . మిగతా ప్రేమలన్ని ఏదో ఒక స్వార్ధముతో కూడుకున్నవే .

    దయమరియు అభిమానంతో కూడిన అనేక తీవ్రమైన భావాల మరియు అనుభవాలనే ప్రేమ అనవచ్చు. ప్రేమ అనే పదం విభిన్న భావాలను, స్థితులను, మరియు వైఖరులను, సాధారణ ఆనందం("నేను ఆ భోజనాన్ని ప్రేమించాను") నుండి తీవ్రమైన వ్యక్తిగత ఆకర్షణల("నేను నా బాయ్ ఫ్రెండ్ ను ప్రేమిస్తున్నాను") వరకు సూచిస్తుంది. ఈ విధంగా విభిన్నమైన ఉపయోగాలు మరియు అర్ధాల వలన, సంక్లిష్టమైన అనేక భావాలతో కలసి ఉన్నందువలన, ప్రేమని సాధారణంగా నిర్వచించడమే కాక ఇతర భావ స్థితులతో పోల్చడం కూడా కష్టసాద్యం.

    ఒక అమూర్త విషయంగా ప్రేమ అనేది మరొక వ్యక్తి కొరకు సున్నితంగా పదిల పరచుకొనే ఒక లోతైన, అవ్యక్తభావన. ప్రేమ యొక్క ఈ చిన్ని భావన కూడా, అనేక రకాల భావాల నిధిలోకే చేరుతుంది, తపనతో కూడిన కోరిక మరియు శృంగారభరిత ప్రేమ నుండి సెక్స్ తో సంబంధంలేని ఉద్వేగభరిత దగ్గరితనం యొక్క కుటుంబపరమైన మరియు ప్లేటోనిక్ ప్రేమ నుండి వేదాంతపరమైన ఏకత్వం లేక భక్తితో కూడిన మతపరమైన ప్రేమ వరకు... ప్రేమ దాని వివిధ రూపాల్లో వ్యక్తుల మధ్య సంబంధాల్లో ఒక ప్రధాన పాత్ర పోషించడమేకాక అనిశ్చితమైన మానసిక ప్రాముఖ్యతకు కేంద్రమవడం, సృజనాత్మక కళల్లో చాలా మామూలు మూలాల్లో ఒకటి.

    రసాయనిక మూలము-- ( Love scientific views)

    ఆకలి లేదా దప్పిక వలె ప్రేమను కూడా క్షీరదాలకు ఉండే ఒక భౌతిక అవసరంగా జీవశాస్త్ర నమూనాలు భావిస్తాయి. . ప్రేమ విషయ నిపుణుడైన హెలెన్ ఫిషర్, ప్రేమ అనుభవాలను అవిభాజ్యమైన మూడు అంచెలుగా విభజించారు: తీవ్రమైన శారీరక వాంఛ, ఆకర్షణ మరియు అనుబంధం. తీవ్రమైన శారీరక వాంఛ ప్రజలను ఇతరులకు బహిర్గతం చేస్తుంది; వూహాజనిత ఆకర్షణ జత కూడుట పట్ల వారి దృష్టి కేంద్రీకృతం అయ్యేలా చేస్తుంది; మరియు అనుబంధం భాగస్వామిని(లేక బిడ్డనయినా) భరించి, బిడ్డను శైశవం నుండి బాల్యదశ వరకు పెంచేంత దీర్ఘ కాలం కొనసాగుతుంది.

    జతకూడటాన్ని ప్రోత్సహించే ఆకర్షణీయ కోరికల యొక్క ప్రారంభ దశ అయిన తీవ్రమైన శారీరక వాంఛలో టెస్టోస్టెరోన్ మరియు ఈస్ట్రోజెన్ వంటి రసాయనాలు అధికంగా విడుదలౌతాయి. ఈ ప్రభావాలు కొన్ని వారాలు లేదా నెలలు మాత్రమే ఉంటాయి. ఆకర్షణ అనేది జతకూడుటకు ఒక ప్రత్యేక వ్యక్తి పట్ల వ్యక్తి పరమైన మరియు వూహాజనిత కోరిక, మరియు ఇది శారీరక వాంఛ నుంచి ఉద్భవించి జత కూడే వైఖరుల పట్ల నిబద్ధతను పెంచుతుంది. న్యూరో సైన్సులో ఇటీవల పరిశోధనలు, ప్రేమలో పడిన వ్యక్తి యొక్క మెదడు అమ్ఫిట మైన్స్ వలెనె పనిచేసే, మెదడు యొక్క ఆనంద కేంద్రాన్ని ఉత్తేజ పరచి, హృదయ స్పందనను పెంచి, నిద్రాహారాలను తగ్గించి, తీవ్రమైన ఉత్తేజాన్ని కలిగించే రసాయనాలైన ఫేరోమోన్స్, డోపమిన్, నోరేపిన్ఫ్రిన్, మరియు సరోటోనిన్, వంటి వాటిని విడుదల చేస్తుందని సూచించాయి. పరిశోధనలు ఈ దశ సాధారణంగా ఒకటిన్నర సంవత్సరం నుండి మూడు సంవత్సరాల వరకు ఉంటుందని సూచించాయి.

