Sunday, March 27, 2011

ఆహారము తీసుకునేముందు దైవప్రార్ధన చెయ్యడం ఎందుకు ?,Why some pray God before meals?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ఫ్ర : ఆహారము తీసుకునేముందు దైవప్రార్ధన చెయ్యడం ఎందుకు ?.
జ : ధ్యాన మంత్రాలకు , మంత్రాక్షరాలకు అపూర్వమైన శక్తి ఉందని మన పూర్వీకుల నమ్మకం . హిందువులైతే " అన్నమో పరబ్రహ్మ: " అనేవారు . ఆహారము మన శరీరానికి శక్తి నిస్తుంది . దేవుడనగానే 'సుచి ,శుబ్రత' పాటిస్తాము . కలుషిత ఆహారము అయినా మంచి ఆహారము అయినా ... దైవ ప్రసాదము గా భావించి ప్రార్ధన అనే ఆచార నియమము ద్వారా శుబ్రం చేయడం జరుగుతుంది . కొంతైనా ఆహారాన్ని అమృతమయం చేసేందుకే ఈ ప్రార్ధన. ప్రార్ధన మూలాన ఇంటిల్ల పాది ఒకేసారి కలిసి బుజించడం జరుగుతూ ఉంటుంది . ఇది ఆరోగ్యానికి చాలా మంచిది .
  • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...