Wednesday, December 07, 2011

Hell and Heaven , నరకము -స్వర్గము



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్ర : నరకము -స్వర్గము అంటే ఏమిటి , What is Hell and Heaven?

జ : నరక లోకము పాపులను శిక్షించే ప్రదేశము . పుణ్యము చెసిన వారికి స్వర్గము, పాపులకు నరకము ప్రాప్తిస్తుంది అని అంటారు.

గాలి-నీరు-భూమి-అగ్ని-ఆకాశం అనే పంచభూతాల సమ్మేళనేమ్ మనిషి. ఈ విశ్వములో ఉన్న 100 లక్షల కోట్ల జీవులలో 84 లక్షల రకాల జీవులు ఉన్నాయని అంచనా. వీటిలో మానవుడు మాటలాడ గలిగే విచక్షణా జ్ఞానము ఉన్న జీవి . తన తోటి మానవులను ఒక క్రమమైన , న్యాయబద్దమైన , ప్రేమపూరితమైన,ఒక నిర్ణీతమైన జీవనవిధానానికి అనేక ఆత్యాధ్మికమైన విధి విధానాలను సృష్టించాడు . వాటిలో కొన్ని --> పుణ్యము - పాపము , మంచి - చెడు , వాయ -వరస , దేవుడు - దెయ్యము, స్వర్గము - నరకము . . .

పాపము : తోటి జీవులకు కష్ట పెట్టే , ఇష్టములేని , నష్టపరిచే పని ఏదైనా పాపమే . . .
పుణ్యము : సహజీవులకు కష్టపెట్టని ,ఇష్టమైన , నష్టపరచని పని ఏదైనా పుణ్యమే . . .

  • మనిషే మనిషికి దేవుడు ,
  • మనిషే మనిషికి దెయ్యము ,
  • మనిషే మనిషికి మిత్రుడు ,
  • మనిషే మనిషికి శత్రువు ,

పరమానందము ఎక్కడో లేదు ... నీ ఆనందాన్ని నలుగురికీ పెంచిపెడితే అదే పరమానందము . ప్రతి జీవిలోనూ దేవుడున్నాడు . ఏకాగ్రతకోసము మనిషి ఊహించుకునే ఆకారమే దేవుని రూపము . ఆల్లా , ఈశ్వర్ , ఏసు మున్నగునవి ఆ కోవలోనివే. అరటి పండు కొబ్బరికాయ నైవేద్యము పెడితే పుణ్యము రాదు . . . మంచిమనసు తో పదిమందిని ఆనందపరిచి వారి ఆకలి తీరే నైవేద్యము పంచిపెడితేనే పుణ్యము .
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...