    శారీరకవాంఛ మరియు ఆకర్షణలు తాత్కాలికమైనవిగా భావించడం వలన, దీర్ఘకాలిక సంబంధాలకై మూడవదశ అవసరమైంది.అనుబంధం అనేది బంధాలను బలపర్చి అవి అనేక సంవత్సరాలు మరియు దశాబ్దాలపాటు కొనసాగేలా చేస్తుంది. అనుబంధం సాధారణంగా వివాహం మరియు పిల్లలు వంటి బాధ్యతలు లేక ఉమ్మడి అభిరుచులపై ఆధారపడిన పరస్పరస్నేహం వంటి వాటిపై ఆధార పడుతుంది. దీనిలో తాత్కాలిక అనుబంధాలలో కంటే ఎక్కువ స్థాయిలో ఆక్సిటోసిన్ మరియు వాసో ప్రెస్సిన్ వంటి ఉన్నత స్థాయి రసాయనాల విడుదలతో సంబంధం కలిగి ఉంటుంది. ప్రేమ యొక్క ప్రారంభ దశలో నెర్వ్ గ్రోత్ ఫాక్టర్ (ఎన్ జిఎఫ్) ప్రోటీన్ అణువు ఉచ్ఛదశలో ఉండి ఒక సంవత్సరం తరువాత తిరిగి పూర్వస్థాయికి వస్తుంది.

    • ============================
    visit My website > Dr.Seshagirirao - MBBS.-

    Wednesday, November 30, 2011

    శీతల రక్త జంతువులు అంటే ఏమిటి ?, What is Coldblooded Animals?

    ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

    Q : శీతల రక్త జంతువులు అంటే ఏమిటి ?.

    A : శీతల రక్త జంతువు లంటే ఆ జంతువుల రక్తము ఐస్ లాగా చల్లగా ఉంటుందని కాదు . .. ఆ జంతువులకు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకునే శక్తి ఉండదు . వాతావరణములో ఉష్ణోగ్రత మార్పును బట్టి వాటి శరీర ఉష్ణోగ్రత మారుతుంది . చేపలు ,కప్పలు , పాములు , బల్లులు వంటివి ఈ తరహా జీవులు .

    కప్పలు శీతల రక్త జంతువులు. అంటే వాతావరణంలో ఎంత ఉష్ణోగ్రత ఉంటే వాటి శరీరంలో అంతే ఉష్ణోగ్రత ఉంటుంది.

    పాము శీతల జంతువు. అంటే, చల్లని వాతావరణంలో శరీర ఉష్ణోగ్రత తక్కువగాను, వేడివాతావరణంలో శరీర ఉష్ణోగ్రత ఎక్కువగాను, ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ జీర్ణక్రియలోవేగం పెరుగుతుందని మనకు తెలిసిందే. ఈ విషయం పాముకు తెలుసు. అందుకే అది ఆహారం తీసుకున్న తరువాత వేడిఎక్కువ తగిలే ప్రాంతాలకు వెళ్లి విశ్రాంతి తీసుకుంటాయి శీతల రక్త జంతువుకదా అందుకని జీర్ణం కావలసిన ఆహారం వున్న భాగాన్ని మాత్రమే వేడితగిలే విధంగా వుంచి మిగిలిన భాగాన్ని బొరియలో వుంచుకుంటుంది.

    సైక్లోస్టొమేటా (Cyclostomata) కార్డేటా వర్గానికి చెందిన జీవులు శీతల రక్త జంతువులు. రక్తములో తెల్ల రక్తకణాలు మరియు కేంద్రక సహిత ఎర్ర రక్తకణాలు ఉంటాయి.

    పక్షులు , క్షీరదాలకు తమ శరీర ఉష్ణోగ్రత నియంత్రించుకునె శక్తి ఉంటుంది . ఉష్ణోగ్రగ మారినా ఈ జీవుల శరీర ఉష్ణోగ్రత స్థిరముగా ఉంటుంది .అందువల్ల వీటిని ఉష్ణ రక్త జంతువులు అంటారు. మానవులు ఉష్ణరక్త జీవులు .
    • =============================
    visit My website > Dr.Seshagirirao - MBBS.-

    Wednesday, November 23, 2011

    గుర్రం కూర్చోదేం? , Why do horse sit?

    ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

    ప్రశ్న: మిగతా జంతువుల్లాగా గుర్రం ఎందుకు నేల మీద కూర్చోదు?

    జవాబు: మామూలుగా ఆవు, మేక, గేదెలాంటి జంతువులు నేల మీద నాలుగు కాళ్లని ముడుచుకుని కూర్చుని సేద తీరడం చూస్తుంటాం. ఏనుగు, ఒంటెలాంటి పెద్ద జంతువులు కూడా అలాగే నేలపై కూర్చుంటాయి. అలా కూర్చోవడం ద్వారా అవి తమ కాళ్ల కండరాలకు విశ్రాంతిని ఇస్తాయి. కానీ గుర్రం అలా కనిపించదు. అది అతి వేగంగా పరిగెత్తగల జంతువు. వేగంతో పాటు అనేక కిలోమీటర్ల దూరం పరుగెత్తినా అలసిపోని శక్తి దాని సొంతం. దానికి కారణం దాని కాళ్లలోని కండరాలు చాలా బలంగా, దృఢంగా ఉండడమే. గుర్రం నులుచుని ఉన్నప్పుడు మూడు కాళ్లపైనే ఒకదాని తర్వాత ఒకటి మారుస్తూ దేహాన్ని నిలదొక్కుకోగల సామర్థ్యం ఉంది. అందువల్ల అది మిగతా జంతువుల లాగా తన కాళ్లను ముడుచుకుని కూర్చోవలసిన అవసరం లేదు. అంతేకాదు అది నిలబడి నిద్రపోగలదు కూడా. ఒకోసారి నేలపై పూర్తిగా ఒక పక్కకు ఒరిగి పడుకుంటుంది.

    - ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌.
    • ================================
    visit My website > Dr.Seshagirirao - MBBS.-

    మిరప తింటే కారమేల?, Why chilli hot on eating?

    ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

    ప్రశ్న: పచ్చి మిరపకాయను కానీ, ఎండు మిరపకాయను కానీ నమిలితే కారంగా ఎందుకు అనిపిస్తుంది?

