Wednesday, April 25, 2012

Chemicals are kept in glass bottle-Why?,రసాయనాలను గాజు సీసాల్లోనే పోస్తారేం?

  •  
  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: రసాయనాలను గాజు సీసాలలో నిల్వ చేస్తారెందుకని? వాటిలో ఉంచకూడనివి కూడా ఉంటాయా? మరి వాటినెలా నిల్వ చేస్తారు?

జవాబు: గాజు సీసాల్లో రసాయనాలను ఉంచడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి గాజు రసాయనికంగా స్థిరమైనది. ఆమ్లాలు, క్షారాలు, విషాలు, నూనెలు, సేంద్రీయ పదార్థాలు ఏవీ గాజుతో చర్య చెందవు. రెండోదేమిటంటే గాజు పారదర్శకత వల్ల లోపల ఏముందో, ఎలా ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది.
కాంతి సమక్షంలో చర్యలకు లోనయ్యే కొన్ని రసాయనాలను రంగు గాజు పాత్రలలో ఉంచుతారు. ఉదాహరణకు హైడ్రోజన్‌ పెరాక్సైడు, అసిటోన్‌, బెంజిన్‌ వంటి ద్రవాలను గోధుమ రంగు పారదర్శక గాజు పాత్రల్లో నిల్వ ఉంచుతారు.

ఎలాంటి గాజు సీసాల్లోనూ నిల్వ చేయలేని పదార్థాలు కూడా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు హైడ్రోఫ్లోరిక్‌ ఆమ్లం (HF) ను గాజు పాత్రల్లో ఉంచకూడదు. గాజులోని సిలికేట్లతో అది రసాయనిక చర్య జరపడమే అందుకు కారణం. చటుక్కున మండే దహనశీలత (imflammability) ఉన్న పదార్థాలను కూడా గాజు పాత్రల్లో ఉంచరు. పొరపాటున పగిలితే ప్రమాదం కాబట్టి.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య,నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...