Saturday, August 24, 2013

How do we measure age of Trees?-వృక్షాల వయసు ఎలా కనుగొంటారు?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న :
పెద్ద పెద్ద వృక్షాల వయసు ఎలా కనుగొంటారు?

జవాబు  : పెద్దపెద్ద వృక్షాల కాండాల అడ్డుకోతను పరిశీలించి ఆ వృక్షాల వయసును నిర్ధరిస్తారు. చెట్లు పెరగాలంటే అవి విధిగా నీటిని, లవణాలను భూమినుంచే తీసుకోవాలి. ఇందుకోసం వృక్షం కాండంలో ప్రత్యేకమైన వృక్ష కణజాలం (plant tissue) ఉంది. ఇందులో ప్రధానమైంది జైలం (xylem) కణజాలం. వృక్షాలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారయిన చక్కెరలను ఇతర భాగాలకు సరఫరా చేసే మరో కణజాలం ఉంది. దాని పేరు ఫ్లోయం (floyem) . ఈ జైౖలం, ఫ్లోయం కణజాలాలు చెట్టు బెరడు (bark) కిందనే ఉంటాయి. ప్రతి సంవత్సరం ప్రత్యేక రుతువులో బాగా వర్షాలు పడ్డం వల్ల లవణాల్ని, నీటిని బాగా సరఫరా చేసేందుకు తయారైన ఆహారాన్ని రవాణా చేసేందుకు జైలం, ఫ్లోయంలు బాగా వదులుగా, పెద్దగా ఉండే కణాల సముదాయంగా ఉంటాయి. దీన్నే కేంద్రీయ పొర అంటారు. కానీ వర్షాలు ఆగిపోతే అనుకూల పరిస్థితులు లేకపోవడం వల్ల అవి గట్టిపడతాయి. ఆ తర్వాతి సంవత్సరం మళ్లీ కొత్త కేంద్రీయం పాత గట్టిపడ్డ పొరమీద ఏర్పడతాయి. అంటే ప్రతీ సంవత్సరం ఓ కొత్త వలయంలా కణజాలం వృద్ధి చెందుతుంది. ఇలా వలయాకారంలో ఏర్పడ్డ పాత, కొత్త రింగుల స్వరూపంలో తేడా ఉండడం వల్ల మనం సులభంగా వాటిని గుర్తించగలం. ఇలాంటి వలయాలను వార్షిక వలయాలు లేదా వృద్ధి వలయాలు అంటారు. వృక్షం కాండంలో ఉన్న వార్షిక వలయాల సంఖ్యే దాని వయసు. పడిపోయిన చెట్ల వయస్సును కార్బన్‌ డేటింగ్‌ అనే కేంద్రక భౌతిక సాంకేతిక పద్ధతి (nuclear physical radio method) ద్వారా కనుగొంటారు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌, రాష్ట్రకమిటి, జనవిజ్ఞానవేదిక

  • ==========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...