Sunday, December 09, 2012

Why do stars sparkling?-ఆకాశంలోని నక్షత్రాలు మిలమిలా మెరుస్తుంటాయెందుకు?


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: ఆకాశంలోని నక్షత్రాలు మిలమిలా మెరుస్తుంటాయి. ఎందుకు?

జవాబు: రాత్రిపూట నక్షత్రాలు స్థిరముగా కాక మినుకు మినుకు మంటూ మెరుస్తూఉంటాయి. చంద్రుడు స్పస్టము గా కనిపిస్తున్నప్పుడు నక్షత్రాలు మాత్రము మెరవడానికి కారణము అవి చంద్రుడుకన్నా దూరములో ఉండడమే .     'ట్వింకిల్‌ ట్వింకిల్‌ లిటిల్‌ స్టార్‌...' అని పాడినట్టే ఆకాశంలో నక్షత్రాల కేసి చూస్తే అవి మినుకు మినుకుమని మెరుస్తుంటాయి. అయితే భూమి నుంచి చూసినప్పుడే వాటి మిలమిలలు కనిపిస్తాయి. అదే భూవాతావరణాన్ని దాటి అంతరిక్షం నుంచో లేక వాతావరణం లేని చంద్రుడి మీద నుంచో చూస్తే నక్షత్రాలు మెరవవు. అంటే నక్షత్రాల మెరుపులకు కారణం వాతావరణంలో జరిగే మార్పులే.
ఎంతో దూరంలో ఉన్న నక్షత్రాల నుంచి వెలువడే కాంతి కిరణాలు మన కంటిని చేరుకోవడం వల్లనే అవి మనకు కనిపిస్తున్నాయనేది తెలిసిందే. అయితే ఈలోగా అవి మన భూమి వాతావరణంలోని అనేక పొరలను దాటుకుని రావలసి ఉంటుంది. ఈ వాతావరణ పొరలు వివిధ ఉష్ణోగ్రతలు కలిగి ఉండడమే కాకుండా అల్లకల్లోలమైన కదలికలు కలిగి ఉంటాయి. ఆ పొరల గుండా ప్రయాణించే కిరణాలు వికృతీకరణం (distortion) చెందడంతో మన కంటికి మిలమిల లాడుతూ కనిపిస్తాయి.

- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • =====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...