Saturday, April 30, 2011

నవ్వు నాలుగు విధాల చేటు అంటే ఏమిటి ? , What do we say Laugh is bad by 4 ways?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ఫ్ర :నవ్వు నాలుగు విధాల చేటు అంటే ఏమిటి ? .

జ : నవ్వకూడని సందర్భాలు , నవ్వే సందర్భాలూ చూసుకొని నవ్వాలని దాని పరమార్ధము .
  1. ఆవేదనతో తనకు జరిగిన అవమానాన్ని పంచుకుంటున్నప్పుడు నవ్వకూడదు .
  2. అన్నిరకాలుగా ఓడిపోయినవాడిని , అవమానభారముతో వెళ్ళిపోతున్న వాడిని చూసి నవ్వకూడదు .
  3. ముఖపరిచమున్న స్త్రీని చూసి పురుషుడు పలకరింపుగానే నవ్వాలిగాని అతిగా నవ్వకూడదు . వివాహమైన పరస్త్రీ , పరపురుషులు ...ఒకరితో నొకరు నవ్వులాటలాడుకోకూడదు . . అది పురుషుని కన్న స్త్రీ కే అవమానము తెచ్చిపెడుతుంది .
  4. గురువులవద్దా , పూజాదికాలసమయాలలో అధికంగాను , గట్టిగాను నవ్వకూడదు ...చిరునవ్వుతోనే పలుకరించుకోవాలి .

  • ============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...