Wednesday, October 26, 2011

దీపావళి వెనుక నిజాల వెలుగులు తెలుసా?,దీపావళి బాణసంచా కథలు-రికార్డులు ,What are the stories behing Diwali?

  • Courtesy with Eenadu news paper

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

దీపావళి అంటే ఎంత సరదానో! మరి సరదా వెనుక నిజాల వెలుగులు తెలుసా? బాణసంచా కథలు, రికార్డులు విన్నారా?
అసలు బాణసంచా ఎక్కడ పుట్టిందో తెలుసా? చైనాలో. దీని వెనకాల రెండు కథలున్నాయి. చాలాకాలం క్రితం చైనాలోని హునాన్‌ ప్రాంతంలో లీ టియస్‌ అనే సాధువు కొన్ని రసాయనాల్ని కలిపి విచిత్రమైన మంటలు తెప్పించాడట. అవే టపాసులన్నమాట. ఆ సాధువుకు అక్కడ ఒక గుడి కూడా కట్టారు. ఏటా ఏప్రిల్‌ 18 ఆయనకు పూజలు చేసి బోలెడు టపాసులు కాలుస్తారు.
మరో కథ ప్రకారం 2000 ఏళ్లక్రితం చైనాలో ఓ వంటవాడు మూడు రకాల పొడులను వేడి చేస్తున్నప్పుడు నిప్పురవ్వ పడి పెద్దగా మెరుపులు చిమ్ముతూ మండిపోయింది. అతడు వాడిన గంధకం, బొగ్గుపొడి, ఒక రకమైన లవణాలను ప్రాచీన చైనీయులు వెదురుబొంగుల్లో కూరి మంటల్లో పడేస్తే 'ఢాంఢాం' అని పేలేది. ఇప్పటికీ టపాసుల తయారీలో ఆ మిశ్రమాన్నే వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా బాణాసంచా ఎక్కువ ఉత్పత్తి చేసే దేశం కూడా అదే.

దివాళీ నగర్‌
దివాళీ నగర్‌ అనగానే మన దేశంలోని వీధి పేరో, ఊరి పేరో అనుకుంటున్నారా? కాదు, కరీబియన్‌ దీవిలో ఉన్న ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో దేశంలోని ఒక ప్రాంతం పేరు. ఇక్కడ 13 లక్షల మంది మన దేశస్థులే. వారందరి కోసం దీపావళిని సెలవు దినంగా ప్రకటించారు. ఇక్కడ 1986 నుంచి దీపావళి సంబరాలు నిర్వహిస్తున్నారు. వారికోసం ప్రభుత్వం కొంత ప్రాంతాన్ని దివాళీ నగర్‌ పేరుతో ఏర్పాటు చేసింది. ఏటా పండగ కోసం కోట్ల రూపాయల విరాళాలు కూడా అందుతాయి.

బంగారు తళుకులు!
అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయం తెలుసుగా? బంగారు పూతతో ధగధగలాడే ఆ ఆలయం దీపావళి నాడు మరింత వెలుగులీనుతుంది. సిక్కులు దీపావళి జరుపుకోవడానికి ఒక ప్రత్యేకత ఉంది. మొఘల్‌ చక్రవర్తి జహంగీర్‌ సిక్కుల ఆరో గురువైన గురు హర్‌గోవింద్‌ సాహిబ్‌తోపాటు 52 మంది రాజులను ఓసారి చెరసాల్లో బంధిస్తాడు. వారిలో గురువును మాత్రం విడుదల చేయడానికి ఒప్పుకుంటాడు.తనతోపాటు రాజులందర్నీ విడుదల చేస్తేనే బయటకు వెళతానని గురువు పట్టుబడతాడు. దాంతో దీపావళి రోజు అందర్నీ విడుదల చేస్తారు. వాళ్లంతా గోల్డెన్‌ టెంపుల్‌కు వచ్చి వేడుకలు జరుపుకుంటారు. స్వర్ణ దేవాలయం నిర్మాణానికి 1577లో పునాది రాయిని వేసింది దీపావళి రోజునే.

ఢాంఢాం రికార్డులు!
*మాల్టా మక్బాలో 2011 జూన్‌లో అతి పెద్ద విష్ణు చక్రాన్ని కాల్చి రికార్డు సృషించారు. దీని చుట్టు కొలత 105 అడుగులు.
* ఫిలిప్పీన్స్‌లో గతేడాది 30 సెకన్లలో 1,25,801 తారాజువ్వల్ని వెలిగించడం గిన్నిస్‌ రికార్డు.
* ఇంగ్లండ్‌లో 2009లో 6.5 సెకన్లలో 1,10,000 రకాల బాణసంచా కాల్చారు.
*జపాన్‌లో అతి పెద్ద చిచ్చుబుడ్డిని 54.7 అంగుళాల వ్యాసం, 750 కిలోలతో తయారు చేశారు.
*చైనాలో 2007లో 13 కిలోమీటర్ల పొడవునా టపాసులను పరిచి కాల్చారు. ఇందుకోసం పది లక్షల డాలర్లని ఖర్చుపెట్టారు.
వూరంతా టపాసులే!
మనం కాల్చే టపాసులు ఎక్కడ తయారవుతాయో తెలుసా? తమిళనాడులోని శివకాశిలో. దేశంలో అమ్ముడయ్యే బాణసంచాలో 95 శాతం అక్కడే తయారవుతాయి. సుమారు 8000 టపాసుల పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో ఉపాధి పొందేవారు 4 లక్షలపైనే! ఏటా సుమారు రూ. 600 కోట్ల వ్యాపారం జరుగుతోంది. ప్రపంచంలో ఎక్కువ టపాసుల్ని కాల్చే అతి పెద్ద పండగ మన దీపావళే. ప్రపంచవ్యాప్తంగా ఏటా 10వేల కోట్ల రూపాయల బాణసంచా వ్యాపారం జరుగుతోంది.
ఒక్కో చోట ఒక్కోలా...
*దీపావళి పండుగను బెంగాల్లో మహానిష అని పిలుస్తారు. కాళికా దేవిని పూజిస్తారు.
*బీహార్‌ గ్రామాల్లో యువకులు ధాన్యం, గడ్డిలను ఒక గంపలో వేసుకుని ఊరంతా తిరుగుతారు.
*మహారాష్ట్రలో యముడికి పూజలు చేసే సంప్రదాయం ఉంది.
*రాజస్థాన్‌లో పిల్లిని అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. ప్రత్యేక ఆహారాన్ని తయారు చేసి పిల్లులకు పెడతారు.
*ఇతర దేశాల విషయానికి వస్తే సింగపూర్‌, మలేషియాలో అధికారిక సెలవు దినం. అమెరికా అధ్యక్ష భవనంలో కూడా దీపావళి పండగను చేస్తారు. వేడుకల్లో పాల్గొన్న తొలి అధ్యక్షుడు బరాక్‌ ఒబామానే!
*జైన మతాన్ని స్థాపించిన మహావీరుడు దీపావళి రోజునే నిర్యాణం చెందినట్టు చెబుతారు. ఆయన జ్ఞాపకార్థం జైనులు ఈరోజు ప్రార్థనలు చేస్తారు.

