Sunday, November 06, 2011

భావాలు కలగడమేల?,Why do we get feelings in Life?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.



ప్రశ్న: మనకు బాధ, కోపం వంటి భావనలు ఎందుకు కలుగుతాయి?,Why do we get feelings of angry and laughter?

-జానపాటి శ్రీనివాస్‌, మిర్యాలగూడ (నల్గొండ)

జవాబు: జీవికి ఆహారం, గాలి, నీరు ప్రధాన అవసరాలు. పరిణతి చెందిన మానవులు లాంటి కొన్ని జీవులు సమూహాలుగా నివసిస్తాయి. మానవ సమూహాన్ని సమాజం అంటాము. మానవుడికి ప్రకృతి సహజమైన ప్రాథమిక అవసరాలతో పాటు స్నేహం, బృందభావన, పరిశీలన, పరిశోధన, ఆలోచన వంటి భావ పరమైన అంశాలు కూడా ఉన్నాయి. సంఘజీవిగా మనిషి ఎదిగే క్రమంలో తనకు ఇష్టమైన, ఇష్టం లేని సంఘటనలను గుర్తించాడు. వాటికి అనుగుణంగా శరీరంలో మార్పులు కలగడం గమనించాడు. శరీరంలో అవాంఛనీయ నాడీ ప్రకంపనలను కలిగించేది దుఃఖంగాను, ఆరోగ్య ప్రకంపనలను బలోపేతం చేసే భావాలను సంతోషంగాను వైద్యశాస్త్రం చెబుతుంది. భావాలు కలగడానికి కారణం మెదడులో ఉత్పన్నమయ్యే కొన్ని రకాల రసాయనాలేనని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటికి అనుగుణంగా నవ్వు, ఏడుపు, చెమటలు పట్టడం, శరీరం వణకడం, గొంతు గాద్గదికం కావడం లాంటి బాహ్య ప్రకటనలు కలుగుతాయి. ఒంటరిగా అడవిలో పెరిగే వ్యక్తికి కోపం, నవ్వువంటి భావాలు కలగవని రుజువైంది. సామాజిక జీవనమే భావప్రకటనలను శరీరానికి అలవాటు చేస్తుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌,--వరంగల్‌; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞానవేదిక.
  • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...