Sunday, January 08, 2012

Internet , ఇంటర్నెట్ , అంతర్జాలము ,ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే ఏమిటి?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



ప్ర : ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే ఏమిటి? .అది ఎలా పనిచేస్తుంది .

జ : ప్రపంచ వ్యాప్తం గా ఉండే కంప్యూటర్లనన్నింటినీ కలిపే వ్యవ స్థనే 'ఇంటర్నెట్‌-Internet' అంటారు. దీనినే తెలుగులో 'అంతర్జాలం' అని సంబోధిస్తారు. మరింత వివరంగా చెప్పాలంటే ఇంటర్నెట్ నెట్ వర్క్ లను కలిపే నెట్ వర్క్. ఈ వ్యవస్తలో ఉన్న కంప్యూటర్లు ఒకదానితో ఒకటి సంభాషించుకొనేటందుకు ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనే నియమావళిని ఉపయోగిస్తారు. ఆంగ్లంలో Internet అని రాస్తున్నప్పుడు మొదటి అక్షరం అయిన "I"ని ఎల్లప్పుడు కేపిటల్ లెటర్ గానే రాయవలెను. .

1969 సంవత్సరంలో అమెరికా భద్రతా విభాగం అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ప్రాజెక్ట్స అయిన 'ఆర్పా' (ఏఆర్‌ పిఏ) లో తొలిసారిగా ఇంటర్నెట్‌ సృష్టించబడింది.
తర్వాత 1990 సంవత్సరంలో టిమ్‌ బెర్నెల్స్‌ లీ అనే శాస్త్రవేత్త స్విట్జర్లాండ్‌ లోని సెర్న్‌ (సిఇఆర్‌ఎన్‌) వద్ద 'వరల్డ్‌ వైడ్‌ వెబ్‌'ను సృష్టించాడు. దీనినే డబ్ల్యు, డబ్ల్యు. డబ్ల్యు.డబ్ల్యు అని అంటారు. ప్రస్తుతం ఇంట ర్నెట్‌ను మనం సర్వీస్‌ ప్రొవైడర్లకు కొంత మొత్తం డబ్బును చెల్లించి ఇళ్లల్లోనూ, కార్యా లయాల్లోనూ వాడుకోవచ్చును. ఇలా ప్రపం చంలోని కంప్యూటర్లను అన్నింటినీ కలిపే వ్యవస్థనే మనం నేడు 'ఇంటర్నెట్‌' అని పిలు చుకుంటున్నాము.

ఈ వ్యవస్థలో ఉన్న కంప్యూటర్లు ఒక దానితో ఒకటి సంభాషించుకునేందుకు ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ అనే నియమావళిని ఉపయోగిస్తారు. ఇంటర్నెట్‌కు అనుసంధాన మైన ప్రతి కంప్యూటర్‌ ఒక సంఖ్యను కలిగి ఉంటుంది. దీనినే 'ఐపీ అడ్రస్‌' అని పిలు స్తుంటారు. ఇంటర్నెట్‌లోని సందేశాలన్నీ ఈ ఐపి చిరునామా ఆధారంగానే పంపబడతాయి.ఈ వ్యవస్థలో మూడు ముఖ్య భాగాలు ఉంటాయి . 1.Client computer(మన కంప్యూటర్ ) , 2.Browser(అనుసందానము చేసే సాప్ట్ వేర్) 3.server computer(మనకు సందేశాలు పంపే కంప్యూటర్).ఈ సూత్రాన్నే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటారు. ఇందులో ఏఒక్కటి లేకపోయినా ఈ పక్రియ పనిచేయదు . ఇక ఈ ఇంటర్నెట్‌ ద్వారా మనం ఎన్నో పనులను ఇంటి నుంచే చేసుకోవచ్చు. పాతకాలంలో ఉత్తరాలు రాసుకునేవారు. అవి రెండు రోజులకో, మూడు రోజులకో చేరేవి. అలా మనం ఉత్తరం రాసినవారు మనకు తిరిగి జవాబివ్వాలంటే మరో రెండు, మూడు రోజులు పట్టేది. కానీ ఇప్పుడాసమస్య లేదు. సమాచారాన్నంత టినీ కంప్యూటర్ల సహాయంతో మనం క్షణాల్లో చేరవేయాలనుకున్న వారికి చేరవేయవచ్చు. ఇంట్లోనే కూర్చుని మార్కెటింగ్‌, షాపింగ్‌ చేయవచ్చు. సినిమా టిక్కెట్లు,రైల్వే టిక్కెట్లు బుక చేసుకోవచ్చు.