రంగులు ఇలా...
బాణసంచా కాలిస్తే బోలెడేసి రంగులు వస్తాయి. అవన్నీ రకరకాల రసాయనాల వల్ల ఏర్పడతాయి. అల్యూమినియం, టిటానియం వల్ల వెండి రంగు, బేరియంతో ఆకుపచ్చ, కాల్ఫియం వల్ల కాషాయం, కాపర్‌ వల్ల నీలం, మెగ్నీషియం వల్ల తెలుపు, సోడియం వల్ల పసుపు, స్ట్రోన్టియమ్‌తో ఎరుపు రంగులు ఏర్పడతాయి.

దీపావళి కథలు--
  • * రావణసురునితో జరిపిన యుద్ధంలో విజయం పొందిన శ్రీరామచంద్రుడు సతీసమేతంగా అయోధ్యకు విచ్చేస్తాడు. ఆరోజు అమావాస్య... అయోధ్య అంతా చీకట్లతో నిండి ఉంటుంది. దాంతో శ్రీరామునికి స్వాగతం పలికేందుకుఅయోధ్యావాసులు దీపాలను వెలిగించి అమావాస్య చీకట్లను పారద్రోలుతారు. ఆనాటి నుంచి దీపావళి పండుగనుమనం జరుపుకుంటున్నాం.
* ఇక రెండవ కథగా నరకాసుర సంహారాన్ని చెప్పుకుందాం. ప్రాద్యోషపురానికి రాజు నరకాసురుడు. బ్రహ్మదేవుని నుంచిపొందిన వరగర్వంతో నరకాసురుడు దేవతలను, మహర్షులను నానా ఇబ్బందులు పెడుతుంటాడు. నరకాసురునిఆగడాలు శృతిమించడంతో సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరిస్తాడు. నరకాసురుని పీడవిరగడవ్వడంతో ప్రజలు దీపాలు వెలిగించి పండుగను జరుపుకున్నారు. ఆ పరంపర నేటికీ కొనసాగుతున్నది.
  • * మూడవ కథగా పాల సముద్రం నుంచి శ్రీమహాలక్ష్మిదేవి ఉద్భవించిన వృత్తాంతాన్ని తెలుసుకుందాం. మరణాన్ని దరిచేర్చని అమృతం కోసం దేవదానవులు పాల సముద్రాన్ని చిలుకుతుండగా ఈ రోజు లక్ష్మిదేవి ఉద్భవించింది. సకలఅష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి దీపావళి నాటి సాయంత్రం హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు.
* నాలుగవ కథగా... భారతంలోని ఇతివృత్తాన్ని చెప్పుకుందాం. కౌరవులు సాగించిన మాయాజూదంలో ఓడిన పాండవులుపదమూడేళ్ళు వనవాసం, ఒక సంవత్సర కాలం అజ్ఞాత వాసం సాగించి తమ రాజ్యానికి తిరిగి వస్తారు. ఆ సందర్భంగాప్రజలు దీపాలు వెలిగించి వారికి స్వాగతం పలుకుతారు.
  • * ఇక చివరిదైన ఐదవ వృత్తాంతంగా మన రైతుల గురించి తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాలలో పంట చేతికి వచ్చేసందర్భాన్ని పురస్కరించుకుని అన్నదాతలు దీపావళి పండుగను చేసుకుంటారు. మంచి పంట దిగుబడినిఅందించినందుకు ఇష్టదైవానికి కృతజ్ఞతగా ప్రత్యేక పూజలు చేసి పండుగ జరుపుకుంటారు.

  • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Tuesday, October 25, 2011

నూనె నీళ్లలో కలిసినప్పుడు రంగురంగుల వలయాలు ఏర్పడతాయెందుకు ?,When water mix with Oil colors formed-Why?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న: నూనె నీళ్లలో కలిసినప్పుడు రంగురంగుల వలయాలు ఏర్పడతాయి. ఎందుకు?