    జవాబు: మన దేశంలో ఉండే మిరపను కాప్సికమ్‌ ఫ్రూటిసెన్స్‌ అంటారు. ఇది బంగాళా దుంపలు, వంకాయలు వంటి మొక్కలకు చెందిన పొలనేసీ కుటుంబానికి చెందినది. మిరపకాయల్లో కారానికి కారణం వాటి తోలు (peel), గింజలు, గుజ్జులో ఉండే కాప్సాసిన్‌ (capsaicin) అనే రసాయన ధాతువు. దీనితో పాటు మరికొన్ని రసాయనాలు కూడా జతకలవడం వల్ల మొత్తం మీద మిరప పచ్చిదైనా, ఎండుదైనా విపరీతమైన కారాన్ని రుచి చూపిస్తుంది. మిరపకాయలో బి-విటమిన్‌, సి-విటమిన్‌, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం లవణాలు కూడా కొద్ది మోతాదులో ఉంటాయి. ఎక్కువగా తీసుకుంటే పొట్టలో ఆమ్లత్వం, నోటి పుండ్లు రావడానికి ఆస్కారమున్నా, తగినంతగా వాడితే శరీరానికి ఔషధగుణాలు లభిస్తాయి. పచ్చిమిరపలో నీటి శాతం బాగా ఉండడం వల్ల కాప్సాసిన్‌ కరిగి అది వెంటనే నోటిలోని లాలాజలంతో కలవడంతో వెంటనే ఘాటు తెలిసిపోతుంది. ఎండు మిరప కాయలో నీటి శాతం తక్కువగా ఉండడం వల్ల కాప్సాసిన్‌ ప్రభావం కొన్ని సెకన్ల తర్వాతే తెలుస్తుంది.

    -ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

    ---------------------------------------------------------

    కారానికి మంటేల?/-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌,-వరంగల్‌; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞానవేదిక

    ప్రశ్న: కారం కళ్లలో పడితే కళ్లు మండి నీరు ఎందుకు కారుతుంది? కారం రసాయనిక నామం ఏమిటి?

    జవాబు: మిరప కాయల్లోను, కారంగా రుచించే ఇతర కూరగాయల్లోను ఆ ఘాటును కలిగించే ప్రధాన రసాయనం పేరు 'క్యాప్సాయిసిన్‌' (capsaicin). దీన్ని శాస్త్రీయంగా '8-మిథైల్‌-ఎన్‌-వ్యానిలైల్‌- 6- నోనీనమైడ్‌' (8-methyl-N- vanillyl-6-nonenamide) అంటారు. నిజానికి పచ్చిమిరపకాయలో కారాన్ని కలిగించే ఈ రసాయనం కన్నా, మన రుచికి ఇంపైన చక్కెరలు, పిండి పదార్థాలతో పాటు విటమిన్లు, లవణాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ప్రతి వంద గ్రాముల కారంలో రకాన్ని బట్టి ఈ రసాయనం నాలుగైదు గ్రాములకు మించకపోయినా, పిట్టకొంచెం కూత ఘనం అన్నట్టు దీని ప్రభావమే కళ్లు, చర్మం, ఇతర కణజాలంపై తీవ్రంగా ఉంటుంది. ఈ రసాయనం నాలుక మీద పడినా, కళ్లలాంటి మృదు చర్మ భాగాల మీద పడినా అక్కడున్న నాడీతంత్రులు తీవ్రంగా స్పందించి మెదడుకు సంకేతాల్ని పంపుతాయి. తద్వారా కంటిలో నీరు అసంకల్పిత ప్రతీకార చర్య (involuntary reaction) వల్ల స్రవిస్తుంది.

    • =============================================
    visit My website > Dr.Seshagirirao - MBBS.-

    Tuesday, November 22, 2011

    మురికి గుంటల్లో మందులెందుకు చల్లుతారు ? , Why do we sprinkle medical lotions in wastewater pits?

    ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
    ప్ర : మురికి గుంటల్లో మందులెందుకు చల్లుతారు ?

    జ : వర్షాకాలము లో మున్సిపాలిటీ సిబ్బంది మురికికాలువలు , గుంటలలో మందు చల్లి వెళుతుంటారు . అది దోమలను నివారించే చర్య . దోమల గుడ్లు , లార్వాలు నీటిపైన ఉంటాయి. లార్వాలు నీటిపొరను ఆధారం చేసుకుని లోపల వేలాడుతున్నా దాని గాలిగొట్టము పైకి తెరుచుకుని ఉంటుంది. మందు చల్లినపుడు అది నీటిమీద ఒక పొర మాదిరిగా ఏర్పడి లార్వాలకు గాలి అందకుండా చేస్తాయి. ఫలితముగా లార్వాలు చినిపోతాయి. చల్లే ఫినైల్ వాసనకు దోమలు మురికి గుంటలను చేరవు .
    • ====================================
    visit My website > Dr.Seshagirirao - MBBS.-

    Sunday, November 20, 2011

    రుద్దితే బాధ తగ్గుతుంది ఎందుకు ?, Rubbing lessen pain How?

    ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

    ప్ర : ఏధైనా దెబ్బతగిగి నొప్పి పెట్టగానే ఆ భాగాన్ని నెమందిగా రుద్దుతాం .ఆయింట్ మెంట్ రాసి రుద్దుతాం ... అలాచేయడం వల్ల బాధ కొంతవరకు తగ్గుతుంది .ఏలా?