e-మెయిల్‌ (ఎలక్ట్రానిక మెయిల్‌) ద్వారా మన క్షేమ సమాచారాలను దేశ విదేశాలలో ఉన్న బంధువులకు నిముషాల్లో పంపవచ్చు. అలాగే ఇంటర్నెట్‌ సౌకర్యం ద్వారా మన కంప్యూటర్‌కు వెబ్‌ కెమెరాను అమర్చుకొని దేశ విదేశాలలో ఉన్న స్నేహితులతోనో, బంధువులతోనో సంభాషించవచ్చు. ఈ వెబ్‌ కెమెరాను మన కంప్యూటర్‌కు సంధించడం వల్ల మనం నెట్‌ ద్వారా మాట్లాడేటపðడు వారు మనకు కంప్యూటర్‌ స్క్రీన్‌పై ప్రత్యక్షమై, (వారికి వెబ్‌ కెమెరా ఉన్నట్లయితేనే) మన ముందు నిలబడి మాట్లాడిన అనుభూతి కలుగుతుంది. అలాగే కొత్త కొత్త వారితో 'ఛాటింగ్‌' చేయవచ్చు. ఈ సౌకర్యం వల్ల మనం ఇంట్లోనే కూర్చుని ప్రపంచంలో ఏ మూలనున్నవారితోనైనా (వారు మనకు పరిచయం లేకున్నా) గంటలతరబడి బాతాఖానీ కొట్టవచ్చు. ఇక ఈ ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని మీరు కలిగి వుంటే లైబ్రరీకి వెళ్ళి దినపత్రికలు, ప్రముఖుల జీవిత చరిత్రలు చదవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అన్నిటినీ మనం ఇందులోనే చదివి విషయసేకరణ చేయవచ్చు. మనం కోరుకున్న జిల్లా వార్తలను కూడా దినపత్రిక వెబ్‌సైట్లను దర్శించి మనం తెలుసుకోవచ్చు. ఇందుకోసం 'వరల్డ్‌ వైడ్‌ వెబ్‌' ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో వెబ్‌సైటులు, బ్లాగులు లాంటి అనేక సౌకర్యాలుంటాయి. వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ తర్వాత ఎక్కువగా ఉపయోగించేది ఈ-మెయిల్స్‌నే. ఇందులో సమాచారాన్ని పంపవచ్చు, అందుకోవచ్చు. ఇపðడు ఇంటర్నెట్‌లో అన్ని భాషల్లో ప్రత్యేక వెబ్‌ సైట్లు కుప్పలు తెప్పలుగా అందుబాటులోకి వచ్చాయి.

టెక్నాలజీ పుణ్యమా అని ఇంటర్నెట్‌ వల్ల ఎన్నో లాభాలున్నాయి. అలాగే ఎన్నో నష్టాలు కూడా ఉన్నాయి. మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే స్థాయిలో ఉండటం వల్ల దీనిని సద్వినియోగానికి ఉపయోగించాలి. అందుకనే పిల్లలు నెట్‌ ముందు గంటలతరబడి కూర్చుని వుంటే పెద్దలు వారిని ఓ కంట కనిపెడుతూ ఉండడం శ్రేయస్కరం. వాళ్ళు నెట్‌ను ఏయే అవసరాలకు వినియోగిస్తున్నారో గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రుదే! ఒకవేళ వారు చెడుదారిలో నడుస్తుంటే ప్రారంభంలోనే వారికి తగు సలహాలనిచ్చి ఎడ్యుకేట్‌ చెయ్యాలి. గంటల తరబడి నెట్‌ ముందు కూర్చునేవారు క్యాన్సర్‌ బారిన పడే అవకాశం ఉందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అలాగే సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లను ఎక్కువగా సందర్శించేవారు గుండెజబ్బులు, మానసిక రుగ్మతల బారిన పడే అవకాశాలుకూడా ఉన్నాయని కూడా హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.

అందుకే బాలలూ! ఇంటర్నెట్‌ వల్ల లాభనష్టాలు సమంగా ఉన్నాయి. మీరు దానిని సద్వినియోగం చేసుకుంటే ఎంతో విజ్ఞానాన్ని ఆర్జించి మీ భవితలను బంగారు మయం చేసుకోవచ్చు. పరీక్షలలో మంచి ర్యాంకులు సాధించవచ్చు. మీ సబ్జెక్ట నాలెడ్జిని ఇంప్రూవ్‌ చేసుకునేందుకుకూడా ఇంటర్నెట్‌ బాగా ఉపయోగపడుతుంది. ఇలా లాభనష్టాలు కలయిక అయిన ఇంటర్నెట్‌ను ఉపయోగించుకునేదాన్ని బట్టి మనకి ఫలితాలు లభిస్తాయి. మీరు ఈ ఇంటర్నెట్‌ ద్వారా మంచి విజ్ఞానాన్ని సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు కదూ!


  • Courtesy with - బాలప్రభ - ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ .

  • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...