Wednesday, February 29, 2012

గోరింటాకు ఎలా పండుతుంది ?,How Mehindi makes skin Red?


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : గోరింటాకు ఎలా పండుతుంది ?

జ : తోరింటాకు అరచేతులు , అరికాళ్ళు మీద పండినంత ఎర్రగా మిగిలిన శరీర భాగాలమీద పండకపోవడం గమనించే ఉంటారు . అసలు ఈ ఆకుల వల్ల మన చర్మం మీద ఎర్రగా ఎలా పండుతుంది అనుకుంటున్నారా?? ఆకులోని లాసోన్ అనే పదార్ధం చర్మంలోని స్త్రామ్ కార్నియం పొరలోని మృతకణాల ద్వారా లోపలకు ఇంకి చర్మానికి ఎరుపు రంగునిస్తుంది. లాసిన్‌తో పాటు మేనైట్ యాసిడ్, మ్యుసిలేజ్, గాలిక్ యాసిడ్, నాఫ్టాక్వినొన్ లాంటి రసాయనాలు కూడా ఇందులో ఉండడం వల్ల ఇది మంచి కలర్ డైగా వాడుకలో ఉంది. మన శరీరము వెలుపల ఉండే కెరోటిన్‌ కి అంటుకునే గుణము ఈ గోరింటాకుకు ఉంది . మన శరీరములోని వెంట్రుకలు , గోళ్ళు , అరచేతులు , అరికాళ్ళు భాగాలలో కెరోటిన్‌ ప్రోటీన్‌ అధికము . అందుకే ఆభాగాలకు బాగా పట్టి పండుతుంది .

మన దేశంలో పెళ్లికి, గోరింటాకుకు విడదీయలేని అనుబంధం ఉంది అని చెప్పవచ్చు. పెళ్లి లేని గోరింటాకు ఉండవచ్చునేమో కాని గోరింటాకు లేని పెళ్లి సందడి ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఉత్తర భారతీయులైతే పెళ్లికి ముందు మెహెంది అని గోరింటాకు పెట్టుకోవడానికే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. అబ్బాయి తరఫునుండి వచ్చిన గోరింటాకుతో పెళ్లి కూతురుకు అందమైన దిజైన్లు దిద్దుతారు. కొన్ని సంప్రదాయాలలో కొత్త పెళ్లి కూతురి చేతి గోరింటాకు వదిలేవరకు వంటింట్లోకి రాకూడదని అంటారు. అమ్మాయిని అంత అపురూపంగా చూసుకుంటారన్నమాట.

గోరింటాకు రంగు మార్చాలంటే దానిలో కాఫీపొడి లేదా టీ డికాక్షన్‌ వంటివి కలుపుతారు . మన శరీరము లో చర్మములోని కెరోటిన్‌ తోనే గోరింటాకు రియాక్ట్ అవడము చేత ... కాలంతో కెరటిన్‌ మృతకణాలు రాలిపోతాయి . దానితో పాటే గోరింటాకు రంగూపోతుంది. అందుకే గోరింటాకు పెట్టుకున్న తరువాత కొద్దిరోజులే ఆ రంగు ఉంటుంది .


 • ==============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Why is it called Raakhi poornima ?,రాఖీ పూర్ణిమ అని పేరు ఎలా వచ్చింది?


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : శ్రావణ మాసం పూర్ణిమను రాఖీ పూర్ణిమ అని ఆచారములోమి ఎలా వచ్చింది?

జ : శ్రావణ పూర్ణిమ విద్యారంభకాలమని పండితుల అభిప్రాయము . అంటే పూర్వము ఈ రోజున వేదాద్యయనము ప్రారంభించేవారు . దీనికి ముందు యజ్ఞోపవీతధారణ చేయడం మన ఆచారము . యజ్ఞోపవీతాన్నే జంధ్యం అనడం వల్ల ఈ రోజుకి జంధ్యాల పూర్ణిమ అని పేరు వచ్చింది . ఈ పండుగకు పురాణసంబంధమైన ఆచారము కనిపించదు . దీనినే రాఖీ పూర్ణిమ , నార్లీ పున్నమి అనీ అంటారు .

గుజరాత్ కు చెందిన బ్రాహ్మణులు తమ పోషకుల్ని ఈ రోజున సందర్శించి వారి ముంజేతికి రాఖీ కట్టే వారు . వారి నుండి కానుకలు పొందేవారు . రాఖీ అంటే తోరం అని అర్ధము .. . . అందుకే రాఖీ పూర్ణిమ అని పేరొచ్చినది . పట్టు లేదా నూలు దారముతో చేసిన రాఖీకి రకరకాల పూలు , డిజైన్ల బిల్లలు జతచేసి కుడి మణికట్టుకు ముడివేస్తారు .

ఇంకో కదనము ప్రకారము యుద్ధము లో జయము పొందాలని దేవగురువు సలహామేరకు ఇంద్రుని భార్య సతీదేవి భర్తకు శక్తిమయమైన రాఖీని శ్రావణపౌర్ణమి నాడు రక్షణకోసము కట్టడము జరిగినది . రాక్షసులపై ఇంద్రుని విజము పొందడముతో అదొక ఆచారముగా దేవ , దానవ , మానవులలో జరుపుతూ ఉన్నారు . కాలక్రమేణా మానములలో అన్నలు , తమ్ముళ్ళ నుంచి రక్షణ కోరుతూ తమ అనుబంధానికి గుర్తుగా అక్క చెళ్ళెల్లు కట్టే తోరణము గా మారినది . ఓ పెద్ద పండగగా వెలుగొందుతోంది . నేటి సమాజము లో స్నేహితులుగా ఉండే పేమికులలో స్త్రీలు తమవిముఖతను తెలియజేసేందుకు ప్రియునికి రాఖీ కట్టే ఒక మహత్తర మంత్రము గా మారినది .
 • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tuesday, February 28, 2012

భూమి పుట్టుక ఎలా?, Origin of Earth-how?
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: భూమి ఎప్పుడు, ఎలా పుట్టింది? వయసెంత?

జవాబు: భూమి పుట్టలేదు. ఏర్పడింది. ఆధునిక విశ్వ సిద్ధాంతాల (cosmology) ప్రకారం సుమారు 1500 కోట్ల సంవత్సరాల క్రితం ఒక మహా విస్ఫోటం (big bang) ద్వారా శక్తి రూపాంతరం చెంది విశ్వం (universe)గా మారింది. ఆ విశ్వం క్రమేపీ విస్తరిస్తున్న క్రమంలో నెబ్యులాలు అనే మేఘాలుగా పదార్థం క్రోడీకరించుకుంది. ఆ నెబ్యులాలే నక్షత్ర రాశులుగా మారాయి. ప్రతి నక్షత్రం మొదట్లో ఓ వాయు అగ్ని పళ్లెంలాగా ఏర్పడింది. అలాంటిదే సుమారు 600 కోట్ల సంవత్సరాల క్రితం సౌరమండల పళ్లెం (solar disc) రూపుదిద్దుకుంది. అది తన చుట్టూ తాను తిరిగే క్రమంలో అపలంబ బలం(centrifugal force) వల్ల అంచుల్లో ఉన్న ద్రవ్యం గ్రహాలుగా, మధ్యలో భాగం సూర్యుడిగా మారాయి. కాబట్టి భూమి కూడా ఆ సౌరమండల పళ్లెంలో ఒక భాగమే. అంటే భూమి, సూర్యుడు కూడా సోదరులు మాత్రమే. భూమి వయస్సు సుమారు 550 కోట్ల సంవత్సరాలు. ఇది కూడా మొదట్లో సూర్యుడిలాగే స్వయం ప్రకాశకం(self luminiscent). కానీ కేంద్రక సంలీన(nuclear fussion)కు కావలసిన ఉదజని (హైడ్రోజన్‌) తొందరగా ఖర్చు కావడం వల్ల అగ్ని ఆగిపోయి చల్లబడి క్రమేపీ ప్రస్తుత స్థితికి చేరుకుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య,-నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
 • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-/

Saturday, February 25, 2012

What is an iceberg , ఐస్బెర్గ్ అంటే ఏమిటి?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


విడిపోయిన భారీ మంచుముక్కలే సముద్రంలో ఐస్‌బర్గ్‌లుగా మారతాయని తెలుసుగా? ఈ ఐస్‌బర్గ్‌ ఏకంగా హైదరాబాద్‌ నగరంకన్నా పెద్దగా ఉంటుంది! ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడున్న అంటార్కిటికా .. ఐస్‌బర్గ్‌లలో అతిపెద్దదిగా రికార్డు కొట్టింది. దాదాపు 563 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్నది . ఇది ఏకంగా 1640 అడుగుల మందంతో ఉంటుంది. నీటిపైన కనిపించేది మాత్రం 160 అడుగులే.