    జ : దెబ్బ తగిలిన విషయము వెన్నెముక ద్వారా మెదడు కు చేరవేయబడుతుంది . తీనితో బాధ మొదలవుతుంది . ఆయింట్మెంట్ రుద్దినప్పుడు దీనిలోని పదార్దము మెదడుకు చేరవేయబడుతున్న బాధసంకేతకాలను అడ్డుకుంటాయి. అదేవిధముగా దెబ్బతగిలినచోట బిగుసుకున్న కండరాలను మర్దనతో రిలాక్స్ చేయగలుగుతాము . ఫలితంగా బాధతగ్గినట్లు అనిపిస్తుంది .
    • =================================
    visit My website > Dr.Seshagirirao - MBBS.-

    Monday, November 14, 2011

    అయస్కాంత ఫ్లక్స్‌ అంటే ఏమిటి?, What is Magnetic Flus?

    ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

    ప్రశ్న:అయస్కాంత ఫ్లక్స్‌ అంటే ఏమిటి?,

    - సిహెచ్‌. సాయికుమార్‌

    జవాబు: ఒక వస్తువును మరో వస్తువు ప్రభావితం చేసేందుకు రెండే పద్ధతులు ఉన్నాయి. ఒకటి ప్రత్యక్షంగా యాంత్రిక బంధాన్ని ఏర్పరుచుకోవడం. రెండు అవి ప్రదర్శించే క్షేత్ర ఫలితాల (field effects) ద్వారా ప్రభావితం కావడం. మనం సైకిల్‌ తొక్కినా, కలం పట్టుకుని రాసినా అది యాంత్రిక బంధమే అవుతుంది. కానీ ఎక్కడో 15 కోట్ల కిలోమీటర్లకు పైగా దూరంలో ఉండే సూర్యుడు తన చుట్టూ భూమిని తిప్పుకునేలా ప్రభావం కలిగించడం యాంత్రిక బంధం కాదు. అది గురుత్వ క్షేత్ర ఫలితం. అలాగే ఒక అయస్కాంతం మరో అయస్కాంతాలన్ని తాకకుండానే ప్రభావం చూపగలదు. ఇది అయస్కాంత క్షేత్ర బలం. యాంత్రిక బంధం లేకుండా ఒక వస్తువు మరో దానిపై ప్రభావం చూపుతోందంటే గురుత్వ, అయస్కాంత, విద్యుత్‌ క్షేత్రాల ప్రభావం ఉన్నట్టే. క్షేత్ర తీవ్రతను బలరేఖల (lines of force) ద్వారా పరిగణిస్తారు. నిర్ణీత వైశాల్యం నుంచి నిర్దిష్ట దిశలో ప్రసరించే క్షేత్ర బలరేఖల సంఖ్యను ఆ క్షేత్రపు ఫ్లక్స్‌ (flux) అంటారు.

    - ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
    • ====================================
    visit My website > Dr.Seshagirirao - MBBS.-

    గద్ద విన్యాసం ఎలా సాధ్యం?,How do eagle fly in the sky with out moving wings?

    ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

    ప్రశ్న: ఆకాశంలో అంత ఎత్తులో గద్ద రెక్కలాడించకుండా ఎలా ఎగరగలుగుతుంది?

    జవాబు: ఎండుటాకులు, దూదిపింజెలు, వెంట్రుకల లాంటి తేలికైన వస్తువులు గాలిలో తేలుతూ చాలా సేపు కింద పడకుండా ఉండడం తెలిసిందే. అదే రాయిలాంటి వస్తువులు పైనుంచి కిందకి తటాలున పడిపోవడం కూడా మనకు తెలుసు. ఎత్తు నుంచి కిందకి పడే వస్తువుపై గాలి వల్ల ఏర్పడే నిరోధక బలం పని చేస్తూ ఉంటుంది. దీని ప్రభావం ఆయా వస్తువుల సాంద్రత, పరిమాణం, బరువులాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. గద్ద విషయానికి వస్తే దాని రెక్కలు చాలా విశాలంగా ఉంటాయి. గద్ద పరిమాణం దాని బరువుతో పోలిస్తే చాలా ఎక్కువ. ప్యారాచూట్‌ కట్టుకున్నప్పుడు, గ్త్లెడర్‌ పట్టుకున్నప్పుడు మనుషులు ఎలాగైతే గాలిలో తేలుతూ ప్రయాణించగలరో గద్దకూడా అలా చేయగలదు. గద్ద ఆకాశంలోకి ఎగరడానికి మామూలుగానే రెక్కలు ఆడించినా, పైకి వెళ్లాక రెక్కలను విశాలంగా చాపి గాలి నిరోధాన్ని, గాలి వేగాన్ని ఉపయోగించుకుని బ్యాలన్స్‌ చేసుకుంటూ తన శక్తిని ఆదా చేసుకుంటుంది. మరింత ఎత్తుకు ఎగరాలంటే మాత్రం రెక్కలు అల్లల్లాడించవలసిందే.

    -ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
    • ===================================
    visit My website > Dr.Seshagirirao - MBBS.-

    Wednesday, November 09, 2011

    How is Cyclone forming ?, తుఫాన్‌ ఎలా ఏర్పడుతుంది?

    ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

    ప్ర : తుఫాన్‌ ఎలా ఏర్పడుతుంది? How is Cyclone forming ?, తుఫాన్‌ ఎలా ఏర్పడుతుంది?

    జ : అక్టోబరు - నవంబరు నెలలు వచ్చే సరికి తుఫాన్లు వస్తాయేమోనన్న భయం మన రాస్ట్రములో ఉంటుంది . అతి వేగముతో గాలులు , భారీ వర్షాలు తీవ్రనస్టాన్ని కలిగిస్తాయి. ఇది ప్రతిఏటా జరుగుతునే ఉంటుంది .

