Sunday, October 28, 2012

Why donot we remember Childhood memories?- చిన్నప్పటి విషయాలు గుర్తుండవేం?

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: మనకు బాల్యంలో జరిగిన విషయాల గురించి అంతగా జ్ఞాపకం ఉండదు. ఎందుకని?

జవాబు: బాల్యంలోని విషయాలు ముఖ్యంగా పుట్టినప్పటి నుంచి ఐదేళ్ల వయసు వచ్చే వరకు జరిగిన అనుభవాల గురించి జ్ఞాపకం ఉండకపోవడానికి కారణాలు రెండు.
ఒకటి, పిల్లలు పుట్టినప్పుడు వారి మెదడులోని కార్టెక్స్‌ అనే భాగం అంతగా ఏర్పడకపోవడం. ఇది మెదడుకు చేరిన సంకేతాలను ఒక క్రమపద్ధతిలో అమరుస్తుంది. ఈ పెరుగుదల ఎనిమిదేళ్ల వయసు వచ్చేసరికి కానీ పూర్తవదు. ఆ తర్వాతి అనుభవాలను మెదడులోని హిప్పోకాంపస్‌ అనే భాగం గ్రహించడం, ఆపై కార్టెక్స్‌ను చేరడం జరుగుతాయి. ఈ భాగాలు చిన్న పిల్లల్లో పూర్తిగా వికసించకపోవడం వల్ల వారి మెదడులో అప్పటి అనుభవాలు నమోదు కావు.

ఇక రెండో కారణం, మనకు ఏదైనా విషయం జ్ఞాపకం ఉండాలంటే దానికొక అర్థం, సందర్భం ఉండాలి. చిన్నపిల్లల్లో ఆ వయసులో తాము జీవిస్తున్న విషయాన్ని గురించిన పరిజ్ఞానం, అవగాహన అంటూ ఏమీ ఉండవు. దాంతో అపుడు జరిగిన విషయాల గురించి అంతగా ఆలోచించకపోవడంతో ఆ జ్ఞాపకాలను వారి మెదడు నిల్వ చేసుకోలేదు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...