Thursday, September 20, 2012

How A.C air cool?-ఏసీ చల్లనేల?

  •  
  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: ఏసి యంత్రం నుంచి గాలి చల్లగా ఎలా వస్తుంది? ఆ గాలి ఆరోగ్యానికి మంచిదేనా?

జవాబు: వాయువుల్లో వాస్తవ వాయువులు (Real Gases) ఆదర్శ వాయువులు(Ideal Gases) అనే రెండు రకాలున్నాయి. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో వీటిని పరస్పరం మార్చుకోవచ్చును. ఇందులో వాస్తవ వాయు ధర్మాల్లో ఓ ప్రధాన ధర్మం జౌల్‌ థామ్సన్‌ గుణకం. ఓ వాయువును బాగా సంపిలినీకరణం (Compression) చేశాక ఒక్కసారిగా విరళీకరణా(expansion)నికి గురిచేస్తే ఆ వాయువు ఉష్ణోగ్రత పడిపోయే ధర్మానికి జౌల్‌ థామ్సన్‌ గుణకం ఓ కొలబద్ద. ఇది క్లోరో ఫ్లోరో కార్బన్‌ బృందానికి చెందిన ఫ్రియాన్‌ వాయువుకు చాలా ఎక్కువ. అందుకే ఏసీ యంత్రాల తయారీలో దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. ప్రత్యేక మోటారుతో మొదట ఫ్రియాన్‌ వాయువును అధిక పీడనానికి లోను చేస్తారు. అలా అధిక పీడనంలో ఉన్న ఫ్రియానును జల్లెడలాగా అంటే గొట్టాల చట్రంలోకి విస్తరించినపుడు ఆ గొట్టాలు చల్లబడతాయి. ఆ గొట్టాల మీదుగా గాలి పదేపదే చక్రీయంగా (Cyclically) వెళ్లేలా చేయడం వల్ల గదిలో గాలి క్రమేణా కూడా చల్లబడుతుంది. ఏసీ యంత్రాలు, రిఫ్రిజరేటర్లు పనిచేసేది ఈ యంత్రాంగం ఆధారంగానే. ఏసీ గాలి వల్ల ప్రమాదం ఏమీ లేదు. ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు. ఎటొచ్చీ ఫ్రియాన్‌ వాయువుతోనే ఉంది తంటా అంతా. ఇది వాతావరణంలోకి ఏమాత్రం లీక్‌ అయినా ఓజోన్‌ పొరను దెబ్బతీస్తుంది. తద్వారా భూ వాతావరణానికి అనారోగ్యం కలుగుతుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌, రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

How Tear gas working-బాష్పవాయువు ఎలా పని చేస్తుంది?

  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: ఒకోసారి పోలీసులు బాష్పవాయువును ప్రయోగిస్తారు. ఇది ఎలా పని చేస్తుంది?

జవాబు: గుంపులుగా చేరి అలజడి సృష్టించే ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు (tear gas) ను ప్రయోగిస్తారు. ఈ వాయువు కళ్లలో నీళ్లు తెప్పిస్తుంది కాబట్టే దీనికాపేరు. యుద్ధాల్లో కూడా ఉపయోగిస్తారు కాబట్టి దీన్ని యుద్ధవాయువు అని కూడా అంటారు.

బాష్పవాయువు హానికరమైనది. కొన్ని రసాయనాలను తుపాకుల వంటి ఆయుధాల్లో కూరి పేల్చడం ద్వారా దీన్ని ప్రయోగిస్తారు. ఈ రసాయనం ఘన, ద్రవ రూపాల్లో ఉంటుంది. ఆల్ఫా క్లోరా సిటెటోఫినోన(Alpha Choraceteto Phenone) అనే రసాయనం ఘన రూపంలోను, ఇథైల్‌ అయోడో ఎసిటేట్‌ (Ethyl Iodo Acetate) ద్రవరూపంలోను ఉంటాయి.

బాష్పవాయువు నుంచి వెలువడిన ఆవిర్లు కళ్లలోని బాష్పగ్రంథులపై రసాయనిక చర్య జరుపుతాయి. అందువల్ల కళ్లల్లో మంట పుట్టి కన్నీరు ఎక్కువగా వస్తుంది. కనుగుడ్లపై నీరు ఎక్కువగా చేరడంతో చూపు కూడా మందగిస్తుంది. కనురెప్పలు వాస్తాయి. కడుపులో వికారం పుట్టి వాంతులు కూడా అవుతాయి. చర్మంపై బొబ్బలు వస్తాయి. కానీ ఈ మార్పులన్నీ తాత్కాలికమే. కొద్ది సేపటికి తగ్గిపోతాయి.

బాష్పవాయువుకు గురైన వారిని బాగా గాలి వీచే విశాలమైన ప్రదేశానికి తీసుకువెళ్లాలి. వారి కళ్లను ఉప్పు నీటితో కానీ, బోరిక్‌ యాసిడ్‌ ద్రవంతో కానీ కడగాలి. సోడియం బై కార్బొనేట్‌ ద్రవాన్ని శరీరంపై బాష్పవాయువు సోకిన భాగాలకు పూయాలి. దీని ప్రభావం ఎక్కువగా పడకూడదనుకుంటే కోసిన ఉల్లిపాయల ముక్కలను చేతిలో పట్టుకుంటే చాలు. అవి బాష్పవాయువును పీల్చుకుని కళ్లపై అంత ప్రభావం చూపవు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Key board letters not in alfabetical line why?-కీ బోర్డుపై అక్షరాలు వరుస క్రమంలో ఉండవెందుకు?