-ఆర్‌. అభిరామ్‌, పాల్వంచ (ఖమ్మం)

జవాబు: నూనె నీళ్లపై ఒక పొరలాగా ఏర్పడి తేలుతుంది. నూనె సాంద్రత, నీటి సాంద్రత కన్నా తక్కువ కావడమే ఇందుకు కారణం. అలా పరుచుకునే నూనె పొర మధ్య భాగం ఉబ్బెత్తుగాను, చివర్లలో పలుచగానూ ఉంటుంది. దీని మీద పడే సూర్యకిరణాలు నూనె పొర నుంచే కాక, దానికి నీటికి మధ్య ఉండే తలం నుంచి కూడా పరావర్తనం (reflection)చెందుతాయి. రెండు తలాల నుంచి పరావర్తనం చెందే ఈ కిరణాలు పయనించే దూరంలో కొంత తేడా ఉంటుంది. దీనిని పథాంతరం (path defference) అంటారు. కాంతి తరంగ రూపంలో ఉంటుంది కదా. నూనె, నీటి పొరల మీద పడిన కాంతి తరంగాలు ఒకదానితో మరొకటి వ్యతికరణం (interference)చెందుతాయి. అందువల్ల సూర్యకాంతిలోని రంగులు పథాంతరాన్ని బట్టి మన కంటికి వలయాలుగా కనిపిస్తాయి.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

పిరానా చేపలు-సంగతులేమిటి ?, What about Piranah Fish?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

పదునైన పళ్లు... విపరీతమైన ఆకలి... గుంపుగా దాడి... అదే పిరానా చేప! వీటి గురించి కొత్త విషయం తెలిసింది... ఇవి తమలో తాము మాట్లాడుకుంటాయిట!

పిరానా చేపలు గురించి పరిశోధన చేసి శాస్త్రవేత్తలు తెలుసుకున్న సంగతులే తమలో తాము మాట్లాడుకుంటాయిట. అచ్చం ఇలాగే తెలుగులో మాట్లాడుకోకపోయినా, పిరానా చేపలు తమలో తాము కొన్ని ధ్వనుల ద్వారా భావాలను వ్యక్తీకరించుకుంటాయని కనిపెట్టారు. అలా అవి చేసే శబ్దాలను, వాటి ప్రవర్తనలను విశ్లేషించి మూడు రకాల సందేశాలను కనుక్కోగలిగారు. అవే పై సంభాషణలు! చేపల్లో భావ ప్రకటన ఉంటుందని ముందే తెలిసినా, ఇంత కచ్చితంగా తెలుసుకోవడం ప్రపంచంలో ఇదే తొలిసారి.

దక్షిణమెరికాలోని మంచి నీటి చెరువుల్లో నివసించే పిరానా చేపల గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వీటి పళ్లు పదును దేలి గట్టిగా ఉండడంతో పాటు ఇవి గుంపులుగా తిరుగుతూ ఆహారాన్ని వేటాడుతాయి. ఏ జలచరమైనా వీటికి దొరికితే క్షణాల్లో అది అస్థిపంజరంలా మారిపోతుందని చెబుతారు. మనుషులపై సైతం ఇలాగే దాడి చేస్తాయనే భయాలున్నాయి. వీటి పళ్లను కొన్ని దేశాల్లో పరికరాల, ఆయుధాల తయారీకి ఉపయోగిస్తారు. వీటిపై బోలెడు సినిమాలు కూడా తీశారు.

పిరానాలలో సుమారు 25 జాతులు ఉన్నాయి. వీటిలో ఎర్రపొట్ట (రెడ్‌ బెల్లీడ్‌) పిరానా జాతి చేపల పైనే ఈ పరిశోధన జరిగింది. వీటిని పెద్ద అక్వేరియంలో పెట్టి అందులో సున్నితమైన శబ్దాలను సైతం నమోదు చేసే పరికరాలను, వీడియో కెమేరాలను ఏర్పాటు చేశారు. ఏ సందర్భాల్లో ఎలాంటి శబ్దాలు చేస్తున్నాయో, అవి విని మిగతావి ఎలా స్పందిస్తున్నాయో విశ్లేషించారు. ఇవి కోపాన్ని, అసహనాన్ని, హెచ్చరిక ధోరణిని తెలిపేందుకు ఎలాంటి ధ్వనులు చేస్తాయో గమనించారు. ఈ శబ్దాలను నోటితో కాకుండా కొన్ని కండరాలను కదిలించడం ద్వారా చేస్తున్నాయని తెలుసుకున్నారు.

===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Friday, October 21, 2011

సెల్‌ఫోన్ కు తేదీలు తెలుసా?,Do Cellphone know dates?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

'ప్రశ్న: సెల్‌ఫోన్‌ను చాలాసేపు ఆఫ్‌ చేసి మళ్లీ ఛార్జింగ్‌ చేసి ఆన్‌ చేస్తే తేదీని తప్పులేకుండా చూపిస్తుంది. ఆఫ్‌ చేసినా దాన్లో తేదీల సమాచారం ఎలా దాగుంది?

-ఖాజా మస్తాన్‌ వలి, హైదరాబాద్‌
జవాబు: సాధారణంగా సెల్‌ బ్యాటరీ ఛార్జింగ్‌ అయిపోకముందే ఆఫ్‌ చేస్తే, ఆ బ్యాటరీ శక్తితో సమాచారం సెల్‌ఫోన్‌ సర్క్యూట్‌లో నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి ఫోన్‌ మెమొరీలో ఉన్న కాంటాక్ట్‌ పేర్లు వగైరా సమాచారమంతా అలాగే ఉంటుంది. అందుకే తిరిగి ఆన్‌ చేసినపుడు తేదీ, సమయం, ఇతర వివరాలు కూడా ఉంటాయి. కానీ సెల్‌ను చాలాకాలం పాటు ఆఫ్‌ చేస్తే దానిలోని బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జి అయిపోతుంది. అప్పుడు ఫోన్‌ మెమొరీలో ఉండే సమాచారం మొత్తం ఖాళీ అవుతుంది. తిరిగి ఛార్జింగ్‌ చేసి ఆన్‌ చేస్తే ఆ సమాచారం తిరిగి రాదు. కానీ తేదీ, కాలం మాత్రం బాగానే కనిపిస్తాయి. ఇందుకు కారణం ఫోన్‌ మెమొరీ కాదు. మనం ఏ కంపెనీ సెల్‌ఫోన్‌ను వాడుతున్నామో, ఆ టవర్‌తో లింకు ఏర్పడి వారి సర్వీసు సర్వర్‌ కంప్యూటర్‌తో సంధానించుకుంటుంది. అయితే కాంటాక్ట్స్‌, ఇతర వివరాలను సెల్‌లో ఉండే మైక్రోచిప్‌లోకానీ, సిమ్‌ మెమొరీలో కానీ దాచుకుంటే ఎన్ని రోజుల తర్వాతైనా తిరిగి వాడుకోవచ్చు.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌,--వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక.
  • =============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