ఐస్‌బర్గ్‌ల గురించి తెలుసుకోవాలంటే ముందు హిమానీ నదుల (గ్లాషియర్స్‌) గురించి అర్థం చేసుకోవాలి. కొండల్లాంటి ఎత్తయిన ప్రదేశాల్లో ఏర్పడే మంచు నెమ్మదిగా గట్టిపడి ముందుకు జరుగుతూ ఉంటుంది. ఇలా ఇవి పల్లానికి జరుగుతూ నేలను కూడా కోతకు గురి చేస్తాయి. ఇవి కరిగినప్పుడు వీటి నుంచే నదులు ఏర్పడి కిందకి ప్రవహిస్తాయి. అలా 'పైన్‌ ఐలాండ్‌' అనే హిమానీ నది నుంచి ఈ ఐస్‌బర్గ్‌ విడివడనుందన్నమాట. శాస్త్రవేత్తలు దీన్ని ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎందుకో తెలుసా? ఐస్‌బర్గ్‌ ఏర్పడే ప్రక్రియ తొలిసారిగా శాస్త్రవేత్తల కంటపడింది. దీన్ని ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలు తీసి గమనిస్తున్నారు. వాతావరణంలో ఏర్పడే కొన్ని మార్పుల గురించి కూడా తెలుసుకోవచ్చని అంటున్నారు.

లక్షలాది టన్నుల బరువుండే ఐస్‌బర్గ్‌లు తేలుతూ సముద్రంలో ప్రయాణిస్తుంటాయి. ఉష్ణోగ్రతలు పెరగ్గానే ఇవి చిన్న ముక్కలుగా విడిపోయి సముద్రంలో కలిసిపోతాయి. ఐస్‌బర్గ్‌ల వల్ల ఓడలకు ప్రమాదమే. టైటానిక్‌ ఓడ ఐస్‌బర్గ్‌ను ఢీకొట్టే మునిగిపోయిందని తెలుసుగా?
ఇన్నాళ్లూ బి-15 అనే ఐస్‌బర్గ్‌కు అతిపెద్దదిగా రికార్డు ఉంది. 2001లో ఏర్పడిన ఇది(అంటార్కిటికా) ఏకంగా 295 కిలోమీటర్ల పొడవు, 37 కిలోమీటర్ల వెడల్పు ఉండేది. ఇక దీని బరువు 300 బిలియన్‌ టన్నులుగా అంచనా వేశారు. కొన్నేళ్లకు ఇది ముక్కలైపోయింది.


 • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, February 24, 2012

అర్ధనారీశ్వరుడంటే ఎవరు , ఆపేరు ఎలా వచ్చింది ?


 • image : courtesy with http://shaktisadhana.50megs.com/Newhomepage/shakti/shivanshakti2.html.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : అర్ధనారీశ్వరుడంటే ఎవరు , ఆపేరు ఎలా వచ్చింది ?

జ : పార్వతీ పరమేశ్వరులు ఒకటిగా ఉండడాన్ని అర్ధనారీశ్వరము అని హిందూ పురాణాలలో చెప్పబడి ఉంది . తలనుండి కాలి బొటనవేలివరకూ సమానము గా అంటే నిలువుగా చెరిసగముగా ఉన్న మగ , ఆడ రూపాలు ఒకటిగా ఉండడము . అర్ధ (సగమైన ) నారి (స్త్రీ) , ఈశ్వర (సగమైన పురుషుడు) రూపము (కలిగిఉన్న రూపము) అవుతుంది . తల ఆలోచనకి , పాదము ఆచరణికి సంకేతాలైతే , పార్వతీపరమేశ్వరులు తలనుండి కాలివరకు సమముగా నిలువుగా ఉంటారంటే ఇద్దరి ఆలోచనలూ, ఆచరణలూ ఒక్కటే అన్నమాట .

లోకములో భార్యా భర్తలు అన్యోన్యముగా తప్పు అయినా ఒప్పు అయినా ... ఆచరణలోనూ ,ఆలోచనలోనూ కర్మలలోను , కార్యాలలోను , నిర్ణయాలలోనూ , నిర్మాణాలలోనూ ఒకటిగా సెరిగగముగా ఉండాలని హిందూపురాణాలు అర్ధనారీశ్వరాన్ని చూపడము జరిగింది .

పరమేశ్వరుని , అంబికను ఏకభావముతో , భక్తితో సేవించాలి . అప్పుడే అధిక శుభము కలుగుతుంది . ఇరువురియందును సమాన ప్రీతి ఉండవలెనన్న ... ఆ ఇరువురియందు మాతాపితృ భావము ఉండాలి .అర్ధనారీశ్వరుడు

లయకారుడిగా శివుడికి అధికారం అధికంగా ఉండాలి. ఆ అధికారాన్నే... పార్వతి, దుర్గ, శక్తి రూపాలుగా పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంటే ఆ శక్తిని ఆయన తనలో భాగంగా ధరించాలి. శివుడు, శక్తి... కలిసి పనిచేయడమంటే, స్త్రీపురుషులు సమానమేనని అంతరార్థం. ఈ సంప్రదాయాన్ని చూపడానికే శివుడు + శక్తి కలిసి అర్ధనారీశ్వరుడిగా దర్శనమిస్తారు. శివుడు లేకుండా శక్తి, శక్తి లేకుండా శివుడు ఉండరు. శక్తితో కలిసిన శివుడిని సంపూర్ణుని (సగుణబ్రహ్మ) గా, శక్తితో లేనప్పుడు అసంపూర్ణుని (నిర్గుణబ్రహ్మ) గా పండితులు చెబుతారు.

ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు కదా. అందుకే కాలం కూడా స్త్రీ పురుష రూపాత్మకమైంది. చైత్రం మొదలు భాద్రపదం వరకు అర్ధభాగం పురుష రూపాత్మకం. ఆశ్వయుజంనుంచి ఫాల్గుణం చివరి వరకు గల కాలం స్త్రీ రూపాత్మకం.

