Wednesday, August 03, 2011

వాతావరణ కాలుష్యాన్ని చెట్లు ఎలా అరికడతాయి ?,How trees control whether pollution?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

Q-వాతావరణ కాలుష్యాన్ని చెట్లు ఎలా అరికడతాయి ?

A===> స్వచ్చమైన వాతవరణంలో 78 శాతం నైట్రొజన్,్ 21 శాతం ఆక్సిజన్...కొంచెంగా అర్గాన్ ,కార్బన్ డై అక్సైడ్ వాయువులు ఉంటాయి. వీటితో పాటు అతి స్వల్పంగా నియాన్,హీలియం,నైట్రస్ అక్సైడ్ ,మీథైన్,కార్బన్ మోనాక్సైడ్ ,సల్ఫర్ డై అక్సైడ్, ఒజొన్, అమ్మోనియ మూలకాలు కుడా ఉంటాయి. శిలాజాలు ,పెట్రొ,కిరొసిన్ లాంటి ఇందనాలు మండించడం ... అడవులను నరికి రసాయన కాలుష్యాలు వెదజల్లె పరిశ్రమలు స్థాపించడం లాంటి పనుల వల్ల వాతావరణంలో ఈ వాయు అంశాల నిష్పత్తిలో రోజురోజుకి మార్పులు వస్తున్నాయి. దాని ఫలితంగానే టన్నుల కొద్ది కార్బన్ డై అక్సైడ్ ,కార్బన్ మోనాక్సైడ్ ,మీథెన్ల వంటి విష వాయువులతో వాతవరణం కలుషితమవుతుంది. దీనిని పచ్చగ ఏపుగా పెరిగిన చెట్లు అరికడతాయి .

చెట్లు వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకోవడంలొ ప్రదానపాత్ర పోషిస్తాయి. కిరణజన్య సంయోగక్రియ పద్దతిలో కార్బన్ డై అక్సైడ్ ,నీరు,సూర్యరశ్మిలని మేళవించి తమ పెరుగుదలకు కావలసిన పిండి పదార్థాన్ని తయారుచేసుకుంటాయి.ఈ ప్రక్రియలో భాగంగానే చెట్లు ప్రాణులకు అవసరమైన అక్సిజన్ ని విడుదల చేస్తాయి. చెట్లు బాస్పొత్పేకం(Transpiration) )ద్వార నీటిని....అవిరి రూపంలొ వెలువరిస్తాయి. దాంతో వాతావరణం చల్లబడుతుంది. పొగ,దుమ్ము, దూళి ,రసాయనిక అణువులు చెట్ల కొమ్మలు,అకులు,కాండాలపై స్థిరంగా పరుచుకొని పోతాయి. ఆ విదంగా అవి మన ఆవాసాల్లోకి చొరబడకుండా ఒక తెరలాగ అడ్దుకుంటాయి.
  • =====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...