Wednesday, April 25, 2012

సునామీ సంగతేంటి?, What is aboutTsunami?

  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



ప్రశ్న: సునామీలు అంటే ఏమిటి? ఎలా ఏర్పడుతాయి?

జవాబు: భూమి ఏర్పడిన తొలి నాళ్లలో ద్రవరూపంలో ఉండేది. కాలక్రమేణా దాని ఉపరితలం గట్టిపడడంతో భూమిపై దాదాపు 30 కిలోమీటర్ల మందంగా ఉండే ఒక పొర ఏర్పడింది. ఈ పైపొర అంతా రకరకాల ఆకారాల్లో ఉండే విశాలమైన ఫలకాలుగా ఉంటుంది. ఈ ఫలకాలన్నీ భూమి అంతర్భాగంలో ద్రవస్థితిలో ఉన్న లోపలి పొర మేంటిల్‌పై తేలుతూ ఉంటాయి. ఫలకాలు కలుసుకునే సరిహద్దుల్లోనే భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి.

సముద్రపు అడుగున ఉండే భూఫలకాలు ఒరుసుకున్నప్పుడు భారీ మొత్తంలో శక్తి విడుదలయి చాలా పెద్ద అలలు ఏర్పడుతాయి. వీటినే సునామీలు అంటారు సునామీ (Tsunami) పదం జపాను భాషలోని TSU (అంటే హార్బరు), NAMI(అంటే అలలు) అనే పదాల నుంచి ఉత్పన్నమైంది. ఈ విధగా సునామీ అంటే తీరాన్ని చేరుకునే ప్రమాదకరమైన అలలని చెప్పుకోవచ్చు.

సముద్రగర్భాల్లో అగ్నిపర్వతాలు పేలడం వల్ల, భూకంపాల వల్ల, న్యూక్లియర్‌ బాంబు పరీక్షల వల్ల, భూఫలకాలు ఢీకొనడం వల్ల సునామీలు ఏర్పడే అవకాశం ఉంది. సునామీ అలలు జెట్‌ విమానంతో సమానమైన, అంతకుమించిన వేగంతో కూడా ప్రయాణించగలవు. దాదాపు 30 మీటర్ల ఎత్తుగా, గంటకు 160 నుంచి 1000 కిలోమీటర్ల వేగంతో ఏకంగా 200 కిలోమీటర్ల పొడవైన అలలు కూడా ఏర్పడుతాయి. సముద్రంలో ఇవి ఒక మీటరు ఎత్తే ఉన్నప్పటికీ తీరాన్ని చేరేసరికి 30 మీటర్ల ఎత్తుకు చేరిపోతాయి. డిసెంబర్‌ 24, 2004లో సంభవించిన సునామీ అలల పొడవు వందలాది కిలోమీటర్లయితే, వాటి ఎత్తు 10.5 మీటర్లు. అవి తీరానికి చేరుకున్న వేగం గంటకు 480 కిలోమీటర్లు!

  • - ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్


  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...