Tuesday, March 06, 2012

ఓజోన్‌ ఉపయోగమేమిటి? దాన్ని కృత్రిమంగా తయారు చేయలేమా?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: ఓజోన్‌ ఉపయోగమేమిటి? దాన్ని కృత్రిమంగా తయారు చేయలేమా?


జవాబు: ఆక్సిజన్‌ పరమాణువులతో ఏర్పడే ఓ త్రి పరమాణుక అణువు(triatomic molecule) ఓజోన్‌.మనం ప్రతి క్షణం పీల్చే ఆక్సిజన్‌ఓద్విపరమాణుకఅణువు(diatomicmolecule). ఆక్సిజన్‌లో ఉండే రెండు పరమాణవులు రసాయనికంగా ఒకే తరహావి కాగా, ఓజోన్‌లో ఉన్న మూడు పరమాణువులు రసాయనికంగా ఒకే కోవకు, లక్షణానికి చెందినవి కావు. మధ్యలో ఉన్న పరమాణువుకు పాక్షిక ధనావేశిత లక్షణం ఉండగా, చివర్ల ఉన్న రెండు పరమాణువులకు పాక్షిక రుణావేశిత లక్షణాలున్నాయి. అందువల్ల ఓజోన్‌ అణువుకు క్రియాశీలత (reactivity)ఎక్కువ. అందుకనే లేత నీలి రంగులో ఉన్న ఓజోన్‌ వాయువును వివిధ రసాయనిక ప్రక్రియల్లో ఆక్సీకరణి (oxidising agent)గా వాడతారు. ముఖ్యంగా సేంద్రియ పదార్థాల నుంచి కార్బొనేట్‌ పదార్థాల్ని తీసుకురావడంలో దీని వినియోగం చాలా ఎక్కువ. నీటిని సూక్ష్మక్రిముల నుంచి రక్షితం చేయడంలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. భూవాతావరణపు పైపొరలో కాంతి సమక్షంలో ఓజోన్‌ ఏర్పడుతూ జీవజాతుల్ని అతినీల లోహిత కిరణాల నుంచి కాపాడుతూ ఉంటుందని చదువుకుని ఉంటారు. ఓజోన్‌ను కేవలం కృత్రిమ పద్ధతుల్లోనే తయారు చేస్తారు. సాధారణ పరిస్థితుల్లో గాలిలో ఓజోన్‌ ఉండదు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య,నిట్‌, వరంగల్‌; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ==============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...