Monday, April 15, 2013

Do you know Bird eating Spider?,పక్షుల్ని తినే సాలీడు గురించి తెలుసా?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



    సాలీడు ఏం తింటుంది?దోమల్లాంటి చిన్న చిన్న కీటకాల్ని...కానీ పక్షుల్ని, పాముల్ని కూడా తినే సాలీడు గురించి తెలుసా?అదే ఇది!

ఎంత పెద్దగా ఉందో! మీ ఇంట్లో గూడు అల్లుకునే సాలీడు మీ గోరంత ఉంటే, ఇది ఏకంగా మీరు అన్నం తినే కంచమంత ఉంటుంది. అందుకే ఇది

ప్రపంచంలోని సాలీళ్లన్నింటిలోకీ అతి పెద్దది! దీని పేరేంటో తెలుసా? 'గోలియత్‌ బర్డ్‌ ఈటింగ్‌ స్పైడర్‌'. అంటే పక్షుల్ని తినే సాలీడని అర్థం! ఇది

విషపూరితమైనది కూడా!

* 'తరంతులా' అనే జాతి సాలీళ్లలో ఇది కూడా ఒకటి. తరంతులా సాలీళ్లలో ఏకంగా 900 జాతులున్నాయి. మరి ప్రపంచంలోని మొత్తం సాలీళ్లు ఎన్ని

జాతులో తెలుసా? 40,000కు పైగానే!

* ఎక్కువగా అమెరికా అడవుల్లో ఉండే ఈ రాకాసి సాలీడు తీరే వేరు! దీని ఒంటి నిండా వెంట్రుకలు ఉంటాయి. ఇవి వాటిని ఎదుటి జీవిపైకి బాణాల్లాగా

విసరగలదు కూడా! ఆ వెంట్రుకలు గుచ్చుకుంటే ఏ జీవైనా విలవిల్లాడాల్సిందే!

* ఇది ఎనిమిది కాళ్లనూ విప్పిందంటే 12 అంగుళాల స్థలాన్ని ఆక్రమిస్తుంది.

* ఇది అన్ని సాలీళ్లలాగా గూడు కట్టదు. బొరియల్లో జీవించే దీనికి ఎనిమిది కాళ్లతో పాటు ఎనిమిది కళ్లుంటాయి. రెండు కోరలు కూడా ఉంటాయి. ఒకోటీ

అంగుళం పొడవుంటే ఈ కోరల్లో విషం ఉంటుంది. వీటితో గుచ్చిందంటే ఇక ఆ జీవి కదల్లేదు.

* ఇవి పాములు, పక్షులు, కప్పలు, తొండల్లాంటి జీవులపై అమాంతం దూకి కోరలతో కాటేస్తాయి. ఆ విషం వల్ల వాటి శరీరంలో కండరాలన్నీ మెత్తగా

అయిపోతాయి. అప్పుడు ఆ సారాన్ని ఇది పీల్చేస్తుందన్నమాట!

* దీనికింకో విద్య కూడా ఉంది. వెంట్రుకలతో ఉన్న కాళ్లను ఒకదానికి ఒకటి రుద్దిందంటే 'హిస్స్‌స్‌స్‌...' మనే శబ్దం వస్తుంది. ఇది ఏకంగా 15 అడుగుల

దూరం వినిపిస్తుంది!

* వీటిలో ఆడవి 25 సంవత్సరాలు బతికితే, మగవి ఆరేళ్లే ఉంటాయి. మగవాటిని ఆడవి చంపి తినేయడమే కారణం!

* ఇవి 400 గుడ్లు పెడతాయి. వాటి నుంచి రెండు నెలల్లో పిల్లలు వస్తాయి. పుట్టగానే సొంతంగా జీవిస్తాయి!
  • ====================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...