అర్ధనారీశ్వరుడు అవతరించినది మాఘ బహుళచతుర్ధశి రోజైన మహాశివరాత్రి నాడు

ఆది దంపతులు - జగత్పితరులు
'జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ' అని స్తుతిస్తుంటారు. జగత్తుకంతటికీ తల్లిదండ్రులలాంటి వారు ఆ పార్వతీపరమేశ్వరులు. ఈ ఆది దంపతులు ఇద్దరూ దేహాన్ని పంచుకొని అర్ధనారీశ్వర అవతారంతో కన్పించటం కూడా అందరికీ తెలిసిందే. ఇంతకీ ఆ శివుడు అర్ధనారీశ్వరుడు ఎప్పుడయ్యాడు? ఆ అమ్మకు తన దేహంలో సగభాగాన్ని ఎలా కల్పించాడు? అసలు దాని వెనుక ఉన్న ప్రధాన కారణమేమిటీ? అనే విషయాలను వివరించి చెబుతుంది ఈ కథాసందర్భం. ఇది శివపురాణంలోని శతరుద్ర సంహితలో కన్పిస్తుంది. నందీశ్వరుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుడికి ఈ కథను వివరించాడు. పూర్వం బ్రహ్మదేవుడు ప్రజలను వృద్ధి చేయటం కోసం తనదైన పద్ధతిలో సృష్టిని చేయసాగాడు. అలా తానొక్కడే ప్రాణులను రూపొందిస్తూ జీవం పోస్తూ ఎంతకాలంగా తన పనిని తాను చేసుకుపోతున్నా అనుకున్నంత సంఖ్యలో ప్రజావృద్ధి జరగలేదు. ఇందుకు ఎంతగానో చింతిల్లిన బ్రహ్మదేవుడు పరమేశ్వరుడిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. బ్రహ్మ చేసిన కఠిన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. సగం పురుషుడు, సగం స్త్రీ రూపం గల దేహంతో ఆ శివస్వరూపం వెలుగొందసాగింది. పరమ శక్తితో కూడి ఉన్న ఆ శంకరుడిని చూసి బ్రహ్మదేవుడు సాష్టాంగ ప్రణామం చేసి అనేక విధాల స్తుతించాడు. అప్పుడు శివుడు బ్రహ్మదేవుడితో బ్రహ్మ సృష్టికి సహకరించటానికే అర్ధనారీశ్వర రూపాన్ని తాను ధరించి వచ్చినట్లు చెప్పాడు. అలా పలుకుతున్న శివుడి పార్శ్వ భాగం నుంచి ఉమాదేవి బయటకు వచ్చింది. బ్రహ్మదేవుడు ఆ జగనాత్మను స్తుతించి సృష్టి వృద్ధి చెందటం కోసం సర్వసమర్థమైన ఒక రూపాన్ని ధరించమని, తన కుమారుడైన దక్షుడికి కుమార్తెగా జన్మించమని బ్రహ్మదేవుడు ఉమాదేవిని ప్రార్థించాడు. ఆమె బ్రహ్మను అనుగ్రహించింది. ఆ వెంటనే భవానీదేవి కనుబొమల మధ్య నుంచి ఆమెతో సమానమైన కాంతులు గల ఒక దివ్యశక్తి అక్కడ అవతరించింది. అప్పుడా శక్తిని చూసి పరమేశ్వరుడు బ్రహ్మ తపస్సు చేసి మెప్పించాడు కనుక ఆయన కోర్కెలను నెరవేర్చమని కోరాడు. పరమేశ్వరుని ఆజ్ఞను ఆమె శిరసావహించింది. బ్రహ్మదేవుడు కోరినట్లుగానే అనంతరం ఆమె దక్షుడికి కుమార్తెగా జన్మించింది. ఆనాటి నుంచి ఆ లోకంలో నారీ విభాగం కల్పితమైంది.

సృష్టి ఆవిర్భావం
స్త్రీ, పురుష సమాగమ రూపమైన సృష్టి ఆనాటి నుంచి ప్రవర్తిల్లింది. స్త్రీ శక్తి సామాన్యమైనది కాదని, ప్రతివారు స్త్రీ మూర్తులను గౌరవించి తీరాలని ఆదిదేవుడు, ఆదిపరాశక్తి ఇద్దరూ సమానంగా ఎంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారో ఈ లోకంలో ఉండే పురుషులతో స్త్రీలు కూడా అంతే శక్తిసామర్థ్యాలు కలిగి ఉన్నారనే విషయాన్ని ఈ కథాసందర్భం వివరిస్తుంది. అంతేకాక స్థితి, లయ కారకులలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తొలుత తాను ఒంటరిగా సృష్టిని ప్రారంభించిన దానివల్ల ఎక్కువ ఫలితం కలగలేక పోయిందని, పరమేశ్వర అనుగ్రహంతో స్త్రీత్వం అవతరించిన తర్వాతే సృష్టి విశేషంగా పరివ్యాప్తమైందని ఈ కథ వివరిస్తోంది. స్త్రీ శక్తి విశిష్టతను తెలియచెప్పేందుకు పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి అర్ధనారీశ్వర రూపంలో అవతరించాడు. కనుక పురుషాధిక్యాన్ని ప్రదర్శించటం కానీ, స్త్రీలను, స్త్రీ శక్తిని కించపరచటం కానీ ఎంతమాత్రం దైవహితం కాదనే విషయాన్ని ఈ కథలో మనం గమనించవచ్చు.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు(ఈనాడు దిన పత్రిక ).

లోకం లో సహజం గా వినిపించే మాట పురుషుడే అధికుడని . శంకరుని విషయములో అది సరికాదు . శంకరుడు తన భార్య పార్వతిని నిరంతరము గౌరవిస్తూనే ఉంటాడు . పార్వతితో తనకు వివాహము కాకముందు తానే స్వయముగా మారు రూపములో ఓ బ్రహ్మచారి వేషములో ఆమె వద్దకు వెళ్ళి -- శంకరునికి తల్లిదండ్రులెవరో ఎవరికీ తెలియదని బూడిదమాత్రమే ఒంటికి పూసుముటాడని , ఇల్లు లేని కారణముగా శ్మశానములోనే ఉంటాడని , నిత్యము బిక్షకోసము తిరుగుతూ ఉంటాడని , బిక్షపాత్రకూడా లేని కారణముగా పర్రెని బిక్షపాత్రగా ధరిస్తాడని ... ఇలా ఉన్నది ఉన్నట్లుగా తన కాబోయే భార్యకి నిజాన్ని చెప్పిన ఒకేఒక్క ప్రియుడు శంకరుడు . లోకములో ప్రేముకులందరికీ ఒక తీరుగా మార్గదర్శకుడు కూడా.

తనకంటే తన భార్య పార్వతి బాగా ఆలోచించగలదని తెలిసి తనకంటే జ్ఞానవతిగా ఆమెను గుర్తించి నిరంతరము ఆమె వద్దకు వెళ్ళి భిక్ష యాచిస్తాడు శంకరుడు . ఆయన చేతిలో పుర్రె మన తలమీది పైభాగానికి సాంకేతం , ఆమె పెట్టే అన్నము జ్ఞానాని సంకేతము కాబట్టి ఆయన ఆ అన్నపూర్ణ నుండి గ్రహించేది " జ్ఞాన (అన్న) భిక్ష " తప్ప మనలా అన్నము మాత్రము కానేకాదు . అందుకే

" అన్నపూర్ణే ! సదాపూర్ణే ! శంకరప్రాణవల్లభే ! జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం భిక్షాం దేహి చ పార్వతి !. అంటుంది శ్లోకము .

/మైలవరపు శ్రీనివాసరావు ( స్వాతి వారపత్రిక నుండి)
 • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Navayodhulu , నవయోధులు అంటే ఎవరు?
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : పురాణాలలో నవయోధులు అంటే ఎవరు ? వారి విశిష్టతలేమిటి?

జ : సూరపద్ముడనే రాక్షసుని వేధింపులౌ భరింపలేక .. ఆ రాక్షస సంహారము చేయమని దేవతలు పరమశివుని వేడుకొనగా ... ఆయన తెరిచిన మూడో కంటినుండి వెలువడిన శక్తే ... సుబ్రమణ్యస్వామి. సుబ్ర మణ్యస్వామి రాక్షస సంహారము చేసే సంర్భములో సహకరించినవారే నవయోధులు . వారు :
 • 1. వీరబాహు ,
 • 2. వీరకేసరి .
 • 3. వీరమహేంద్ర ,
 • 4. వీర మహేశ్వర ,
 • 5. వీరపురంధర ,
 • 6. వీరరాక్షస ,
 • 7. వీరమార్తాండ ,
 • 8. వీరాంతక ,
 • 9. వీరధీర .
వీరు శివుని పుతృలే . పార్వతీదేవి పాదాభరణం లోని విలువైన రాయి రాలి తొమ్మి ది ముక్కలవగా .. ఆ తొమ్మిది రాళ్ళలో ప్రతిబింబించిన పార్వతి రూపాన్ని శివుడు గాంచగా ఆ తొమంది మందికి కలిగిన సంతానమే " నవయోధులు " . రాలిపడి ముక్కలైన ఆ తొమ్మిదే " నవరత్నాలు " నవరత్నాలవంటి మగువలకు శివునికి జన్మించునందువల్లే వారు శక్తివంతులైన యోధులైనారు .
 • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

పంచభూత లింగాలు ఏవి ? అవి ఎక్కడ ఉన్నాయి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్ర : పంచభూత లింగాలు ఏవి ? అవి ఎక్కడ ఉన్నాయి?

