Friday, February 24, 2012

Navayodhulu , నవయోధులు అంటే ఎవరు?




ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : పురాణాలలో నవయోధులు అంటే ఎవరు ? వారి విశిష్టతలేమిటి?

జ : సూరపద్ముడనే రాక్షసుని వేధింపులౌ భరింపలేక .. ఆ రాక్షస సంహారము చేయమని దేవతలు పరమశివుని వేడుకొనగా ... ఆయన తెరిచిన మూడో కంటినుండి వెలువడిన శక్తే ... సుబ్రమణ్యస్వామి. సుబ్ర మణ్యస్వామి రాక్షస సంహారము చేసే సంర్భములో సహకరించినవారే నవయోధులు . వారు :
  • 1. వీరబాహు ,
  • 2. వీరకేసరి .
  • 3. వీరమహేంద్ర ,
  • 4. వీర మహేశ్వర ,
  • 5. వీరపురంధర ,
  • 6. వీరరాక్షస ,
  • 7. వీరమార్తాండ ,
  • 8. వీరాంతక ,
  • 9. వీరధీర .
వీరు శివుని పుతృలే . పార్వతీదేవి పాదాభరణం లోని విలువైన రాయి రాలి తొమ్మి ది ముక్కలవగా .. ఆ తొమ్మిది రాళ్ళలో ప్రతిబింబించిన పార్వతి రూపాన్ని శివుడు గాంచగా ఆ తొమంది మందికి కలిగిన సంతానమే " నవయోధులు " . రాలిపడి ముక్కలైన ఆ తొమ్మిదే " నవరత్నాలు " నవరత్నాలవంటి మగువలకు శివునికి జన్మించునందువల్లే వారు శక్తివంతులైన యోధులైనారు .
  • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...