  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: కీ బోర్డుపై అక్షరాలు వరుస క్రమంలో ఉండవెందుకు?

జవాబు: మనం సాధారణంగా వాడే కీబోర్డును క్వర్టీ (Qwerty) కీబోర్డు అంటాము. కీ బోర్డు పై వరుసలో ఉన్న మొదటి ఆరు అక్షరాలు Q, W, E, R, T, Y కాబట్టి వాటిని కలిపేసి పలుకుతారు. ఈ తరహా కీబోర్డును 1868లో అమెరికాకు చెందిన క్రిస్టోఫర్‌ షోల్స్‌ రూపకల్పన చేశారు. అంతకు ముందు A, B, C, D లాగా వరుసగా ఉన్న కీబోర్డు పై ఆయన కొన్ని ఇబ్బందులు (practical difficulties) గమనించారు. ఇంగ్లిషు భాషలో కొన్ని అక్షరాలు అతి ఎక్కువసార్లు, కొన్నయితే అతి అరుదుగా వస్తుంటాయి. ఉదాహరణకుQ, Z W, X, Fవంటి అక్షరాల వాడకం తక్కువగా ఉంటుంది. అచ్చులయిన A,E,I,O,U లతో పాటు, P, B, L, M, N, K, L వంటివి ఎక్కువ సార్లు తారసపడతాయి. అక్షరాల మీద తీవ్రమైన ఒత్తిడి లేకుండాను, ఎక్కువసార్లు వచ్చే అక్షరాలు చేతివేళ్లకు అనుకూలమైన స్థానాల్లోను ఉండేలా షోల్స్‌ తాను రూపొందించిన టైపు మిషన్‌ కీబోర్డునుQwerty నమూనాలో చేశాడు. అదే ఒరవడి కంప్యూటర్‌ కీబోర్డులకూ విస్తరించింది. కానీ ఆధునిక పరిశోధనల ప్రకారం Qwerty కన్నా మరింత సులువైన కీ బోర్డు అమరికలున్నట్లు రుజువు చేశారు. ఉదాహరణకు Dvorak కీబోర్డు ఒకటిి. కానీ ఇది ప్రచారంలోకి రావడం లేదు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌,-వరంగల్‌, రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక.

  • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Curency notes in washing mechine -వాషింగ్‌ మెషిన్‌లోకరెన్సీ నోట్లు

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: వాషింగ్‌ మెషిన్‌లో వేసిన దుస్తుల జేబుల్లో పొరపాటున ఉండిపోయే కరెన్సీ నోట్లు చిరగవని అంటారు. ఎందువల్ల?

జవాబు: అన్ని సందర్భాలలోను ఇది వర్తించకపోయినా ఇందుకు ఒక కారణం ఉంది. నోట్‌ పుస్తకాలు, న్యూస్‌పేపర్‌కు వాడే మామూలు కాగితాలకు, కరెన్సీ నోట్ల తయారీకి ఉపయోగించే కాగితానికి మధ్య చాలా తేడా ఉంటుంది. మామూలు కాగితాలను చెట్ల నుంచి వచ్చే సెల్యులోజ్‌ పదార్థంతో తయారు చేస్తారు. కరెన్సీ నోట్లకు వాడే కాగితాన్ని పత్తి, ఊలు మిశ్రమంతో కూడిన లినెన్‌, గుడ్డ పీలికల నార నుంచి తయారు చేస్తారు. ఇందులో పోగులు చాలా దగ్గరగా బంధించబడి, మామూలు కాగితంలోని పోగుల కన్నా దృఢంగా ఉంటాయి. ఇవి నీటి వల్ల అంత త్వరగా ప్రభావితం కావు. సెల్యులోజ్‌తో చేసిన మామూలు కాగితం నీటిలో పడితే వెంటనే నీటిని పీల్చుకుని పోగులు విడిపోతాయి. దాంతో అది చిరిగిపోయి ఉండలు చుట్టుకుపోతుంది. కరెన్సీ నోట్లను నాణ్యమైన కాగితంతో చేయడం వల్ల అది అంత తొందరగా చిరిగిపోవు. అంతేకాకుండా మనం చేతులతో ఉతికినంత తీవ్రంగా వాషింగ్‌ యంత్రం దుస్తులను ఉతకదు. అది కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో దుస్తులను తిప్పడం ద్వారా వాటిలోని ధూళి కణాలను వేరు చేస్తుంది. ఇందువల్ల కూడా దుస్తుల జేబుల్లో ఉండిపోయిన కాగితాలు చిరిగిపోయేంత తీవ్రమైన ప్రభావానికి గురికావు.

- పొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Steel donot get rusted Why?-స్టీలు తుప్పు పట్టదేం?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

ప్రశ్న: స్టెయిన్‌లెస్‌ స్టీలు తుప్పు పట్టకుండా ఎలా ఉంటుంది?