జ : లింగరూపం గా ఉండే శంకరుడు పంచభూతాలకి ప్రతీకగా ఐదు చోట్ల లింగాకారములో ఉన్నాడు . పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగములను పంచభూతలింగాలు అంటారు.

1. పృథ్విలింగం:


ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.

2. ఆకాశలింగం:
ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు.

3. జలలింగం:-


ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడు లోని తిరుచునాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతక నివారణకోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరువచ్చెను.
4. తేజోలింగం:-


తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది. అరుణాచల శిఖరాగ్రం పై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు. అమ్మవారి పేరు అరుణాచలేశ్వరి.

5. వాయులింగం:-

ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయంలోని లింగమే వాయులింగం. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు. అమ్మవారి పేరు ఙ్ఞానప్రసూనాంబ. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం.

 • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Saturday, February 18, 2012

వెనిల్లా అంటే ఏచిటి ?దాని ఉపయోగాలు తెలపండి?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

వెనిల్లా అనేది ఒక రకమైన సువాసన (flavouring) ద్రవ్యము . వెనిల్లా మొక్కలను సుమారు 1500 లో మెక్షికో లో గుర్తించడము జరిగినది . ఈ మొక్క యొక్క పువ్వులు , కాయలు , పండ్లు మంచి వాసన కలిగి ఉంటాయి. ప్రపంచములో అన్ని దేశాలలో ఇపుడు దీనిని పండిస్తున్నారు .

వెనిల్లా పేరు ఐస్ క్రీములప్పుడు మాత్రమే విని ఉంటారు . అంతకు మించి వెనిల్లా గురించిగాని , దాని విశేషాల గుఎఇంచి గాని చాలా మందికి తెలియదు . వెనిల్లా రుచితో పాటు ఇతర విధాలుగా కూడా వినియోగపడుతుంది .
 • సువాసనలను వెదజల్లగలిగినది వెనిల్లా ఫ్రిజ్ లో పెట్టే పదార్ధముల వల్ల వచ్చే వాసనలను తరిమివేయగలదు . ఒక కాటన్‌ ఉండను వెనిల్లాలో ముంచి ఫ్రిజ్ లోపల అంతా తుడిస్తే చెడువాసనలు పోతాయి.
 • కీటకాలను పారద్రొలేశక్తి వెనిల్లాకు ఉంది . వెనిల్లాలో గుడ్డ ముంచి శరీరము మీద తుడుచుకుంటే ఆ వాసనకు దోమలు రావు .
 • కాలిన గాయాలకు వెనిల్లా రాస్తే చల్ల బరుస్తుంది . గాయము త్వరగా మానేలా చేయగలదు .
 • మణికట్టు ప్రాంతాలలో వెనిల్లా చుక్కలు రాసుకుంటే దానివాసన చాలా సేపు నిలిచిఉంటుంది . పెళ్ళి , పేరంటాలలో అతిధులకు రాయవచ్చును .
 • ఇంటికి పెయింటింగ్స్ వేసేటప్పుడు ఆ పెఇంట్స్ ఘాటైన వాసనకు విరుగుడు గా వెనిల్లా ను వాడవచ్చును . పెయింట్ లో ఒక స్పూన్‌ వెనిల్లా కలిపితే పెయింట్ ఘాటు తగ్గుతుంది .

 • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, February 17, 2012

చేపల వాసన వదిలేందుకు చిట్కాలు .ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : మేము ఇంటిల్లపాది చేపల కూర తింటాము . చేపలు వండేవారి , తినేవారి చేతులు కంపు పోయేందుకు కొన్ని చిట్కాలు చెప్పగలరా?

జ : చేపలను తినడానికి ఇస్టపడేవారు కూడా భరించలేని వాసన చేపలలో ఉంటుంది . చేతులతో పట్టుకున్నా , వంట చేసినా చేపల వాసన అంత త్వరగా వదలదు . ఆ వాసన వదిలించుకునేందుకు ఇంటిలోని పదార్ధాలే చాలు .
 • వాటిలో ముఖ్యమైనది నిమ్మ . నిమ్మ రసముతో చేతులు కడుగుకున్నా , నిమ్మ చెక్కలతో చేతులు తుడుచుకున్నా చేపలవాసన వదులుతుంది .
 • గిన్నెలు కడిగేందుకు ఉపయోగించే పొడిని ద్రవముగా చేసి దానికు ఒక స్పూన్‌ ఉప్పును కలిపి దానితో చేతులు కడుగుకుంటే చేపల వాసన పోతుంది.
 • వంటసోడా కి నీటిని కలిపి ముద్దలా తయారుచేసి ఆ ముద్దతో చేతులు కడుక్కోవాలి .. వాసన పోతుంది .
 • సారా చేతుల మీద చల్లుకొని దానిని నీటితో కడుక్కుంటే చేపల వాసన వదులుతుంది .
 • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tuesday, February 14, 2012

శ్రీకాకుళం అంటే అర్ధము...ఆఊరి కధ ఏమిటి ? , What is the meaning and story of Srikakulam?


 • http://3.bp.blogspot.com/_oIowsJflyGQ/SrqzzyXHEWI/AAAAAAAAATw/kpIfDox7NUc/s1600/Mandals-srikakulam111.jpg
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

శ్రీకాకుళం అను పేరుతో రెండు ఊర్లు ఉన్నాయి. ఒకటి(1) కృష్ణా జిల్లలో దివితాలుకా లోని చిన్న గ్రామము . రెండు(2) శ్రీకాకుళము జిల్లాలో జిల్లాకేంద్రము అయిన శ్రీకాకుళం పట్టణము .

(1)-శ్రీకాకుళం లోని " శ్రీ" అంటే లక్ష్మి , సంపద , శుభప్రదము అని అర్ధాలు .
" కా" అనే ద్రావిడ పదానికి అర్ధము : ఆధారము , రక్షకుడు , ప్రభువు , దైవము .
" కుళం " అంటే కొలను అని అర్ధము .
ఫలితార్ధము = శుభప్రదమైన దేవుని కొలను . ఇది కృష్ణానదీ తీరము లో ఉన్న ఆంధ్రనాయక స్వామి ఆలయము . ఈ స్వామినే తెలుగు రాయడు , తెలుగు వల్లభుడు అని అంటారు .

(2)- పూర్వము ఆంగ్లేయ పరిపాలన కాలములో శ్రీకాకుళం ప్రాంతాన్ని ఖజానా నిలువా ఉంచే (ఠంక శాల) ప్రదేశము(Treasury) గా వాడేవారు . ఇక్కడ నాణేల సంచులు మూటలు కట్టి దాచేవారని. సంభందిత అధికారులు వచ్చి మూటలు విప్పి లెక్కించేవారని అంటారు . ఇక్కడ హిందీ లో సిక్కా అంటే నాణెం (డబ్బు)सिक्का=Coin అని . కుళా అంటే खुला = Open అని అర్ధము . కావున అర్ధాన్ని బట్టి .. ఈ ప్రాంతాన్ని సిక్కాకోల్ గా పిలిచేవారని అంటారు. కాలక్రమేనా... సిక్కాకోల్ '' సిక్కోల్ '' గాను , తదుపరి '' శ్రీకాకుళం '' గాను నామకరణము చేయబడినది .'' శ్రీ'' అంటే లక్ష్మి (Money) , ''కా'' అంటే దైవము , " కుళం " అంటే కొలను లేదా ప్రవాహము అని అర్ధము. శ్రీకాకుళం , జిల్లా ముఖ్యపట్టణము మరియు జిల్లా పేరు . ఈ జిల్లాలో 38 మండళాలు , 5 మున్సిపాలిటీలు ఉన్నాయి


 • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

What is Chandramaanam? ,చాంద్రమానం అంటే ఏమిటి ?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


చంద్రుడు భూమికి ఉపగ్రహము . చంద్రుడు భూమిని చుట్టివచ్చే గమనాన్ని బట్టి చేసిన కాలగణనను చాంద్రమానము అంటారు . పడవమనుండి తూర్పుకు తిరుగుతూ చంద్రుడు 27 1/3 రోజులకు ఒకసారి భూప్రదక్షిణ పూర్తిచేస్తాడు . ఆ కాలాన్ని ఒక మాసము (నెల) అన్నారు .

