Tuesday, January 08, 2013

Roten egg floats on water why?,కుళ్ళిన కోడి గుడ్డు నీటిలో ఎందుకు తేలుతుంది ?

  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర: కుళ్ళిన కోడి గుడ్డు నీటిలో ఎందుకు తేలుతుంది ?

జ : పాడైన గుడ్లు మాత్రమే కాదు , ఉడకబెట్టిన గుడ్లు కూడా నీటి్లో తేలుతాయి. ఒక మామూలు గుడ్డుకి , కుళ్ళిపోయిన గుడ్డుకి సాంద్రతలో తేడా రావడమే దానికి ప్రధాన కారణము . సాధారణముగా ఒక మంచి కోడిగుడ్డు సాంద్రత నీటి సాంద్రత కన్నా ఎక్కువగా వుంటుంది . ఈ కారణముగా అది నీటిలో మునుగుతుంది . కుళ్ళిపోయిన గుడ్డుకూడా అదే పరిమాణములో ఉన్నప్పటికీ దానిలో నుండి కొన్ని  బిందువులు గుడ్డు పెంకుకి ఉండే సూక్ష్మమైన రంధ్రాల గుండా బయటకి వెళ్ళిపోతాయి. దాంతో గుడ్డు ద్రవ్యరాశి తగ్గిపోతుంది.

ఎదైనా ఒక వస్తువు యొక్క ఘన పరిమాణము తగ్గకుండా , దాని ద్రవ్యరాశి మాత్రం  తగ్గిందీ అంటే దానర్ధము ఆ వస్తువు సాంద్రత తగ్గిపోయిందనే . ఉదాహరణము .. ఒక లీటరు పాలు పట్టే పాత్రలో ఓ పదికోట్ల గాలి కణాలు బందించామనుకుందాం . అప్పుడు  ఆ పాత్ర సాంద్రత కేవలము 5-6 కోట్ల గాలి కణాలను మాత్రమే బందించామనుకుందాం . పాత్ర అలాగే ఉన్నప్పటికీ , లోపలి గాలి తీసేస్తే .. ద్రవ్యరాశి తగ్గిపోవడం వల్ల పాత్ర సాంద్రత ఆ మేరకు తగ్గిపోతుంది. కుళ్ళిన గుడ్డు విషయములోనూ ఇలాగే జరుగుతుంది . కుళ్ళిన గుడ్డుసాంద్రత నీటి సాంద్రత కన్న తక్కువగా వుండటం వల్ల అది నీటిలోతేలుగుంది. . ఈ సందర్భముగా మనము మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తించాలి .ఒకవేళ కోడిగుడ్డుని చిక్కని ఉప్పునీటిలో వేసినట్లైతే గుడ్డు కన్నా ఉప్పు నీటి సాంద్రత ఎక్కువగా వుండె కారణముగా మనము నీటిలో వేసిన గుడ్డు మంచిదైనా , పాడైనదైనా అది ఉప్పునీటిలో తేలుగుంది.

  • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...