Thursday, February 02, 2012

కాల్చిన ఇటుకలు గట్టిగా ఉంటాయి. ఎందుకు?, Burned bricks are stronger.Why?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



ప్రశ్న: కాల్చిన ఇటుకలు పచ్చిమట్టి కన్నా గట్టిగా ఉంటాయి. ఎందుకు?

జవాబు: పచ్చిమట్టిలో కేవలం విడివిడి మట్టి రేణువులు ఉంటాయి. వీటి మీద నీటి అణువులు ఉండడం, ఈ రేణువులన్నీ కలిసి ముద్దగా ఉండడం వల్ల మనం ఆ ముద్దను ఏ రూపంలోకైనా తీసుకురాగలము. ఇటుకల కోసం వాడే ఎర్రమట్టి ఇలాంటిదే. అయితే ఇటుకలు చేసిన తర్వాత ఆరబెట్టినప్పుడు ఆ ఇసుక, మట్టి రేణువుల మధ్య ఇంకా కొన్ని నీటి అణువులు ఉండడం వల్ల ఆ ఇటుక రూపం అలాగే ఉంటుంది. ఇలాంటి స్థితిలో ఇటుక దిమ్మెలను బట్టీలో అధిక ఉష్ణోగ్రతకు గురి చేసినప్పుడు నీటి అణువులు అక్కడి నుంచి ఆవిరైపోయినా, మట్టిలో ఉన్న విడివిడి రేణువుల్లోని ఉపరితలాల వద్ద కొత్త రసాయనిక బంధాలు ఏర్పడుతాయి. పింగాణీ వస్తువులు, కుండలు, ఇటుకలు, గాజు పదార్థాల తయారీలో ఇలాంటి ఉష్ణ రసాయనిక చర్యలు (Thermo chemical reations) కీలక పాత్ర వహిస్తాయి. ఇలా తయారయ్యే పదార్థాలను కాంపోజిట్లు అంటారు. బట్టీలో తయారయ్యే ఇటుకలు ఓ విధమైన కాంపోజిట్లే.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌,--వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...