    భూగోళము మీద అన్నిప్రాంతాలూ ఒకేలా ఉండక ఎత్తుపల్లాలు కల్గిఉన్నట్లే గాలిలో పీడనపరంగా అక్కడక్కడా అల్పపీడనము గల ప్రాంతాలు ఏర్పడతాయి. పల్లపు ప్రాంతాలలోకి నీరు ప్రవహించినట్లే అల్పపీడనము ప్రాంతాలాలోకి అన్నిదిక్కుల నుండి గాలి అతివేగంగా వీస్తుంది . అలా ఏర్పడిన వాయుగుండము సుడులు తురుగుతూ వేగం పుంజుకుని తీరము వైపు పయనిస్తుంది . వాతారణములోని తేమ భూమిపైనున్న చల్లని ప్రదేశాలకు తాకి వర్షముగా కురుస్తుంది . వేగము గా వీచే గాలితోకూడిన వర్షమే తుఫాను (cyclone).
    • ============================================
    visit My website > Dr.Seshagirirao - MBBS.

    బావి నీరు వెచ్చనేల?, Well water is warm-Why?

    ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

    ప్రశ్న: చలికాలంలో కూడా బావిలో నీరు వెచ్చగా ఎలా ఉంటుంది?

    - నీలిశెట్టి సుబ్బారావు,

    7వ తరగతి, కనిగిరి (ప్రకాశం)
    జవాబు: వేడిని గ్రహించడంలో రకరకాల పదార్థాలు వేర్వేరు లక్షణాలను చూపిస్తాయి. అలా చూసినప్పుడు నీరు భూమి కన్నా నిదానంగా వేడెక్కుతుంది. అలాగే నిదానంగా చల్లారుతుంది. ఏదైనా ఒక గ్రాము పదార్థం, ఒక డిగ్రీ సెంటిగ్రేడు ఉష్ణోగ్రత పెరగడానికి కావలసిన వేడిని విశిష్టోష్ణము అంటారు. ఇది నీటికి ఎక్కువ. చలికాలంలో మన చుట్టూ పరిసరాలలో ఉండే గాలి చల్లగా ఉంటుంది. ఇందువల్ల బావి ఉపరితలంలోని నీరు తనలోని ఉష్ణాన్ని పరిసరాలకు ఇవ్వడం ద్వారా చల్లబడుతుంది. అలా చల్లబడిన నీటి సాంద్రత పెరుగుతుంది. అందువల్ల చల్లబడిన నీరు బావి కింది వైపు చేరుతుంది. అదే సమయంలో బావిలోపలి పొరల్లో ఉండే వెచ్చని నీటి సాంద్రత తక్కువ కాబట్టి అది పైకి చేరుకుంటుంది. ఈ ప్రక్రియనే ఉష్ణ సంవహన (convection) క్రియ అంటారు. బావిలో నీరు ఎక్కువగా ఉండడం, ఈ ప్రక్రియ చాలా నిదానంగా జరగడం వల్ల బావిలోని నీరంతా పూర్తిగా చల్లబడిపోయే పరిస్థితి ఉండదు. అందువల్లనే బావి నీరు చలికాలంలో వెచ్చగాను, వేసవిలో చల్లగాను ఉంటుంది.

    - ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
    • =========================================
    visit My website > Dr.Seshagirirao - MBBS.

    Sunday, November 06, 2011

    భూమి వేగానికి పడిపోమేం?,Why donot we fall due to Earth speed?

    • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

    ప్రశ్న: భూమి గుండ్రంగా ఉండి పడమర నుంచి తూర్పునకు వేగంగా తిరుగుతోంది కదా! మరి మనం పడిపోమెందుకు?

    జవాబు: భూమి తన చుట్టూ తాను గంటకు 1620 కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది. కానీ ఆ చలనం మనకు కొంచెం కూడా తెలియదు.కారణంభూమిసమవేగంతో(uniform)తిరగడమే. మనం సమవేగంతో సరళమార్గంలో వెళుతున్న రైలుబండిలో ఉన్నామనుకోండి. బయటి దృశ్యాలు కనిపించకుండా బోగీల తలుపులు, కిటికీలు మూసేసి కూర్చుంటే అది కదులుతోందో లేదో కనిపెట్టలేము. ఆగి ఉన్న రైలుకు, సమవేగంతో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళుతున్న రైలుకు తేడా ఏమీ ఉండదు. అయితే రైలు సరళమార్గం నుంచి మలుపు తిరిగితే మాత్రం మన శరీరం పక్కకు ఒరగడం వల్ల రైలు గమనాన్ని అనుభూతి చెందగలం.

    తన చుట్టూ తాను తిరిగే భూమి కదలిక సమంగా, ఒడిదుడుకులు లేకుండా నిరంతరాయంగా ఉండడం వల్ల మనకు దాని చలనం మనకు అనుభవంలోకి రాదు. భూమి సమవేగంతో పయనిస్తున్నా, సరళమార్గంలో కాకుండా వంపుగా ఉన్న మార్గంలో తిరుగుతున్న విషయం తెలిసిందే. ఆ కారణంగా మనం ఆ వంపుగా ఉండే కేంద్రం నుంచి దూరంగా పడాలి కానీ అలా జరగడం లేదు. దానికి కారణం భూమి పరిమాణమే. భూమి ఎంత పెద్దగా ఉంటుందంటే, దాని పరిభ్రమణంలోని వంపు ఒక్కసారిగా, తటాలున మారకుండా క్రమేపీ కొంచెం కొంచెంగా మారుతుంది. ఆ మలుపు చాలా వరకు సరళ మార్గంలోనే ఉంటుంది. అందువల్ల మనపై పనిచేసే బాహ్యబలం అత్యంత స్వల్పంగా ఉంటుంది. కాబట్టే భూమి పరిభ్రమిస్తున్నా, మనం కిందపడం.