చంద్రుడు చాయను భూమి నుండి చూసినపుడు పెరుగుతున్నట్లు ... తరుగుతున్నట్లు కనిపిస్తుంది . పెరిగే 15 రోజులను శుక్లపక్షమని . . తరిగే 15 రోజులను కృష్ణపక్షమని అంటారు . అంటే మాసము (14+1) రెండు పక్షాలుగా విభజించారు . పక్షములోని రోజులను తిధులు గా విభజించారు . కృష్ణపక్షములో తిధుల చివర అమావాస్య , శుక్లపక్షములో తిధుల చివర పౌర్ణమి వస్తాయి. ఇదే చాంద్రమానము .
 • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

అన్నమయ్య ముద్ర అంటే ఏమిటి ? వివరించండి ?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : అన్నమయ్య ముద్ర అంటే ఏమిటి ? వివరించండి ?

జ : మహా భారతమ్లోని అనుశాసన పర్వం లో ఉన్న " శ్రీ విష్ను సహస్రనామ స్తోత్రం " లో విష్ణు నామాల్లో " అన్నం " అనే నామం కూడా ఉన్నది . ఆ స్తోత్రాన్ని విష్ణు ఆలయాల్లో అర్చన కాలం లో అనుదినం పఠిస్తూ ఉంటారు . " అన్నం " విష్ణు నామము కనుక అన్నమయ్య తల్లిదండ్రులు తమ కుమారునికి ఆ పేరు పెట్టారని ఆయన మనుమడు తాళ్ళపాక చిన్నన్న తన కావ్యము లో తెలిపాడు . " అన్నం " బ్రహ్మానికి పేరు గనుక అన్నమయ్యకు ఆ పేరు పెట్టి ఉంటారని కొంతమంది పండితుల భావన .

రోజుకొక సంకీర్తన తక్కువ కాకుండా తన జీవిత పర్యంతము శ్రీవేంకటేశ్వర స్వామికి 32 వేల సంకీర్తనా సుమాలు అర్పించిన అన్నమాచార్యులవారు స్వామి ఆదేశానుసారము తెలుగు , ద్రవిడ , కన్నడ (ఆంధ్ర , తమిళ , కర్ణాటక ) దేశాలలో విస్తారము గా సంచరించాడు . మార్గమధ్యములో వివిధ దేవతా మూర్తుల ఆలయాల్ని దర్శించడం జరిగినప్పుడు ఆయన ఆమూర్తులను స్తుతిసతూ వరాసిన సంకీర్తనల్లో కూడా వీరి చరణము లో ఆ యా దేవత మూర్తులకు - శ్రీ వేంకటేశ్వర స్వామికి అభేదం చూపుతూ విధగా సామి పేరు ప్రస్తావించేవాడు . అలా శ్రీవేంకటేశ్వర నామం అన్నమాచార్యులవారి కీర్తనల్లో " ముద్ర" గా సర్వత్రా కనిపిస్తుంది . ఒక సంకీర్తన అన్నమాచార్యుల వారిదా? కాదా? అని తెలుసుకోవాలంటే ఈ " ముద్ర " యే ఆధారము
 • =================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, February 08, 2012

మొనాకో దేశం సంగతేమిటి ?, What is about Monaco Country?


 • image : courtesy with Andhrabhoomi Sunday magazine.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్ర : మొనాకో దేశం సంగతేమిటి ?, What is about Monaco Country?
జ : యూరప్‌లో పర్యాటకులని ఆకర్షించే ఓ చిన్న దేశం ఇది. ప్రపంచంలోని రెండో చిన్నదేశం వాటికన్ సిటీ. మొదటిది అయిన మొనాకో ప్రపంచంలో అధిక జనసాంద్రత గల దేశం. ఫ్రాన్స్, ఇటలీల మధ్యగల మొనాకో విస్తీర్ణం రెండు చదరపు కిలోమీటర్లే! జనాభా 35,986. ప్రపంచంలో అధిక కాలం జీవించేది కూడా మొనాకో దేశస్థులే - తొంభై ఏళ్లు! నిరుద్యోగం జీరో పర్సంట్! ఫ్రాన్స్, ఇటలీల నించి ప్రతిరోజూ ఈ దేశంలోకి నలభై వేల మంది ఉద్యోగులు వచ్చి పని చేసి వెళ్తూంటారు. మెడిటరేనియన్ సీ తీరాన గల మొనాకోకి పాయింట్ సెవెన్ కిలోమీటర్ల విస్తీర్ణం మేర సముద్రాన్ని పూడ్చి భూభాగాన్ని పెంచారు.
ఇక్కడ 1297 నించి రాజ్యాంగబద్ధమైన రాజరికం కొనసాగుతోంది. ప్రిన్స్ ఆల్బర్ట్-2 నేటి రాజు. దీని రక్షణ బాధ్యత ఫ్రాన్స్ దేశానిది. ఇక్కడి మోంటీ కార్లో నగరం పర్యాటకులని అధికంగా ఆకర్షిస్తుంది. అందుకు కారణం అక్కడ గల జూదగృహాలు.
లీగ్రాండ్ కేసినో ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. అందులో సినిమా థియేటర్, బాలే థియేటర్ మొదలైన వినోదాలు ఉన్నాయి. రాజ కుటుంబం భాగస్వాములుగా ఓ పబ్లిక్ కంపెనీ దీన్ని నిర్వహిస్తోంది. మోంటీ కార్లోలోనే కాక మొనాకో అంతటా నైట్ క్లబ్స్ విస్తారంగా ఉంటాయి. రౌలెట్, స్టడ్‌పోకర్, బ్లాక్‌జాక్, క్రాప్స్, బకారట్ లాంటి జూదాలు, స్లాట్ మెషీన్స్ అన్ని కేసినోలలో ఉంటాయి. తమాషా ఏమిటంటే మొనాకన్స్ - అంటే మొనాకో దేశస్థులకి మాత్రం వీటిలోకి ప్రవేశం లేదు. ప్రతీ కేసినో బయట సందర్శకుల పాస్‌పోర్ట్‌లని తనిఖీ చేసే లోపలికి పంపుతారు. ఈ దేశపు ప్రధాన ఆదాయం కేసినోల నించే వస్తోంది. 1873లో జోసెఫ్ డేగర్ అనే అతను కేసినోలోని రౌలెట్ వీల్స్ తిరిగే పద్ధతిని జాగ్రత్తగా గమనించి మోంటీ కార్లో బేంక్‌ల్లోని డబ్బుకన్నా ఎక్కువ జూదంలో సంపాదించాడు. దీన్ని ‘బ్రేకింగ్ ది బేంక్ ఎట్ మోంటీ కార్లో’గా పిలుస్తారు.
జేమ్స్‌బాండ్ నవలా రచయిత ఇయాన్ ఫ్లెమింగ్ 1953లో రాసిన మొదటి నవల ‘కేసినో రాయల్’ నేపథ్యం ఇక్కడిదే. బాండ్ సినిమాలు ‘నెవర్ సే నెవర్ అగైన్’ ‘గోల్డెన్ ఐ’ ‘కేసినో రాయల్’ చిత్రీకరణ ఇక్కడ జరిగింది.
1866లో మోంటీకార్లోకి ఆ పేరు ఇటాలియన్ భాష నించి వచ్చింది. దాని అర్థం వౌంట్ ఛార్లెస్. ఛార్లెస్-3 గౌరవార్థం ఈ పేరు ఆ నగరానికి పెట్టబడింది.
ఇక్కడి మరో ఆకర్షణ ఫార్ములా ఒన్ గ్రాండ్ ప్రిక్స్ పోటీ. సింగిల్ సీటర్ ఆటో రేసింగ్‌ని గ్రాండ్స్ పిక్స్ పేరుతో ఇక్కడ నిర్వహిస్తున్నారు. గంటకి 360 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఎఫ్ ఒన్ (్ఫర్ములా ఒన్) కార్లు ఈ రేసుల్లో పాల్గొంటాయి. ప్రపంచం నలుమూలల నించి రేసర్లు వచ్చి ఈ పోటీల్లో పాల్గొంటారు. 1879లో ఆరంభించిన శాలీగార్నియర్ లేదా ఒపేరా డి మాంటీ కార్లో అనేక నాటక శాలలో ఒపేరాలు జరుగుతూంటాయి. ముందే వీటికి టిక్కెట్ బుక్ చేసుకోవాలి.
1864లో నిర్మించబడ్డ హోటల్ డి పేరిస్, మోంటీ కార్లో నడిబొడ్డున ఉంది. 106 గదులు గల ఈ హోటల్‌లో వివిధ దేశాల ప్రముఖులు బస చేసారు. దీన్ని కూడా పర్యాటకులు ఆసక్తిగా చూస్తారు.
హాలీవుడ్ నటి గ్రేస్‌కెల్లీ, ప్రిన్స్ రెయినియర్‌ని వివాహం చేసుకుని ఇక్కడే నివసించింది. ఆమె కొడుకే నేటి రాజు ఆల్బర్ట్-2. హాలీవుడ్ హీరోయిన్స్‌లో మహారాణి అయింది ఈమె మాత్రమే. 1954లో ఇక్కడ ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ ‘కు టేచ్ ఏ థీఫ్’ అనే చిత్రాన్ని ఇక్కడ చిత్రీకరించాడు.
ఇంకా మ్యూజియం ఆఫ్ ఏంటిక్ ఆటోమొబైల్స్ (ఇందులో ప్రిన్స్ రెయినియర్ 85 వింటేజ్ కార్లని కూడా చూడచ్చు) ప్రినె్సస్ గ్రేస్ రోజీ గార్డెన్, స్టాంప్స్ అండ్ మనీ మ్యూజియం, లూయిస్-2 స్టేడియం, మ్యూజియం ఆఫ్ ప్రీ హిస్టారిక్ ఏంత్రోపాలజీ, ఓషనోగ్రాఫిక్ మ్యూజియం, మ్యూజియం ఆఫ్ నెపోలనిక్ సావెనీర్స్ ఇక్కడ చూడదగ్గవి.
మే నించి అక్టోబర్ దాకా టూరిస్ట్ సీజన్. ఇటలీ, ఫ్రాన్స్ దేశాల నించి రోడ్డు మార్గంలో అరగంటలో ఇక్కడికి చేరుకోవచ్చు. యూరప్‌లోని అన్ని ముఖ్య నగరాల నించి ఇక్కడికి విమాన సర్వీసులున్నాయి.
 • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, February 03, 2012