జవాబు: ఇనుప వస్తువులకు వాతావరణంలోని తేమ, ఆక్సిజన్‌ తగిలినప్పుడు రసాయనిక చర్య జరిగి ఐరన్‌ ఆక్సైడు పొర ఏర్పడుతుంది. ఈ పొరనే 'తుప్పు' అంటారు. స్టెయిన్‌లెస్‌ స్టీలులో కూడా ఇనుము ఉన్నప్పటికీ, దాంతో పాటు కలిసి ఉండే ఇతర పదార్థాలపై పరిసరాల ప్రభావం ఉండదు. స్టీలులో ఇనుము, క్రోమియం మాంగనీస్‌, సిలికాన్‌, నికెల్‌, కార్బన్‌ మూలకాలు ఎక్కువ పాళ్లలో ఉంటాయి. ఈ మూలకాలకు తేమ, ఆక్సిజన్‌ తగిలితే లోహ ఆక్సైడ్లు, హైడ్రాక్సైడ్‌లతో కూడిన సన్నని స్థిరమైన పొర ఏర్పడుతుంది. పరిసరాల ప్రభావం స్టెయిన్‌లెస్‌ స్టీలులోని ఇనుముపై పడకుండా ఈ పొర అడ్డుకుంటుంది.ఈ పొర మందం అత్యంత సూక్ష్మంగా (10-8 సెంటీమీటర్లు) ఉండడంతో మన కంటికి కనబడదు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, September 07, 2012

క్లోనింగ్ ప్రయోగము మనుషులపైన ఏ దేశములోనైనా చేసారా?,Do cloning expermented on humans?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

  • ప్ర : పధహారు సంవత్సరాల క్రితం గొర్రె (డాలీ) నుంచి క్లోనింగ్ ద్వారా మరో గొర్రెను సృష్టించారు . అ పద్ధతి ద్వారా ఈ ప్రయోగము మనుషులపైన ఏ దేశాం లోనైనా చేశారా?

జ : ప్రకృతి సహజమైన సంపర్కంతో పని లేకుండానే అదే రకమైన జన్యుధర్మాలు ఉండే ప్రాణుల సృష్టినే క్లోనింగ్‌ అంటారు. ఈ ప్రక్రియలో ఎదిగిన చెట్లు, తీగల వల్లనే మనకు గింజలు లేని ద్రాక్ష, దానిమ్మ, ఆపిల్‌, చెర్రీలాంటి పండ్లు లభిస్తాయి.

  • ఒక కణం నుండి కేంద్రకాన్ని తొలగించి, దానిని, కేంద్రకం క్రియా రహితం చేయబడిన లేదా తొలగించిన వేరొక ఫలదీకరణం చెందని అండకణం లోనికి ప్రవేశ పెట్టే ప్రక్రియ క్లోనింగ్. క్లోనింగ్ రెండు విధాలుగా ఉంటుంది:

ప్రత్యుత్పాదక క్లోనింగ్ : కొంత విభజన తరువాత అండకణాన్ని గర్భాశయంలో ప్రవేశపెట్టినపుడు అది దాత కేంద్రకంతో జన్యుపరంగా సారూప్యత కలిగిన పిండంగా అభివృద్ధి చెందుతుంది.

  • చికిత్సాయుత క్లోనింగ్ : అండాన్ని రాతి గిన్నె (పెట్రి డిష్ )లో ఉంచినపుడు అనేక రుగ్మతలపై ప్రభావ వంతంగా పనిచేసే పిండ మూలకణాలుగా అభివృద్ధి చెందుతాయి. ఇవి రోగాల చికిత్సలకు ఉపయోగిస్తారు .

1997 లో రోస్లిన్ ఇన్స్టిట్యూట్ కి చెందిన ఇయన్ విల్ముట్ తన సహచరులతో కలిసి గొర్రె క్షీర గ్రంధుల నుండి డాలీ అనే గొర్రె పిల్లను క్లోనింగ్ ప్రక్రియ ద్వారా విజయవంతంగా సృష్టించినపుడు ఇది మీడియా దృష్టిని ఆకర్షించింది. డాలీని సృష్టించిన ప్రక్రియ లోనే మానవ క్లోనింగ్ కూడా సాధ్యమేనని చాలా మంది భావించారు. ఇది నైతిక వివాదాలను సృష్టించింది. ఇటువంటి క్లోనింగ్ మనుషులమీద చేస్తే ఎక్కువకాలము బతకరనీ , త్వరగా చనిపోతారనీ, ఇది చాలా అపాయకరమైన ప్రయోగమని , చెయ్యవద్దని " విల్ మట్ " స్పష్టముగా చెప్పారు . ఈ హ్యూమం క్లోనింగ్ ని అమెరికా , బ్రిటన్‌ వంటి దేశాలు నిషేదించడమే కాదు ... ఇటువంటి ప్రయోగాలు మానవజాతిపట్ల జరిగే అపచారం , హత్యతో సమానం అని అన్నారు
  • ================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tuesday, September 04, 2012

Why do we name cyclones?-తుపానులకు పేర్లెందుకు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: తుపానులకు థానే, లైలా అంటూ పేర్లు ఎలా పెడతారు?

జవాబు: ఆధునిక సాంకేతిక అభివృద్ధి వల్ల తుపానుల రాక గురించి మనం కొన్ని రోజుల ముందే తెలుసుకోగలుగుతున్నాం. తుపాను హెచ్చరిక కేంద్రాలు, వాతావరణ కేంద్రాలు, ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా తుపాను ఉనికిని, అది ప్రయాణించే దిశను కూడా అంచనా వేసి ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయగలుగుతున్నాం. అంతర్జాతీయ స్థాయిలో పనిచేసే ప్రపంచ వాతావరణ సంస్థ (World Metereological Organisation) వివిధ దేశాల వాతావరణ పరిశోధన సంస్థలను వాటి సమీప సముద్రాల్లో ఏర్పడే తుపానులకు పేర్లు ఇవ్వమని అడుగుతుంది. అలా అకారాది క్రమంలో ఆయా దేశాల వారు ఇచ్చిన పేర్లనే ఆయా ప్రాంతాలను తాకనున్న తుపానులకు కేటాయిస్తారు. ఉదాహరణకు హిందూ మహా సముద్రంలో సంభవించే తుపానులకు భారత దేశం అగ్ని, ఆకాశ్‌, బిజిలి, లాల్‌, లహర్‌, మేఘ్‌, సాగర్‌, వాయు అనే పేర్లు ఇచ్చింది. ఇప్పటికే బిజిలి వరకు పేర్లు అయిపోయాయి. లైలా పేరును పాకిస్థాన్‌ పెట్టింది. థానే పేరును మయన్మార్‌ పెట్టింది. ఆయా దేశాల సామాన్యులు సులువుగా గుర్తు పెట్టుకునేందుకు, తుపానుల ప్రభావాన్ని చారిత్రకంగా నమోదు చేయడానికి తుపానులకు పేర్లు పెడతారు.

- ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌,-వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

What is Junk food-జంక్‌ ఫుడ్ సంగతేంటి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: 'జంక్‌ ఫుడ్‌' అంటే ఏమిటి? ఇది ఏఏ పదార్థాలలో ఉంటుంది?

జవాబు: ఇంగ్లిషులో జంక్‌ అంటే చెత్త లేదా పనికిరాని కుప్ప అని అర్థం. ఈమెయిల్‌లో కూడా జంక్‌ అనే పదాన్ని విని ఉంటారు. పనికిరాని, ప్రమాదకరమైన మెయిల్స్‌ను జంక్‌ మెయిల్స్‌ అంటారు. అలాగే పోషక విలువల పరంగా అంతగా ఉపయుక్తం కానిది, ఎంతో కొంత ఆరోగ్యానికి హాని కలిగించేది లేదా రుచీపచీ లేని నానా చెత్త ఆహార పదార్థాలకు ఇచ్చిన సర్వసాధారణ నామధేయం 'జంక్‌ఫుడ్‌'. బజార్లో రోడ్లమీద అమ్మే ఆహార పదార్థాలను జిహ్వ చాపల్యాన్ని సంతృప్తిపరచడానికి రకరకాల మసాలాలు వేసి వేయిస్తారు. పనిలో పనిగా వీధుల్లోని దుమ్ము, ధూళి, ఈగలు, చెమట అందులో కలిసి ఆ చెత్త ఆహారం మరింత చెత్తగా తయారవుతుంది. దానికి తోడు వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడడం వల్ల వేపుళ్లు మరింత నల్లగా ఉంటాయి. హోటళ్లలోను, బండల దగ్గర దొరికే ఐస్‌క్రీములు, గప్‌చిప్‌లు క్రిముల మయమవడం వల్ల అవి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ఇలాటి జంక్‌ఫుడ్‌ జోలికి పోకుండా ఉండడం మేలు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;-రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Monday, September 03, 2012

Dal curry and salt restriction-పప్పు ఉడకడానికి, ఉప్పు కి సంబంధం ఏమిటి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: పప్పులు ఉడికించేప్పుడు మొదట్లోనే ఉప్పు వేయరు. అలా వేస్తే పప్పు ఉడకదంటారు. పప్పు ఉడకడానికి, ఉప్పు వేయకపోవడానికి సంబంధం ఏమిటి?

జవాబు: పప్పు సాధారణంగా పిండి పదార్థంతోను, మాంసకృత్తులు (ప్రోటీన్లు)తోను నిండి ఉంటుంది. పప్పులోని పిండిపదార్థం తొందరగానే ఉడికినా ఎక్కువ సేపు వండితేకానీ ఉడకనివి మాంసకృత్తులే. బాగా ఉడకడం అంటే పొడవైన ప్రోటీను అణువులు చిన్న చిన్న ముక్కలవడమే. ఇవి మన జీర్ణవ్యవస్థలో సులభంగా అరిగిపోతాయి. నీటి సమక్షంలో ప్రోటీను అణువులు ముక్కలవడాన్ని జలవిశ్లేషణం(hydrolysis)అంటారు. నీటిలో ఉప్పు వేయడం వల్ల ఈ ప్రక్రియ మందగిస్తుంది. అందుకే వేయరు. అంటే ఉప్పు దగ్గర మన పప్పులు ఉడకవన్నమాట.

- ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Rain in summer gives Smell Why?-నేలపై వాన వాసన ఏమిటి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: వేసవిలో ఎండిన నేలపై ఉన్నట్టుండి వర్షం కురిస్తే ఒక విధమైన సువాసన వ్యాపిస్తుంది. ఎందువల్ల?

జవాబు: వేసవి ఎండలకు నేల ఎండిపోయినప్పుడు నేలలో నుండి పొడిగా ఉండే దుమ్ము పైకి వస్తుంది. దానితో పాటు ఒక రకమైన సూక్ష్మజీవులు (బ్యాక్టీరియా) కూడా నేల ఉపరితలంపై పరుచుకుంటాయి. ఈ బ్యాక్టీరియా తడిగా, నులివెచ్చగా ఉండే నేలలో పెరుగుతాయి. దుమ్ము, బ్యాక్టీరియా కూడుకున్న ఎండిన నేలపై వర్షం పడినప్పుడు అవి వర్షం నీటితో కలుస్తాయి. అప్పుడు ఏర్పడిన తుంపరల నుంచి వచ్చే గాలిని మనం పీల్చడంతో ఒక ఆహ్లాదకరమైన వాసన వస్తుంది. ఈ వాసన రావడానికి ఏక్టినోనైసిటేల్స్‌ (actinonycetales) జాతికి సంబంధించిన సిరప్టోమైసిస్‌ (syreptomycis) అనే బ్యాక్టీరియానే కారణం.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు,-హైదరాబాద్
  • ==================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Why do river sand only use for construction?-నదిలో ఇసుకనే కట్టడాల్లో ఎందకు వాడతారు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: నదిలో ఇసుకనే కట్టడాల్లో ఎందకు వాడతారు? పొలాల్లో, చెరువుల్లో దొరికే ఇసుక పనికిరాదా?

