Wednesday, October 19, 2011

సౌరఘటాల మర్మమేమిటి?,What is the secrete of Solar cells?








ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.



ప్రశ్న: సూర్యకాంతిని విద్యుత్‌గా మార్చే సౌరఫలకాలు ఎలా పనిచేస్తాయి. వాటిలో ఏ పదార్థం ఉంటుంది?

-వి. మోహన సూర్యప్రకాశ్‌, ఏలూరు

జవాబు: సౌరఫలకాలను సాధారణంగా సిలికాన్‌ పొరలతో (silicon wafers)తో తయారు చేస్తారు. ఒకో సిలికాన్‌ పొర ఒకో విద్యుత్‌ ఘటం(cell)లాగా పనిచేస్తుంది. అయితే ఒకోదానిలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ చాలా స్వల్పంగా మిల్లీవోల్టులలో మాత్రమే ఉంటుంది. అందువల్లనే వీటిని వందలాది సంఖ్యలో అనుసంధానిస్తారు. ఇక ఇవి ఎలా పనిచేస్తాయో చూద్దాం.

ఒక పదార్థం ద్వారా విద్యుత్‌ ప్రవహించాలంటే అందులో స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు ఉండాలి. రాగి, వెండి, పాదరసం వంటి పదార్థాలలో ఇవి దండిగా ఉండడం వల్లనే వాటిని విద్యుత్‌వాహకాలు(electrical conductors) అంటారు. అయితే సిలికాన్‌ వంటి పదార్థాల్లోకి భాస్వరం, బోరాన్‌, అల్యూమినియం లాంటి పరమాణువుల్ని నింపితే వేర్వేరు రకాల అర్థవాహకాలుగా మారతాయి. ఇలాంటి వేర్వురు అర్థవాహకాలను అనుసంధానించినప్పుడు విద్యుత్‌ శక్మం ఏర్పడుతుంది. సౌరఫలకాలు ఇలా రూపొందించినవే. సూర్యకాంతిలో ఉంచినప్పుడు వీటిలో ఎలక్ట్రాన్ల ప్రవాహం సాగుతుంది. వీటినే కాంతి విద్యుద్ఘటాలు(photo voltaic cells) అంటారు.

-ప్రొఎ. రామచంద్రయ్య, నిట్‌,వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక.










  • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...