pestle stand errect in mortor on eclipse day?,గ్రహణం నాడు రోకలి ఎలా నిలబడుతుంది?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...ప్రశ్న: చంద్ర గ్రహణం సంభవించినప్పుడు రోట్లో రోకలి నిలువుగా నిలబెట్టవచ్చని విన్నాను. ఇది ఎలా సాధ్యం?

జవాబు: ఏదైనా వస్తువును పడిపోకుండా నిలబెట్టాలంటే భూగురుత్వాకర్షణ శక్తి వల్ల దానికి కలిగే భారం (Weight) దాని ఆధార పీఠం (Base) గుండా పయనించగలగాలి. పొడవు ఎక్కువగా ఉండి, పీఠం వైశాల్యం తక్కువగా ఉండే రోకలిలాంటి వస్తువును పడకుండా నిలబెట్టడం కొంత కష్టమైన పనే. కానీ అసాధ్యం కాదు. ప్రయత్నిస్తే నేల మీద లేదా ఏదైనా పళ్లెంలో నిలబెట్టవచ్చు. సన్నని, నిడుపాటి కర్రను కూడా నిలువుగా అరచేతిలోను, చూపుడు వేలు చివరనో బ్యాలన్స్‌ చేయడం మనకు తెలిసిన విషయమే.

విశ్వంలోని ప్రతి రెండు వస్తువుల మధ్య పనిచేసే ఆకర్షణ బలాన్ని గురుత్వాకర్షణ బలం అంటారు. చంద్రగ్రహణం సంభవించినప్పుడు చంద్రుడు, భూమి మధ్య ఉండే గురుత్వాకర్షణ బలం ఎక్కువగా ఉంటుంది. అందువల్లే సముద్రంలో ఆటుపోటుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ బలం వస్తువులపై పని చేసే భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో పనిచేస్తుండటం వల్ల రోకలిని నిలబెట్టడం కొంచెం సులభం అవుతుందంతే. అలాగే కొందరు గ్రహణం నాడు పళ్లెంలో నీళ్లు పోసి ఆ మధ్యలో కూడా రోకలిని నిలబెడతారు. అప్పుడు నీటి అణువుల వల్ల ఏర్పడే అసంజన బలాలు (adhesive forces) కూడా ఇందుకు దోహదపడతాయి. కాబట్టి గ్రహణ సమయంలో రోకలిని నిలబెట్టడం వెనుక మహత్తు లేదు. శాస్త్ర ప్రమేయం ఎంతైనా ఉంది.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
 • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

వృద్ధాప్యంలో తల వెంట్రుకలు తెల్లబడతాయెందుకు?,Hair become whitish in old age Why?


 • image : courtesy with Eenadu news paper.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: వృద్ధాప్యంలో తల వెంట్రుకలు తెల్లబడతాయెందుకు?.

జవాబు: వెంట్రుకలు దేహంపై ఉండేే చర్మంలో ఒక భాగం. చర్మం ఛాయ శరీరంలో ఉండే ఐదు పిగ్మెంట్ల (రంగుతో కూడిన పదార్థాలు)పై ఆధారపడి ఉంటుంది. ఈ పిగ్మెంట్లలో 'మెలానిన్‌' ముఖ్యమైనది. ఇది దేహంలో ఉండే మెలనోసైటిస్‌ అనే కణాల నుండి ఉత్పన్నమవుతుంది. ఈ మెలానిన్‌ చర్మం కింది భాగంలో, వెంట్రుకలలో, కళ్ళలో ఉంటుంది. మెలానిన్‌ తక్కువ పాళ్లలో ఉంటే శరీరం తెల్లగాను, ఎక్కువగా ఉంటే నల్లగాను ఉంటారు. కళ్లు, వెంట్రుకల రంగు కూడా దీనిపైనే ఆధారపడి ఉంటుంది.

వయసు పెరిగే కొద్దీ ముఖ్యంగా వృద్ధాప్యంలో శరీర ప్రక్రియలన్నీ నెమ్మదిస్తాయి. మెలనోసైటిస్‌ కణాలు తక్కువ శాతంలో మెలానిన్‌ను ఉత్పన్నం చేస్తాయి. అందువల్ల వృద్ధులకు తల నెరుస్తుంది. నిజానికి ప్రతి వెంట్రుక పారదర్శకంగా ఉండే ఒక సన్నని గొట్టం లాంటిది. ఆ గొట్టం నిండా మెలానిన్‌ ఉన్నంత కాలం ఆ వెంట్రుక నల్లగా ఉంటుంది. దానికి తగినంత మెలానిన్‌ అందకపోతే వెంట్రుక నల్లని రంగు క్రమేపీ మారి గొట్టం మొత్తం ఖాళీ అయిపోగానే తెల్లగా కనిపిస్తుంది. బాల్‌పాయింట్‌ పెన్‌ రీఫిల్‌ నిండా ఇంకు ఉన్నప్పుడు నల్లగాను, ఇంకు పూర్తిగా అయిపోయిన తర్వాత తెల్లగాను కనబడినట్టే ఇది కూడానన్నమాట. ఒకోసారి మెలనోసైటిస్‌ కణాలు మెలానిన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోవడంతో యుక్తవయసులోనే కొందరి తల వెంట్రుకలు తెల్లబడతాయి. దీన్నే బాలనెరుపు అంటారు.