లోటస్‌ టెంపుల్‌-ఢిల్లీ సంగతేమిటి , What about Lotus Temple Delhi

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

మీకు ఈఫిల్‌ టవర్‌, తాజ్‌మహల్‌ తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన వీటి కన్నా ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించిన కట్టడం ఒకటి మన దేశంలోనే ఉందని తెలుసా? అదే ఢిల్లీలోని లోటస్‌ టెంపుల్‌. కలువ పువ్వు ఆకారంలో కట్టిన ఆలయమన్నమాట. దీన్ని నిర్మించి పాతికేళ్లు అయిన సందర్భంగా అక్కడ ఉత్సవాలు జరగనున్నాయి. ఇప్పటి వరకూ దీన్ని ఏకంగా 7 కోట్ల మంది సందర్శించారు. అద్భుత పాలరాతి కట్టడంగా ఇది గిన్నిస్‌ పుస్తకంలోకి కూడా ఎక్కింది. పెద్ద కలువ పువ్వులా కనిపించే ఈ ఆలయం ఎత్తు 131 అడుగులు! అంటే దాదాపు పన్నెండు అంతస్తుల భవనమంత అన్నమాట! ఏటా 40 లక్షల మంది, రోజుకి 13 వేలమంది, నిముషానికి 9 మంది దీన్ని చూస్తున్నారని అంచనా.

ప్రపంచ దేశాలన్నీ దీని నిర్మాణాన్ని అపురూపమైనదిగా గుర్తించాయి. ఉత్తర అమెరికా ఇంజినీరింగ్‌ సంఘం 20వ శతాబ్దపు తాజ్‌మహల్‌గా బిరుదిచ్చింది. తాజ్‌మహల్‌లాగే దీన్ని కూడా పాలరాతితోనే కట్టారు. ఇందుకోసం గ్రీస్‌ నుంచి ప్రత్యేకంగా పాలరాయిని దిగుమతి చేసుకున్నారు. మొత్తం 27 రేకులతో కూడిన కలువ ఆకారంలో కట్టిన ఇది చుట్టూ ఏర్పరిచిన జలాశయాల మధ్య నీటిలో తేలియాడుతున్నట్టు ఎంతో అందంగా కనిపిస్తుంది. మొత్తం 26 ఎకరాల స్థలంలో తీర్చిదిద్దిన దీని నిర్మాణం ఆరేళ్లపాటు కొనసాగి 1986లో పూర్తయింది. తొమ్మిది ద్వారాలతో కనిపించే ఈ ఆలయం లోపల 2500 మంది కూర్చోగలిగినంత విశాలమైన ధ్యానమందిరం ఉంటుంది. దీన్ని నిర్మించిన ఇరానీ శిల్పకారుడు ఫరీబోజ్‌ సహ్‌బా దేశదేశాల్లో ఎన్నో పురస్కారాలు పొందిన ప్రఖ్యాత శిల్పకారుడు.

ఇంతకీ ఈ ఆలయంలో ఏ దేవుడుంటాడు? ఎవరూ ఉండరు! ఇది బహాయి మతానికి చెందినది. వారి సిద్ధాంతం ప్రకారం దేవుడు నిరాకారుడు. 150 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన ఈ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది అనుసరిస్తారు. ఏ మతాన్ని అవలంబించేవారైనా ఇక్కడకు వచ్చి ధ్యానం చేసుకోవచ్చు.
  • ============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

చలికాలంలో బ్యాటరీలు సరిగా పనిచేయవు-ఎందుకని?,Battary cell work is not in winter Why?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న: చలికాలంలో బ్యాటరీలు సరిగా పనిచేయవు. ఎందుకని?
-ఎ. రాంబాబు, 10వ తరగతి, గుంటూరు
జవాబు; బ్యాటరీలో ఉండే రెండు లోహపు పలకల మధ్య రసాయనిక చర్యల ద్వారా ఎలక్ట్రాన్లు ప్రవహించే తీరును బట్టి అది ఉత్పత్తి చేసే విద్యుత్‌ సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. సాధారణంగా బ్యాటరీలలో జింకు, రాగి లోహపు పలకలను వాడతారు. వీటిని ఎలక్ట్రాన్లు సులువుగా ప్రవహించే ద్రవంలో ఉంచుతారు. వీటి మధ్య జరిగే రసాయనిక చర్యల ఫలితంగా ఎలక్ట్రాన్ల ప్రవాహం మొదలై ఎక్కువ మోతాదులో రాగి పలకపైకి చేరుకుంటాయి. ఇవే బ్యాటరీని అనుసంధానం చేసిన విద్యత్‌ వలయంలో కూడా ప్రవహిస్తాయి. చలికాలంలో, వర్షాకాలంలో వాతవతరణంలో ఉండే చల్లదనం వల్ల ఉష్ణోగ్రత తగ్గి రసాయనిక చర్య వేగం మందగించడంతో బ్యాటరీలలో ఎలక్ట్రాన్ల ప్రవాహం తక్కువగా ఉంటుంది. ఆ పరిస్థితుల్లో వాటిని కొంచెం వేడి చేస్తే పరిస్థితి మెరుగుపడుతుంది. చలికాలంలో మోటారు వాహనాలు వెంటనే స్టార్ట్‌ కాకపోవడానికి కూడా ఇదే కారణం.

-ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్.
  • =======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Thursday, October 20, 2011

బిగ్‌బెన్‌ గడియారం సంగతేమిటి ? , What about Bigben Clock?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

లండన్‌ అనగానే ఏం గుర్తొస్తుంది? బిగ్‌బెన్‌ గడియారం కదా... అదిప్పుడు ప్రమాదంలో పడింది! ఒక పక్కకి వాలిపోతోంది...మరి దాని వివరాలు తెలుసుకుందామా?

ఇటలీలోని పీసా టవర్‌ ప్రత్యేకత ఏమిటి? ఒక పక్కకి ఒరిగి ఉండడం కదా. అలాగే లండన్‌లోని బిగ్‌బెన్‌ గడియార స్తంభం కూడా ఒరిగిపోతోందని తేలింది. ప్రపంచ ప్రఖ్యాత కట్టడాల్లో ఒకటైన ఇది ఇలాగే ఒరిగిపోతూ ఉంటే కొన్నాళ్లకు కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. నిట్టనిలువుగా ఉండే దీని పైభాగం ఇప్పటికే ఒకటిన్నర అడుగుల మేరకు పక్కకు ఒరిగి కనిపిస్తోంది. ఇంతకీ ఎందుకిలా జరుగుతోంది?

బిగ్‌బెన్‌గా పేరొందిన ఈ గడియారం టిక్‌టిక్‌ మనడం మొదలై ఇప్పటికి 152 ఏళ్లయింది. ఇప్పటికి కూడా చక్కగానే పనిచేస్తోంది. భూమి నుంచి కొలిస్తే ఏకంగా 315 అడుగుల ఎత్తుగా ఉండే టవర్‌పై నాలుగు వైపులా నాలుగు పెద్ద పెద్ద గడియారాలు ఏర్పాటు చేశారు. ఇవి 1859 సెప్టెంబర్‌ 7 నుంచి పనిచేయడం మొదలు పెట్టాయి. దీని నిర్మాణానికి సుమారు 15 సంవత్సరాలు పట్టింది. బ్రిటన్‌ పార్లమెంటు భవనంలో భాగంగా ఉండే దీనికి సమీపంలోనే థేమ్స్‌ నది ప్రవహిస్తోంది. నది ఒడ్డున భూగర్భంలో మురుగు నీటి కాల్వల కోసం, కార్‌ పార్కింగ్‌ కోసం నిర్మాణాలు జరుగుతున్నాయి. దీని వల్లే బిగ్‌బెన్‌ దృఢమైన పునాదిని కోల్పోయి ఒక వైపుగా ఒరుగుతున్నట్టు పరిశోధకులు భావిస్తున్నారు. ఇలా ఇది ఏడాదికి 0.04 అంగుళాల వంతున ఒరుగుతున్నట్టు అంచనా.

ప్రస్తుతం బ్రిటిష్‌ పార్లమెంటు భవనం ఉన్న స్థలంలో అంతకు ముందు వేరే భవంతి ఉండేది. అది 1834లో అగ్నిప్రమాదానికి గురవ్వడంతో కొత్త భవనాన్ని నిర్మించాలనుకున్నారు. అప్పుడే క్లాక్‌ టవర్‌ని కూడా కట్టాలని నిర్ణయించారు. అలా 1843లో నిర్మాణాన్ని ప్రారంభించారు. మరి దీనికి బిగ్‌బెన్‌ అని పేరు ఎందుకు వచ్చింది? ఎందుకంటే, ఈ టవర్‌ లోపల గంటలు కొట్టే అయిదు పెద్ద గంటలు ఉంటాయి. వాటిలో అతి పెద్దదాని పేరే బిగ్‌బెన్‌. దీని బరువు 13.5 టన్నులు. అసలు దీని పేరు సెయింట్‌ స్టీఫెన్స్‌ టవర్‌ అనుకున్నా, బిగ్‌బెన్‌గానే పేరొందింది. టవర్‌కి నాలుగు వైపులా ఉండే గడియారాలు 25 అడుగుల వ్యాసంతో ఉంటాయి. వీటిలో ఉండే పెద్ద ముల్లులు 14 అడుగుల పొడవుగా, చిన్నముల్లులు 9 అడుగుల పొడవుగా ఉంటాయి.
  • =====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

అలుగు సంగతేమిటి? , What about Armadillo?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

అదొక జంతువు... దాని మానాన అది బతుకుతోంది... కానీ అమెరికాను మాత్రం ఏడిపిస్తోంది...ఏమిటది? ఎందుకు?

ఒళ్లంతా పొలుసులు... ముందుకు పొడుచుకొచ్చిన మూతి... చేంతాడులా సాగే నాలుక... నాలుగు కాళ్లపై నడక... బారెడు తోక... ఇదొక వింత జంతువు. ప్రమాదం ఎదురైతే చటుక్కున బంతిలా ముడుచుకుపోయే దీన్ని అలుగు అంటారు. చాలా దేశాల్లో కనిపించే ఇది ఇప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ఓ తలనెప్పిగా మారింది. ఇంతకీ ఏం చేసింది?

అలుగును ఆంగ్లంలో ఆర్మడిల్లో (Armadillo) అంటారు.వీటిలో మొత్తం ఇరవై జాతులు ఉన్నాయి. దక్షిణ అమెరికా ఖండంలో ఎక్కువగా కనిపిస్తాయి. దాదాపు 9 జాతుల ఆర్మడిల్లోలు అక్కడుంటాయి. వాటిలో ఒకటైన 'నైన్‌ బ్యాండెడ్‌ ఆర్మడిల్లో'తోనే సమస్యంతా. ఇది ఎలా వెళ్లిందో తెలియదు కానీ, 1880లో ఉత్తర అమెరికా ఖండంలోకి అడుగు పెట్టింది. అక్కడ వాటి సంఖ్య పెరిగిపోయింది. ఇవి ఇప్పుడు యూఎస్‌ఏ రాష్ట్రాల్లోకి చొచ్చుకుపోయాయి. వాటి బతుకు అవి బతుకుతుంటే సమస్య ఏంటి?

