Tuesday, February 14, 2012

అన్నమయ్య ముద్ర అంటే ఏమిటి ? వివరించండి ?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : అన్నమయ్య ముద్ర అంటే ఏమిటి ? వివరించండి ?

జ : మహా భారతమ్లోని అనుశాసన పర్వం లో ఉన్న " శ్రీ విష్ను సహస్రనామ స్తోత్రం " లో విష్ణు నామాల్లో " అన్నం " అనే నామం కూడా ఉన్నది . ఆ స్తోత్రాన్ని విష్ణు ఆలయాల్లో అర్చన కాలం లో అనుదినం పఠిస్తూ ఉంటారు . " అన్నం " విష్ణు నామము కనుక అన్నమయ్య తల్లిదండ్రులు తమ కుమారునికి ఆ పేరు పెట్టారని ఆయన మనుమడు తాళ్ళపాక చిన్నన్న తన కావ్యము లో తెలిపాడు . " అన్నం " బ్రహ్మానికి పేరు గనుక అన్నమయ్యకు ఆ పేరు పెట్టి ఉంటారని కొంతమంది పండితుల భావన .

రోజుకొక సంకీర్తన తక్కువ కాకుండా తన జీవిత పర్యంతము శ్రీవేంకటేశ్వర స్వామికి 32 వేల సంకీర్తనా సుమాలు అర్పించిన అన్నమాచార్యులవారు స్వామి ఆదేశానుసారము తెలుగు , ద్రవిడ , కన్నడ (ఆంధ్ర , తమిళ , కర్ణాటక ) దేశాలలో విస్తారము గా సంచరించాడు . మార్గమధ్యములో వివిధ దేవతా మూర్తుల ఆలయాల్ని దర్శించడం జరిగినప్పుడు ఆయన ఆమూర్తులను స్తుతిసతూ వరాసిన సంకీర్తనల్లో కూడా వీరి చరణము లో ఆ యా దేవత మూర్తులకు - శ్రీ వేంకటేశ్వర స్వామికి అభేదం చూపుతూ విధగా సామి పేరు ప్రస్తావించేవాడు . అలా శ్రీవేంకటేశ్వర నామం అన్నమాచార్యులవారి కీర్తనల్లో " ముద్ర" గా సర్వత్రా కనిపిస్తుంది . ఒక సంకీర్తన అన్నమాచార్యుల వారిదా? కాదా? అని తెలుసుకోవాలంటే ఈ " ముద్ర " యే ఆధారము
  • =================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...