-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

 • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Why do Tyres black in color? ,టైర్లు నల్ల రంగులోనే ఉంటాయెందుకు?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...ప్రశ్న: టైర్లు నల్ల రంగులోనే ఉంటాయెందుకు?

1.జవాబు: టైర్లు ప్రధానంగా రబ్బరుతో తయారవుతాయి. ఈ రబ్బర్ల తయారీలో సాధారణంగా బొగ్గు చూర్ణాన్ని(charcoal powder) కలుపుతారు. ఇందువల్ల రబ్బరుకు మరీ ఎక్కువ స్థితిస్థాపకత(elasticity) లేకుండా ఉండడంతో పాటు, టైర్లకు గట్టిదనం కూడా ఏర్పడుతుంది. తాకిడిని తట్టుకునేంత సస్పెన్షన్‌ను ఇస్తుంది. దీని వల్లనే టైర్లకు నల్ల రంగు ఏర్పడుతుంది. టైర్లను కాల్చినపుడు దట్టమైన పొగ రావడానికి కారణం కూడా సరిగా మండని ఈ కర్బన రేణువులే.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య,--నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

------------------------------------------
2.జవాబు: సైకిలుకు కానీ, కారుకు కానీ, మరే ఇతర వాహనానికైనా ఉండే టైర్లకు కొన్ని ముఖ్యమైన ధర్మాలు ఉండాలి. వాహనం ఎంత వేగంగా వెళుతున్నా టైరులో ఉండే ట్యూబులో గాలి తగ్గిపోకుండా ఉండాలి. రోడ్డుపై పోతున్నప్పుడు కలిగే రాపిడి (friction)కి తట్టుకోగలిగే శక్తి ఉండాలి. ఎక్కువ కాలం మన్నేటంత దృఢత్వం ఉండాలి. మామూలు రబ్బరులో ఈ లక్షణాలన్నీ ఉండవు. అందుకని టైర్ల తయారీకి మామూలు రబ్బరులో కొన్ని ఇతర పదార్థాలను కలుపుతారు. రబ్బరులో 35 శాతం 'బ్యూటజీన్‌' రబ్బరును కలుపుతారు. ఇది టైర్లకు రాపిడిని తట్టుకునే శక్తిని ఇస్తుంది. మరో 65 శాతం 'కార్బన్‌ బ్లాక్‌' అనే పదార్థాన్ని కలుపుతారు. ఇది టైర్లను దృఢంగా ఉండేలా చేస్తుంది. వీటితో పాటు ఇంకా ప్రాసెసింగ్‌ ఆయిల్‌, ప్రొడక్షన్‌ వ్యాక్స్‌ తదితర పదార్థాలను కూడా కలిపి టైర్లను తయారు చేస్తారు. టైర్లలో ఎక్కువగా ఉండే కార్బన్‌బ్లాక్‌ అనేది ఇసుక నుంచి తయారయ్యే నల్లని పదార్థం. దీని వల్లనే టైర్లకు నల్లని రంగు వస్తుంది. ఇలా తయారైన టైర్లు అరిగిపోకుండా సుమారు లక్షాయాభైవేల కిలోమీటర్లు నడుస్తాయి.

- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
 • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

యాండ్రాయిడ్‌ మొబైల్స్‌ సంగతి ఏమిటి?,What about Android mobile ?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...ప్రశ్న: యాండ్రాయిడ్‌ మొబైల్స్‌ అంటే ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయి?

జవాబు: యాండ్రాయిడ్‌ (Android) అంటే ఆంగ్లభాష ప్రకారం ఓ మరమనిషి (Robot). కృత్రిమ పద్ధతిలో మనిషి చేసే విధంగా కొన్ని పనులను చేయగలిగే మరజంతువు, లేదా మరమనిషిని యాండ్రాయిడ్‌ అంటారు. అయితే మొబైల్స్‌ విషయంలో ఈ పదానికి ఓ భిన్నమైన అర్థం ఉంది. ఇక్కడ యాండ్రాయిడ్‌ అంటే ఓ కంప్యూటర్‌ పరిభాష. Windows, MAC, GNU, LINUX లాగా ఇది కూడా ఓ ఆపరేటింగ్‌ సిస్టమ్‌. దీన్ని గూగుల్‌ కంపెనీ రూపొందించింది. మరో మాటలో చెప్పాలంటే కంప్యూటర్లను నడిపేందుకు ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉన్నట్టే, మొబైల్‌ ఫోన్ల ద్వారా కొన్ని పనులను చేయడానికి ఉపకరించే వ్యవస్థే ఇది. వేరే ఫోన్లలో ఉన్న యంత్రాంగం ద్వారా చేయలేని ఎన్నో పనులను యాండ్రాయిడ్‌ ఫోన్లు చేయగలవు. ఉదాహరణకు యాండ్రాయిడ్‌ ఫోనులాగా మిగిలిన ఫోన్లు సర్వర్‌లాగా పనిచేయలేవు. జీపీఆర్‌ఎస్‌ సాయంతో మామూలు ఫోన్లు ఇంటర్నెట్‌ను చూపగలిగినా, వాటిని సంధానించుకుని ఇతర ఫోన్లు వైఫై లేదా బ్లూటూత్‌ ద్వారా ఇంటర్నెట్‌ను చూడలేవు. కానీ యాండ్రాయిడ్‌ ఫోనుకు జీపీఆర్‌ఎస్‌ ఉంటే, దాని సాయంతో మిగిలిన సెల్‌ఫోన్లలో కూడా ఇంటర్నెట్‌ చూడవచ్చు.


-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌,--వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

 • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Thursday, February 02, 2012

How long human survive without Oxygen?,ఆక్సిజన్‌ లేకుండా ఒక వ్యక్తి ఎంత సేపు జీవించగలడు?


 • image : courtesy with Eenadu news paper.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: ఆక్సిజన్‌ లేకుండా ఒక వ్యక్తి ఎంత సేపు జీవించగలడు?


జవాబు: ఒక వ్యక్తి ఆక్సిజన్‌ లేకుండా కొన్ని నిమిషాలు మాత్రమే జీవించగలడు. కారణం మెదడులోని కణాలకు ఆక్సిజన్‌ ఎంతో అవసరం. శరీరపు బరువులో మెదడు బరువు 2 శాతమే అయినప్పటికీ, ఒక వ్యక్తి పీల్చుకునే ఆక్సిజన్‌లో 20 శాతాన్ని మెదడే గ్రహిస్తుంది. కాబట్టి దేహానికి రక్తం అందించే ఆక్సిజన్‌ సరఫరా కొన్ని నిమిషాలు ఆగిపోయినా మెదడు స్తంభించిపోతుంది. మెదడు నిర్వర్తించే ప్రక్రియలన్నీ నిలిచిపోవడంతో మరణం సంభవిస్తుంది. మెదడుకు ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోయిన 8 నుంచి 10 సెకన్లలోనే స్పృహ కోల్పోతాడు. అయితే శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే, దేహం వినియోగించుకునే ఆక్సిజన్‌ పరిమాణం తక్కవగా ఉంటుంది కాబట్టి మెదడులోని కణాలు ఎక్కువ సేపు జీవించి ఉండగలవు. ఈ అంశాన్ని బట్టే వైద్యులు గుండెమార్పిడి లాంటి శస్త్రచికిత్సలు చేసేప్పుడు ఉపయోగిస్తారు.


-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
 • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

కాల్చిన ఇటుకలు గట్టిగా ఉంటాయి. ఎందుకు?, Burned bricks are stronger.Why?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...ప్రశ్న: కాల్చిన ఇటుకలు పచ్చిమట్టి కన్నా గట్టిగా ఉంటాయి. ఎందుకు?