సాధారణంగా ఒక ప్రాంతానికి చెందిన జంతువు కానీ, మొక్క కానీ మరో కొత్త ప్రదేశానికి వెళితే ఒకోసారి తలనెప్పిగా మారిపోతాయి. కొత్త ప్రాంతాల్లో సహజ శత్రువులు లేకపోయినా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా వీటి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. అప్పుడవి ఆ ప్రాంతానికి చెందిన ఇతర జంతుజీవాలతో పోటీకి దిగుతాయి. వాటి మనుగడకు కూడా అడ్డంకిగా మారతాయి. ఇలాంటి వాటిని 'ఎలియన్‌ స్పిసీస్‌' అంటారు. అలుగుగారు అమెరికాలో ఇప్పుడీ అవతారమే ఎత్తారు.

దట్టమైన అడవుల్లో, మైదానాల్లో గోతులు చేసుకుని జీవించే ఇవి ఏవి పడితే వాటిని తింటాయి. పంటల నుంచి కీటకాల వరకూ ఆరగిస్తూ పెరిగిపోతాయి. వీటి వల్ల చాలా చోట్ల పక్షులకు, ఇతర జీవులకు ప్రమాదం కలుగుతోంది. ఇవెంతగా పెరిగిపోయాయంటే అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రుళ్లు ఇవి రోడ్ల మీదకు తరచుగా వస్తుండడంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. వీటి సంఖ్యను ఎలా అదుపు చేయాలా అని అధికారులు తలపట్టుకుంటున్నారు. రోజుకు 16 గంటలు ఏ సొరంగంలోనో పడుకునే వీటిని పట్టుకోవడం కూడా సమస్యగానే మారింది.

* అలుగుల్లో అతి పెద్దది అయిదడుగుల వరకు పెరిగితే, అతి చిన్నది ఆరంగుళాలు ఉంటుందంతే!
* వీటికి కంటిచూపు అంతంత మాత్రమే. సునిశితమైన వినికిడి శక్తి ద్వారా వేటాడుతాయి.
  • ========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Wednesday, October 19, 2011

సౌరఘటాల మర్మమేమిటి?,What is the secrete of Solar cells?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న: సూర్యకాంతిని విద్యుత్‌గా మార్చే సౌరఫలకాలు ఎలా పనిచేస్తాయి. వాటిలో ఏ పదార్థం ఉంటుంది?

-వి. మోహన సూర్యప్రకాశ్‌, ఏలూరు

జవాబు: సౌరఫలకాలను సాధారణంగా సిలికాన్‌ పొరలతో (silicon wafers)తో తయారు చేస్తారు. ఒకో సిలికాన్‌ పొర ఒకో విద్యుత్‌ ఘటం(cell)లాగా పనిచేస్తుంది. అయితే ఒకోదానిలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ చాలా స్వల్పంగా మిల్లీవోల్టులలో మాత్రమే ఉంటుంది. అందువల్లనే వీటిని వందలాది సంఖ్యలో అనుసంధానిస్తారు. ఇక ఇవి ఎలా పనిచేస్తాయో చూద్దాం.

ఒక పదార్థం ద్వారా విద్యుత్‌ ప్రవహించాలంటే అందులో స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు ఉండాలి. రాగి, వెండి, పాదరసం వంటి పదార్థాలలో ఇవి దండిగా ఉండడం వల్లనే వాటిని విద్యుత్‌వాహకాలు(electrical conductors) అంటారు. అయితే సిలికాన్‌ వంటి పదార్థాల్లోకి భాస్వరం, బోరాన్‌, అల్యూమినియం లాంటి పరమాణువుల్ని నింపితే వేర్వేరు రకాల అర్థవాహకాలుగా మారతాయి. ఇలాంటి వేర్వురు అర్థవాహకాలను అనుసంధానించినప్పుడు విద్యుత్‌ శక్మం ఏర్పడుతుంది. సౌరఫలకాలు ఇలా రూపొందించినవే. సూర్యకాంతిలో ఉంచినప్పుడు వీటిలో ఎలక్ట్రాన్ల ప్రవాహం సాగుతుంది. వీటినే కాంతి విద్యుద్ఘటాలు(photo voltaic cells) అంటారు.

-ప్రొఎ. రామచంద్రయ్య, నిట్‌,వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక.

  • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Thursday, October 13, 2011

మీసాలు మగవారికేనా?,Mustache are present in male only why?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న: గడ్డాలు, మీసాలు పురుషులకే ఎందుకు వస్తాయి? ఆడవారికి ఎందుకు రావు?

జవాబు: పుట్టుకతోనే ఆడ, మగ పిల్లల్లో ఉండే శారీరక వ్యత్యాసాలను ప్రాథమిక లైంగిక లక్షణాలు(Primary sexual characteristics)అంటారు. పిల్లలు పెరిగే క్రమంలో మరికొన్ని మార్పులు శరీరం బయట, లోపల కూడా ఏర్పడుతాయి. వీటిని ద్వితీయ లైంగిక లక్షణాలు (Secondary sexual characteristics)అంటారు. ఉదాహరణకు జంతువుల్లో కోడి గుడ్డులోంచి వచ్చే పిల్లలు ఎదిగే కొద్దీ కొన్ని ప్రత్యేకమైన ఈకలు వచ్చి పెట్టలుగా, పుంజులుగా మారడం, పుంజు మాత్రమే కొక్కొరొకో అని కూయగలగడం, అలాగే మగ నెమలికి మాత్రమే పింఛం రావడం మొదలైన లక్షణాలను గమనించవచ్చు. మనుషుల్లో గడ్డాలు, మీసాలు మగవారికి మాత్రమే ఏర్పడడం కూడా ద్వితీయ లక్షణాలలో భాగంగానే. ఇందుకు కారణం స్త్రీపురుష శరీరాల్లో కొన్ని హార్మోన్లు ప్రత్యేకంగా వృద్ధి చెందడమే. మగవారిలో టెస్టోస్టిరాన్‌ హార్మోను ఎక్కువగాను, ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ తక్కువగాను ఉంటాయి. అదే ఆడవారిలో ఈస్ట్రోజన్‌ పరిమాణం ఎక్కువగాను, టెస్టోస్టిరాన్‌ తక్కువగాను ఉత్పత్తి అవుతాయి. వీటి ప్రభావం వల్లనే ఈ తేడాలు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  •  

