Friday, June 10, 2011

సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పూర్తయిన తర్వాత అలా ఉంచేస్తే ఏమవుతుంది?,What happen to cellphone if continue pluged-in after charging?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.


ప్రశ్న:సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పూర్తయిన తర్వాత కూడా ప్లగ్‌లోంచి తీయకుండా అలాగే ఉంచేస్తే ఏమవుతుంది?

-పి. జాన్‌ ప్రశాంత్‌సాగర్‌, హైదరాబాద్‌

జవాబు: సెల్‌ఫోన్లలో వాడే బ్యాటరీని రీఛార్జబుల్‌ బ్యాటరీ అంటారు. అందులో సాధారణంగా లిథియంను వాడతారు. ఛార్జింగ్‌ అయిపోయిన తర్వాత కూడా అలాగే ఉంచేస్తే పెద్దగా ప్రమాదం ఉండకపోయినా, బ్యాటరీ వేడెక్కి తన జీవితకాలాన్ని కోల్పోతుంది. కొన్ని నాసిరకం బ్యాటరీలైతే ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదు. కాబట్టి సెల్‌ఫోన్‌కు రాత్రిళ్లు ఛార్జింగ్‌ పెట్టి నిద్రలోకి జారిపోవడం మంచిది కాదు. ఛార్జింగ్‌ అయిపోగానే ఛార్జర్‌ నుంచి సెల్‌ను, ప్లగ్‌ నుంచి ఛార్జర్‌ పిన్నును కూడా తొలగించడం మంచిది. కొన్ని కొత్త మొబైల్స్‌లో ఛార్జింగ్‌ అయిపోగానే సర్క్యూట్‌ బ్రేక్‌ అయ్యే సదుపాయం ఉంది.

- ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • =============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...