    -ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
    • ========================================
    visit My website > Dr.Seshagirirao - MBBS.

    ఎమెమ్మెస్‌ అంటే ఏమిటి?,What is ment by M.M.S ?

    ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

    ప్రశ్న: సెల్‌ఫోన్లకు సంబంధించి తరచు ఎమ్‌.ఎమ్‌.ఎస్‌. అనే మాటను వింటాము. ఏమిటి దానర్థం?

    -అను, రేపల్లె (గుంటూరు)

    జవాబు : సెల్‌ఫోన్‌ ద్వారా సమాచారాన్ని క్లుప్తంగా పంపే విధానాన్ని ఎస్‌.ఎమ్‌.ఎస్‌. అంటారు. అంటే షార్ట్‌ మెస్సేజ్‌ సర్వీస్‌ అని అర్థం. కేవలం టెక్ట్స్‌ సమాచారమే కాకుండా బొమ్మలు, ఫొటోలు, పాటల్ని, వీడియోలతో కలిపేలా సందేశాన్ని పంపడాన్నే ఎమ్‌.ఎమ్‌.ఎస్‌. అంటారు. కంప్యూటర్‌ పరిభాషలో దీన్ని మల్టీమీడియా మెస్సేజ్‌ సర్వీస్‌ అంటారు. అయితే ఎమెమ్మెస్‌ పంపాలంటే సెల్‌ఫోన్లలో ప్రత్యేక సదుపాయం ఉండాలి. ఇలాంటి సందేశాలను పంపినందుకు సెల్‌ఫోన్‌ కంపెనీలు కొంత రుసుమును వసూలు చేస్తాయి. ఎసెమ్మెస్‌, ఎమెమ్మెస్‌ల పేర్లలోనే కాకుండా సెల్‌ఫోన్లలో సమాచారం సంకేతాలుగా మారే ప్రక్రియలో కూడా తేడా ఉంటుంది.

    -ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌,-వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక.
    • ==================================
    visit My website > Dr.Seshagirirao - MBBS.

    భావాలు కలగడమేల?,Why do we get feelings in Life?

    ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

    ప్రశ్న: మనకు బాధ, కోపం వంటి భావనలు ఎందుకు కలుగుతాయి?,Why do we get feelings of angry and laughter?

    -జానపాటి శ్రీనివాస్‌, మిర్యాలగూడ (నల్గొండ)

    జవాబు: జీవికి ఆహారం, గాలి, నీరు ప్రధాన అవసరాలు. పరిణతి చెందిన మానవులు లాంటి కొన్ని జీవులు సమూహాలుగా నివసిస్తాయి. మానవ సమూహాన్ని సమాజం అంటాము. మానవుడికి ప్రకృతి సహజమైన ప్రాథమిక అవసరాలతో పాటు స్నేహం, బృందభావన, పరిశీలన, పరిశోధన, ఆలోచన వంటి భావ పరమైన అంశాలు కూడా ఉన్నాయి. సంఘజీవిగా మనిషి ఎదిగే క్రమంలో తనకు ఇష్టమైన, ఇష్టం లేని సంఘటనలను గుర్తించాడు. వాటికి అనుగుణంగా శరీరంలో మార్పులు కలగడం గమనించాడు. శరీరంలో అవాంఛనీయ నాడీ ప్రకంపనలను కలిగించేది దుఃఖంగాను, ఆరోగ్య ప్రకంపనలను బలోపేతం చేసే భావాలను సంతోషంగాను వైద్యశాస్త్రం చెబుతుంది. భావాలు కలగడానికి కారణం మెదడులో ఉత్పన్నమయ్యే కొన్ని రకాల రసాయనాలేనని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటికి అనుగుణంగా నవ్వు, ఏడుపు, చెమటలు పట్టడం, శరీరం వణకడం, గొంతు గాద్గదికం కావడం లాంటి బాహ్య ప్రకటనలు కలుగుతాయి. ఒంటరిగా అడవిలో పెరిగే వ్యక్తికి కోపం, నవ్వువంటి భావాలు కలగవని రుజువైంది. సామాజిక జీవనమే భావప్రకటనలను శరీరానికి అలవాటు చేస్తుంది.

    -ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌,--వరంగల్‌; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞానవేదిక.
    • ===================================
    visit My website > Dr.Seshagirirao - MBBS.

    Wednesday, October 26, 2011

    దీపావళి వెనుక నిజాల వెలుగులు తెలుసా?,దీపావళి బాణసంచా కథలు-రికార్డులు ,What are the stories behing Diwali?

    • Courtesy with Eenadu news paper

    ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

    దీపావళి అంటే ఎంత సరదానో! మరి సరదా వెనుక నిజాల వెలుగులు తెలుసా? బాణసంచా కథలు, రికార్డులు విన్నారా?
    అసలు బాణసంచా ఎక్కడ పుట్టిందో తెలుసా? చైనాలో. దీని వెనకాల రెండు కథలున్నాయి. చాలాకాలం క్రితం చైనాలోని హునాన్‌ ప్రాంతంలో లీ టియస్‌ అనే సాధువు కొన్ని రసాయనాల్ని కలిపి విచిత్రమైన మంటలు తెప్పించాడట. అవే టపాసులన్నమాట. ఆ సాధువుకు అక్కడ ఒక గుడి కూడా కట్టారు. ఏటా ఏప్రిల్‌ 18 ఆయనకు పూజలు చేసి బోలెడు టపాసులు కాలుస్తారు.
    మరో కథ ప్రకారం 2000 ఏళ్లక్రితం చైనాలో ఓ వంటవాడు మూడు రకాల పొడులను వేడి చేస్తున్నప్పుడు నిప్పురవ్వ పడి పెద్దగా మెరుపులు చిమ్ముతూ మండిపోయింది. అతడు వాడిన గంధకం, బొగ్గుపొడి, ఒక రకమైన లవణాలను ప్రాచీన చైనీయులు వెదురుబొంగుల్లో కూరి మంటల్లో పడేస్తే 'ఢాంఢాం' అని పేలేది. ఇప్పటికీ టపాసుల తయారీలో ఆ మిశ్రమాన్నే వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా బాణాసంచా ఎక్కువ ఉత్పత్తి చేసే దేశం కూడా అదే.

