Tuesday, September 04, 2012

Why do we name cyclones?-తుపానులకు పేర్లెందుకు?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: తుపానులకు థానే, లైలా అంటూ పేర్లు ఎలా పెడతారు?

జవాబు: ఆధునిక సాంకేతిక అభివృద్ధి వల్ల తుపానుల రాక గురించి మనం కొన్ని రోజుల ముందే తెలుసుకోగలుగుతున్నాం. తుపాను హెచ్చరిక కేంద్రాలు, వాతావరణ కేంద్రాలు, ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా తుపాను ఉనికిని, అది ప్రయాణించే దిశను కూడా అంచనా వేసి ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయగలుగుతున్నాం. అంతర్జాతీయ స్థాయిలో పనిచేసే ప్రపంచ వాతావరణ సంస్థ (World Metereological Organisation) వివిధ దేశాల వాతావరణ పరిశోధన సంస్థలను వాటి సమీప సముద్రాల్లో ఏర్పడే తుపానులకు పేర్లు ఇవ్వమని అడుగుతుంది. అలా అకారాది క్రమంలో ఆయా దేశాల వారు ఇచ్చిన పేర్లనే ఆయా ప్రాంతాలను తాకనున్న తుపానులకు కేటాయిస్తారు. ఉదాహరణకు హిందూ మహా సముద్రంలో సంభవించే తుపానులకు భారత దేశం అగ్ని, ఆకాశ్‌, బిజిలి, లాల్‌, లహర్‌, మేఘ్‌, సాగర్‌, వాయు అనే పేర్లు ఇచ్చింది. ఇప్పటికే బిజిలి వరకు పేర్లు అయిపోయాయి. లైలా పేరును పాకిస్థాన్‌ పెట్టింది. థానే పేరును మయన్మార్‌ పెట్టింది. ఆయా దేశాల సామాన్యులు సులువుగా గుర్తు పెట్టుకునేందుకు, తుపానుల ప్రభావాన్ని చారిత్రకంగా నమోదు చేయడానికి తుపానులకు పేర్లు పెడతారు.


- ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌,-వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...