జవాబు: పచ్చిమట్టిలో కేవలం విడివిడి మట్టి రేణువులు ఉంటాయి. వీటి మీద నీటి అణువులు ఉండడం, ఈ రేణువులన్నీ కలిసి ముద్దగా ఉండడం వల్ల మనం ఆ ముద్దను ఏ రూపంలోకైనా తీసుకురాగలము. ఇటుకల కోసం వాడే ఎర్రమట్టి ఇలాంటిదే. అయితే ఇటుకలు చేసిన తర్వాత ఆరబెట్టినప్పుడు ఆ ఇసుక, మట్టి రేణువుల మధ్య ఇంకా కొన్ని నీటి అణువులు ఉండడం వల్ల ఆ ఇటుక రూపం అలాగే ఉంటుంది. ఇలాంటి స్థితిలో ఇటుక దిమ్మెలను బట్టీలో అధిక ఉష్ణోగ్రతకు గురి చేసినప్పుడు నీటి అణువులు అక్కడి నుంచి ఆవిరైపోయినా, మట్టిలో ఉన్న విడివిడి రేణువుల్లోని ఉపరితలాల వద్ద కొత్త రసాయనిక బంధాలు ఏర్పడుతాయి. పింగాణీ వస్తువులు, కుండలు, ఇటుకలు, గాజు పదార్థాల తయారీలో ఇలాంటి ఉష్ణ రసాయనిక చర్యలు (Thermo chemical reations) కీలక పాత్ర వహిస్తాయి. ఇలా తయారయ్యే పదార్థాలను కాంపోజిట్లు అంటారు. బట్టీలో తయారయ్యే ఇటుకలు ఓ విధమైన కాంపోజిట్లే.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌,--వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
 • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, February 01, 2012

సెల్యులోజ్‌ అంటే ఏమిటి?,What is Cellulose?
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: సెల్యులోజ్‌ అంటే ఏమిటి?,What is Cellulose?

జవాబు: సెల్యులోజ్‌ అనేది మొక్కలు ఉత్పత్తి చేసే ఒక పదార్థం. మొక్కలకు వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడును, నీటిని కలిపి గ్లూకోజ్‌ అనే చక్కెర పదార్థంగా మార్చే శక్తి ఉందని పాఠాల్లో చదువుకుని ఉంటారు. అలా తయారు చేసిన గ్లూకోజ్‌ను మొక్కలు ఏం చేస్తాయనే విషయం వేర్వేరు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఏ మొక్కా గ్లూకోజ్‌ను ఎక్కువగా నిల్వ ఉంచుకోదు. ఎందుకంటే గ్లూకోజ్‌ ఎక్కువగా ఉండే మొక్కల కణాలు ఎక్కువ నీటిని శోషించుకోవలసి ఉండడంతో అవి పగిలి విచ్ఛిన్నమవుతాయి. అలాగే గ్లూకోజ్‌ ఎక్కువయ్యే కొద్దీ కిరణజన్య సంయోగ క్రియ(photosynthesis) వేగం తగ్గిపోతుంది.

ఈ ప్రమాదం నుంచి తప్పించుకోడానికి మొక్కల్లో అదనపు గ్లూకోజ్‌ అణువులతో పొడవైన గొలుసులను తయారు చేసే ఒక ఎంజైమ్‌ ఉంటుంది. ఈ గొలుసులలో పిండిపదార్థం (starch) ఒకటైతే, మరొకటి సెల్యులోజ్‌.

సెల్యులోజ్‌ గొలుసుల పొడవు ఒకో మొక్కకు ఒకోలా ఉంటుంది. ఉదాహరణకు పత్తిమొక్కలో తయారయే ఒకో సెల్యులోజ్‌ గొలుసులో 10,000 గ్లూకోజ్‌ అణువులు ఉంటాయి. సెల్యులోజ్‌ మొక్కలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మొక్క యొక్క కణాల గోడలు దృఢమైన సెల్యులోజ్‌ పదార్థంతోనే తయారవుతాయి. ఆ ఏర్పాటు లేకపోతే మొక్క తన భారానికి తానే ముడుచుకుపోయి నశిస్తుంది.

సెల్యులోజ్‌ మనకు ఆహారంగా పనికిరాదు. మన జీర్ణవ్యవస్థలో పిండి పదార్థాల గొలుసులను గ్లూకోజ్‌ అణువులుగా విడగొట్టగల ఎంజైములు ఉన్నాయి కానీ, సెల్యులోజ్‌ను విడగొట్టగల ఎంజైములు లేవు. మనం మొక్కలకు సంబంధించిన ఆహారాన్ని తీసుకుంటే వాటిలోని పిండిపదార్థం జీర్ణమై, సెల్యులోజ్‌ భాగం విసర్జితమవుతుంది. ఎండుకట్టెలలో సెల్యులోజ్‌ అధికంగా ఉండడంతో ఎక్కువ ఉష్ణాన్నిచ్చే వంట చెరకుగా ఉపయోగపడతాయి. సెల్యులోజ్‌ను కాగితం, వస్త్రాలు, రేయాన్‌, సెల్లోఫేన్‌, సెల్యులాయిడ్‌ లాంటి పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
 • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Waht about VASA PARROT?,వాసా ప్యారెట్(చిలుక)సంగతేమిటి?


 • image : courtesy with Eenadu news paper.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ఈ చిలుక పేరు వాసా ప్యారెట్‌. ప్రపంచంలోని చిలుక జాతుల్లో ఇదీ ఒకటి. అంతేకాదు వాటన్నింటిలో భిన్నమైన లక్షణాలున్నది కూడా ఇదే. చూడాలంటే మడగాస్కర్‌ అడవులకి వెళ్లాల్సిందే. ఒకప్పుడు పెంపుడు పక్షులుగా విపరీతంగా అమ్మేవారు. ఇప్పుడు వీటి సంఖ్య పూర్తిగా తగ్గిపోవడంతో జంతు ప్రదర్శన శాలల్లోనే కనిపిస్తున్నాయి.

వాసా చిలుకల్లో ఆడవి మరీ చిత్రంగా ఉంటాయి. పక్షి జాతిలో వేటికీలేని లక్షణం వీటికుంది, అదేంటో తెలుసా? తల మీద బొచ్చులా ఒత్తుగా ఉండే ఈకల్ని పూర్తిగా వదిలించేసుకోగలవు. అప్పుడిది బోడి చిలుకలా ఉంటుంది. ఆ నెత్తి మీద చర్మం లేత నారింజ రంగులో ఉంటుంది. ఇవి తాము కోరుకున్నప్పుడు ఒంటి మీద ఉన్న ఈకల రంగుని బూడిద రంగు నుంచి లేత మట్టి రంగులోకి మార్చేసుకుంటాయి. గుడ్లు పెట్టే సమయంలో అయితే ఆ మట్టిరంగు పసుపు రంగులోకి మారిపోతుంది. దీని ఒంట్లో ఉన్న కొన్ని రసాయనిక గ్రంధుల వల్లే రంగు మార్పు సాధ్యమవుతుందని పరిశోధకుల అభిప్రాయం. ఒక్క ఆడవే కాదు మగవి కూడా తమ రంగుని మార్చుకోగలవు.వాసా చిలుకల్లో ఆడవాటికి చాలా కోపం ఎక్కువ. వాటికి నచ్చినట్టు ఉండకపోతే మగ చిలుకల్ని వెంటపడి తరుముతాయి. అడిగినప్పుడు ఆహారం తెచ్చి పెట్టకపోయినా మగవాటి పని అయిపోయినట్టే. వాసా చిలుకలు తిండిపోతులు. ఇరవై అంగుళాల పొడవు పెరిగే ఇవి పండ్లు విత్తనాలు, రకరకాల గింజలు నిత్యం తింటూనే ఉంటాయి. ఇవి నిశ్శబ్దంగా ఉండే పక్షులు. తమ గూడులో గుడ్లను పెట్టి ఆ గుడ్లు కనిపించకుండా రకరకాల ఆకులు, పుల్లలు, చెత్త చెదారం తెచ్చి నింపేస్తాయి. అన్నట్టు వీటికి స్నానం చేయడం అంటే చాలా ఇష్టం. నీళ్లు, బురద ఎక్కడ కనిపించినా వెళ్లి దూకాల్సిందే. అప్పుడప్పుడు సూర్య స్నానం కూడా చేస్తాయి. ఎండకి ఎదురుగా తిరిగి ఈకల్ని ఆరబెట్టుకుంటాయి.
 • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-