Saturday, February 18, 2012

వెనిల్లా అంటే ఏచిటి ?దాని ఉపయోగాలు తెలపండి?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

వెనిల్లా అనేది ఒక రకమైన సువాసన (flavouring) ద్రవ్యము . వెనిల్లా మొక్కలను సుమారు 1500 లో మెక్షికో లో గుర్తించడము జరిగినది . ఈ మొక్క యొక్క పువ్వులు , కాయలు , పండ్లు మంచి వాసన కలిగి ఉంటాయి. ప్రపంచములో అన్ని దేశాలలో ఇపుడు దీనిని పండిస్తున్నారు .

వెనిల్లా పేరు ఐస్ క్రీములప్పుడు మాత్రమే విని ఉంటారు . అంతకు మించి వెనిల్లా గురించిగాని , దాని విశేషాల గుఎఇంచి గాని చాలా మందికి తెలియదు . వెనిల్లా రుచితో పాటు ఇతర విధాలుగా కూడా వినియోగపడుతుంది .
  • సువాసనలను వెదజల్లగలిగినది వెనిల్లా ఫ్రిజ్ లో పెట్టే పదార్ధముల వల్ల వచ్చే వాసనలను తరిమివేయగలదు . ఒక కాటన్‌ ఉండను వెనిల్లాలో ముంచి ఫ్రిజ్ లోపల అంతా తుడిస్తే చెడువాసనలు పోతాయి.
  • కీటకాలను పారద్రొలేశక్తి వెనిల్లాకు ఉంది . వెనిల్లాలో గుడ్డ ముంచి శరీరము మీద తుడుచుకుంటే ఆ వాసనకు దోమలు రావు .
  • కాలిన గాయాలకు వెనిల్లా రాస్తే చల్ల బరుస్తుంది . గాయము త్వరగా మానేలా చేయగలదు .
  • మణికట్టు ప్రాంతాలలో వెనిల్లా చుక్కలు రాసుకుంటే దానివాసన చాలా సేపు నిలిచిఉంటుంది . పెళ్ళి , పేరంటాలలో అతిధులకు రాయవచ్చును .
  • ఇంటికి పెయింటింగ్స్ వేసేటప్పుడు ఆ పెఇంట్స్ ఘాటైన వాసనకు విరుగుడు గా వెనిల్లా ను వాడవచ్చును . పెయింట్ లో ఒక స్పూన్‌ వెనిల్లా కలిపితే పెయింట్ ఘాటు తగ్గుతుంది .

  • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...