Wednesday, December 28, 2011

What is Gangotri?, గంగోత్రి అంటే ఏమిటి ?


  • image : courtesy with http://wikipedia.org/

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
Q : గంగోత్రి అంటే ఏమిటి ?

A : గంగోత్రి ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీ జిల్లాలోని ఒకనగర పంచాయితీ. ఇది భాగీరధీ నదీతీరంలో ఉన్న హిందువుల పుణ్యక్షేత్రం. ఇది హిమాలయాల పర్వత శ్రేణులలో 4,042 మీటర్ల ఎత్తులో ఉంది.

గంగోత్రి గంగా నది పుట్టిన ప్రదేశం. గంగాదేవి ప్రతిష్ఠితమైన ప్రదేశం. హిమాలయాలలోని చార్‌ధామ్‌లలో ఒకటి. ఇక్కడ గంగానది భాగీరధి పేరుతో పిలవబడుతుంది. గంగా నదిని భూమికి తీసుకు రావడానికి భాగీరధుడు కారణం కనుక ఆ పేరు వచ్చింది. దేవ ప్రయాగనుండి గంగానదిలో అలకనందా నది ప్రవేశించే ప్రదేశం నుండి గంగా నదిగా పిలవబడుతుంది. గంగానది పుట్టిన ప్రదేశం గౌముఖ్. ఇది గంగోత్రినుండి 40 కిమీటర్ల ఎగువలో పర్వతాలలో ఉంటుంది.

2001 జనాభా లెక్కలననుసరించి ఇక్కడి జనాభా 606. పురుషులు 96%, స్త్రీలు 4%. గంగోత్రి 80% అక్షరాశ్యులను కలిగి ఉంది పురుషుల అక్షరాశ్యత 91%, స్త్రీల అక్షరాశ్యత 48%.
  • ==============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...