Friday, February 03, 2012

pestle stand errect in mortor on eclipse day?,గ్రహణం నాడు రోకలి ఎలా నిలబడుతుంది?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



ప్రశ్న: చంద్ర గ్రహణం సంభవించినప్పుడు రోట్లో రోకలి నిలువుగా నిలబెట్టవచ్చని విన్నాను. ఇది ఎలా సాధ్యం?

జవాబు: ఏదైనా వస్తువును పడిపోకుండా నిలబెట్టాలంటే భూగురుత్వాకర్షణ శక్తి వల్ల దానికి కలిగే భారం (Weight) దాని ఆధార పీఠం (Base) గుండా పయనించగలగాలి. పొడవు ఎక్కువగా ఉండి, పీఠం వైశాల్యం తక్కువగా ఉండే రోకలిలాంటి వస్తువును పడకుండా నిలబెట్టడం కొంత కష్టమైన పనే. కానీ అసాధ్యం కాదు. ప్రయత్నిస్తే నేల మీద లేదా ఏదైనా పళ్లెంలో నిలబెట్టవచ్చు. సన్నని, నిడుపాటి కర్రను కూడా నిలువుగా అరచేతిలోను, చూపుడు వేలు చివరనో బ్యాలన్స్‌ చేయడం మనకు తెలిసిన విషయమే.

విశ్వంలోని ప్రతి రెండు వస్తువుల మధ్య పనిచేసే ఆకర్షణ బలాన్ని గురుత్వాకర్షణ బలం అంటారు. చంద్రగ్రహణం సంభవించినప్పుడు చంద్రుడు, భూమి మధ్య ఉండే గురుత్వాకర్షణ బలం ఎక్కువగా ఉంటుంది. అందువల్లే సముద్రంలో ఆటుపోటుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ బలం వస్తువులపై పని చేసే భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో పనిచేస్తుండటం వల్ల రోకలిని నిలబెట్టడం కొంచెం సులభం అవుతుందంతే. అలాగే కొందరు గ్రహణం నాడు పళ్లెంలో నీళ్లు పోసి ఆ మధ్యలో కూడా రోకలిని నిలబెడతారు. అప్పుడు నీటి అణువుల వల్ల ఏర్పడే అసంజన బలాలు (adhesive forces) కూడా ఇందుకు దోహదపడతాయి. కాబట్టి గ్రహణ సమయంలో రోకలిని నిలబెట్టడం వెనుక మహత్తు లేదు. శాస్త్ర ప్రమేయం ఎంతైనా ఉంది.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...