Thursday, February 02, 2012

How long human survive without Oxygen?,ఆక్సిజన్‌ లేకుండా ఒక వ్యక్తి ఎంత సేపు జీవించగలడు?


  • image : courtesy with Eenadu news paper.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...




ప్రశ్న: ఆక్సిజన్‌ లేకుండా ఒక వ్యక్తి ఎంత సేపు జీవించగలడు?


జవాబు: ఒక వ్యక్తి ఆక్సిజన్‌ లేకుండా కొన్ని నిమిషాలు మాత్రమే జీవించగలడు. కారణం మెదడులోని కణాలకు ఆక్సిజన్‌ ఎంతో అవసరం. శరీరపు బరువులో మెదడు బరువు 2 శాతమే అయినప్పటికీ, ఒక వ్యక్తి పీల్చుకునే ఆక్సిజన్‌లో 20 శాతాన్ని మెదడే గ్రహిస్తుంది. కాబట్టి దేహానికి రక్తం అందించే ఆక్సిజన్‌ సరఫరా కొన్ని నిమిషాలు ఆగిపోయినా మెదడు స్తంభించిపోతుంది. మెదడు నిర్వర్తించే ప్రక్రియలన్నీ నిలిచిపోవడంతో మరణం సంభవిస్తుంది. మెదడుకు ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోయిన 8 నుంచి 10 సెకన్లలోనే స్పృహ కోల్పోతాడు. అయితే శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే, దేహం వినియోగించుకునే ఆక్సిజన్‌ పరిమాణం తక్కవగా ఉంటుంది కాబట్టి మెదడులోని కణాలు ఎక్కువ సేపు జీవించి ఉండగలవు. ఈ అంశాన్ని బట్టే వైద్యులు గుండెమార్పిడి లాంటి శస్త్రచికిత్సలు చేసేప్పుడు ఉపయోగిస్తారు.


-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...