Thursday, October 25, 2012

Do Earth energy diminishes?- భూమి శక్తి అయిపోతుందా?

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: మనం చేసే ప్రతి పనికీ కొంత శక్తి అవసరం. మరి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ పరిభ్రమణం చేస్తోంది కదా, ఆ శక్తి భూమికి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక వేళ ఆ శక్తి అయిపోతే భూమి తిరగడం ఆగిపోతుందా?

జవాబు: ఒక వస్తువును నిరోధ బలాన్ని (resistant force) అధిగమిస్తూ కొంత దూరం జరపవలసినప్పుడే శక్తి అవసరం అవుతుంది. ఒక పదార్థపు ఉష్ణోగ్రతను లేదా శక్తిస్థాయి (energy level)ని తక్కువ విలువ నుంచి ఎక్కువ విలువకు చేర్చడానికీ శక్తి కావాలి. భూమి తన చుట్టూ తాను తిరిగే భ్రమణ (spin) ప్రక్రియలో కానీ, సూర్యుడి చుట్టూ తిరిగే పరిభ్రమణ(revolution) ప్రక్రియలో కానీ భూమి ఎదుర్కొనే ఘర్షణ (friction) లేదా అవరోధ బలం (opposing force) అంటూ ఏవీ లేవు. అంటే భూమి తన భ్రమణ, పరిభ్రమణ ప్రక్రియల్లో శక్తిని ఖర్చు పెట్టవలసిన అగత్యం ఏమీ లేదు. అంటే భూమి కదలికల వెనుక శక్తి పనిచేయడం లేదని కాదు అర్థం. భూమి కదలికలకు అవసరమైన శక్తి తన పుట్టుకతోనే విశ్వజనీనంగా లభ్యమైంది. అలా లభ్యమైన శక్తి ఎంత మాత్రం ఖర్చు కావడం లేదు. అందువల్ల భూమి శక్తి అయిపోవడమనే ప్రశ్నగాని, భూమి ఆగిపోతుందనే భయంగాని అవసరం లేదు.


-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...