జవాబు: పొలాల్లో, చెరువుల్లో దొరికే ఇసుక రేణువుల మధ్య తేలికయిన దుమ్ము, ధూళి, మట్టి, నారపీచుల వంటి మలినాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇలాంటి ఇసుక రంగు నల్లగా లేదా ముదురు గోధుమ రంగులో ఉంటుంది. సిమెంటును, ఇసుకను కలిపినపుడు నిర్మాణాలు స్థిరంగా, దృఢంగా ఉండాలంటే గట్టిగా ఉన్న స్వచ్ఛమైన ఇసుక రేణువులే కావాలి. అప్పుడే అది సిమెంటు, కంకర, ఇనుప ముక్కల్ని నిరాఘాటంగా, సానుదీర్ఘం(continuous)గా అంటి పెట్టుకుని ఉండగలదు. ఇసుకలోని మలినాలు సిమెంటుతో బంధాలు ఏర్పరుచుకోవు కాబట్టి రేణువుకు, రేణువుకు మధ్య సంధానం కరవై నిర్మాణంలో అస్థిరత్వం (distability) ఏర్పడుతుంది. నదుల్లోని ఇసుక రేణువుల మధ్య ఉండే మలినాలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోవడం వల్ల అక్కడి ఇసుక శుద్ధమైనదిగా తయారవుతుంది. ఎక్కువ గట్టిగా ఉండే ఇసుక రేణువులే తీరాల్లోను, నదీగర్భంలోను పోగుపడతాయి. అందుకే నదులు, సముద్రతీరాలకు కొంచెం దూరంలో దొరికే ఇసుకను నాణ్యమైనదిగా పరిగణిస్తారు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌,-వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Freezer is always up why?-ఫ్రీజర్‌ పైనే ఎందుకు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: ఫ్రిజ్‌ల్లో ఎక్కువ చల్లదనాన్ని ఇచ్చే చిన్న పెట్టెలాంటి ఫ్రీజర్‌ను పైభాగంలోనే అమరుస్తారు. దాన్ని ఫ్రిజ్‌కు కింది భాగంలో ఎందుకు పెట్టరు?

జవాబు: రిఫ్రిజిరేటర్‌లో సులభంగా ఆవిరయ్యే ఫ్రియాన్‌ (Freon) అనే ద్రవ పదార్థాన్ని సన్నని తీగ చుట్టల ద్వారా ప్రవహింపజేస్తారు. ఈ ద్రవాన్ని 'రెఫ్రిజిరెంట్‌' అంటారు. ఈ ద్రవం ఫ్రిజ్‌లో ఉండే పదార్థాల వేడిని గ్రహించి ఆవిరిగా మారుతుంది. ఫ్రిజ్‌లో చల్లదనాన్ని కలుగజేస్తుంది. ఆవిరిగా మారే ఫ్రియాన్‌ తిరిగి ఫ్రిజ్‌లోని కండెన్సర్‌ ద్వారా పీడనానికి గురై మళ్లీ ద్రవంగా మారుతుంది. ఇది తిరిగి ద్రవరూపాన్ని పొందేటప్పుడు అది అంతకు ముందు గ్రహించిన వేడి ఫ్రిజ్‌ వెనక భాగం నుంచి బయటకు పోతుంది. ఫ్రిజ్‌లోని పదార్థాలలోని వేడిని గ్రహించి ఆవిరిగా మారిన ఫ్రియాన్‌ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఆవిరిగా మారిన దాని సాంద్రత (density)తక్కువ కావడంతో ఆ ఆవిరి ఫ్రిజ్‌ పైభాగానికి పయనిస్తుంది. ఈ ప్రక్రియ వల్ల ఫ్రిజ్‌లో చల్లదనం ఏర్పడి ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెల్షియస్‌కు తగ్గుతుంది. ఫ్రీజర్‌ను ఫ్రిజ్‌ అడుగు భాగంలో అమరుస్తే అక్కడ ఉష్ణోగ్రత మరీ తగ్గడం వల్ల వెలువడే ఉష్ణకిరణాలు పైవైపు ప్రయాణించి అక్కడ అంతకు ముందు చల్లబడిన పదార్థాల ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. అందువల్లనే ఫ్రీజర్‌ను పైభాగంలోనే అమరుస్తారు. అక్కడ వెలువడిన ఉష్ణకిరణాలు అక్కడి నుంచే బయటకు వెలువడుతాయి.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

సిరాను బ్లాటింగ్‌ పేపర్‌ ఎలా పీల్చుకుంటుంది?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: సిరాను బ్లాటింగ్‌ పేపర్‌ ఎలా పీల్చుకుంటుంది?