  • =========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

మన ఉష్ణోగ్రత స్థిరమా?,Is our body Temperature static?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న: మన శరీర ఉష్ణోగ్రత అన్ని భాగాల్లోను, అన్ని వేళల్లోను ఒకేలా ఉంటుందా?

-కె. జోగారావు, 10వ తరగతి, రాజమండ్రి

జవాబు: మన శరీరంలో ఉష్ణస్థాపకం (థెర్మోస్టాట్‌) లాంటి వ్యవస్థ ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇది మన శరీర ఉష్ణోగ్రతను 37 డిగ్రీల సెంటిగ్రేడు (98.6 ఫారెన్‌హీటు) వద్ద స్థిరంగా ఉంచుతుంది. అయితే ఇది మెదడు, దేహ అంతర్భాగంలో మాత్రమే స్థిరంగా ఉంటుంది. వాతావరణ ఉష్ణోగ్రతను బట్టి, కండరాల క్రీయాశీలత (యాక్టివిటీ) స్థాయిని బట్టి చేతుల, కాళ్ల ఉష్ణోగ్రతలు కొన్ని సార్లు హెచ్చుతగ్గులు చూపించవచ్చు. అలాగే ఒక వ్యక్తి నిద్రపోయేప్పుడు, మెలకువగా ఉన్నప్పుడు కలిగే మార్పుల వల్ల కూడా శరీర ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది. దేహ పరిశ్రమ వల్ల అలసట కలిగినప్పుడు దేహ ఉష్ణోగ్రత తగ్గుతుంది. అలాంటి సమయంలో కొంచెం సేపు నిద్రపోవడం ద్వారా శరీర ఉష్ణోగ్రత యధాస్థితికి వస్తుంది.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Sunday, October 09, 2011

పిడుగు పరిమాణమెంత?,What is the volume of a thunder?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న: మెరుపుతో కూడిన పిడుగు ఎంత పరిమాణంలో ఉంటుంది?

-వెరోనికా డేవిడ్‌, విజయవాడ

జవాబు: ఒక మిల్లీసెకండు కాలంలో మెరుపుతో కూడిన పిడుగు 20,000 ఆంపియర్ల విద్యుత్‌ ప్రవాహాన్ని ఉద్గారిస్తుంది. అప్పుడు ఏర్పడే విద్యుత్‌ క్షేత్ర తీవ్రత మీటరుకు 2 లక్షల వోల్టులు. మెరుపు పిడుగు వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు మొదట్లో గాలిలో గొట్టంలాంటి మార్గం ఏర్పడి, అందులోని అణువులు అయనీకరణం(Ionisation) చెందుతాయి. పిడుగులు పయనించే మార్గాలు పలుమార్లు తమ దిశలను మార్చుకుంటాయి. అందువల్లనే ఆ విద్యుత్‌ ఉత్సర్గ మార్గాలు (Electric Discarge Paths) వంకరటింకరలుగా ఉంటాయి. ఆకాశంలో విద్యుత్‌ ఉత్ప్రేరితమైన మేఘాలకు, భూమి ఉపరితలానికి మధ్య మెరుపులతో కూడిన పిడుగులు ఒకటి నుంచి రెండు కిలోమీటర్ల పొడవును సంతరించుకుంటాయి. రెండు మేఘాల మధ్య విద్యుత్‌ ఉత్సర్గం ఏడు కిలోమీటర్ల వరకూ విస్తరిస్తుంది. ఈ ఉత్సర్గం కొన్ని సందర్భాల్లో 140 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
  • =====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Thursday, October 06, 2011

ముఖంపై మొటిమలేల?,Why do we get pimples on face?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న: యుక్తవయసులోనే ముఖం మీద ఎక్కువగా మొటిమలు వస్తుంటాయి. ఎందుకు? వాటిని తగ్గించుకోవడం ఎలా?

-కె. అరుణ్‌, పి. మన్మథ, 9వ తరగతి, మారికవలస

జవాబు: మనిషి ఎదిగే క్రమంలో శరీరంలో ఎన్నో హార్మోన్లు ఉత్పత్తి అవుతూ వివిధ పాత్రలను పోషిస్తాయి. యుక్తవయసులో యాండ్రోజన్లు, ఈస్ట్రోజన్లు అనే హార్మోన్లు ఎక్కువగా విడుదల అవుతుంటాయి. శరీరాన్ని కాంతివంతంగా, నిగారింపుతో ఉంచడానికి చర్మం కింద ఉన్న తైలగ్రంథులు (sabacious glands) తైలాన్ని స్రవిస్తాయి. ఆ తైలం చర్మంపై పలుచని పొరలాగా ఏర్పడి చర్మానికి నిగారింపును ఇస్తుంది. ఈ తైలగ్రంథుల సాంద్రత శరీరంలో మిగతా భాగాల కన్నా ముఖచర్మంలోనే ఎక్కువగా ఉంటాయి. ఈ తైలస్రావం తైల రంధ్రాల ద్వారా చర్మం మీదకు రావాలి. కానీ ఇవి చాలా సన్నగా ఉండడం వల్ల చాలా సార్లు ఈ తైలం బయటకు రాలేక చర్మం కింద పోగుపడుతుంది. ఇవే మొటిమలు (పింపుల్స్‌).

ముఖాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూ, మంచి నీళ్లతో, తేలికపాటి సబ్బులతో తరచు కడుక్కుంటూ ఉంటే, తైలగ్రంథులు సక్రమంగా పనిచేసి ఎప్పటికప్పుడు తైలం బయటకు వస్తుంటుంది. మొటిమల్ని పోగొడతాయంటూ మార్కెట్లో దొరికే లేపనాలు, పౌడర్లు ఆ పని చేయలేవు. ముఖ వ్యాయామాలు, పరిశుభ్రత మాత్రమే మొటిమలు రాకుండా కాపాడే శాస్త్రీయ పద్ధతులు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • =========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

పొగలకా రంగులేల?,Smoke have colors Why?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న: మంటల నుంచి వెలువడే పొగ వేర్వేరు రంగుల్లో ఎందుకుంటుంది?

-పి. కేశవ్‌, ఇంటర్‌, తాడిపత్రి (అనంతపురం)

జవాబు:
మంటల నుంచి వెలువడే పొగలో వేడిగాలులు, అనేక చిన్న కణాలు, సూక్ష్మమైన నీటి తుంపరలు కలగలిసి ఉంటాయి. మండుతున్న పదార్థాలు, మంట ఉష్ణోగ్రతలపై పొగ రంగు ఆధారపడి ఉంటుంది. దట్టమైన నల్లటి పొగలో ఎక్కువ పరిమాణంలో మసి కణాలుంటాయి. ఈ పొగ ఖనిజ తైలం లేదా కర్బన సంబంధిత పదార్థాలు తక్కువ ఉష్ణోగ్రతలో మండుతున్నప్పుడు ఏర్పడుతుంది. అందులోని మసికణాలు వాటిపై పడే కాంతిని శోషించుకోవడం వల్ల పొగ నల్లగా కనిపిస్తుంది. తక్కువ ఉష్ణోగ్రత కలిగిన మంటలో పొగాకు వంటి తడి ఇంధనం మండేప్పుడు కర్బన కణాలు, బూడిద, నీటి ఆవిరి వెలువడతాయి. ఆ కణాలపై పడే కాంతి పరావర్తనం చెందడం వల్ల ఆ పొగ తెల్లగా కనిపిస్తుంది.

అగ్నిమాపక దళం వారు పొగరంగు, పరిమాణాలను బట్టి మండుతున్న పదార్థాలను గుర్తించగలిగే శిక్షణ పొందుతారు. ఉదాహరణకు ఫర్నిచర్‌ మండుతున్నప్పుడు వెలువడే పొగ బూడిద రంగులో ఉంటుంది. అందులో ప్లాస్టిక్‌ ఎక్కువగా ఉంటే పొగ నల్లగా ఉంటుంది. పొగ పసుపు లేదా గోధుమ రంగులో కనిపిస్తే దానర్థం మంటకు సరిగా ఆక్సిజన్‌ అందడం లేదని, మండే పదార్థాల్లో హైడ్రోకార్బన్లు పూర్తిగా మండడం లేదని అర్థం. ఇలాంటి పొగ వెలువడుతున్న గదులను తటాలున తెరిస్తే వాతావరణంలోని ఆక్సిజన్‌ అంది మంటలు పెరిగి పేలుడు కూడా సంభవించే అవకాశాలు ఉంటాయి. రసాయనిక పదార్థాలు మండుతున్నప్పుడు వచ్చే పొగ ఆకుపచ్చ లేదా ఎరుపు రంగులో ఉంటుంది.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • =====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

గాయాలకు హైడ్రోజన్‌ పెరాక్సైడు స్పిరిట్‌ మందులేల?,How is H2O2 and spirit usefull for wounds?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న: గాయాలను వైద్యులు హైడ్రోజన్‌ పెరాక్సైడుతో లేదా స్పిరిట్‌తో శుభ్రపరుస్తారు. ఎందుకు?

-సీఏ ఈశ్వర్‌, ఇంటర్‌, కరీంనగర్‌

జవాబు: గాయాలు తగిలినప్పుడు చేయాల్సిన ప్రథమ చికిత్స అది పుండుగా మారకుండా చూడడం. పుండు అంటే గాయం చేసిన దారి గుండా బయట ఉన్న సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించి అక్కడ వృద్ధి చెందడమే. అలా అవి చొరబడకుండా చూడడానికి, అప్పటికే గాయంపై చేరిన వాటిని నాశనం చేయడానికి కొన్ని రసాయనాలతో శుభ్రపరుస్తారు. సాధారణంగా ఏకకణ జీవులుగా ఉండే సూక్ష్మజీవులు తమ కణాల్లోంచి నీరు పోయినా, ఆ కణద్రవంలో ఉన్న జీవరసాయనాలు చెదిరిపోయినా బతకలేవు. హైడ్రోజన్‌ పెరాక్సైడుతో గాయాలను కడిగినప్పుడు అది విచ్ఛిత్తి చెందడం ద్వారా వెలువడే ఆక్సిజన్‌ సూక్ష్మజీవుల జీవరసాయనాలతో చర్య జరిపి, వాటిని పనిచేయకుండా చేస్తుంది. అలాగే స్పిరిట్‌లో ప్రధానంగా ఉండే ఆల్కహాలు గాయాల దగ్గరున్న నీటిని, సూక్ష్మజీవుల జీవరసాయనాలను లాగేసి వాటి అభివృద్ధిని నాశనం చేస్తుంది తద్వారా సూక్ష్మజీవులు చస్తాయి.

-ప్రొ .ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ,-జనవిజ్ఞానవేదిక.
  • ============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.