Thursday, December 15, 2011

చేపలు తలకిందులవుతాయేం?, Why do fish float belly up after death?


  • image : courtesy with Eenadu Hai bujji.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: చనిపోయిన చేపలు నీటిలో వెల్లకిలా తేలుతాయెందుకు?

జవాబు: ఏ ప్రాణి చనిపోయిన తర్వాతైనా దాని శరీరం నిండా వాయువులు ఉత్పన్నమవుతాయి. చేపల్లో కూడా ఇలాగే జరుగుతుంది. తేలికైన ఈ వాయువుల కారణంగానే చనిపోయిన చేపలు నీటిపైన తేలుతాయి. వాయువులు ముఖ్యంగా చేపల కిందివైపు ఉండే ఉదరభాగంలో ఉత్పన్నమవుతాయి. ఫలితంగా ఉదరభాగం ఉత్ల్పవన (buoynacy) ప్రభావానికి గురవుతుంది. చేపల గరిమనాభి (centre of gravity) ఉదర భాగంలో కేంద్రీకరించి ఉండడంతో ఆ భాగం నీటి ఉపరితలానికి చేరుకుంటుంది. అందువల్లనే చనిపోయిన చేప తలకిందులై వెల్లకిలా తేలుతుంది. తర్వాత కొంత కాలానికి చనిపోయిన చేప విఘటనం (decay) చెంది దాని లోని వాయువులన్నీ విడుదలవడంతో అది నీటిలో మునిగిపోతుంది.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్

  • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...