Thursday, April 07, 2011

గాలితో కారు నడిచేదెలా?,How do a car run by air?


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.








ప్రశ్న: కేవలం గాలిని ఉపయోగించి కారుని నడిపారని పత్రికల్లో చదివాను. ఇదెలా సాధ్యం?

జవాబు: సాధారణంగా వాహనాలు పెట్రోలు, డీజిల్‌ లాంటి ఇంధనాలలోని రసాయనిక శక్తిని తమ అంతర్దహన యంత్రాంగం (internal combustion mechanism) ద్వారా యాంత్రిక శక్తిగా మార్చుకుని పని చేస్తాయి. ఈమధ్య వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రత్యామ్నాయ యాంత్రిక పద్ధతుల్లో వాహనాలను నడిపే ప్రక్రియలను ప్రోత్సహిస్తున్నారు. అలాంటివే ఈ వాయు చోదక వాహనాలు. మామూలు గాలిని ప్రత్యేక మోటార్ల ద్వారా సిలండర్లలో అధిక పీడనంతో నింపుతారు. వీటి మూతులకు ప్రత్యేకమైన రెగ్యులేటర్లను అమర్చడం ద్వారా కావలసిన పీడనం, వేగాలతో బయటకి పంపే ఏర్పాటు ఉంటుంది. ఇలా అత్యధిక ఒత్తిడితో బయటకి వచ్చే గాలి టర్బైన్‌ను తిప్పే విధంగా అమరిక ఉంటుంది. అంటే వాయుశక్తి యాంత్రిక శక్తిగా మారుతోందన్నమాట. ఈ టర్బైన్‌కు అనుసంధానంగా చక్రాల ఇరుసులను అమర్చడం వల్ల అవి తిరిగి కారు ముందుకు కదులుతుంది. ఇలాంటి ఇంజిన్లను వాయుచలన యంత్రాలు (Pneumatic engines) అంటారు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞాన వేదిక

  • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...