Tuesday, June 14, 2011

పాంచజన్యము అంటే ఏమిటి? , What is panchajanya in hindu epics?


  • https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjJ_XzR0Jiz2G7-0wewQSQcpqFWSytuANOXrGCgNxV0bUe8-gF4cCFuRhXN8UZB29p4zLPgfnnkiNeD07oaQ9_V4y3z2X1YnhuF23JzWZu08wGi532F6z_DaBTUxA2XaQh0MVx_j0dhmbyw/s1600/Conch_drawing.jpg




ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

పాంచజన్యము శ్రీకృష్ణుని శంఖము పేరు . ధర్మరాజు పాండవులలో అగ్రజుడు , ధర్మపుత్రుడు . యుధిస్ఠిరుడు అని ఆయనకు నామాంతరములు . ఆయన చేతిలోని శంఖమునకు " అనంత విజయ" అని పేరు . అంటే అంతులేని భటులను జయించేదని అర్ధము . అర్జునిని చేతిలోఉన్న శంఖమునకు " దేవదత్తము అని పేరు . భీముని శంఖము " పౌండ్రము " నకులుని శంఖము " సుఘోషము " అని పేరు .సహదేవుని శంఖము పేరు " మణి పుష్పకము " అని పేరు . కురుక్షేత్ర యుద్ధము లో అందరూ తమతమ శంఖములను పూరించినారు . ఐదుగురి చేతులలో ఐదు శంఖాలు . శ్రీకృష్ణ పరమాత్మ ఆరవవాడు ... ఆయన శంఖము పాంచజన్యము . . . ఈ ఐదుగురి శంఖములతో సమానము పాంచజన్యము .

చేపలవలె నీటిలో ఉండే ప్రాణి శంఖము ఆ ప్రాణి శంఖము లో ఉన్నపుడు కదులుతూ ఉంటుంది . మనకు పైన చర్మము లోన మాంసము , ఎముకలూ ఉండగా శంఖమునకు బయట అస్థి లోపల మాంసము ఉంటుంది . సముద్రములో ఉన్న ' పంచజనమనే ' శంఖమును బయటికి తెచ్చి భగవంతుడు తన యుద్ధ ఘోషకు ఉపయోగించాడు . పంచజనునకు సబంధించీంది కనుక దానికి " పాంచజన్యము " అని పేరు . అందరూ వారి వారి శంఖములను యూద్ధప్రారంభ సూచకముగా ఆనాడు పూరించేవారు .
  • ======================================
visit My website > Dr.Seshagirirao -

No comments:

Post a Comment

your comment is important to improve this blog...