జవాబు: ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకునే ముందు ద్రవాలకు సంబంధించిన ఒక ధర్మాన్ని తెలుసుకోవాలి. ఒక కేశనాళిక (వెంట్రుకంత సన్నని రంధ్రం ఉండే గాజుగొట్టం)ను ఒక పాత్రలో ఉన్న నీటిలో నిలువునా ముంచితే ఒక విషయాన్ని గ్రహించవచ్చు. పాత్రలోని నీటి మట్టం కంటే కేశనాళికలోని నీటి మట్టం కొంచెం ఎత్తులో ఉంటుంది. అంటే పాత్రలోని నీరు కేశనాళికలోకి ఎగబాకిందన్నమాట. ద్రవాలకు ఉండే ఈ ధర్మాన్ని కేశనాళీయకత (capillarity) అంటారు. ద్రవాల ఉపరితలం, సాగదీసిన బిగువైన పొరలాగా ప్రవర్తిస్తుంది. దీన్నే ద్రవాల తలతన్యత (surface tension) అంటారు. కేశనాళీయకత అనేది ఈ తలతన్యత ప్రభావమే. ఇప్పుడు బ్లాటింగ్‌ పేపర్‌ విషయానికి వద్దాం. దీన్ని కొయ్య, ఎండుగడ్డి, దూది లాంటి పదార్థాల మెత్తని గుజ్జుతో తయారు చేస్తారు. ఈ గుజ్జును చదునైన తలంపై పోసి రోటర్లతో ఒత్తిడికి గురి చేయడం వల్ల

బ్లాటింగ్‌ పేపర్‌ తయారవుతుంది. ఈ పేపర్‌ కణాల మధ్య ఏర్పడే ఖాళీలు అతి సన్నని రంధ్రం గల గొట్టాలలాగా పనిచేస్తాయి. ఒలికిన సిరాపై బ్లాటింగ్‌ పేపర్‌ను సుతారంగా అద్దినప్పుడు కేశనాళీయకత వల్ల దాని ఖాళీల్లోకి సిరా ఎగబాకుతుంది. అలా ఆ కాగితం ఉపరితలంపైకి వచ్చిన సిరాను చుట్టుపక్కల కణాలు పీల్చుకోవడంతో అది వ్యాపిస్తుంది.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

మంటలను ఆర్పడానికి నీళ్లనే ఎందుకు ఎక్కువగా వాడుతారు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: మంటలను ఆర్పడానికి నీళ్లనే ఎందుకు ఎక్కువగా వాడుతారు?

జవాబు: మండుతున్న వస్తువుల ఉష్ణోగ్రత నీటి ఉష్ణోగ్రత కన్నా ఎక్కువగా ఉంటుంది. మనం మంటపై నీటిని చల్లినప్పుడు ఆ నీరు మంటలోని వేడిని గ్రహించి నీటియావిరి ఏర్పడుతుంది. ఎక్కువ ఘనపరిమాణం గల ఆ నీటియావిరి మండే వస్తువుల మీద ఒక పొరలాగా ఆక్రమించడంతో మంటకు వాతావరణం నుంచి ఆక్సిజన్‌ అందదు. అందువల్ల మంట ఆరిపోతుంది. అగ్నిమాపక దళం వారు చల్లని నీటి కన్నా గోరు వెచ్చని నీటిని పైపుల సాయంతో మంటలపై చల్లుతారు. వేడిగా ఉన్న నీరు చల్లని నీటికన్నా తొందరగా భాష్పీభవన స్థానం (boiling point) చేరుకుని నీటి ఆవిరిగా మారడానికి తక్కువ సమయాన్ని తీసుకుంటుంది. అంతేకాకుండా చల్లని నీటి కన్నా వేడి నీటి తలతన్యత (surface tension) తక్కువ కాబట్టి గోరు వెచ్చని నీరు మంటలపై ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తుంది.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
  • ====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

అరటికాయలు కోసినప్పుడు చేతులు రంగు మారడానికి కారణం ఏమిటి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: అరటికాయలు కోసినప్పుడు చేతులు రంగు మారడానికి కారణం ఏమిటి?

జవాబు: సాధారణంగా మొక్కలు తమను తాము సూక్ష్మజీవులు, పురుగుల బారి నుంచి రక్షించుకోవడానికి అంతో ఇంతో ప్రత్యేక రసాయనాలను ఉత్పత్తి చేసుకుంటాయి. అలా అరటి కాయ తన లోపల ఎన్నో రక్షక రసాయనాలను (preservatives) సహజంగానే సంతరించుకుని ఉంటుంది. ఇందులో ఫినాలు తరహా రసాయనాలు, ఇనుము, కాపర్‌ లవణాలు ఉంటాయి. మనం అరటికాయ పచ్చని తోలును చీల్చినప్పుడు అందులోంచి ఈ రసాయనాలు కొంచెం జిగురుగా రావడాన్ని గమనించవచ్చు. ఇవి మన చేతులకు కానీ, బట్టలకు కానీ అంటుకుంటూనే బయటి వాతావరణానికి బహిర్గతమవుతాయి. వెంటనే ఇవి గాలిలోని ఆక్సిజన్‌తో కలిసి ఆక్సీకరణం(oxidise) చెందుతాయి. ఉదాహరణకు ఫినాళ్లు ఆక్సీకరణం చెందితే అవి క్వినోన్లు అనే పదార్థాలుగా మారతాయి. అలాగే లోహ లవణాలు (metal salts) కొన్ని వాటి ఆక్సైడులుగా మారతాయి. ఫినాళ్లకు దాదాపు రంగు ఉండదు. కానీ క్వినోన్లకు ముదురు రంగులు ఉంటాయి. అరటి తొక్క జిగురు చేతికి అంటుకున్నప్పుడు అందులోని ఫినాళ్లు గాలిలోని ఆక్సిజన్‌ సమక్షంలో రంగుగల క్వినోన్లుగా మారడం వల్లనే మచ్చలు (కర్రులు) ఏర్పడుతాయి.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌,-వరంగల్‌; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞానవేదిక
  • =====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

How do we get Seedles fruits? పండ్లను గింజలు లేని విధంగా ఉత్పత్తి చేస్తున్నారు. ఇదెలా సాధ్యం?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: ద్రాక్ష, దానిమ్మ లాంటి కొన్ని పండ్లను గింజలు లేని విధంగా ఉత్పత్తి చేస్తున్నారు. ఇదెలా సాధ్యం?

