Tuesday, February 26, 2013

Why greenland is called big Island vs Austrelia?,ఆస్ట్రేలియా కంటే గ్రీన్‌లాండ్‌ను పెద్ద ద్వీపంగా ఎందుకు పేర్కొంటారు?

  •  





ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



ప్రశ్న: వైశాల్యంలో అతి పెద్ద ద్వీపం ఆస్ట్రేలియా అయితే గ్రీన్‌లాండ్‌ను పెద్ద ద్వీపంగా ఎందుకు పేర్కొంటారు?

జవాబు: ప్రపంచ పటంలో నేల భాగాన్ని ప్రాథమికంగా ఖండాలు (continents)గా విభజించారు. ఆసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఐరోపా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా అంటూ ఏడు ఖండాలున్నా, జనాభా ఏమీ లేని అంటార్కిటికాను ఖండాల్లో లెక్కించకుండా రెండు అమెరికాలను ఒకే ఖండం అంటూ ఐదు ఖండాల్నే పేర్కొంటారు. సాధారణంగా ఖండాలుగా ఉన్న ప్రాంతాల చుట్టూ సముద్రాలు లేదా సముద్రపు నీటి ప్రాంతాలున్నా, వాటిని ద్వీపాలు(islands)గా పరిగణించరు. కేవలం ఖండాల్లో అంతర్భాగంగా ఉన్న దేశాలేమైనా ఉండి, వాటి చుట్టూ అన్ని వైపులా సముద్రపు జలాలుంటే అలాంటి సందర్భాలలోనే ద్వీపాలుగా భావిస్తారు. ఆస్ట్రేలియా దేశమే అయినా అది ఓ ప్రధాన ఖండం. ఓ ఖండంగా చూస్తే దీని వైశాల్యం దాదాపు 90 లక్షల చదరపు కిలోమీటర్లున్నా, అందులో ఓ దేశంగా ఉన్న ఆస్ట్రేలియా వైశాల్యం సుమారు 77 లక్షల చదరపు కిలోమీటర్లుంది. కానీ గ్రీన్‌లాండ్‌ ఉత్తర అమెరికా ఖండంలో ఓ భాగం. మొత్తం ఉత్తర అమెరికా ఖండపు వైశాల్యం 245 లక్షల చదరపు కిలోమీటర్లు కాగా, గ్రీన్‌లాండ్‌ ద్వీపపు మొత్తం వైశాల్యం కేవలం 20 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే ఆస్ట్రేలియా ఖండంలో ఆస్ట్రేలియా దేశపు భాగం దాదాపు 85 శాతం కాగా, ఉత్తర అమెరికా ఖండంలోని గ్రీన్‌లాండ్‌ భూభాగం 10 శాతం కూడా లేదు. కాబట్టి గ్రీన్‌లాండ్‌ను ఓ ద్వీపంగా, ఆస్ట్రేలియాను ఓ ఖండంగా మాత్రమే పరిగణిస్తారు. అయితే ఆస్ట్రేలియాను కూడా అడపాదడపా ద్వీపంగా కూడా చెబుతారు. చుట్టు పక్కల నీరుండడాన్నే గీటురాయిగా తీసుకుంటే అమెరికా ఖండాలు రెండూ ద్వీపాలే. ఆఫ్రికా కూడా ద్వీపమే. ఆసియా-ఐరోపా కలిపి యూరేసియా అంటున్నారు కాబట్టి అది కూడా ద్వీపమే. అన్నీ ద్వీపాలే. ఇది గందరగోళానికి దారి తీసే ప్రమాదం ఉంది. కాబట్టి గ్రీన్‌లాండ్‌నే అతి పెద్ద ద్వీపంగా లెక్కిస్తారు.

- ప్రొ||ఎ. రామచంద్రయ్య, -నిట్‌, వరంగల్‌;రాష్ట్రకమిటీ, -జనవిజ్ఞానవేదిక
  • =====================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...