Thursday, May 19, 2011

కాలం గడిచే కొద్దీ సూర్యుడి బరువు తగ్గుతుందా?, Does the Sun loosing weitht daily?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.


ప్రశ్న: కాలం గడిచే కొద్దీ సూర్యుడి బరువు తగ్గుతుందా?

-కె. స్వప్న, 9వ తరగతి, మహబూబ్‌నగర్‌

జవాబు:
సూర్యునిలో ప్రతి సెకనుకు 700 మిలియన్‌ టన్నుల హైడ్రోజన్‌ రూపాంతరం చెంది హీలియంగా మారుతుంటుంది. ఫలితంగా కాలం గడిచే కొద్దీ సూర్యుని ద్రవ్యరాశి (mass) తగ్గి తేలికవుతాడు. సూర్యుని అంతరాల్లో జరిగే కేంద్రక సంయోగ చర్య (nuclear fusion) ద్వారా నాలుగు హైడ్రోజన్‌ పరమాణువులు ఒక హీలియం పరమాణువుగా మారుతుంటాయి. ఈ ఒక్క హీలియం పరమాణువు ద్రవ్యరాశి, నాలుగు హైడ్రోజన్‌ పరమాణువుల ద్రవ్యరాశి కన్నా తక్కువ.అంటే హైడ్రోజన్‌ పరమాణువులు కోల్పోయే ద్రవ్యరాశి శక్తిగా మారుతోందన్నమాట. ఇలా ద్రవ్యం, శక్తిగా మారడాన్ని ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ రూపొందించిన E=mc సమీకరణం ద్వారా లెక్క కట్టవచ్చు. ఇక్కడ m కోల్పోయిన ద్రవ్యరాశి అయితే, c శూన్యంలో కాంతి వేగం. ఆ విధంగా ప్రతి సెకనుకు సూర్యుడు ఐదు మిలియన్‌ టన్నుల బరువు తగ్గిపోతున్నాడు. ఇది మనకు పెద్ద పరిమాణంగా అనిపించినా, సూర్యుని జీవిత కాలంతో పోలిస్తే ఇది దాని ద్రవ్యరాశిలో 0.01 శాతం మాత్రమే!

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌.

  • =================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...