జవాబు: ఏ పండుకైనా గింజకానీ, విత్తనం కానీ ఉంటుంది. ఇది ప్రకృతి ధర్మం. కానీ శాస్త్ర పరిశోధనలు పురోగమించే కొలదీ గింజలు లేని ద్రాక్ష, దానిమ్మ లాంటి పండ్లు మనకు లభిస్తున్నాయి. మామూలుగా విత్తనాలను నేలలో పాతడం ద్వారా మనకు మొక్కలు ఎదుగుతాయి. కానీ కొత్త పద్ధతుల్లో తీగలు లేక చెట్ల కొమ్మలనే నేలలో పాతడం ద్వారా మొక్కలను పెంచుతున్నారు. ఈ ప్రక్రియను 'క్లోనింగ్‌' అంటారు. ప్రకృతి సహజమైన సంపర్కంతో పని లేకుండానే అదే రకమైన జన్యుధర్మాలు ఉండే ప్రాణుల సృష్టినే క్లోనింగ్‌ అంటారు. ఈ ప్రక్రియలో ఎదిగిన చెట్లు, తీగల వల్లనే మనకు గింజలు లేని ద్రాక్ష, దానిమ్మ, ఆపిల్‌, చెర్రీలాంటి పండ్లు లభిస్తాయి.

ప్రకృతి సిద్ధమైన తీగ లేక చెట్ల నుంచి ఒక చిన్న తీగనో, కొమ్మనో తుంచి దానిని ఆ చెట్ల వేర్లను ఉత్పత్తి చేసే హార్మోన్లలో ముంచి తడి మట్టిలో ఉంచి పెంచుతారు. కొంతకాలం తర్వాత ఆ కొమ్మకు భూమిలో వేర్లు, భూమిపైన ఆకులు పెరుగుతాయి. ఈ విధంగా పెరిగిన మొక్కల ఫలాలే 'సీడ్‌లెస్‌' (గింజలు లేని) పండ్లన్నమాట.

నిజానికి ఈ విధానంలో ఉత్పత్తి అయ్యే పండ్లలో కూడా ఒక దశలో గింజలు ఏర్పడుతాయి. కానీ క్లోనింగ్‌ వల్ల కలిగే జన్యుపరమైన తేడా వల్ల ఆ గింజల చుట్టూ గట్టిగా ఉండే కవచం ఏర్పడక పోవడంతో అవి అసలు గింజలలాగా గట్టిగా ఉండకుండా పండులోని గుజ్జుతో కలిసిపోతాయి.

-ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Saturday, September 01, 2012

How do lie dector work?-అబద్ధం చెబితే పసిగట్టే లైడిటెక్టర్‌ ఎలా పనిచేస్తుంది?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: అబద్ధం చెబితే పసిగట్టే లైడిటెక్టర్‌ ఎలా పనిచేస్తుంది?

జవాబు: ఒక వ్యక్తి అబద్ధ్దం చెబుతున్నప్పుడు తనకు తెలియకుండానే భావావేశానికి, ఉద్వేగానికి లోనవుతాడు. అపుడు అతని శరీరంలో కొన్ని సున్నితమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ సూత్రం ఆధారంగానే లైడిటెక్టర్‌ (Lie Detector)ను రూపొందించారు.?

ఇది మానవ శరీరంలో రక్తపోటు, గుండె చప్పుడు, శ్వాసక్రియ, చెమట పట్టడం లాంటి కొన్ని మార్పులను నమోదు చేస్తుంది. దీనిలో ఉండే న్యూమోగ్రాఫ్‌ ట్యూబు (pneumograph tube) అనే సన్నని రబ్బరు గొట్టాన్ని నిందితుని ఛాతీ చుట్టూ గట్టిగా కడతారు. ఒక పట్టీని రక్తపోటు కొలవడానికి జబ్బకు కడతారు. చర్మంలోని ప్రకంపనలను కొలవడానికి శరీర భాగాలలో కొద్ది మోతాదులో విద్యుత్‌ను ప్రవహింపజేసి అందులోని మార్పులను గ్రహించే ఏర్పాట్లు కూడా ఆ యంత్రంలో ఉంటాయి.

శరీరంలో కలిగే ప్రేరేపణలను, ఉద్వేగాలను సున్నితమైన ఎలక్ట్రోడుల ద్వారా గ్రహించి గ్రాఫు ద్వారా నమోదు చేస్తారు. ఈ యంత్రం ద్వారా లభించిన సమాచారాన్ని శాస్త్రీయంగా విశ్లేషించడం ద్వారా నిందితుడు అబద్ధ్దమాడుతున్నాడా లేదా అనే అంశంపై ప్రాథమిక అవగాహనకు వస్తారు. న్యాయవ్యవస్థ దీన్ని నేర విచారణలో ఒక సాధనంగానే గుర్తిస్తుంది కానీ కేవలం అది అందించే సమాచారం ఆధారంగానే నేర నిర్ధారణ చేయరు. ఈ పరికరాన్ని 1921లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని జాన్‌లాగూన్‌ అనే వైద్య విద్యార్థి, ఒక పోలీసు అధికారి సాయంతో కనిపెట్టాడు.