    దివాళీ నగర్‌
    దివాళీ నగర్‌ అనగానే మన దేశంలోని వీధి పేరో, ఊరి పేరో అనుకుంటున్నారా? కాదు, కరీబియన్‌ దీవిలో ఉన్న ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో దేశంలోని ఒక ప్రాంతం పేరు. ఇక్కడ 13 లక్షల మంది మన దేశస్థులే. వారందరి కోసం దీపావళిని సెలవు దినంగా ప్రకటించారు. ఇక్కడ 1986 నుంచి దీపావళి సంబరాలు నిర్వహిస్తున్నారు. వారికోసం ప్రభుత్వం కొంత ప్రాంతాన్ని దివాళీ నగర్‌ పేరుతో ఏర్పాటు చేసింది. ఏటా పండగ కోసం కోట్ల రూపాయల విరాళాలు కూడా అందుతాయి.

    బంగారు తళుకులు!
    అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయం తెలుసుగా? బంగారు పూతతో ధగధగలాడే ఆ ఆలయం దీపావళి నాడు మరింత వెలుగులీనుతుంది. సిక్కులు దీపావళి జరుపుకోవడానికి ఒక ప్రత్యేకత ఉంది. మొఘల్‌ చక్రవర్తి జహంగీర్‌ సిక్కుల ఆరో గురువైన గురు హర్‌గోవింద్‌ సాహిబ్‌తోపాటు 52 మంది రాజులను ఓసారి చెరసాల్లో బంధిస్తాడు. వారిలో గురువును మాత్రం విడుదల చేయడానికి ఒప్పుకుంటాడు.తనతోపాటు రాజులందర్నీ విడుదల చేస్తేనే బయటకు వెళతానని గురువు పట్టుబడతాడు. దాంతో దీపావళి రోజు అందర్నీ విడుదల చేస్తారు. వాళ్లంతా గోల్డెన్‌ టెంపుల్‌కు వచ్చి వేడుకలు జరుపుకుంటారు. స్వర్ణ దేవాలయం నిర్మాణానికి 1577లో పునాది రాయిని వేసింది దీపావళి రోజునే.

    ఢాంఢాం రికార్డులు!
    *మాల్టా మక్బాలో 2011 జూన్‌లో అతి పెద్ద విష్ణు చక్రాన్ని కాల్చి రికార్డు సృషించారు. దీని చుట్టు కొలత 105 అడుగులు.
    * ఫిలిప్పీన్స్‌లో గతేడాది 30 సెకన్లలో 1,25,801 తారాజువ్వల్ని వెలిగించడం గిన్నిస్‌ రికార్డు.
    * ఇంగ్లండ్‌లో 2009లో 6.5 సెకన్లలో 1,10,000 రకాల బాణసంచా కాల్చారు.
    *జపాన్‌లో అతి పెద్ద చిచ్చుబుడ్డిని 54.7 అంగుళాల వ్యాసం, 750 కిలోలతో తయారు చేశారు.
    *చైనాలో 2007లో 13 కిలోమీటర్ల పొడవునా టపాసులను పరిచి కాల్చారు. ఇందుకోసం పది లక్షల డాలర్లని ఖర్చుపెట్టారు.
    వూరంతా టపాసులే!
    మనం కాల్చే టపాసులు ఎక్కడ తయారవుతాయో తెలుసా? తమిళనాడులోని శివకాశిలో. దేశంలో అమ్ముడయ్యే బాణసంచాలో 95 శాతం అక్కడే తయారవుతాయి. సుమారు 8000 టపాసుల పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో ఉపాధి పొందేవారు 4 లక్షలపైనే! ఏటా సుమారు రూ. 600 కోట్ల వ్యాపారం జరుగుతోంది. ప్రపంచంలో ఎక్కువ టపాసుల్ని కాల్చే అతి పెద్ద పండగ మన దీపావళే. ప్రపంచవ్యాప్తంగా ఏటా 10వేల కోట్ల రూపాయల బాణసంచా వ్యాపారం జరుగుతోంది.
    ఒక్కో చోట ఒక్కోలా...
    *దీపావళి పండుగను బెంగాల్లో మహానిష అని పిలుస్తారు. కాళికా దేవిని పూజిస్తారు.
    *బీహార్‌ గ్రామాల్లో యువకులు ధాన్యం, గడ్డిలను ఒక గంపలో వేసుకుని ఊరంతా తిరుగుతారు.
    *మహారాష్ట్రలో యముడికి పూజలు చేసే సంప్రదాయం ఉంది.
    *రాజస్థాన్‌లో పిల్లిని అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. ప్రత్యేక ఆహారాన్ని తయారు చేసి పిల్లులకు పెడతారు.
    *ఇతర దేశాల విషయానికి వస్తే సింగపూర్‌, మలేషియాలో అధికారిక సెలవు దినం. అమెరికా అధ్యక్ష భవనంలో కూడా దీపావళి పండగను చేస్తారు. వేడుకల్లో పాల్గొన్న తొలి అధ్యక్షుడు బరాక్‌ ఒబామానే!
    *జైన మతాన్ని స్థాపించిన మహావీరుడు దీపావళి రోజునే నిర్యాణం చెందినట్టు చెబుతారు. ఆయన జ్ఞాపకార్థం జైనులు ఈరోజు ప్రార్థనలు చేస్తారు.

