Sunday, July 13, 2014

How did Cannons work?,. నాటి ఫిరంగులు ఎలా పనిచేసేవి?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



ప్రశ్న: రాజుల కాలంలో వాడిన ఫిరంగులు ఎలా పనిచేసేవి? అందులో నుంచి లోహపు గుండ్లు ఎలా వదిలేవారు?

జవాబు: నాటి ఫిరంగులైనా, నేటివైనా, తుపాకులైనా, రివాల్వరులైనా సూత్రం ఒకటే. పేలుడు పదార్థం, గుండు లేదా బుల్లెట్‌సైజు, గుండు బయటకొచ్చే ద్వారం అడ్డుకోత వైశాల్యం, పేల్చే విధానం మొదలైన విషయాల్లోనే తేడా.

ఫిరంగి ఓ వైపు మూసుకొని మరోవైపు తెరచుకొని ఉండే దళసరి లోహపు గోడలున్న ఓ గొట్టం. మూసుకుని ఉన్న చివర అంటిస్తే ఉన్నఫళాన పేలే రసాయనిక పేలుడు పదార్థం ఉంటుంది. మనం దీపావళి సమయంలో అంటిస్తే పేలినట్టే ఇది కూడా పేలుతుంది. ఈ పేలుడు పదార్థాన్ని తెరచి ఉన్న చివరి నుంచే బాగా లోపలికి దట్టిస్తారు. ఆ తర్వాత గుండును ఆ రంధ్రంలోకి జొప్పుతారు. గొట్టం మూసి ఉన్న చివర వత్తి మాత్రమే లోపలికి వెళ్లేలా సన్నని రంధ్రం ఉంటుంది. దాన్ని వెలిగిస్తే కాలుతూ లోపలికి వెళ్లి పేలుడు పదార్థాన్ని పేలుస్తుంది. ఒక్క ఉదుటున పేలుడు వాయువులు విడుదలవుతాయి. అవి అటూ ఇటూ పోవడానికి దారిలేకపోవడం వల్ల గుండును అతివేగంగా నెడుతూ బయటికి రావడానికి ప్రయత్నిస్తాయి. ఆ క్రమంలో గుండు విపరీతమైన శక్తితో బయటకు దూసుకు వస్తుంది. పొడవైన గొట్టం సరళమార్గంలో ఉండడం వల్ల గుండు కూడా బయటకు నేరుగా వేగంగా వస్తుంది. గుండు గమ్యాన్ని బట్టి అది ఉన్న దూరాన్ని బట్టి ఫిరంగి గొట్టపు వాలు కోణాన్ని మార్చేలా ఫిరంగిలో యంత్రాంగం ఉంటుంది.

  • - ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • =================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...