Wednesday, July 09, 2014

What are the six-tastes in food?,షడ్రుచులు అంటే ఏమిటి?




ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 Q : What are the six-tastes in food?,షడ్రుచులు అంటే ఏమిటి?

Ans : తినడానికి బతకకూడదు ... బతకడానికి తినాలి... అని పూర్వము ఒక నానుడి. ఆహారము తినడము జీవించడానికి ఒక ఇంధనము అంటారు. . . ఆధునికులు . జీవించడానికే కాదు వ్యాధి రాకుండా ఉండడానికి ఆహారము అవసరము కనుక దానిని బ్రహ్మపదార్ధము తో సంధానించి " అన్నం పరబ్రహ్మం" అన్నారు పెద్దలు. ఆహారమునుండే ఆరోగ్యము , అనారోగ్యము పుడుతుంటాయి అని వైద్యులు అంటారు . జీవరాసులన్నింటికీ ఏదోవిధమైన ఆహారము వాటి జీవనానికి అవసరము .. ఈ ఆహారము లో ఆరు రుచులు అని ఆయుర్వేదము చెపుతుంది. నిజానికి రుచులు అనేక రకాలు. జీవి-జీవికీ రుచి గ్రహణలో తేడాలు ఉంటాయి.


    షడ్రుచులు ,Six-tastes

  •     తీపి-------Sweet. ఉదా: పంచదార , తేనె ,
  •     పులుపు---Sour. ఉదా : నారింజ , నిమ్మకాయ ,
  •     చేదు------Bitterness. ఉదా : వేప , పసుపు , మెంతులు ,
  •     కారం-----Recompence(chili). ఉదా : మిరప , మిరియాలు ,
  •     వగరు-----Acrid. ఉదా : చిక్కుడు , కాలీఫ్లవర్ , మినప పప్పు ,
  •     ఉప్పు-----Salt. ఉదా : సముద్రపు నీరు , సైందవ లవణము ,
      
   
  • ==========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...