    రంగులు ఇలా...
    బాణసంచా కాలిస్తే బోలెడేసి రంగులు వస్తాయి. అవన్నీ రకరకాల రసాయనాల వల్ల ఏర్పడతాయి. అల్యూమినియం, టిటానియం వల్ల వెండి రంగు, బేరియంతో ఆకుపచ్చ, కాల్ఫియం వల్ల కాషాయం, కాపర్‌ వల్ల నీలం, మెగ్నీషియం వల్ల తెలుపు, సోడియం వల్ల పసుపు, స్ట్రోన్టియమ్‌తో ఎరుపు రంగులు ఏర్పడతాయి.

    దీపావళి కథలు--
    • * రావణసురునితో జరిపిన యుద్ధంలో విజయం పొందిన శ్రీరామచంద్రుడు సతీసమేతంగా అయోధ్యకు విచ్చేస్తాడు. ఆరోజు అమావాస్య... అయోధ్య అంతా చీకట్లతో నిండి ఉంటుంది. దాంతో శ్రీరామునికి స్వాగతం పలికేందుకుఅయోధ్యావాసులు దీపాలను వెలిగించి అమావాస్య చీకట్లను పారద్రోలుతారు. ఆనాటి నుంచి దీపావళి పండుగనుమనం జరుపుకుంటున్నాం.
    * ఇక రెండవ కథగా నరకాసుర సంహారాన్ని చెప్పుకుందాం. ప్రాద్యోషపురానికి రాజు నరకాసురుడు. బ్రహ్మదేవుని నుంచిపొందిన వరగర్వంతో నరకాసురుడు దేవతలను, మహర్షులను నానా ఇబ్బందులు పెడుతుంటాడు. నరకాసురునిఆగడాలు శృతిమించడంతో సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరిస్తాడు. నరకాసురుని పీడవిరగడవ్వడంతో ప్రజలు దీపాలు వెలిగించి పండుగను జరుపుకున్నారు. ఆ పరంపర నేటికీ కొనసాగుతున్నది.
    • * మూడవ కథగా పాల సముద్రం నుంచి శ్రీమహాలక్ష్మిదేవి ఉద్భవించిన వృత్తాంతాన్ని తెలుసుకుందాం. మరణాన్ని దరిచేర్చని అమృతం కోసం దేవదానవులు పాల సముద్రాన్ని చిలుకుతుండగా ఈ రోజు లక్ష్మిదేవి ఉద్భవించింది. సకలఅష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి దీపావళి నాటి సాయంత్రం హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు.
    * నాలుగవ కథగా... భారతంలోని ఇతివృత్తాన్ని చెప్పుకుందాం. కౌరవులు సాగించిన మాయాజూదంలో ఓడిన పాండవులుపదమూడేళ్ళు వనవాసం, ఒక సంవత్సర కాలం అజ్ఞాత వాసం సాగించి తమ రాజ్యానికి తిరిగి వస్తారు. ఆ సందర్భంగాప్రజలు దీపాలు వెలిగించి వారికి స్వాగతం పలుకుతారు.
    • * ఇక చివరిదైన ఐదవ వృత్తాంతంగా మన రైతుల గురించి తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాలలో పంట చేతికి వచ్చేసందర్భాన్ని పురస్కరించుకుని అన్నదాతలు దీపావళి పండుగను చేసుకుంటారు. మంచి పంట దిగుబడినిఅందించినందుకు ఇష్టదైవానికి కృతజ్ఞతగా ప్రత్యేక పూజలు చేసి పండుగ జరుపుకుంటారు.

    • ====================================
    visit My website > Dr.Seshagirirao - MBBS.

    Tuesday, October 25, 2011

    నూనె నీళ్లలో కలిసినప్పుడు రంగురంగుల వలయాలు ఏర్పడతాయెందుకు ?,When water mix with Oil colors formed-Why?

    ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

    ప్రశ్న: నూనె నీళ్లలో కలిసినప్పుడు రంగురంగుల వలయాలు ఏర్పడతాయి. ఎందుకు?

    -ఆర్‌. అభిరామ్‌, పాల్వంచ (ఖమ్మం)

    జవాబు: నూనె నీళ్లపై ఒక పొరలాగా ఏర్పడి తేలుతుంది. నూనె సాంద్రత, నీటి సాంద్రత కన్నా తక్కువ కావడమే ఇందుకు కారణం. అలా పరుచుకునే నూనె పొర మధ్య భాగం ఉబ్బెత్తుగాను, చివర్లలో పలుచగానూ ఉంటుంది. దీని మీద పడే సూర్యకిరణాలు నూనె పొర నుంచే కాక, దానికి నీటికి మధ్య ఉండే తలం నుంచి కూడా పరావర్తనం (reflection)చెందుతాయి. రెండు తలాల నుంచి పరావర్తనం చెందే ఈ కిరణాలు పయనించే దూరంలో కొంత తేడా ఉంటుంది. దీనిని పథాంతరం (path defference) అంటారు. కాంతి తరంగ రూపంలో ఉంటుంది కదా. నూనె, నీటి పొరల మీద పడిన కాంతి తరంగాలు ఒకదానితో మరొకటి వ్యతికరణం (interference)చెందుతాయి. అందువల్ల సూర్యకాంతిలోని రంగులు పథాంతరాన్ని బట్టి మన కంటికి వలయాలుగా కనిపిస్తాయి.

    -ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
    • ====================================
    visit My website > Dr.Seshagirirao - MBBS.