-ప్రొఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • ====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

సూర్యుడు ఉదయం-సాయంత్రం పెద్దగా మధ్యాన్నం చిన్నదిగా కనిపిస్తాడేం?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు మనకు దూరంగా ఉన్నా పెద్దగా కనిపిస్తాడు. అదే సూర్యుడు మధ్యాహ్నం వేళ దగ్గరగా వచ్చినప్పుడు చిన్నగా కనిపిస్తాడు. ఎందుకని?

జవాబు: నిజానికి సూర్యుడు ఉదయం, మధ్యాహ్నం మనకు ఒకే దూరంలో ఉంటాడు. కానీ ఉదయం, సాయంత్రం సమయాల్లో సూర్యకిరణాలు ఏటవాలుగా భూమిపై పడతాయి. అందువల్ల ఆ కిరణాలు వాతావరణంలో బాగా మందంగా ఉన్న గాలిపొరల్లో ఎక్కువ దూరం పయనించాల్సి వస్తుంది. శూన్యం నుంచి గాలి పొరల్లోకి ప్రవేశించిన సూర్యకిరణాలు వంగుతాయి. ఈ ప్రక్రియను వక్రీభవనం (refraction) అంటారు. దీని ప్రభావం వల్లే సూర్యుడు ఉదయం, సాయంత్రం పెద్దగా కనిపిస్తాడు. అదే మధ్యాహ్నం వేళ నడినెత్తిన ఉన్న సూర్యకిరణాలు తక్కువ మందం ఉండే గాలి పొరల్లో పయనించడం వల్ల వక్రీభవన ప్రభావం అంతగా ఉండదు. అందువల్ల ఆ సమయంలో సూర్యుడు చిన్నగా కనిపిస్తాడు.

courtesy with-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-http://dr.seshagirirao.tripod.com/

Do people present in other planets?-గ్రహాంతర వాసులు ఉన్నారా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న:కథలు, సినిమాల్లో గ్రహాంతర వాసుల గురించి చెబుతుంటారు. అనేక మంది నమ్ముతారు కూడా. వాళ్లు నిజంగా ఉన్నారా?

జవాబు: గ్రహాంతర వాసులు ఉన్నారో లేదో చెప్పడానికి నేటి విజ్ఞాన శాస్త్రం వద్ద కచ్చితమైన ఆధారాలు లేవు. కానీ భూమి మీద ఉన్న పరిస్థితులు, పరిణామం (evelution) మరెక్కడైనా సంభవించి ఉంటే ఆ గ్రహాల మీద కూడా జీవం ఆవిర్భావానికి అవకాశం లేకపోలేదు. ఆ జీవులు క్రమేణా పరిణామం చెంది ఉన్నత స్థాయి జీవులుగా మారే అవకాశం కూడా ఉంటుంది. మన సౌరమండలంలో మరెక్కడా జీవం ఉన్న ఆనవాళ్లు లేవు. భూమికి సమీపంలో ఉన్న మార్స్‌ (కుజ లేదా అంగారక) గ్రహంపై జీవం ఉందో లేదో తెలుసుకోడానికి ఇటీవల పంపిన క్యూరియాసిటీ రోవర్‌ అక్కడికి చేరుకోడానికి దాదాపు ఏడాది సమయం పట్టింది. సుమారు 20 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న కుజ గ్రహం మీదకు వెళ్లడానికే ఇంతకాలం పడితే ఎన్నో కాంతి సంవత్సరాల దూరంలో ఎక్కడెక్కడో ఉండే సౌరమండలాలలోని గ్రహాల మీది పరిస్థితులు ఎలాంటివో తెలియడానికి ఎన్నో వందల ఏళ్లు పడుతుంది. ఆయా గ్రహాల మీద గ్రహాంతర వాసులెవరైనా ఉన్నా వాళ్లు భూమి దగ్గరకి రావడానికి కూడా అంతే కాలం పడుతుంది. అది సాధ్యం కాదు. కాబట్టి గ్రహాంతర వాసులు ఎక్కడో అక్కడ ఉన్నా వారిని మనం చూడడం దాదాపు అసంభవం.

  • -ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, -వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Rain drops are round in shape Why?-వాన చినుకులు గుండ్రనేల?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: వాన చినుకులు గుండ్రంగానే ఉంటాయెందుకు?

జవాబు: ద్రవపదార్థాల ఉపరితలం సాగదీసిన పొరలాగా స్థితిస్థాపకత (elasticity) కలిగి ఉండి బిగువు (tension)గా ఉంటుంది. ఈ ధర్మాన్నే తలతన్యత (surface tension) అంటారు. దోమలు నీటి ఉపరితలంపై మునిగిపోకుండా నిలబడి ఉండడానికి కారణం తలతన్యతే.

ద్రవాలకు స్వేచ్ఛ లభిస్తే తలతన్యత వల్ల అవి తక్కువ ప్రదేశాన్ని ఆక్రమించుకోడానికి ప్రయత్నిస్తాయి. ఆకారాలన్నింటిలో గోళాకారానికి తక్కువ ఉపరితల వైశాల్యం ఉంటుంది. అందుకే స్వేచ్ఛగా ఆకాశంలోని మబ్బుల నుంచి జారిపడే వాన చినుకు గోళాకారంలో అంటే గుండ్రంగా ఉంటుంది. చెమట బిందువులు, నీటిలో పడిన నూనె, సీసా నుంచి నేలపై ఒలికి పడిన పాదరసం, ఎత్తు నుంచి నేలపై చిందిన పాలు బిందువులుగా గుండ్రని గోళాకారంలో ఉండడానికి కారణం కూడా ఇదే.

  • -ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-